Women Premier League History

women's premier league
Women’s Premier League

ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పూర్తితో ఎన్నో క్రికెట్ లీగ్ లు దేశ విదేశాల్లో అలరిస్తున్నాయి అదే దారిలో మరొక్క లీగ్ మన భారత దేశంలో సందడి చేస్తుంది అదే “విమెన్ ప్రీమియర్ లీగ్” అంటే “మహిళల ప్రీమియర్ లీగ్”. మరి ఈ లీగ్ ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది అనేది తెలుసుకుందాం.

మహిళల క్రికెట్

భారత మహిళలు అంతర్జాతీయ క్రికెట్ లో 1976 సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ మరియు టి20 మ్యాచ్ ఆడుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటూ తమ ప్రతిభని చాటుతున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి లీగ్ మ్యాచ్లలో కూడా ఆడటం ప్రారంభించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన 11 సంవత్సరాల తరువాత బి.సి.సి.ఐ పెద్దలకి ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు మహిళలతో ఇలాంటి లీగ్ నిర్వహించకూడదు అని. ఆ ఆలోచన వచ్చిన వెంటనే, అంటే 2018 సంవత్సరంలో రెండు క్రికెట్ జట్లతో ఈ లీగ్ ప్రారంభించారు. రెండు జట్లలో దేశి, విదేశీ మహిళా క్రికెట్ ఆటగాళ్ళని కలిపేసి ఒక మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఒక జట్టుకి ఐపీఎల్ ట్రయిల్ బ్లెజెర్స మరో జట్టుకి ఐపీఎల్ సూపర్ నోవాస్ అని పేర్లు పెట్టడం జరిగింది. “విమెన్స్ టి 20 ఛాలెంజ్” పేరుతొ ఈ లీగ్ ని మొదలు పెట్టారు. ఈ రెండు జట్లతో మొదటి మ్యాచ్ ఆడటం జరిగింది. మొదటి సారి దేశి, విదేశీ మహిళా క్రికెటర్లు ఆడిన మ్యాచ్ విజయం సాధించడం విశేషం. ఈ మ్యాచ్ విజేత ఐపీఎల్ సూపర్ నోవాస్.

ఈ మ్యాచ్ విజయం సాధించగానే 2019 సంవత్సరంలో ఈ రెండు జట్లతో పాటు మూడో జట్టు కలిసింది, ఆ జట్టు పేరు ఐపీఎల్ వెలాసిటీ. అలా 2019, 2020, 2022 సంవత్సరాలలో ఈ లీగ్ మ్యాచ్లు వరసగా జరిగాయాయి. మూడు సార్లు ఐపీఎల్ సూపర్ నోవాస్ జట్టు గెలిస్తే ఒక సారి ఐపీఎల్ ట్రయిల్ బ్లెజెర్స జట్టు గెలిచింది.

మహిళల ప్రీమియర్ లీగ్

ఈ మూడు జట్లకు వచ్చిన స్పందన చూసి 2023 సంవత్సరంలో మాజీ సారధి, ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆలోచనతో “విమెన్ ప్రీమియర్ లీగ్” ప్రారంభించడం జరిగింది. నిజానికి 2021 సంవత్సరంలో ఈ ఆలోచన వచ్చినా కొవిడ్ కారణంగా విరమించుకోవడం జరిగింది. 2023 సంవత్సరంలో మళ్ళీ ఈ ఆలోచన రావడంతో లీగ్ ని ప్రారంభించారు. ఈ ఆలోచనకి మిగితా బి.సి.సి.ఐ సభ్యులు కూడా ఆమోదించడం జరిగింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహా ఈ విమెన్ ప్రీమియర్ లీగ్ ని సృష్టించారు. ముందుగా 5 నగరాలని వేలంపాటలో వేయడం జరిగింది, వాటిని కొంతమంది వ్యాపారవేత్తలు కొనడం జరిగింది. ఆ నగరాలకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టడం జరిగింది. ఐపీఎల్ లో ఉన్న ముంబై, బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్ జట్లు ఈ విమెన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఉండటం విశేషం, ఈ నాలుగు కాకుండా ఉత్తర్ ప్రదేశ్ జట్టు విమెన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడం జరిగింది. ఐపీఎల్ లో ఈ ఉత్తర్ ప్రదేశ్ జట్టు లేని విషయం మనందరికీ తెలిసందే. మహిళా ఆటగాళ్ళని కూడా వేలంలో కొనడం జరిగింది.

ఫార్మటు

ఇక ఫార్మటు విషయానికి వస్తే ఒక్క జట్టు మరో జట్టుతో రెండు సార్లు తలపడేలా నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ తరువాత మొదట మూడు స్థానాల్లో నిలిచిన జట్లని తరువాతి దశకు అర్హత సాధిస్తాయి. మొదట మూడు స్థానాల్లో నిలిచిన జట్టులోని మొదటి జట్టు నేరుగా ఫైనల్ కి ప్రవేశించగా ఆ తరువాత రెండు మరియు మూడు స్థానాల్లో నిలిచినా జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో ముందే ప్రవేశించిన జట్టుతో తలపడుతుంది.

2023 సంవత్సరంలో ఘనంగా ఈ లీగ్ ప్రారంభించారు. మొదటి సీజన్ లో ముంబై జట్టు ఢిల్లీ జట్టు మీద ఘాన విజయం సాధించడం జరిగింది. అదే ఉత్సాహంతో 2024 సంవత్సరంలో మరో సీజన్ ప్రారంభించారు. ఈ సీజన్ లో కూడా ఢిల్లీ జట్టు ఫైనల్ లోకి ప్రవేశించడం జరిగింది. ఈ సీజన్ లో విజేత బెంగళూరు టైటిల్ సాధించడం విశేషం.

ఆటగాళ్ల విషయానికి వస్తే హర్మాన్ ప్రీత్ కౌర్, స్మ్రితి మంధన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రాజేశ్వరి గైక్వార్డ్ లాంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు మరి కొందరు జూనియర్ ఆటగాళ్లు కూడా ఉండటం విశేషం.

ఈ విమెన్ ప్రీమియర్ లీగ్ లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన మరియు వేలంపాటలో కొనుగోలు చేసిన మహిళా క్రికెటర్లు కూడా పాల్గొనడం జరిగింది. అంజలి శర్వాని, అరుంధతి రెడ్డి, సబ్బినేని మేఘన, గౌహర్ సుల్తానా, యశశ్రీ, స్నేహ దీప్తి, షబ్నమ్ షకీల్ లాంటి తెలుగు మహిళా ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొన్నడం విశేషం మరియు మిగితా తెలుగు మహిళా క్రీడాకారులకి స్ఫూర్తిదాయకం.

సారధులు

ఇక సారధులు విషయానికి వస్తే ఢిల్లీ జట్టుకి మెగ్ లాన్నింగ్, గుజరాత్ జట్టుకి బెత్ మూనీ, ముంబై జట్టుకి హర్మాన్ ప్రీత్ కౌర్, బెంగళూరు జట్టుకి స్మ్రితి మంధన మరియు ఉత్తర్ ప్రదేశ్ జట్టుకి అలీస్సా హీలి సారధ్యం వహిస్తున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే విమెన్ ప్రీమియర్ లీగ్ లో నగరాలకు ఆకర్షియనీయమైన పేర్లు పెట్టడం జరిగింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అని ఐపీఎల్ లో ఉన్న పేర్లే ఇక్కడ కూడా అవే పేర్లు పెట్టడం జరిగింది, ఇక ఉత్తర్ ప్రదేశ్ జట్టు విషయానికి వస్తే యూపీ వారియర్స్ అని పేరు పెట్టడం జరిగింది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *