Telugu Movie Pelli Songs Lyrics

వడ్డే నవీన్, మహేశ్వరి, పృథ్వీ రాజ్ మరియు సుజాత ముఖ్య పాత్రలో నటించిన చిత్రం పెళ్లి. ఈ చిత్రానికి దర్శకులు కోడి రామకృష్ణ మరియు ఈ చిత్రానికి సంగీతం అందించింది ఎస్.ఏ. రాజ్ కుమార్. ఈ చిత్రం లోని ప్రతి పాట వినసొంపుగా ఉంటాయి. ముఖ్యంగా “జాబిలమ్మ నీకు అంత కోపమా” పాట ఇప్పటికి జనాలు వింటూ పాడుకుంటూ ఉంటారు. ఈ చిత్రంలో ప్రతీ పాటని సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ గారు రచించడం విశేషం. ఈ చిత్రం కన్నడ భాషలో “మధువే” గా తమిళ్ భాషలో “అవళ్ వరువాల” గా హిందీ భాషలో “కోయి మేరె దిల్ సె పూచే” గా రీమేక్ చేయడం జరిగింది. పెళ్లి చిత్రంలో ని పాటల లిరిక్స్ మీకోసం.

పాట – పైట కొంగు ఎంతో చెడ్డది
గానం – ఎస్.పి. బాలసుబ్రమణ్యం,కే.ఎస్.చిత్ర
రచయిత – సిరివెన్నెల సీతరామ శాస్ట్రీ

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదింకా ఈడు
నచ్చా చెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కూడు
కాసుకో అమ్మడు కొంటె దూకుడు

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది

సొగసులు ఇమ్మని నిను బతిమాలని
తెగ పడి రమ్మని పిలవకు వయసుని
సొగసులు ఇమ్మని నిను బతిమాలని
తెగ పడి రమ్మని పిలవకు వయసుని

అదిరిపడే పెదవులలో అనుమతిని చదవని
బిడియపడే మనసు కదా అడుగుకు పైపడమని
బెదురూ ఎంత సేపని ఎవరున్నారని
అదును చూసి రమ్మని అందాలయ్య అందాన్ని

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది

చలి చలి గాలిలో చెమటలు ఏంటట
వలపుల లీలలో అది ఒక ముచ్చట
చలి చలి గాలిలో చెమటలు ఏంటట
వలపుల లీలలో అది ఒక ముచ్చట

ఎదురు పడే మదనుడితో వరసాలెల కలుపుట
తెరలు వీడే తరుణంలో తెలియనిదేమున్నదంట
మాయదారి ప్రేమలో ఎం చేయాలట
మోయలేని హాయిలో ఒళ్ళో కొస్తే చాలంట

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదింకా ఈడు
నచ్చా చెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కుడు
కాసుకో అమ్మడు హొయ్ కొంటె దూకుడు

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది

పాట – కొండా కోన గుండెల్లో
పాడినవారు – ఎస్.పి. బాలసుబ్రమణ్యం, కే.ఎస్.చిత్ర
రాసినవారు – సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ

కొండా కోన గుండెల్లో ఊగే ఉయ్యాల
ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాలా
వాగు వంక ఒంపుల్లో సాగే జంపాల
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా

దొరికే చుక్కను ఏలె ధోరణై నవ్వాలా
కొరికే కోరిక చూసి చిలకై నవ్వాలా
వన్నెల్లొ అంత మనకేసి చూసే వేళా

ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండా కోన గుండెల్లో ఊగే ఉయ్యాల
వాగు వంక ఒంపుల్లో సాగే జంపాల

నిద్దుర చెడి మదన పడి మదిని లాలించాలి
ముచ్చట పడి ముద్దుల తాడే మొదటి మూడవ్వాలి
ప్రతి పొదలో మన కథలే కొత్త పూత పూయించాలి
మతి చెదిరే శృతి ముదిరి తందానాలు తొక్కించాలి

అందెలు కట్టే అందాలన్నీ సందిట పెట్టాలి
తొందర పెట్టె ఆరాటాన్ని ముందుకు నెట్టాలి
ఏకాంతాన్నంతా మన జంటే పాలించాలి

ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండా కోన గుండెల్లో ఊగే ఉయ్యాల
వాగు వెంక ఒంపుల్లో సాగే జంపాల

సిగ్గనదువ్వే మొగ్గలు పువ్వై ఒదిగి ఉందువు గాని
చిలిపి నవ్వే పిలుపునిన్స్తే రానా కిన్నెరా సాని
కోడె నాగుల కొంటె సెగలే చుట్టుకొని కాటెయ్యాలి
కొండా వాగుల కన్నె వగలే కమ్ముకొని కవ్వించాలి
చిటికవిని సంతోషంతో తెచ్చా సొంపుల్ని
కళలు గానే సావాసంతో గీచ్చా చంపాలని
కౌగిల్లో రాణి ఎద పాడే రాగాలన్నీ

ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండా కోన గుండెల్లో ఊగే ఉయ్యాల
వాగు వెంక ఒంపుల్లో సాగే జంపాల
ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా

పాట – అనురాగమే మంత్రంగా
పాడినవారు – ఏసుదాసు
రచయిత – సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ

అనురాగమే మంత్రంగా
అనుబంధమే సూత్రంగా
మమతా కొలువులో జరుగు పెళ్ళికి
మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం
మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం
అనురాగమే మంత్రంగా

మూడు ముళ్లతోనే పెళ్లి పూర్తి కాదు అని
మరో మూడీగా చేరుకున్న స్నెహ బంధమిది
సప్తపదితో ఆగరాదు జీవితం అని
అష్టపదిగా సగమన్న ప్రాయమా పదము ఇది

నాతిచరామి మంత్రములో అర్ధం తెలిసిన నేస్తముతో
అడుగు కలుపుతూ వెలుగు వెతుకుతూ సాగే సమయమిది
ఆగని పయనమిది

అనురాగమే మంత్రంగా
మమతా కొలువులో జరుగు పెళ్ళికి
మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం
అనురాగమే మంత్రంగా

ఆడదంటె ఆడదానికి శత్రువు కాదు అని
అత్తా గుండెలోన కూడా అమ్మ వున్నదనీ
బొమ్మలాటలాడుతున్న బ్రహ్మ రాతలనీ
మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది

చరితాలు చదవని తోలి కధగా
మనసులు ముడి పడు మనుగడగా
తరతరాలకు నిలిచిపొమ్మని తల్లిగా దీవించే
చల్లని తరుణమిది

అనురాగమే మంత్రంగా
అనుబంధమే సూత్రంగా
మమతా కొలువులో జరుగు పెళ్ళికి
మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం

పెళ్ళీ చిత్రంలో ని మిగితా పాటల లిరిక్స్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *