Young Tiger NTR Movies List

నందమూరి హరికృష్ణ తనయుడిగా సినీ పరిశ్రమలోకి బాలనటుడిగా అడుగుపెట్టారు జూ. ఎన్. టి. ఆర్. ప్రముఖ నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామా రావు దర్శక, నిర్మాతగా మారి నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో అర్జునుడి పాత్రలో నటించారు జూ. ఎన్. టి. ఆర్. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో బాలలతో తీసిన రామాయణం చిత్రంలో రాముడి పాత్రలో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు జూ. ఎన్. టి. ఆర్.

కధానాయకుడిగా తోలిపరిచయం

కధానాయకుడిగా 2001 సంవత్సరంలో నిన్ను చూడాలని చిత్రంతో పరిచయం అయ్యారు జూ. ఎన్. టి. ఆర్. ఈ చిత్రానికి నిర్మాత రామోజీరావు మరియు ఉష కిరణ్ మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రం నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి దర్శకుడు వి. ఆర్. ప్రతాప్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశపరిచింది.

తొలివిజయం

మొదటి సినిమా పరాజయంతో రెండవ చిత్రం స్టూడెంట్ No. 1 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు జూ. ఎన్. టి. ఆర్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు మరియు దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు రాఘవేంద్రరావు మరియు స్క్రీన్ప్లే కూడా రచించడం జరిగింది. మూడవ చిత్రంగా సుబ్బు చిత్రాన్ని మొదలు పెట్టారు జూ. ఎన్. టి. ఆర్ కానీ ఆ చిత్రం ప్రేక్షకులని నిరాశ పరిచింది.

స్టార్డం, భారీ విజయాలు

సుబ్బు చిత్రం నిరాశపరచడంతో జూ. ఎన్. టి. ఆర్ తన తదుపరి చిత్రమైన ఆది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి వి. వి. వినాయక్ దర్శకత్వం వహించారు అంతేకాకుండా వి. వి. వినాయక్ కి ఈ చిత్రం మొదటి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో కథానాయకిగా కీర్తి చావ్లా నటించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఆది చిత్రంలో జూ. ఎన్. టి. ఆర్ నటన అందర్నీ ఆకట్టుకుంది.

ముఖ్యంగా ప్రతినాయకుడు పాత్ర పోషించిన రాజన్ పి. దేవ్ తో కలిసి జూ. ఎన్. టి. ఆర్ పోటాపోటీగా నటించడం మరియు వారిద్దరి మధ్య వచ్చే సంభాషణ అభిమానులని చప్పట్లు కొడుతూ ఈలలు వేసేలా చేసింది. “అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా” అంటూ జూ. ఎన్. టి. ఆర్ చెప్పిన డైలాగ్ అప్పట్లో ఒక సంచలనం, ఇప్పటికి ఆ డైలాగ్ కొంతమంది అభిమానులు వాడుతూ ఉంటారు. ఆది చిత్రం తరువాత అభిమానులకి జూ. ఎన్. టి. ఆర్ నటన మీద అంచనాలు పెరిగిపోయాయి.

ఆది చిత్రం తరువాత జూ. ఎన్. టి. ఆర్ నటించిన అల్లరి రాముడు చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ మరియు గజాల కథానాయకులుగా నటించారు. చాలాకాలం తరువాత ప్రముఖ నటి నగ్మా అల్లరి రాముడు చిత్రంలో నటించారు. నాగ చిత్రంతో జూ. ఎన్. టి. ఆర్ మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో సదా కథానాయకిగా నటించారు. ఈ చిత్రం కూడా పరాజయంతో అభిమానులు నిరాశ చెందారు.

2003 సంవత్సరంలో వచ్చిన సింహాద్రి చిత్రంలో నటించారు జూ. ఎన్. టి. ఆర్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎస్. ఎస్. రాజమౌళి అంతేకాకుండా వీరిద్దరి కలయికలో వచ్చిన రెండవ చిత్రం సింహాద్రి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించడం విశేషం. అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులు సింహాద్రి చిత్రం తిరగరాసింది.

న్యూ టాలీవుడ్ రికార్డు అంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ చిత్రం లో జూ. ఎన్. టి. ఆర్ నటన ఒక అద్భుతమని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ చిత్రం తరువాత జూ. ఎన్. టి. ఆర్ ను యంగ్ టైగర్ ఎన్. టి. ఆర్ అని బిరుదు అభిమానులు ఇవ్వడం జరిగింది.

