
రాఖి చిత్రంలో కోర్ట్ సన్నివేశంలో జూ. ఎన్టీఆర్ చెప్పిన సంభాషణలో ఇలా అంటారు, శిక్షలు వేయడం కాదు సర్ మా అందరి చేత పెద్ద బాలశిక్షచదివించండి అని అంటారు, మరి ఆ పెద్ద బాలశిక్ష అంటే ఏంటి, చదువుకోడానికి ఆ పుస్తకంలో ఏముంటుంది, దాని గురించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్ద బాలశిక్ష అంటే ఏంటి
తెలుగు భాషాభిమానులు, విద్యార్థులు, విజ్ఞానసాధకులకు సుపరిచితమైన గ్రంథం పెద్ద బాలశిక్ష. తెలుగు సాహిత్యంలో ఈ గ్రంథానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రంధాన్ని చిన్నపిల్లల నుంచీ పెద్దవాళ్ల వరకు ఎవరైనా చదవవచ్చు మరియు ఈ గ్రంధంలో అందరికీ ఉపయోగపడే విలువైన విజ్ఞానాన్ని పొందుపరిచారు.
పెద్ద బాలశిక్ష అనేది ప్రధానంగా తెలుగు భాష, సాహిత్యం, గణితం, భౌగోళికం, ధర్మశాస్త్రం, సామాజిక నైపుణ్యాలు మొదలైన విభాగాల్లో ప్రాధమిక జ్ఞానాన్ని అందించే గ్రంథం. ఇందులో పురాణాలు, నీతికథలు, పద్యాలు, వ్యాకరణ నియమాలు, సామెతలు, శ్లోకాలు, మంత్రములు, అంకెల గుణితాలు, కాలానుగుణ విజ్ఞానం మొదలైన ఎన్నో అంశాలు ఉంటాయి.
తెలుగు భాష అభివృద్ధిలో అనేక గ్రంథాలు ప్రముఖమైనవి. వాటిలో “పెద్ద బాలశిక్ష”ది ఒక విశిష్టమైన స్థానం. ఈ గ్రంథాన్ని వివిధ కాలాల్లో పునర్ముద్రించారు. ఇందులో ప్రతి కాలానికి అనుగుణంగా పలు మార్పులు చేశారు.
ఎవరు రచించారు
మేస్టర్ క్లూ లో అనే బ్రిటిష్ నాయకుడు 1832 సంవత్సరంలో చదలవాడ సీతారామశాస్ట్రీ గారిచే ఒక పుస్తకాన్ని రచింపజేశారు, ఆ పుస్తకం పేరే బాలశిక్ష. ఈ పుస్తకాన్ని మొత్తం 78 పేజీలతో రకరకాల విషయాలతో రచించారు చదలవాడ సీతారామశాస్ట్రీ గారు.
ఆ తరువాత 1865 సంవత్సరంలో 90 పేజీలతో ఈ బాల శిక్ష పుస్తకాన్ని మళ్ళీ ముద్రించి పెద్ద బాలశిక్ష అని ఈ పుస్తకానికి పేరుపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతోమంది ఈ పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని ఎన్నో మార్పులు చేస్తూ ప్రచురిస్తూ వచ్చారు మరియు ఎన్నో ఎడిషన్లు లభించడం విశేషం. 1983 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద బాలశిక్ష కొన్ని ముఖ్యమైన అంశాలని పాఠ్య పుస్తకాల్లో చేర్చడం విశేషం.
పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని ఇన్ని సంవత్సరాలలో ఎంతోమంది రచించారు మరియు ఇప్పుడున్న పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని గాజుల సత్యనారాయణ రచించారు అలాగే విజయవాడ లో ఈ పుస్తకాన్ని ముద్రించడం విశేషం.
మహాభారతంలో 18 పర్వాలు ఉన్నట్టే ఈ పెద్ద బాలశిక్ష పుస్తకంలో కూడా 18 పర్వాలు ఉండటం విశేషం. ఇప్పటి తరానికి గూగుల్ ఎలాగో ఒకప్పుడు పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని కూడా అలా భావించేవారు. ఎలాంటి విషయం తెలుసుకోవాలన్న లేదా ఏ విషయం మీదైనా సందేహం వచ్చిన పెద్ద బాలశిక్ష పుస్తం తిరగేసేవారు.
గ్రంథంలోని ముఖ్యాంశాలు
- తెలుగు అక్షరమాల & వ్యాకరణం – తెలుగు భాషలో అచ్చులు, హల్లులు, సమాసాలు, నామవాచకాలు, క్రియలు మొదలైన విషయాలు.
- సామెతలు & ముచ్చట్లు – పాఠకులకు జ్ఞానం, విలువలు, మానవతా దృక్పథాన్ని నేర్పే సామెతలు.
- పురాణ & ఇతిహాస గాథలు – రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలలోని ముఖ్యమైన కథలు.
- నీతి సూత్రాలు & సుభాషితాలు – తాత్విక సందేశాలను అందించే నీతి కథలు, శ్లోకాలు.
- గణితం & కాల గణన – అంకెల లెక్కింపు, సంఖ్యా వ్యవస్థ, కాలమాన ప్రక్రియలు.
- ధర్మశాస్త్రం & ఆచార వ్యవహారాలు – హిందూ ధర్మంలోని ముఖ్యమైన నిబంధనలు, ఆచారాలు, పండుగల వివరాలు.
ఈ గ్రంథానికి ప్రత్యేకత ఏమిటి?
- ఇది చిన్న వయస్సులోనే పిల్లలకు ప్రాథమిక విజ్ఞానం అందించేందుకు ఉపయోగపడుతుంది.
- భాషాభిమానులకు ఇది ఒక మార్గదర్శిని గ్రంథం.
- ప్రాచీన, ఆధునిక విజ్ఞానాన్ని కలిపిన సమగ్ర తెలుగు గ్రంథం.
- పండితుల నుంచి విద్యార్థుల వరకు అందరికీ ఉపయోగపడే పుస్తకం.
తెలుగు భాషాభిమానులకు మార్గదర్శి
ఈ పుస్తకం ఆధునిక కాలంలో కూడా చాలా ఉపయోగకరం. ఉన్నత చదువులు చదివే విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కూడా పెద్ద బాలశిక్షలోని సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు.
సంక్షిప్తంగా
పెద్ద బాలశిక్ష అనేది కేవలం ఓ పుస్తకం మాత్రమే కాదు, అది తెలుగువారికి జ్ఞానసంపన్నతను అందించే మహానిధి. తెలుగు భాష పట్ల ప్రేమ, వ్యాకరణం పట్ల అవగాహన, సమాజపు నైపుణ్యాలు, పురాణ గాథలు – ఇవన్నీ ఇందులో ఒకే చోట లభిస్తాయి. మీరు చిన్నప్పుడు పెద్ద బాలశిక్ష చదివారా? మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి! ఇదే విధంగా మరిన్ని తెలుగు సంస్కృతి, భాష, సాహిత్య విశేషాల గురించి తెలుసుకోవడానికి మనమందరం ప్రయత్నిద్దాం.
పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని మీరు కూడా కొనాలంటే కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న పుస్తకాన్ని గాజుల సత్యనారారాయణ గారు రచించారు. మీకు నచ్చితే ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు మరియు పార్ట్ 1 & పార్ట్ 2 పేరుతొ రెండు పుస్తకాలూ మీకు లభిస్తాయి.