వ్యాఖ్యాతగా, సహాయనటుడిగా, ప్రతినాయకుడిగ మరియు కధానాయకుడిగా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేస్కుంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ గురించి తెలుసుకుందాం.
వ్యాఖ్యాతగా ప్రయాణం
ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ జెమినీ టీవిలో ప్రసారమైన ఒక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు శివాజీ. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రావడం మొదలవడంతో బుల్లితెర నుంచి వెండితెర బాట పట్టారు శివాజీ. “మెగాస్టార్” చిరంజీవి నటించిన మాస్టర్ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు శివాజీ. సురేస్జ్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో శివాజీ విద్యార్ధి పాత్ర పోషించి ప్రేక్షకులుని మెప్పించారు.
శ్రీకాంత్ కధానాయకుడిగా సాధికా రంధావా కలిసి నటించిన హలో ఐ లవ్ యు చిత్రంలో నటించారు శివాజీ. క్రాంతి కుమార్ దర్శకత్వంలో వినీత్, రవితేజ, శివాజీ, హీరా కలిసి నటించిన పాడుతా తీయగా చిత్రం నిరాశపరిచింది. నూతన దర్శకులు వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో వెంకట్, చాందిని కలిసి నటించిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రంలో స్నేహితుడి పాత్రలో నటించారు శివాజీ.
ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, రచన కలిసి నటించిన కన్యాదానం చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ స్నేహితుడిగా నటించారు శివాజీ.
జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్, ప్రీతి జింతా కలిసి నటించిన ప్రేమంటే ఇదేరా చిత్రంలో స్నేహితుడి పాత్రలో నటించారు శివాజీ. ఈ చిత్రం విజయాన్ని అందించింది. ఫిలింనగర్ చిత్రం నిరాశపరచగా నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగార్జున కలిసి నటించిన సీతారామరాజు చిత్రం విజయం సాధించింది. మహేష్ బాబు నటించిన యువరాజు చిత్రంలో స్నేహితుడి పాత్రలో నటించారు శివాజీ.
సాన యాదిరెడ్డి దర్శకత్వంలో శివాజీ, మాన్య కలిసి నటించిన బ్యాచిలర్స్ చిత్రం నిరాశపరిచింది. రవి చావాలి దర్శకత్వంలో శివాజీ, మాన్య కలిసి నటించిన కాలేజ్ చిత్రం నిరాశపరచగా, ఈ చిత్రంలో “మాయదారి మైసమ్మో” పాట జనాదరణ పొందింది. ఇప్పటికి ఈ పాట సంగీత అభిమానులు వినడం విశేషం. బాలశేఖరన్ దర్శకత్వంలో తరుణ్, శివాజీ, స్నేహ, ప్రీతా కలిసి నటించిన ప్రియమైననీకు చిత్రంలో నటించారు మరియు ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
ఎస్. జె. సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా, శివాజీ కలిసి నటించిన ఖుషి చిత్రం భారీ విజయం సాధించింది. శివాజీ ప్రేమకి పవన్ కళ్యణ్ ఎలా సహాయ పడతారు ఆ తరువాత జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. లవ్, వైఫ్, చిరంజీవులు, స్నేహితుడా చిత్రంలో నటించి అలరించారు శివాజీ. ఆర్. గణపతి దర్శకత్వంలో వేణు, శివాజీ, షామా సికందర్, మాళవిక కలిసి నటించిన ప్రియనేస్తామా చిత్రం నిరాశపరిచింది.
వి. ఉమాకాంత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, సుమన్, నరేష్, జయప్రద, శివాజీ, రాధికా వర్మ కలిసి నటించిన చంద్రవంశం చిత్రం భారీ పరాజయం చూసింది. విరాట పర్వం ఘట్టం నేపధ్యం నుంచి తీసుకున్న ఒక కధ ఆధారంగా నేటి తరానికి తగ్గట్టు చంద్రవంశం చిత్రం రూపొందించారు. బండి రమేష్ దర్శకత్వంలో శివాజీ, అలీ కలిసి నటించిన ఫ్రెండ్స్ చిత్రం నిరాశపరిచింది.
మరికొన్ని చిత్రాలు
జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సాయికిరణ్, శివాజీ, జెన్నిఫర్ కొత్వాల్ కలిసి నటించిన మనసుంటే చాలు చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రంలో శివాజీ ప్రతినాయకుడి పాత్రలో విశాఖ పేరుతొ నటించారు. 2002 సంవత్సరంలో ముప్పలేని శివ దర్శకత్వంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ, ఊర్వశి, రాశి, సంఘవి కలిసి నటించిన సందడే సందడి చిత్రం విజయం సాధించింది.
శేఖర్ సూరి దర్శకత్వంలో తరుణ్ నటించిన అదృష్టం చిత్రంలో నటించారు శివాజీ మరియు ఈ చిత్రం నిరాశపరిచింది. 2002 సంవత్సరంలో బి. గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి, ఆర్తి అగర్వాల్, సోనాలి బెంద్రే కలిసి నటించిన ఇంద్ర చిత్రంలో ఆర్తి అగర్వాల్ మేనల్లుడి పాత్రలో నటించారు శివాజీ. కాశి నగరంలో తల దాచుకుంటున్న ఇంద్రసేనా రెడ్డి పాత్రని వెన్నుపోటు పొడిచే పాత్రలో నటించి మెప్పించారు శివాజీ.
వి. సముద్ర దర్శకత్వంలో జగపతిబాబు, వెంకట్, శివాజీ, పూనమ్, లయ, మోనికా కలిసి నటించిన శివరామరాజు చిత్రం విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి ఎస్. ఏ. రాజ్ కుమార్ సంగీతం అందించారు. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో శ్రీకాంత్, కనిహ, శివాజీ, సునీల్ కలిసి నటించిన ఒట్టేసి చెబుతూన్న చిత్రం ఘన విజయం సాధించింది. ఒట్టేసి చెబుతూన్న చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులని మెప్పించారు శివాజీ.
ఎన్. శంకర్ దర్శకత్వంలో రాజశేఖర్, గుర్లిన్ చోప్రా, సంగీత కలిసి నటించిన ఆయుధం చిత్రంలో ఒక పాత్రలో నటించారు శివాజీ మరియు ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో ఆర్యన్ రాజేష్, శివాజీ, అనిత, సింధు మీనన్ కలిసి నటించిన ఆడంటే అదోటైపు చిత్రం నిరాశపరిచింది.
శ్రీకాంత్ ఐ. దర్శకత్వంలో 2003 సంవత్సరంలో రాజేంద్రప్రసాద్, శివాజీ, బ్రహ్మానందం, రాశి, సింధు మీనన్, కోవైసరళ, రంభ, షకీలా కలిసి నటించిన శ్రీ రామచంద్రులు చిత్రం భారీ విజయం సాధించింది. ఘంటాడి కృష్ణ అందించిన సంగీతంతో పాటు పాటలు కూడా అలరించాయి.
కధానాయకుడిగా మొదటి విజయం
ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో 2003 సంవత్సరంలో శివాజీ, లయ, భూమిక చావ్లా, కలిసి నటించిన మిస్సమ్మ చిత్రం భారీ విజయం సాధించింది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు అలరించాయి మరియు ఈ చిత్రానికి నంది పురస్కారాలు లభించడం విశేషం. మిస్సమ్మ చిత్రంతో శివాజీకి సోలో కధానాయకుడిగా మొదటి విజయం అందుకున్నారు.
బాలశేఖరన్ దర్శకత్వంలో శివాజీ, మీరా జాస్మిన్ కలిసి నటించిన అమ్మాయి బాగుంది చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో మీరా జాస్మిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవ్వడమే కాకుండా తను నటించిన మొదటి చిత్రంతోనే ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఎం. ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.
శివ నాగేశ్వర్రావు దర్శకత్వంలో శివాజీ, లైలా కలిసి నటించిన Mr. అండ్ Mrs. శైలజ కృష్ణమూర్తి విజయం సాధించింది. రైలు ప్రయాణంలో పరిచయమైనా ఇద్దరు వ్యక్తులు, వారి మధ్య చిగురించిన స్నేహం, ప్రేమ ఆ తరువాత జరిగే సంఘటనలు ఈ చిత్రంలో చూడొచ్చు. రోహిత్ రాజ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.
కె. విశ్వనాధ్ దర్శకత్వంలో శ్రీకాంత్, శివాజీ, లయ, ఊర్వశి, ఆముక్త మాల్యద కలిసి నటించిన చిత్రం స్వరాభిషేకం. సంగీతం నేపధ్యం మీద రూపొందించిన ఈ చిత్రంలో కె. విశ్వనాధ్ ప్రత్యేక పాత్రలో నటించారు. విద్యాసాగర్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించగా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు పురస్కారాలు లభించాయి.
ప్రముఖ దర్శకులు వంశీ దర్శకత్వంలో శివాజీ, వేద కలిసి నటించిన కొంచెం టచ్ లో ఉంటె చెబుతాను నిరాశపరచగా చక్రి అందించిన సంగీతం అలరించింది. కే. కిశోర్ దర్శకత్వంలో శివాజీ, రోమా కలిసి నటించిన Mr. ఎర్రబాబు చిత్రం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన అదిరిందయ్యా చంద్రం చిత్రం విజయాన్ని అందుకుంది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శివాజీ, లయ, సంగీత, మధు శర్మ కలిసి నటించిన ఈ చిత్రానికి ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.
శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలో 2006 సంవత్సరంలో శివాజీ, అంకిత కలిసి నటించిన సీతారాముడు చిత్ర్రం నిరాశపరిచింది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో శివాజీ, లయ, కృష్ణ భగవాన్ కలిసి నటించిన టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రానికి ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.
ఉదయ్ శంకర్ దర్శకత్వంలో, గోపీచంద్, మీరా జాస్మిన్, అంకిత, శివాజీ కలిసి నటించిన రారాజు చిత్రం నిరాశపరిచింది. 2007 సంవత్సరంలో రాజా వన్నేంరెడ్డి దర్శకత్వంలో శివాజీ, సుహాసిని కలిసి నటించిన ఆదివారం ఆడవాళ్లకు సెలవు చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, వేణుమాధవ్, కొండవలస లక్ష్మణరావు, కృష్ణభగవాన్, కోవైసరళ, అభినయశ్రీ, సురేఖ వాణి, గీత సింగ్, తెలంగాల శకుంతల షకీలా మరియు ప్రత్యేక అతిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు.
శ్రీహరి నాను దర్శకత్వంలో శివాజీ, భూమిక చావ్లా కలిసి నటించిన సత్యభామ చిత్రం పరవాలేదనిపించింది. గజినీ చిత్రంలో సూర్య చేసిన పాత్ర తరహా భూమిక పాత్ర ఉండడం విశేషం. శాఖమూరి మల్లికార్జున రావు దర్శకత్వంలో శివాజీ, నికిత, సింధు తులాని కలిసి నటించిన నీ నవ్వే చాలు పరాజయం చూసింది.
మరికొన్ని చిత్రాలు
2007 సంవత్సరంలో బోయపాటి శీను దర్శకత్వంలో “విక్టరీ” వెంకటేష్, నయనతార, శివాజీ కలిసి నటించిన తులసి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో నయనతార అన్నయ్యగా నటించారు శివాజీ. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అలరించింది. భజంత్రీలు, స్టేటరౌడీ చిత్రాలు నిరాశపరచగా ఆ తరువాత తులసి రామ్ దర్శకత్వంలో శివాజీ, ఛార్మి కలిసి నటించిన మంత్ర చిత్రం ఘన విజయం సాధించింది.
అల్లరి నరేష్, శివాజీ, శ్రీదేవి కలిసి నటించిన పెళ్లికాని ప్రసాద్ చిత్రం నిరాశపరచగా ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్ కలిసి నటించిన జల్సా చిత్రంలో నటించి మెప్పించారు శివాజీ. ఇ. శ్రీకాంత్ నాహతా దర్శకత్వంలో శివాజీ, బ్రహ్మానందం, రవికృష్ణ, కమలిని ముఖర్జీ కలిసి నటించిన బ్రహ్మానందం డ్రామా కంపెనీ నిరాశపరిచింది.
రాజా వన్నేంరెడ్డి దర్శకత్వంలో శివాజీ, మీరా జాస్మిన్, సంగీత కలిసి నటించిన మా అయన చంటి పిల్లాడు చిత్రం అపజయాన్ని చూసింది. ఆలయం, కౌసల్య సుప్రజ రామ, కుబేరులు, మస్త్, ఇందుమతి చిత్రాలు నిరాశపరిచాయి. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్, సంజన, నీతూ చంద్ర, శివాజీ కలిసి నటించిన సత్యమేవ జయతే చిత్రం నిరాశపరిచింది.
ఎం. నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో శివాజీ, కావేరి ఝా, కలిసి నటించిన నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్, 18, 20 లవ్ స్టోరీ, డైరీ, ఆకాశ రామన్న చిత్రాలు నిరాశపరిచాయి. అరుణ్ సింగరాజు దర్శకత్వంలో శివాజీ, నిష్రత్ భారుచ్చ కలిసి నటించిన తాజ్మహల్ చిత్రం పరాజయాన్ని చూసింది. ఈ చిత్రానికి శివాజీ నిర్మాతగా వ్యవహరించగా, ఆర్తి అగర్వాల్ ప్రత్యేక గీతంలో కనిపిస్తారు. కన్నడ తాజ్మహల్ చిత్రానికి ఇది రీమేక్.
గోళ్లపాటి నాగేశ్వర్రావు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, కళ్యాణి, శివాజీ, సోనియా కలిసి నటించిన బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం చిత్రం పరవాలేదనిపించింది. లోకమే కొత్తగా, ముగ్గురు, ఏమైంది నాలో, అయ్యారే, ఎం బాబు లడ్డు కావాలా, దశ తిరిగింది, పవిత్ర, గోల గోల, కమలతో నా ప్రయాణం, బూచమ్మా బూచాడు, చూసినోడికి చూసినంత, దొరకడు, సీసా చిత్రాల్లో నటించి అలరించారు శివాజీ.
టీవీ మరియు వెబ్ సిరీస్
ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ స్టార్ మా తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కార్యక్రమం లో పాల్గొన్నారు శివాజీ. మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఉత్సాహంగా పాల్గొంటూ మధ్యలో కొన్ని టాస్కులలో ఇబ్బంది పడ్డ తరువాత కోలుకొని ఫినాలే వరకు ఉండడం విశేషం. ఫినాలే రోజు రెండవ రన్నరప్ గా నిలిచారు శివాజీ.
అమెజాన్ ప్రైమ్ ఓటిటి యాప్లో ప్రసారమైన గ్యాంగ్స్టర్స్ మరియు ఈటీవీ విన్ ఓటిటి యాప్లో ప్రసారమైన #90స్ – మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ లో నటించారు శివాజీ. ఈ వెబ్ సిరీస్ లో శివాజీ భార్యగా నటి వాసుకి నటించారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రంలో చెల్లిగా నటించారు వాసుకి. ఈటీవీ తెలుగు ఛానెల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో ఒక జడ్జి గా ఉన్నారు శివాజీ.
ప్రముఖ కధానాయకుడు నితిన్ నటించిన జయం, దిల్, సంబరం, ఆర్యన్ రాజేష్ నటించిన సొంతం, ప్రభుదేవా నటించిన అందరు దొంగలే దొరికితే, యశో సాగర్ కధానాయకుడిగా నటించిన ఉల్లసంగా ఉత్సాహంగా, తమిళ డబ్బింగ్ చిత్రం పిజ్జా చిత్రం తెలుగు లో విజయ్ సేతుపతికి శివాజీ గాత్రం అందించడం జరిగింది.
దిల్ చిత్రానికి గాను ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ పురస్కారం అందుకున్నారు శివాజీ. శివాజీ మాట్లాడే యాస బాగుంటుందని ప్రముఖ నటుడు “మెగాస్టార్” చిరంజీవి ప్రశంసించడం విశేషం.
రాజకీయం
కొన్ని రోజులు సినిమాలకి విరామం ఇచ్చి రాజకీయాల మీద ద్రుష్టి పెట్టారు శివాజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశారు మరియు రాజకీయ విశ్లేషకుడిగా కూడా మారడం జరిగింది. ఈ రాజకీయ ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు శివాజీ.
వ్యక్తిగతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా లోని నరసరావుపేటలో 1977 సంవత్సరం 30 జూన్ న జన్మించారు శివాజీ. శివాజీకి ఇద్దరు కుమారులు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శివాజీ అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడాలి అలాగే మళ్ళీ ఊరికి వెళ్తే కార్ తీసుకొనే వెళ్ళాలి అనే పట్టుదలతో ఉండేవారు. అనుకున్నట్టే మంచి మంచి అవకాశాలు రావడంతో కార్ కొనుక్కొని హైదరాబాద్ నుంచి తన ఊరికి వెళ్లడం విశేషం.
శివాజీ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
- మాస్టర్
- హలో ఐ లవ్ యు
- శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
- ప్రేమంటేఇదేరా
- కన్యాదానం
- ఫిలింనగర్
- సీతారామరాజు
- యువరాజు
- బ్యాచిలర్స్
- కాలేజ్
- ప్రియమైననీకు
- ఖుషి
- వైఫ్
- చిరంజీవులు
- స్నేహితుడా
- ప్రియనేస్తామా
- చంద్రవంశం
- ఫ్రెండ్స్
- మనసుంటేచాలు
- సందడే సందడి
- అదృష్టం
- ప్రియనేస్తామా
- ఇంద్ర
- శివరామరాజు
- ఒట్టేసిచెబుతున్న
- ఆయుధం
- ఆడంతే అదో టైపు
- శ్రీరామచంద్రులు
- మిస్సమ్మ
- వరం
- అమ్మాయి బాగుంది
- Mr. & Mrs. శైలజ కృష్ణమూర్తి
- స్వరాభిషేకం
- కొంచెం టచ్ లో ఉంటె చెబుతాను
- Mr. ఎర్రబాబు
- అదిరిందయ్యా చంద్రం
- సీతారాముడు
- టాటా బిర్లా మధ్యలో లైలా
- రారాజు
- ఆదివారం ఆడవాళ్ళకు సెలవు
- సత్యభామ
- నీ నవ్వే చాలు
- తులసి
- భజంత్రీలు
- స్టేట్ రౌడీ
- మంత్ర
- పెళ్లికాని ప్రసాద్
- జల్సా
- బ్రహ్మానందం డ్రామా కంపెనీ
- మా అయన చంటిపిల్లోడు
- ఆలయం
- కౌసల్య సుప్రజ రామ
- కుబేరులు
- మస్త్
- ఇందుమతి
- నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్
- సత్యమేవజయతే
- 18,20 లవ్ స్టోరీ
- డైరీ
- ఆకాశరామన్న
- తాజ్ మహల్
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
- లోకమెకొత్తగా
- ముగ్గురు
- ఏమైందినాలో
- అయ్యారే
- ఎం బాబు లడ్డు కావాలా
- దశతిరిగింది
- పవిత్ర
- ఆశ దోస అప్పడం
- దశమి
- దశ తిరిగింది
- సంధ్య రాగం
- గురుడు
- గోల గోల
- కమలతో నా ప్రయాణం
- కొలిమి
- దొరకడు
- బూచమ్మ బూచాడు
- చూసినోడికి చూసినంత
- దొరకడు
- సీసా
- గ్యాంగ్స్టర్స్ (వెబ్ సిరీస్)
- #90స్ (వెబ్ సిరీస్)