వడ్డే నవీన్, మహేశ్వరి నటించిన పెళ్లి చిత్రంలోని మిగితా పాటల లిరిక్స్ ఇక్కడ చూడొచ్చు.
పాట – ఓ యవ్వన వీణ
పాడినవారు – ఎస్.పి. బాలసుబ్రమణ్యం
రచయిత – సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ
హోం
యవ్వన వీణ పువ్వుల వానా
నువ్వెవరు నా ఎదలో చేరిన మైనా
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
హోం
యవ్వన వీణ పువ్వుల వానా
నువ్వంటూ పుట్టినట్టు నా కొరకు
ఆచూకీ అందలేదు ఇంతవరకు
వచ్చింది గాని ఈడు ఒంటి వరకు
వేధించలేదు నన్ను జంట కొరకు
చూసాక ఒక్కసారి ఇంత వెలుగు
నా వంక రాను అంది కంటి కునుకు
ఈ అల్లరి ఈ గారడీ నీ లీల అనుకోనా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
హోం
యవ్వన వీణ పువ్వుల వానా
ఏ పూల తీగ కాస్త ఊగుతున్న
నీ లేత నడుమే అనుకున్నా
యే గువ్వా కిలకిలా వినపడినా
నీ నవ్వులేనని వెళుతున్నా
మేఘాల మెరుపులు కనపడినా
యే వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్న
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
హోం
యవ్వన వీణ పువ్వుల వానా
నువ్వెవరు నా ఎదలో చేరిన మైనా
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
పాట – ఋక్కు ఋక్కు రామనిస గుణమని
పాడినవారు – మనో
రచయిత – సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ
ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణిసగుణమని రబ్బ హాయ్ రబ్బ
చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ
ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణిసగుణమని రబ్బ హాయ్ రబ్బ
చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ
కిలాడీ కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వారెవహ్
అలంటి ముచ్చట మరల ఇచట రెడీ గ ఉన్నదిరా వారెవహ్
ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణి సుగుణమని రబ్బ హాయ్ రబ్బ
చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ
ముద్దుల గుమ్మా పుత్తడి బొమ్మ
బుగ్గ మీద సిగ్గు మొగ్గ వించిందోయమ్మ
ముద్దుల గుమ్మా పుత్తడి బొమ్మ
బుగ్గ మీద సిగ్గు మొగ్గ వించిందోయమ్మ
విరిసి విరయని మొగ్గ ర
ముద్దే తగలని బుగ్గ ర
మెరిసే ఈ సిరి నీదిర
వరమే అనుకో సోదర
అందమైన కుందనాల కూన
నీ అండ చేరుతుంది కదరా కన్నా
పొందికైన సుందరవాదన
నీ పొందు కోరుతున్నది పదరా నాన్న
సోంపులందుకో హాయ్ స్వర్గమేలుకో హాయ్
చిన్నదాని వన్నెలన్ని కన్యాదానం అందుకొని నవాబ్ అయిపోరా
నీ నాసిబీ మారును ర
హే ఋక్కు ఋక్కు ఋక్కుమిని హోం
ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణి సగుణమని రబ్బ హాయ్ రబ్బ
చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ
కలికి నీ కల తీరగా ఇలకే చంద్రుడు జారేగా
చిలక నీ జత చేరగా ఒడిలో ఇంద్రుడు వాలేగా
అరెరెరె బంగారు జింక నీకు అంతలోనే అంతటి సిగ్గ సిగ్గా
అప్పుడే ఏవయ్యింది గనక ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా
కంటి విందుగా హాయ్ జంట కట్టగా హాయ్
హోరు హోరు హోరు మంటూ ఊరు వాడ అంత చేరి హుషారు హుంగామ
మహా కుషీగా చేద్దామా అరెరెరెరె
ఋక్కు ఋక్కు ఋక్కుమిని హోం
ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణి సుగుణమని రబ్బ హాయ్ రబ్బ
చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ
ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణి సుగుణమని రబ్బ హాయ్ రబ్బ
చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ
ఖిలాడీ కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వారెవహ్
అలంటి ముచ్చట మరల ఇచట రెడీ గ ఉన్నదిరా వారెవహ్
పాట – జాబిలమ్మ నీకు అంత కోపమా
పాడినవారు – ఎస్.పి. బాలసుబ్రమణ్యం
రచయిత – సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితే
అల్లాడిపోదా రేయి ఆపుమ
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా ఓ
చిగురు పెదవి పైన చిరు నవ్వాయి చేరాలనుకున్న
చెలియా మనసులోన సిరి మువ్వై ఆడాలనుకున్న
ఉన్నమాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా
హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా
మరి అంత దూరమా కళలు కన్నా తీరమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా ఓ
మనసు చూడవమ్మా కొలువుందో లేదో నీ బొమ్మ
మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా
ప్రాణమున్న పాలరాతి శిల్పమా
ప్రేమ నీడ చేరుకొని పంతమా
తోడు కోరి దగ్గరైతే దోషమా
తియ్యనైన స్నేహమంటే ద్వేషమా
ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితే
అల్లాడిపోదా రేయి ఆపుమ
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా ఓ