Victory Venkatesh Telugu Movies List

Venkatesh
Venkatesh

డా. డి. రామానాయుడు తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నటించిన మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకుని ఆ తరువాత తనకంటూ ఒక ప్రత్యేక అభిమానాన్ని సంపాదించి అగ్రనటుల్లో ఒక నటుడిగా కొనసాగుతున్న నటులు “విక్టరీ” వెంకటేష్ గురించి తెలుసుకుందాం.

సినీ ప్రస్థానం

కె. ఎస్. ప్రకాష్ రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డా. డి. రామానాయుడు నిర్మించిన చిత్రం ప్రేమనగర్. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ కలిసి నటించిన ఈ చిత్రంలో “నవరస నటన సార్వభౌమ” సత్యనారాయణ చిన్ననాటి పాత్ర చేశారు వెంకటేష్. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డా. డి. రామానాయుడు నిర్మించిన చిత్రం కలియుగ పాండవులు. 15 సంవత్సరాల తరువాత వెండితెర మీద కధానాయకుడిగా పరిచయం అయ్యారు “విక్టరీ” వెంకటేష్. ఖుష్బూ నటించిన ఈ చిత్రం 1986 సంవత్సరంలో విడుదలై భారీ విజయం సాధించింది. వెంకటేష్ నటనకి నంది పురస్కారం లభించడం విశేషం.

కె. మురళి మోహనరావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాణంలో వచ్చిన చిత్రం బ్రహ్మరుద్రులు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి, వెంకటేష్, రజని, రంజని నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. కధానాయిక శోభనతో కలిసి నటించిన అజేయుడు చిత్రం  పరవాలేదనిపించిన ఆ తరువాత వచ్చిన భారతంలో అర్జునుడు చిత్రం నిరాశపరిచింది.

వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ కలిసి నటించిన త్రిమూర్తులు పరవాలేదనిపించిన ఆ తరువాత వచ్చిన విజేత విక్రమ్ నిరాశపరిచింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో కె. మురారి నిర్మాణంలో వచ్చిన చిత్రం శ్రీనివాస కళ్యాణం, ఈ చిత్రంలో వెంకటేష్, మోహన్ బాబు, భానుప్రియ, గౌతమీ కలిసి నటించారు మరియు ఈ చిత్రం ఘన విజయం సాధించింది. బి. గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్, అమల కలిసి నటించిన రక్తతిలకం చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

వరుస విజయాలు

దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వెంకటేష్, రజని, మోహన్ బాబు, జయసుధ కలిసి నటించిన చిత్రం బ్రహ్మపుత్రుడు, 1988 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది మరియు విక్టరీ వెంకటేష్ ఈ చిత్రానికి ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నారు. “కళాతపస్వి” కె. విశ్వనాధ్ దర్శకత్వంలో వెంకటేష్, భానుప్రియ నటించిన చిత్రం స్వర్ణకమలం. నృత్య నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందించింది.

స్వర్ణకమలం చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం మరియు ఈ చిత్రంలో వెంకటేష్, భానుప్రియ నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఏ మోహన్ గాంధీ దర్శకత్వంలో స్రవంతి రవి కిశోర్ నిర్మాణంలో వచ్చిన చిత్రం వారసుడొచ్చాడు. వెంకటేష్, మోహన్ బాబు, సుహాసిని కలిసి నటించిన ఈ చిత్రం విజయాన్ని అందించింది. ఇళయరాజా అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.

సురేష్ కృష్ణ మొదటిసారి దర్శకత్వం వహించిన చిత్రం ప్రేమ. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డా. డి. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్, రేవతి కలిసి నటించారు మరియు ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రేమకథ నేపధ్యం మీద వచ్చిన ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను అలరించాయి. ప్రేమ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం.

ప్రేమ చిత్రంలో “ప్రియతమా నా హృదయమ” పాట భగ్న ప్రేమికులని పాడుకునేలా చేయడం విశేషం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్, ఫరా, రూపిణి కలిసి నటించిన చిత్రం ఒంటరిపోరాటం, ఈ చిత్రం ఘన విజయం సాధించింది. వై. నాగేశ్వరరావు దర్శకత్వంలో వెంకటేష్, రజని నటించిన ధృవనక్షత్రం ఘన విజయం సాధించగా, దాసరి నారాయణరావు దర్శకత్వంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు, మోహన్ బాబు, వెంకటేష్, రాధా కలిసి నటించిన టూ టౌన్ రౌడీ చిత్రం పరవాలేదనిపించింది.