వరుస పరాజయాలు

సింహాద్రి లాంటి భారీ విజయం తరువాత జూ. ఎన్. టి. ఆర్ చేసిన చిత్రం ఆంధ్రావాలా. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన ఈ చిత్రం భారీ స్థాయిలో విఫలమైంది మరియు అభిమానులని నిరాశ పరిచింది. ఆంధ్రావాలా చిత్రం నుంచి 2006 సంవత్సరంలో విడుదలైన రాఖి చిత్రాల వరకు ఒక్క విజయం కూడా చూడలేదు జూ. ఎన్. టి. ఆర్, తన నటన బాగున్నా కూడా కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి అంతేకాకుండా ప్రతీ సినిమాకి బరువు పెరగడం వల్ల సినిమాలు నిరాశపరిచాయి.

2007 సంవత్సరంలో యమదొంగ చిత్రంలో నటించారు జూ. ఎన్. టి. ఆర్. ఈ చిత్రానికి దర్శకులు ఎస్. ఎస్. రాజమౌళి. వీరిద్దరి కలయికలో యమదొంగ మూడవ చిత్రం. ఈ చిత్రం కూడా భారీ విజయం సాధించడం విశేషం. ఈ చిత్రంలో జూ. ఎన్. టి. ఆర్ ని చుసిన అభిమానులు తన శరీరాకృతిని చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. అప్పటివరకు భారీ శరీరాకృతితో ఉన్న జూ. ఎన్. టి. ఆర్ ఈ చిత్రంలో చాల వరకు బరువు తగ్గి సన్నగా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియమణి, మమతా మోహన్దాస్ కథానాయికలుగా నటించారు.

యమదొంగ చిత్రంలో వచ్చే ఒక సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ హాస్య నటుడు ఆలీ గారడీ చేస్తుంటే అక్కడ కూర్చున్న ప్రేక్షకుడు పులి నుంచి మనిషిని తీస్కోనిరా అప్పుడు నీ గారడీ విద్య నమ్ముతాం అనడం వెంటనే ఆలీ దానికి అంగీకరించి పులిని పిలవడం అప్పుడు ఆ పులి ఒక దూకు దూకగానే జూ. ఎన్. టి. ఆర్ అవ్వడం చూసి అభిమానులు ఎంతగానో సంబరపడిపోయారు. యమదొంగ చిత్రంలో ప్రముఖ నటుడు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు యముడి పాత్రలో నటించి మెప్పించారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి చిత్రం ఫరవాలేదనిపించింది.

విజయాలు, అపజయాలు

2010 సంవత్సరంలో జూ. ఎన్. టి. ఆర్ రెండు చిత్రాల్లో నటించారు మరియు ఆ రెండు చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అదుర్స్ చిత్రంతో మూడవ సారి ప్రముఖ దర్శకులు వి. వి. వినాయక్ దర్శకత్వం లో నటించారు జూ. ఎన్. టి. ఆర్. ఈ చిత్రంలో జూ. ఎన్. టి. ఆర్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అదుర్స్ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంతో కలిసి జూ. ఎన్. టి. ఆర్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈ చిత్రంలో షీలా మరియు నయనతార కథానాయికలుగా నటించారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా బృందావనం చిత్రంలో నటించారు జూ. ఎన్. టి. ఆర్. ఈ చిత్రంలో సమంత మరియు కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటించారు. 2010 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. శక్తి చిత్రంతో రెండవ సారి మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన ఆ చిత్రం పరాజయంపాలైంది. అలా కొన్ని చిత్రాలు విజయాలు అపజయలతో చిత్రాలు చేస్తూ వచ్చారు జూ. ఎన్. టి. ఆర్.

వరస విజయాలు

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ మూవీ లో దయా పాత్రలో నటించారు జూ. ఎన్. టి. ఆర్. వీరిద్దరికి టెంపర్ రెండవ చిత్రం. ఈ చిత్రంలో కథానాయకిగా కాజల్ అగర్వాల్ నటించారు. సరికొత్త పాత్రలో జూ. ఎన్. టి. ఆర్ నటన అభిమానులని ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్, కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన జై లవ కుశ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సామెత చిత్రాలు విజయాలు సాధించాయి.

జనతా గ్యారేజ్ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ మలయాళ నటులు మోహన్ లాల్ నటించారు. జూ. ఎన్. టి. ఆర్ మరియు మోహన్ లాల్ మధ్య వచ్చే సన్నివేశాలు చాల బాగా తెరకెక్కించారు కొరటాలశివ. జై లవ కుశ చిత్రంలో త్రిపాత్రాభినయం లో నటించారు జూ. ఎన్. టి. ఆర్. ఒక పాత్ర దొంగ పాత్రలో సరదాగా ఉంటె రెండవ పాత్ర ఉద్యోగం చేస్తూ అమాయకుడిగా నటించారు జూ. ఎన్. టి. ఆర్. మూడవ పాత్ర ప్రతినాయకుడి పాత్ర తరహా మరియు నత్తి తో మాట్లాడే పాత్రలో అద్భుతంగా నటించారు జూ. ఎన్. టి. ఆర్.

మాల్టీస్టారర్, బాలీవుడ్ అరంగ్రేటం

ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నాల్గవసారి నటించారు జూ. ఎన్. టి. ఆర్. ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో కొమరం భీం పాత్రలో నటించారు జూ. ఎన్. టి. ఆర్. ఇదే చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాంచరణ్ నటించడం విశేషం. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. తెలుగు లో మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూడడం జరిగింది.

జనతా గ్యారేజ్ చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంతో రెండవ సారి నటించారు జూ. ఎన్. టి. ఆర్. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇప్పుడు వార్ 2 చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు జూ. ఎన్. టి. ఆర్. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో కధానాయకుడిగా నటిస్తున్నారు.

మరికొన్ని విషయాలు

గాయకుడిగా తను నటించిన కొన్ని చిత్రాల్లో అలాగే కన్నడలో ప్రముఖ నటుడు పునీత్ రాజ్కుమార్ నటించిన చక్రవ్యూహ చిత్రంలో కూడా పాడారు జూ. ఎన్. టి. ఆర్. స్టార్ మా తెలుగులో లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జెమినీ టీవి లో ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమాన్ని కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2009 సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో జరిగిన ఆక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు. కూచిపూడి నృత్యంలో ప్రావిణ్యం పొందారు జూ. ఎన్. టి. ఆర్.

వ్యక్తిగతం

20 మే 1983 సంవత్సరంలో హైదరాబాద్ లో జన్మించారు జూ. ఎన్. టి. ఆర్ మరియు తన చదువంతా హైదరాబాద్ లో కొనసాగింది.

జూ. ఎన్. టి. ఆర్ పూర్తి పేరు తారకరామ్ కానీ ప్రముఖ నటులు విశ్వవిఖ్యాత నటసార్వాభౌమ నందమూరి తారక రామారావు తన పేరే జూ. ఎన్. టి. ఆర్ కి పేరు పెట్టడం జరిగింది. జూ. ఎన్. టి. ఆర్ తల్లి పేరు షాలిని మరియు తను నందమూరి హరికృష్ణ రెండవ భార్య. 2011 సంవత్సరంలో లక్ష్మి ప్రణతి తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

జూ. ఎన్. టి. ఆర్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
బాలనటుడిగా:
  1. బ్రహ్మర్షి విశ్వామిత్ర
  2. రామాయణం
కధానాయకుడిగా:
  1. నిన్ను చూడాలని
  2. స్టూడెంట్ No 1
  3. సుబ్బు
  4. ఆది
  5. అల్లరి రాముడు
  6. నాగ
  7. సింహాద్రి
  8. ఆంద్రవాలా
  9. సాంబ
  10. నా అల్లుడు
  11. నరసింహుడు
  12. అశోక్
  13. రాఖి
  14. యమదొంగ
  15. కంత్రి
  16. చింతకాయల రవి (పాటలో అతిధి పాత్ర)
  17. అదుర్స్
  18. బృందావనం
  19. శక్తి
  20. ఊసరవెల్లి
  21. దమ్ము
  22. బాద్షా
  23. రామయ్య వస్తావయ్యా
  24.  రభస
  25. టెంపర్
  26. నాన్నకు ప్రేమతో
  27. జనతా గ్యారేజ్
  28. జై లవ కుశ
  29. అరవింద సమెత వీర రాఘవ
  30. ఆర్ ఆర్ ఆర్
  31. దేవర

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *