లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ కధానాయకుడిగా అనిత కథానాయకిగా తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద పి. కిరణ్ నిర్మించిన చిత్రం నువ్వు నేను. ఈ చిత్రానికి సంగీతం ఆర్.పి పట్నాయక్. ఈ చిత్రంలో అన్ని పాటలు కులశేఖర్ రచించడం విశేషం. 2001 సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్తానికి 4 ఫిలింఫేర్ పురస్కారాలు 5 నంది పురస్కారాలు లభించాయి. ఈ చిత్రం లో పాటలు అప్పట్లో ప్రేక్షకులని ఉర్రుతలూగించాయి. ముఖ్యంగా “గాజువాక పిల్లా” పాట మాత్రం అందరి నోట పాడించేలా చేసింది.
కధ
కళాశాలలో చదువుకుంటూ గొడవపడుతన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య స్నేహం ఎలా చిగురించింది, ఆ స్నేహం ప్రేమ గా ఎలా మారింది, ఆ తరువాత ప్రేమికులుగా మారి వారి సమస్యల్ని ఎలా అధిగమించారు, పెద్దల్ని ఒప్పించి ఎలా ఒకటయ్యారు అనేది ఈ చిత్రం కధ. ఈ చిత్రం విడుదలయ్యాక ఇలాంటి నేపథ్యంతో ఎన్నో చిత్రాలు రూపుదిద్దుకున్నాయి.
ఈ చిత్రం ఉదయ్ కిరణ్ కి రెండవ చిత్రం మరియు కధానాయకిగా అనితకి మొదటి చిత్రం. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ తమ పాత్రకి న్యాయం చేశారు. తెలంగా శకుంతల, రాళ్లపల్లి, ఎం.ఎస్. నారాయణ, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, వైజాగ్ ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్ తదితరులు తమ పాత్రలను అద్భుతంగా పండించారు. తెలంగాణ శకుంతల గారి పాత్ర తెలుగు సినిమా చరిత్రలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ చిత్రంతో సునీల్ హాస్యనటుడిగా తన హాస్యాన్ని పండించి అప్పటినుంచి ఎన్నో చిత్రాల్లో తన హాస్యాన్ని పండిస్తున్నారు. ఆ తరువాత కధానాయకుడిగా కూడా ఒక అడుగు ముందుకేశారు మరియు తనకోసమే దర్శకులు పాత్రలు సృష్టించడం విశేషం. ఈ చిత్రాన్ని హిందీ లో “ఏ దిల్” పేరుతొ మరియు తమిళంలో “మదురై వీరం” పేరుతొ రీమేక్ చేయడం జరిగింది. హిందీ లో కూడా కథానాయకిగా అనిత నటించారు.
రీ – రిలీజ్
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పాత సినిమాలన్నీ రీ రిలీజ్ పేరుతో మళ్ళీ విడుడల చేస్తున్నారు, పోకిరి చిత్రంతో మొదలైన ఈ పద్దతి కొనసాగుతూనే ఉంది. అందరి నటుల చిత్రాలు వచ్చాయి ఒక్క ఉదయ్ కిరణ్ చిత్రాలు తప్పిస్తే, ఇప్పుడు తన వంతు కూడా వచ్చేసింది.
నువ్వు నేను చిత్రం మళ్ళి ప్రేక్షకుల ముందు రావడానికి ముస్తాబవుతోంది. మార్చ్ 21, 2024 సంవత్సరంలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడం విశేషం. 2001 సంవత్సరం లో చుసిన వారు మళ్ళీ ఆ జ్ఞపకాలను మరియు ఉదయ్ కిరణ్ ని పెద్ద తేర మీద మరొక్కసారి చూడాలంటే చూసేయండి అలాగే చుడనివారు ఎవరైనా ఉంటె థియేటర్ కి వెళ్లి చూసేయొచ్చు.