ఎస్. ఎస్.  రవిచంద్ర దర్శకత్వంలో వెంకటేష్, అమల, గౌతమీ కలిసి నటించిన అగ్గిరాముడు పరవాలేదనిపించింది మరియు ఈ చిత్రంలో వెంకటేష్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. 1990 సంవత్సరంలో బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బొబ్బిలిరాజా. వెంకటేష్, దివ్యభారతి కలిసి నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంతో దివ్యభారతి తెలుగు సినిమాకి పరిచయం అయ్యారు.

1991 – 2000 మధ్య చిత్రాలు

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన శత్రువు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. వెంకటేష్, విజయశాంతి కలిసి నటించిన ఈ చిత్రానికి ఎం. ఎస్. రాజు నిర్మించారు మరియు రాజ్ – కోటి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు నిర్మించిన చిత్రం కూలి No. 1. కథానాయికగా టబు ని పరిచయం చేస్తూ వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ రైల్వే కూలి గా నటించడం విశేషం.

రైల్వే కూలి గా ఉంటూ సింగపూర్ దేశానికి వెళ్లి అక్కడ రావు గోపాల్ రావు, మోహన్ బాబు మరియు మిగితా నటుల్ని ఎలా బురడి కొట్టించాడనేది చిత్రకథ. ఇళయరాజా అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సూర్య ఐపీఎస్ పరవాలేదనిపించగా ఆ తరువాత విడుదలైన క్షణక్షణం చిత్రం ఘన విజయం సాధించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్, శ్రీదేవి కలిసి నటించారు.

దొంగ పాత్రలో వెంకటేష్ అలాగే తెలియని నేరంలో ఇరుకున్న అమాయకమైన పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి ఎం. ఎం.  కీరవాణి సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలోని పాటలన్ని ప్రేక్షకులని అలరించాయి. “జాము రాతిరి”, “చలి చంపుతున్న” పాటలు ఎక్కువ జనాదరణ పొందాయి.

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చిత్రం చంటి. తమిళ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. అమాయకపు పాత్రలో వెంకటేష్ నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు. మీనా కథానాయకిగా నటించిన ఈ చిత్రం ఎన్నో పురస్కారాలు అందుకుంది. ముగ్గురు అన్నల మధ్య గారాభంగా పెరిగిన చెల్లెలిగా మీనా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వరుస విజయాలు

బి. గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన చిత్రం చినరాయుడు. వెంకటేష్, విజయశాంతి కలిసి నటించిన ఈ చిత్రం తమిళ చిత్రానికి రీమేక్ అవ్వడం విశేషం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్, మీనా కలిసి నటించిన చిత్రం సుందరకాండ. అపర్ణ అనే కొత్త నటి ఈ చిత్రంతో పరిచయం అయ్యారు మరియు ఈ చిత్రంలో వెంకటేష్ ఉపాధ్యాయుడి పాత్రలో, అపర్ణ విద్యార్థినిగా అల్లరి చేస్తూ సరదాగా ఉండే పాత్రలో నటించారు.

సుందరకాండ చిత్రానికి ఎం.ఎం . కీరవాణి సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలోని పాటలతో పాటు సినిమా కూడా భారీ విజయం సాధించింది. తెలుగులో విడుదలై భారీ విజయం సాధించిన చంటి చిత్రాన్ని హిందీ భాషలో అనారి పేరుతొ రీమేక్ చేశారు దర్శకులు కె. మురళి మోహన రావు మరియు నిర్మాత డా. డి. రామానాయుడు. హిందీ భాషలో కూడా వెంకటేష్ నటించగా కథానాయికగా కరిష్మాకపూర్ నటించారు మరియు ఈ చిత్రం హిందీ కూడా విజయం సాధించడం విశేషం.

సుమన్, వెంకటేష్, శ్రీకాంత్, నగ్మా కలిసి నటించిన చిత్రం కొండపల్లిరాజా. ఈ చిత్రానికి దర్శకులు రవి రాజా పినిశెట్టి మరియు ఈ చిత్రం ఘన విజయం సాధించింది. చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉన్న సుమన్, వెంకటేష్ ని విడదీయాలని సుమన్ తండ్రి కోట శ్రీనివాసరావు చేసే ప్రయత్నం అలాగే పాలు అమ్మే వ్యక్తి కొట్టేశ్వరుడు ఎలా అయ్యాడో తెలియచేసే పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారు.

మీనా తో నటించిన అబ్బాయిగారు, నగ్మా, సౌందర్యలతో కలిసి నటించిన సూపర్ పోలీస్ చిత్రాలు పరవాలేదనిపించిన ఆ తరువాత రమ్యకృష్ణ తో కలిసి నటించిన ముద్దుల ప్రియుడు భారీ విజయం సాధించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.

మరికొన్ని చిత్రాలు

పోకిరి రాజా చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించిన ప్రేక్షకులను నిరాశపరిచింది. హాస్యనటులు, ఆలీ, ఇంద్రజ కలిసి నటించిన యమలీల చిత్రాన్ని హిందీ భాషలో తఖ్దీర్వాల పేరుతొ రీమేక్ చేయడం జరిగింది. వెంకటేష్, రవీనా టండన్ కలిసి నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. ధర్మచక్రం, సహసవీరుడు సాగరకన్య, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రాలతో భారీ విజయాల్ని అందుకున్నారు వెంకటేష్. సరదా బుల్లోడు చిత్రం నిరాశపరిచింది.

ముత్త్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య కలిసి నటించిన పవిత్రబంధం చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు మిగితా భాషలైన తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో రీమేక్ చేయడం విశేషం. ఎం. ఎం. కీరవాణి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. చిన్నబ్బాయి చిత్రం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన చిత్రం ప్రేమించుకుందాం రా చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

వెంకటేష్, అంజలి జవేరి కలిసి నటించిన ఈ చిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకులు మరియు ప్రేమకథ, రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యం మీద తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్ మహదేవన్ సంగీతం అందించారు. సౌందర్య తో కలిసి నటించిన పెళ్లిచేసుకుందాం, రాధికా, మీనా, సంఘవి కలిసి వెంకటేష్ ద్విపాత్రాభినయం లో నటించిన సూర్యవంశం చిత్రాలు విజయాన్ని చూశాయి.

రంభ, మధుబాల కథానాయికలుగా వెంకటేష్ నటించిన గణేష్, ప్రీతి జింటా తో కలిసి వెంకటేష్ నటించిన ప్రేమంటేఇదేరా, సౌందర్య, అబ్బాస్ వెంకటేష్ కలిసి నటించిన రాజా చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. శీను చిత్రం పరాజయం అవ్వగా ఆ తరువాత వచ్చిన చిత్రాలు కలిసుందాంరా, జయంమనదిరా చిత్రాలు భారీ విజయం సాధించాయి.

2001 – 2010 మధ్య చిత్రాలు

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య, అంజలా ఝవేరి కలిసి నటించిన దేవిపుత్రుడు, సిమ్రాన్ తో కలిసి నటించిన ప్రేమతో రా చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచాయి. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో 2001 సంవత్సరంలో వచ్చిన నువ్వు నాకు నచ్చవ్ చిత్రం భారీ విజయాన్ని అందించింది. వెంకటేష్, ఆర్తీఅగర్వాల్ కలిసి నటించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరించింది. ఆర్తి అగర్వాల్ ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశమలోకి అడుగుపెట్టడం విశేషం.

కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన వాసు, శరన్ దర్శకత్వంలో వచ్చిన జెమిని చిత్రాలు నిరాశపరిచాయి. విక్రమన్ దర్శకత్వంలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్, ఆకాష్, కళ్యాణి నటించిన వసంతం చిత్రం ఘన విజయం సాధించింది. క్రికెటర్ అవ్వాలనే ఆశయంతో వెంకటేష్ నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఎస్. ఏ. రాజ్కుమార్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. వసన్తం చిత్రంలోని అన్ని పాటలు ప్రేక్షకులను అలరించాయి.

కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన చిత్రం మల్లీశ్వరి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో కత్రినాకైఫ్ కథానాయికగా పరిచయం అయ్యారు. కోటి అందించిన సంగీతం వెంకటేష్ నటన ప్రేక్షకులను అలరించడమే కాకుండా చిత్రాన్ని విజయాన్ని అందించింది.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వెంకటేష్, ఆసిన్ నటించిన ఘర్షణ చిత్రం పరవాలేదనిపించిన ఆ తరువాత వచ్చిన సంక్రాంతి చిత్రం ఘన విజయం సాధించింది. చంద్రమోహన్, శారదా, వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్, ఆర్తి అగర్వాల్, స్నేహ, సంగీత, రతి, ప్రకాష్ రాజ్ కలిసి నటించిన ఈ చిత్రానికి ముప్పలేని శివ దర్శకత్వం వహించారు మరియు ఈ చిత్రానికి ఎస్. ఏ. రాజ్ కుమార్ సంగీతం అందించారు.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సుభాష్ చంద్ర బోస్ చిత్రం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన లక్ష్మి, ఆడువారి మాటలకూ అర్ధాలే వేరులే, తులసి, చింతకాయల రవి, చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. తమిళ నటులు కమల్ హస్సన్, వెంకటేష్ కలిసి నటించిన ఈనాడు నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన నమో వేంకటేశ చిత్రం పరువలేదనిపించింది. రజనీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన నాగవల్లి చిత్రం పరవాలేదనిపించింది.

ముల్టీస్టార్ర్ర్ చిత్రాలు

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బాడీగార్డ్ నిరాశపరచగా ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో నటించారు వెంకటేష్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అంజలి, సమంత కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్ నటించి మెప్పించారు. కుటుంబకథా నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు.

అన్నదమ్ములుగా వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సంగీతం సంగీత ప్రియులని అలరిస్తుంది. మెహెర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన షాడో చిత్రం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన మసాలా చిత్రం విజయాన్ని అందించింది. వెంకటేష్, రామ్, అంజలి, షాజన్ పదంసీ కలిసి నటించిన మసాలా చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.

శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్, మీనా కలిసి దృశ్యం చిత్రంలో నటించారు. మలయాళం చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్, శ్రియ శరన్ కలిసి నటించిన గోపాల గోపాల చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాస్తికుడిగా పాత్రలో వెంకటేష్ దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ అధిభూతంగా నటించారు. ఈ చిత్రానికి దర్శకులు కిశోరె కుమార్ పార్దాసాని.

మారుతి దర్శకత్వంలో వెంకటేష్, నయనతార కలిసి నటించిన బాబు బంగారం, సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన గురు చిత్రాలు పరవాలేదనిపించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాద కలిసి నటించిన హాస్య చిత్రం F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్  మరియు F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. భార్య భారతలా మధ్య సాగే తగాదాల మీద తీసిన ఈ రెండు చిత్రాలు విజయాన్ని చూశాయి.

మరికొన్ని చిత్రాలు

వేంకటేష్, నాగ చైతన్య, పాయల్ రాజపుట్, రాశి ఖన్నా కలిసి నటించిన వెంకీ మామ చిత్రం ఘన విజయం సాధించింది. కె. ఎస్. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మేనమామ మేనల్లుడు పాత్రలో నటించారు వెంకటేష్, నాగ చైతన్య. ధనుష్ నటించిన అసురన్ చిత్రానికి రీమేక్ గా నారప్ప చిత్రాన్ని దర్శకత్వం వహించారు శ్రీకాంత్ అడ్డాల. వెంకటేష్, ప్రియమణి కలిసి నటించిన ఈ చిత్రం నేరుగా సామజిక మద్యమైన ప్రైమ్ లో విడుదలైంది మరియు ఈ చిత్రంలో వెంకటేష్ నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పొచ్చు.

మలయాళ చిత్ర దర్శకులు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దృశ్యం 2. దృశ్యం చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ప్రైమ్ లో విడుదలైంది. వెంకటేష్, మీనా కలిసి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. సల్మాన్ ఖాన్, వెంకటేష్, జగపతిబాబు, భూమిక చావ్లా, పూజ హెగ్డే కలిసి నటించిన హిందీ చిత్రం కిసీకా భాయ్ కిసీకా జాన్. ఈ చిత్రం ఘన విజయం సాధించగా ఆ తరువాత శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన సైన్ధవ చిత్రం పరాజయాన్ని చూసింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2025 సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విక్టరీ వెంకటేష్. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య లక్ష్మి కధానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో.

మరికొన్ని విశేషాలు

రానా దగ్గుబాటి తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో తండ్రి పాత్రలో నటించారు వెంకటేష్. గురు చిత్రంలో “జింగిడి జింగిడి” పాటని పాడటం విశేషం. నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం, రవితేజ నటించిన క్రాక్, మంచు విష్ణు నటించిన మోసగాళ్లు చిత్రాలకి గాత్ర దానం చేయడం జరిగింది. కొన్ని చిత్రాల్లో అతిధి పాత్రలు కూడా చేయడం విశేషం. రానా దగ్గుబాటి నటించిన కృష్ణం వన్డే జగద్గురుమ్ చిత్రంలో ఒక పాటలో ఆలా మెరిశారు వెంకటేష్.

క్రికెట్ అంటే చాల ఇష్టం వెంకటేష్ గారికి, ఎక్కడ మ్యాచ్ లు జరిగిన వెళ్లి చూడడం అలవాటు అలాగే సినిమా వాళ్ళు ఆడిన క్రికెట్ మ్యాచ్ లో కూడా పాల్గొని తన సత్తా చాటారు విక్టరీ వెంకటేష్.

వ్యక్తిగతం

చెన్నై నగరంలో 1960 సంవత్సరం, డిసెంబర్ 13న జన్మించారు వెంకటేష్. తండ్రి దగ్గుబాటి రామానాయుడు నిర్మాత, తల్లి రాజేశ్వరి. చెన్నై, అమెరికా లలో తన చదువు పూర్తి చేశారు. 1985 సంవత్సరంలో నీరజ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వెంకటేష్ అన్నయ్య దగ్గుబాటి సురేష్ బాబు మరియు రానా దగ్గుబాటి కి చిన్నాన్న, నాగ చైతన్యకి మేన మామ అవుతారు వెంకటేష్.

వెంకటేష్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
  1. ప్రేమనగర్ (బాలనటుడు)
  2. కలియుగ పాండవులు
  3. బ్రహ్మరుద్రులు
  4. అజేయుడు
  5. భారతంలో అర్జునుడు
  6. త్రిమూర్తులు
  7. విజేత విక్రమ్
  8. శ్రీనివాస కళ్యాణం
  9. రక్తతిలకం
  10. బ్రహ్మ పుత్రుడు
  11. స్వర్ణకమలం
  12. వారసుడొచ్చాడు
  13. ప్రేమ
  14. ఒంటరిపోరాటం
  15. ధ్రువ నక్షత్రం
  16. టూ టౌన్ రౌడీ
  17. జయమ్ము నిశయమ్మురా (అతిధి పాత్ర)
  18. అగ్గిరాముడు
  19. బొబ్బిలి రాజా
  20. శత్రువు
  21. కూలీ No 1
  22. సూర్య ఐ.పి.ఎస్
  23. క్షణ క్షణం
  24. చంటి
  25. చిన్నరాయుడు
  26. సుందరకాండ
  27. కొండపల్లి రాజా
  28. అబ్బాయిగారు
  29. అనారి (హిందీ)
  30. సూపర్ పోలీస్
  31. ముద్దుల ప్రియుడు
  32. పోకిరి రాజా
  33. తఖ్దీర్వాల (హిందీ)
  34. ధర్మ చక్రం
  35. సాహసవీరుడు సాగరకన్య
  36. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
  37. సరదా బుల్లోడు
  38. పవిత్రబంధం
  39. చిన్నబ్బాయి
  40. ప్రేమిచుకుందాం రా
  41. పెళ్లిచేసుకుందాం
  42. సూర్యవంశం
  43. గణేష్
  44. ప్రేమంటే ఇదేరా
  45.  రాజా
  46. శీను
  47. కలిసుందాం రా
  48. జయంమనదే రా
  49. దేవిపుత్రుడు
  50. ప్రేమతో రా
  51. నువ్వు నాకు నచ్చావ్
  52. వాసు
  53. జెమిని
  54. వసంతం
  55. మల్లీశ్వరి
  56. ఘర్షణ
  57. సంక్రాంతి
  58. సుభాష్ చంద్రబోస్
  59. సోగ్గాడు (అతిధి పాత్ర)
  60. లక్ష్మి
  61. ఆడవారి మాటలకూ అర్ధాలేవేరులే
  62. తులసి
  63. చింతకాయల రవి
  64. ఈనాడు
  65. నమో వేంకటేశ
  66. నాగవల్లి
  67. బాడీగార్డ్
  68. కృష్ణం వందే జగద్గురుమ్ (ఒక పాటలో అతిధి పాత్ర)
  69. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు
  70. షాడో
  71. మసాలా
  72. దృశ్యం
  73. గోపాల గోపాల
  74. బాబు బంగారం
  75. ప్రేమమ్ (అతిధి పాత్ర)
  76. గురు
  77. అగ్న్యాతవాసి (అతిధి పాత్ర)
  78. ఎఫ్ – 2
  79. వెంకీ మామ
  80. నారప్ప
  81. దృశ్యం – 2
  82. ఎఫ్ – 3
  83. ఓరి దేవుడా (అతిధి పాత్ర)
  84. కిసీకా భాయ్ కిసీకా జాన్ (హిందీ)
  85. సైంధవ్
  86. రానా నాయుడు (హిందీ వెబ్ సిరీస్)
  87. సంక్రాంతికి వస్తున్నాం

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *