
చిన్న చిన్న పాత్రలు చేస్తూ సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా, కధానాయకుడిగా నటిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మరియు అభిమానులని సంపాదించుకుని వందకు పైగా చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ గురించి తెలుసుకుందాం.
మొదటి అవకాశం
వినోద్ కుమార్, భానుప్రియ నటించిన పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంతో మొదటి సారి వెండితెర మీదకి కనిపించారు నటుడు శ్రీకాంత్. ఈ చిత్రంలో నక్సలైట్ పాత్రలో నటించడం జరిగింది. ఆ తరువాత మధురానగరిలో, సీతారత్నంగారి అబ్బాయి, పెళ్ళాం చెబితే వినాలి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, జీవితమే ఒక సినిమా, ఆశయం, రధసారధి, వారసుడు, కొండపల్లిరాజా, రౌడీ అన్నయ్య, దొంగల్లుడు, అబ్బాయిగారు, రాజేశ్వరి కళ్యాణం ఇలా మరి కొన్ని చిత్రాల్లో సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా నటిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు శ్రీకాంత్.
కధానాయకుడిగా
శివ నాగేశ్వర్రావు దర్శకత్వంలో జె. డి. చక్రవర్తి, శ్రీకాంత్ కథానాయకులుగా వచ్చిన చిత్రం వన్ బై టూ. కధానాయకుడిగా శ్రీకాంత్ కి మొదటి సినిమా మరియు ఈ చిత్రంలో నిరోషా, ఉత్తర కథానాయికలుగా నటించారు. దొంగ రాస్కేల్, న్యాయ రక్షణ చిత్రాల్లో నటించినా పెద్దగా విజయం సాధించలేదు.
1994 సంవత్సరంలో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, ఊహ కలిసి నటించిన ఆమె చిత్రం ఘన విజయం సాధించింది. ప్రముఖ నటులు నరేష్ ఈ చిత్రంలో మరో కధానాయకుడిగా నటించారు. ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణపొందాయి. ముప్పలేని శివ దర్శకత్వంలో 1995 సంవత్సరంలో శ్రీకాంత్, మోనికాబేడీ, సంఘవి కలిసి నటించిన తాజమహల్ చిత్రం ఘన విజయం సాధించింది.
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో Dr. డి. రామానాయుడు నిర్మించిన తాజమహల్ చిత్రానికి M. M. శ్రీలేఖ సంగీతం అందించారు. ఇదే సంవత్సరంలో శ్రీకాంత్ నటించిన ఊరికిమొనగాడు, సింహగర్జన చిత్రాలు నిరాశపరిచాయి. “దర్శకేంద్రుడు” కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ కలిసి నటించిన చిత్రం పెళ్ళిసందడి. సి. అశ్వినీదత్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
పెళ్ళిసందడి చిత్రానికి M. M. కీరవాణి సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలోని పాటలన్ని ప్రేక్షకులను అలరించాయి అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉన్నాయి. ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడమే కాకుండా తమిళ్, హిందీ, బెంగాలీ భాషల్లో రీమేక్ చేయడం జరిగింది. పెళ్ళిసందడి చిత్రం తరువాత శ్రీకాంత్ నటించిన కూతురు, వేటగాడు, వన్స్ మోర్, ప్రేమ ప్రయాణం చిత్రాల్లో నటించారు.
ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి కలిసి నటించిన వినోదం చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది అంతే కాకుండా ఈ చిత్రంలో హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. హాస్యనటులు బ్రహ్మానందం, ఏవీఎస్ కలిసి పండించిన హాస్యం ప్రేక్షకులను ఇప్పటికి అలరిస్తుంది.
వరుస చిత్రాలు, విజయాలు
1997 సంవత్సరంలో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ స్నేహ, శ్వేతా, స్వాతి కలిసి నటించిన తాళి చిత్రం ఘన విజయం సాధించింది. రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో జె. డి. చక్రవర్తి, శ్రీకాంత్, లైలా కలిసి నటించిన చిత్రం ఎగిరేపావురమా. సుహాసిని ప్రత్యేకపాత్రలో నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకుడిగా శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా కలిసి నటించిన ఆహ్వానం చిత్రం విజయం సాధించింది. శుభకార్యాలకు పత్రికలూ పంచినట్టు విడాకుల కోసం సంప్రదాయంగా విడాకులు ముద్రించి అందరికి పంచి పెడ్తుంది శ్రీకాంత్ భార్య పాత్ర రమ్యకృష్ణ. ఈ సన్నివేశం చూసే ప్రతి ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. 2012 సంవత్సరంలో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ భాషలో డైవోర్స్ ఇన్విటేషన్ పేరుతొ రీమేక్ చేసారు ఎస్. వి. కృష్ణారెడ్డి.
