ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో కధానాయకుడిగా పరిచయం అయ్యారు నితిన్. ఈ చిత్రంలో కథానాయకిగా సదా నటించడం జరిగింది. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. కాలేజీ కుర్రాడి పాత్రలో నితిన్ నటన అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో “రాను రాను అంటూనే చిన్నదో” అనే పాటా తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది.
ప్రముఖ దర్శకుడు వి . వి . వినాయక్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా నితిన్ నటించిన రెండవ చిత్రం దిల్. ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో కథానాయకి పాత్రలో నేహా నటించడం జరిగింది. హాస్య నటుడు వేణుమాధవ్ తో కలిసి నితిన్ పండించిన కామెడీ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుంటుంది.
నితిన్ నటించిన మూడవ చిత్రం సంబరం. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది మరియు ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్. నికిత ఈ చిత్రంలో కథానాయకిగా నటించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన శ్రీ ఆంజనేయం చిత్రంలో అమాయకుడిగా మరియు ఆంజనేయ స్వామి భక్తుడిగా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు నితిన్. ఈ చిత్రంలో ప్రముఖ సినీ నటుడు “యాక్షన్ కింగ్” అర్జున్ ఆంజనేయ స్వామి పాత్రలో నటించడం విశేషం.
వరుస వైఫల్యాలు
“దర్శకధీరుడు” రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సై. జెనీలియా కథానాయకిగా నటించిన ఈ చిత్రం కళాశాల నేపథ్యంలో రూపొందింది. రెండు గ్రూపులు మధ్య జరిగే గొడవలు, అల్లర్లు ఆ తరువాత ప్రతినాయకుడి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ రెండు గ్రూపులు ఒక్కటవ్వడం ఇలా ఆ చిత్రం సాగుతుంది. ఈ చిత్రం నితిన్ కి మంచి విజయాన్ని అందించడమే కాకుండా మంచి పేరు తీసుకొచ్చింది.
సై చిత్రం తరువాత నితిన్ కెరీర్లో వరుసగా పరాజయాలు పలకరించడం మొదలైంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరి బుల్లోడు చిత్రంలో త్రిషతో కలిసి నటించారు నితిన్. ఈ చిత్రంలో నితిన్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. కానీ ఈ చిత్రం పరాజయం పాలైంది. అల్లరి బుల్లోడు చిత్రం నుంచి మారో అనే చిత్రం వరకు విజయం కోసం ఎంతగానో ఎదురు చూశారు నితిన్.
నిర్మాణం, మరియు పూర్వవైభవం
ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇష్క్. నిత్యామీనన్ తో కలిసి ఈ చిత్రంలో నటించారు నితిన్. ఈ చిత్రంతో భారీ విజయం అందుకున్నారు నితిన్. ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించారు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు సోదరి నికిత రెడ్డి. ఈ చిత్రం తరువాత గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో మళ్ళీ నిత్యా మీనన్ తో కలిసి నటించారు నితిన్. ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి దర్శకుడు విజయ్ కుమార్ కొండా.
గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో నితిన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రంలోని “ఏమైందో ఏమో ఈ వేళ” పాటను గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో రీమిక్స్ చేయడం జరిగింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ చిత్రాలు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. జయాపజయాలతో సంభందం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ ముందుకెళ్తున్నారు నితిన్. ఇప్పుడు తన కొత్త చిత్రం రాబిన్ హుడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
మరికొన్ని విశేషాలు
వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించారు నితిన్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అగ్యాత్ అనే హిందీ చిత్రంలో కూడా నటించారు నితిన్. ఇష్క్ మరియు గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలలో నితిన్ పాటలు కూడా పాడటం జరిగింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం అఖిల్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు నితిన్.
వ్యక్తిగతం
1983 సంవత్సరంలో నిజామాబాద్ లో జన్మించారు నితిన్. తన చదువంతా హైదరాబాద్ నగరంలో పూర్తయింది. నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి సినిమా పంపిణీదారుడిగా పనిచేసేవారు. ఇంజినీరింగ్ లో ఉండగానే జయం చిత్రంలో అవకాశం రావడం విశేషం. 2020 సంవత్సరంలో తన వివాహం షాలిని కందుకూరి తో జరిగింది అంతేకాకుండా వీరిది ప్రేమ వివాహం.
నితిన్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
- జయం
- దిల్
- సంబరం
- శ్రీ ఆంజనేయం
- సై
- అల్లరిబుల్లోడు
- ధైర్యం
- రామ్
- టక్కరి
- ఆటాడిస్తా
- విక్టరీ
- హీరో
- ద్రోణ
- అగ్యాత్ (హిందీ)
- రెచ్చిపో
- సీత రాముల కళ్యాణం లంకలో
- మారో
- ఇష్క్
- గుండెజారి గల్లంతయ్యిందే
- హార్ట్ ఎటాక్
- చిన్నదానా నీకోసం
- కొరియర్ బాయ్ కళ్యాణ్
- అ ఆ
- లై
- చల్ మోహన రంగ
- శ్రీనివాస కళ్యాణం
- గద్దలకొండ గణేష్ (అతిధి పాత్ర)
- భీష్మ
- చెక్
- రంగ్ దె
- మాస్ట్రో
- మాచెర్ల నియోజకవర్గం
- ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్
- రాబిన్ హుడ్