ఆర్. వి. ఉదయ్ కుమార్ దర్శకత్వంలో తారకరాముడు, వీరా శంకర్ దర్శకత్వంలో హలో ఐ లవ్ యు చిత్రాల్లో నటించారు శ్రీకాంత్. ఇ. వి. వి. సత్యనారాయణ “రెబెల్ స్టార్” కృష్ణంరాజు, కోట శ్రీనివాసరావు, శ్రీకాంత్, సిమ్రాన్, అంబికా కలిసి నటించిన మా నాన్నకి పెళ్లి చిత్రం విజయం సాధించింది. శ్రీకాంత్ తండ్రి పాత్రలో కృష్ణంరాజు, తాతయ్య పాత్రలో కోట శ్రీనివాసరావు నటించారు.
మా నాన్నకి పెళ్లి చిత్రంలో తండ్రికి నచ్చిన వ్యక్తిని తనయుడు శ్రీకాంత్ పెళ్ళీ చేయాలి అనుకుంటారు మరి అనుకున్నట్టు తన తండ్రికి పెళ్లి జరిపించడం లేదా అనేది అనేది ఈ చిత్రం చూసి తెలుసుకోవచ్చు. కృష్ణంరాజుని పెళ్లి చేసుకునే పాత్రలో ప్రముఖ నటి అంబికా నర్స్ పాత్రలో నటించారు. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ కలిసి నటించిన ఊయల చిత్రం నిరాశపరిచింది.
శ్రీకాంత్ దంపతులకి కవల పిల్లలు పుట్టడం అందులో ఒకర్ని డాక్టర్ సూచనలతో పిల్లలు లేని ఒక ధనవంతుడి దంపతులకి ఇవ్వడం జరుగుతుంది. ధనవంతుల ఇంట్లో తన పిల్లడు ఎలా ఉన్నాడో అది బైటికి చెప్పలేక మనసులో దాచుకోలేక ఎంత సతమతమయ్యాడు అనేది చిత్ర కధ. ఈ చిత్రంలో శ్రీకాంత్ అద్భుతంగా నటించారు.
శరత్ దర్శకత్వంలో శ్రీకాంత్, రాశి నటించిన పండగ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రముఖ నటులు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలన్ని ఆకట్టుకున్నాయి మరియు భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ముప్పలేని శివ దర్శకత్వంలో శ్రీకాంత్, మీనా, రాశి కలిసి నటించిన గిల్లికజ్జాలు చిత్రం పరవాలేదనిపించింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, రచన కలిసి నటించిన చిత్రం కన్యాదానం. ఈ చిత్రంలో కన్నడ నటులు ఉపేంద్ర తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు. కోటి సంగీతం అందించిన ఈ చిత్రం విజయం సాధించింది. సుప్రభాతం, గమ్యం, శుభలేఖ, ఆయనగారు, మాణిక్యం, ఇంగ్లిష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు చిత్రాల్లో నటించి అలరించారు శ్రీకాంత్.
1999 సంవత్సరంలో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, శ్రీకాంత్, మహిమ చౌదరి కలిసి నటించిన మనసులోమాట చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. రమేష్ శరంగన్ దర్శకత్వంలో శ్రీకాంత్, అబ్బాస్, సౌందర్య, పూనమ్ కలిసి నటించిన అనగనగ ఒక అమ్మాయి నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన పిల్లనచ్చింది చిత్రం పరవాలేదనిపించింది.
పిల్లనచ్చింది చిత్రంలో శ్రీకాంత్ సరసన రచన, సంఘవి నటించారు మరియు ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ఎం. ఎస్. నారాయణ, రజిత పండించిన హాస్యం ప్రేక్షకులను అలరించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్, ప్రిథ్వీరాజ్, కౌసల్య కలిసి నటించిన పంచదారచిలక చిత్రం అపజయాన్ని చూసింది.
చంద్ర మహేష్ దర్శకత్వంలో శ్రీకాంత్, పృథ్వీరాజ్, రాశి, సంఘవి కలిసి నటించిన ప్రేయసిరావే చిత్రం భారీ విజయం సాధించింది. దగ్గుబాటి రామానాయుడు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి ఎం. ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించింది. 2000 సంవత్సరంలో రాజా వన్నేం రెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రోజా, రమ్యకృష్ణ, ప్రీతి, కోవైసరళ కలిసి నటించిన చిత్రం క్షేమంగా వెళ్లి లాభంగా రండి.
హాస్య ప్రధానంగా తీసిన ఈ చిత్రం భారీ విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో రవితేజ ప్రత్యేక పాత్రలో నటించారు మరియు ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శక నిర్మాణంలో శ్రీకాంత్, నవీన్, మాళవిక, ఆశాషైనీ కలిసి నటించిన చాలాబాగుంది చిత్రం ఘన విజయం సాధించింది. ఎల్. బి. శ్రీరామ్ పండించిన హాస్యం ప్రేక్షకులను అలరించగా కోటి సంగీతం ఆకట్టుకుంది.
రాజా వన్నేంరెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, శ్రీకాంత్, రంభ కలిసి నటించిన చూసొద్దాంరండి చిత్రం నిరాశపరిచింది. ఆర్. ఆర్. షిండే దర్శకత్వంలో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, సౌందర్య మరియు ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగార్జున నటించారు. ప్రేమకధ నేపధ్యం మీద రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఎస్. ఏ. రాజ్ కుమార్ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరిస్తుంది.
ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, సురేష్, రాశి, ప్రేమ, ముంతాజ్, ఎల్. బి. శరీరం, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, తనికెళ్ళ భరణి, లహరి కలిసి నటించిన ఆమ్మో ఒకటో తారీఖు చిత్రం నిరాశపరిచిన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్య తరగతి కుటుంబం నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో పృథ్వీరాజ్, రాశి కలిసి నటించిన చిత్రం దేవుళ్ళు. మాస్టర్ నందన్, బేబీ నిత్యా ముఖ్యమైన పత్రాలు పోషించిన ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు శ్రీకాంత్ మరియు అయన సోదరుడు అనిల్ లక్ష్మణుడి పాత్రలో, నటి లయ సీతమ్మ పాత్రలో నటించి అలరించారు. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాసరావు సంగీతం అందించారు.
ఇ. సత్తిబాబు దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, బ్రహ్మానందం, రోజా, మహేశ్వరి, కోవైసరళ కలిసి నటించిన తిరుమల తిరుపతి వేంకటేశ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, జయలక్ష్మి కలిసి నటించిన చిత్రం సకుటుంబ సపరివార సమేతం. ఈ చిత్రంలో సుహాసిని, అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేక పాత్రలో నటించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
గుర్తుండిపోయే చిత్రాలు
2002 సంవత్సరం లో వచ్చిన ఖడ్గం 2003 సంవత్సరంలో వచ్చిన చిత్రం పెళ్ళాం ఊరెళితే , ఒట్టేసిచెబుతున్న 2004 సంవత్సరంలో వచ్చిన స్వరాభిషేకం, శంకర్ దాదా MBBS, సంక్రాంతి 2005 సంవత్సరంలో రాధాగోపాళం 2007 సంవత్సరంలో ఆపరేషన్ దుర్యోధన 2009 సంవత్సరంలో మహాత్మా 2011 సంవత్సరంలో శ్రీరామరాజ్యం 2014 సంవత్సరంలో గోవిందుడు అందరివాడేలే చిత్రాలలో నటించారు.
2016 సంవత్సరంలో సరైనోడు 2021 సంవత్సరంలో అఖండ 2022 సంవత్సరంలో సన్ అఫ్ ఇండియా 2023 సంవత్సరంలో స్కంద 2024 సంవత్సరంలో దేవర పార్ట్ 1 లో గుర్తుండిపోయే పాత్రలు చేశారు శ్రీకాంత్. తమిళ్, మలయాళం కన్నడ భాషలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు శ్రీకాంత్ అంతేకాకుండా రెండు వెబ్ సిరీస్ లో కూడా నటించడం విశేషం.
వ్యక్తిగతం
కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి నగరంలో 1968 సంవత్సరం మార్చ్ 23న జన్మించారు శ్రీకాంత్. తన చదువంతా కర్ణాటక రాష్ట్రం లో సాగింది. 1997 సంవత్సరంలో శ్రీకాంత్ నటి ఊహని ప్రేమ వివాహం చేసుకున్నారు మరియు వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. తనయుడు రోషన్ కూడా నిర్మల కాన్వెంట్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆ తరువాత పెళ్ళిసందడి అనే చిత్రంలో నటించారు.
శ్రీకాంత్కి ఒక అక్క, ఒక తమ్ముడు మరియు తన తమ్ముడు కూడా రెండు చిత్రాల్లో నటించడం విశేషం. శ్రీకాంత్ అక్క కూతురిని ప్రముఖ సినీ నటుడు గోపీచంద్ వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసింది.
శ్రీకాంత్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
- పీపుల్స్ ఎన్కౌంటర్
- మధురానగరిలో
- సీతారత్నం గారి అబ్బాయి
- పెళ్ళాం చెబితే వినాలి
- ప్రెసిడెంట్ గారి పెళ్ళాం
- జీవితమే ఒక సినిమా
- ఆశయం
- రథసారధి
- వారసుడు
- కొండపల్లి రాజా
- రౌడీ అన్నయ్య
- దొంగ అల్లుడు
- అబ్బాయిగారు
- రాజేశ్వరి కళ్యాణం
- రౌడీ గారి టీచర్
- చిన్నల్లుడు
- వన్ బై టూ
- దొంగ రాస్కేల్
- న్యాయరక్షన
- ఆమె
- లవ్ గేమ్
- ఘటోత్కచుడు
- పాతబస్తీ
- తాజ్ మహల్
- ఊరికిమొనగాడు
- సింహ గర్జన
- పెళ్లి సందడి
- కూతురు
- వేటగాడు
- వన్స్ మోర్
- ప్రేమప్రయాణం
- వినోదం
- తాళి
- ఎగిరేపావురమా
- ఆహ్వానం
- కలియుగంలో గందరగోళం
- తారకరాముడు
- హలో ఐ లవ్ యు
- మా నాన్నకు పెళ్లి
- ఊయల
- పండగ
- గిల్లికజ్జాలు
- కన్యాదానం
- సుప్రభాతం
- చంద్రలేఖ (అతిధి పాత్ర)
- గమ్యం
- శుభలేఖలు
- ఆయనగారు
- మాణిక్యం
- ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు
- మనసులో మాట
- అనగనగ ఓక అమ్మాయి
- పిల్ల నచ్చింది
- పంచదార చిలక
- ప్రేయసిరావే
- క్షేమంగా వెళ్లి లాభంగా రండి
- చాలాబాగుంది
- చూసొద్దాం రండి
- నిన్నేప్రేమిస్తా
- ఆమ్మో ఒకటో తారీఖు
- దేవుళ్ళు
- తిరుమల తిరుపతి వేంకటేశ
- సకుటుంబ సపరివార సమేతం
- మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాల మంచిది
- దీవించండి
- కలిసినడుద్దాం
- నా మానసిస్తారా
- ప్రేమ సందడి
- డార్లింగ్ డార్లింగ్
- ఓ చిన్నదానా
- ఆడుతూ పాడుతూ
- తప్పుచేసి పప్పుకూడు
- ఖడ్గం
- పెళ్ళాం ఊరెళితే
- ఒట్టేసిచెబుతున్న
- దొంగ రాముడు అండ్ పార్టీ
- ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి
- నేను పెళ్ళికి రెడీ
- నీకే మానసిచ్చాను
- ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
- లేత మనసులు
- స్వరాభిషేకం
- శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
- సంక్రాంతి
- రాధాగోపాళం
- సోగ్గాడు (అతిధి పాత్ర)
- కాంచనమల కేబుల్ టీవీ
- సరదా సరదాగా
- ఏవండోయ్ శ్రీవారు
- మాయాజాలం
- శ్రీ కృష్ణ 2006
- ఆది లక్ష్మి
- ఆపరేషన్ దుర్యోధన
- శంకర్ దాదా జిందాబాద్
- యమగోల మళ్ళి మొదలైంది
- మైఖేల్ మదన కామ రాజు
- నగరం
- కౌసల్య సుప్రజ రామ
- మహాత్మా
- అ ఆ ఇ ఈ
- రంగ ది దొంగ
- దుశ్శాసన
- విరోధి
- శ్రీ రామ రాజ్యం
- అల్ ది బెస్ట్
- షిర్డీ సాయి
- లక్కీ
- దేవరాయ
- సేవకుడు
- శత్రువు
- షాడో
- క్షత్రియ
- మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో
- వేట
- గోవిందుడు అందరివాడేలే
- ఢీ అంటే ఢీ
- వీడికి దూకుడెక్కువ
- టెర్రర్
- సరైనోడు
- మెంటల్
- యుద్ధం శరణం
- రా రా
- ఆపరేషన్ 2019
- మార్షల్
- ఇదే మా కథ
- తెలంగాణ దేవుడు
- అఖండ
- కోతల రాయుడు
- సన్ అఫ్ ఇండియా
- హంట్
- స్కంద
- కోటబొమ్మాళి ఐ.పి.ఎస్
- దేవర: పార్ట్ 1
- గేమ్ చేంజెర్
- చదరంగం (వెబ్ సిరీస్)
- షూటౌట్ ఎట్ ఆలైర్ (వెబ్ సిరీస్)
మిగితా భాషల్లో చేసిన చిత్రాలు
- హెన్దతి హేళిదరే కేల్బేకు (కన్నడ)
- ఉగాది (కన్నడ)
- విలన్ (మలయాళం)
- ది విలన్ (కన్నడ)
- జేమ్స్ (కన్నడ)
- వరుస (తమిళ)