ప్రతి సంవత్సరం తెలుగు భాషలో ఎన్నో చిత్రాలు విడుదలవుతుంటాయి అలాగే ఎంతోమంది దర్శకులు పరిచయం అవుతుంటారు, కొంతమంది దర్శకులు విజయాలు అందుకుంటారు కొంతమంది దరర్శకులు అపజయాన్ని చూస్తారు. కానీ ఎన్ని చిత్రాలకి దర్శకత్వం వహించిన తమ మొదటి చిత్రం ఆ దర్శకులకి ప్రత్యేకంగా ఉంటుంది, మరి ఆ దర్శకుల మొదటి చిత్రాలేంటో తెలుసుకుందాం.
మొదటి చిత్ర దర్శకులు
పూరి జగన్నాధ్: “పవర్ స్టార్” పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, అమీషా పటేల్ మరియు ప్రత్యేక పాత్రలో ప్రకాష్ రాజ్ కలిసి నటించిన బద్రి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు పూరి జగన్నాధ్. టి. త్రివిక్రమ రామారావు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించారు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఆ తరువాత పూరి జగన్నాధ్ ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీయడం మనందరికీ తెలిసిందే.
వి. వి. వినాయక్: “యంగ్ టైగర్” ఎన్టీఆర్, కీర్తి చావ్లా కలిసి నటించిన ఆది చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు వి. వి. వినాయక్. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్ పాత్రని మాస్ అభిమానులకు దెగ్గరయ్యేలా చూపించారు వి. వి. వినాయక్. 2002 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మించగా మణిశర్మ సంగీతం అందించడం జరిగింది.
వి. వి. వినాయక్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రమే భారీ విజయం సాధించడంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం కూడా లభించడం విశేషం.
శ్రీను వైట్ల: “మాస్ మహారాజ” రవితేజ, మహేశ్వరి కలిసి నటించిన నీకోసం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీను వైట్ల. 1999 సంవత్సరంలో ఘంటా శ్రీనివాస్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందించలేదు. ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రానికి గాను శ్రీను వైట్ల ఉత్తమ మొదటి చిత్ర దర్శకుడిగా మరియు స్క్రీన్ప్లే రైటర్ గా పురస్కారాలు అందుకోవడం విశేషం.
ఎస్. ఎస్. రాజమౌళి: “యంగ్ టైగర్” ఎన్టీఆర్, గజాల, రాజీవ్ కనకాల కలిసి నటించిన స్టూడెంట్ No 1 చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు ఎస్. ఎస్. రాజమౌళి. తను దర్శకత్వం వహించిన మొదటి చిత్రంతోనే ఘన విజయం సాధించారు ఎస్. ఎస్. రాజమౌళి.
2001 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి సి. అశ్వినీదత్ నిర్మించగా ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఆ తరువాత ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయారు ఎస్. ఎస్. రాజమౌళి.
మొదటి చిత్ర దర్శకులు
త్రివిక్రమ్ శ్రీనివాస్: తరుణ్, శ్రియ శరన్, ప్రకాష్ రాజ్ కలిసి నటించిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పటి వరకు రచయితగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం విశేషం.
2002 సంవత్సరంలో స్రవంతి రవికిశోర్ నిర్మాణంలో కోటి సంగీతం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఉత్తమ సంభాషణ రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది పురస్కారం అందుకోవడం జరిగింది.
సుకుమార్: “స్టైలిష్ స్టార్” అల్లు అర్జున్, శివ బాలాజీ, అను మెహతా కలిసి నటించిన ఆర్య చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు సుకుమార్. 2004 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించింది. ఈ చిత్రానికి దర్శకుడిగా ఫిలిం ఫేర్, సినీ మా, స్క్రీన్ ప్లే రచయితగా నంది, సంతోషం మరియు జెమినీ టీవీ పురస్కారాలు అందుకున్నారు సుకుమార్.
బోయపాటి శీను: “మాస్ మహారాజ” రవితేజ, మీరా జాస్మిన్ కలిసి నటించిన భద్ర చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు బోయపాటి శీను. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. 2005 సంవత్సరంలో దిల్ రాజు నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఆ తరువాత ఎన్నో భారీ చిత్రాలు దర్శకత్వం వహించి విజయాన్ని అందుకున్నారు బోయపాటి శీను.
మెహెర్ రమేష్: కన్నడ భాషలో రెండు చిత్రాలకి దర్శకత్వం వహించిన మెహెర్ రమేష్ తెలుగులో “యంగ్ టైగర్”ఎన్టీఆర్, హన్సిక, తనీషా కలిసి నటించిన కంత్రి చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అయ్యారు. సి. అశ్వినీదత్ నిర్మాణంలో 2008 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.
శ్రీకాంత్ అడ్డాల: వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటించిన కొత్త బంగారులోకం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ అడ్డాల. దిల్ రాజు నిర్మాణంలో 2008 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ అందించారు మరియు అన్ని పాటలు ప్రజాదర పొందాయి.
మరి కొంతమంది దర్శకులు
వై. వి. ఎస్. చౌదరి: అక్కినేని నాగేశ్వరరావు, వెంకట్, చాందిని కలిసి నటించిన సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు వై. వి. ఎస్. చౌదరి. అక్కినేని నాగార్జున నిర్మాణంలో 1998 సంవత్సరంలో విడుదలైన ఈ ప్రేమాకధ చిత్రం ఘన విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.
దశరథ్: “కింగ్” అక్కినేని నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియ శరన్ కలిసి నటించిన సంతోషం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు దశరథ్. కె. విశ్వనాధ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్ర్రం భారీ విజయం సాధించింది. 2002 సంవత్సరంలో కె. ఎల్. నారాయణ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించడం విశేషం.
తేజ: ఉదయకిరణ్, రీమాసేన్ కలిసి నటించిన చిత్రం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు తేజ. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి రామోజీరావు నిర్మించగా ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించడం విశేషం. కళాశాల మరియు ప్రేమకథ నేపధ్యం మీద రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత మరిన్ని ప్రేమకథలు రూపొందించారు దర్శకులు తేజ.
అనిల్ రావిపూడి: 2015 సంవత్సరంలో నందమూరి కళ్యాణ్ రామ్, శృతి సోధి, సాయి కుమార్ మరియు అశుతోష్ రానా కలిసి నటించిన పటాస్ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించగా సాయి కార్తీక్ సంగీతమే అందించారు.
ఈ చిత్రానికి ఉత్తమ నూతన దర్శకుడిగా అనిల్ రావిపూడి గారికి సౌత్ ఇంటర్నేషనల్ మూవీ మరియు సంతోషం పురస్కారాలు లభించాయి. పటాస్ చిత్రం ఆ తరువాత వరుసగా చిత్రాలు చేస్తూ ముందుకెళ్తున్నారు అనిల్ రావిపూడి.
సురేందర్ రెడ్డి: నందమూరి కళ్యాణ్ రామ్, సింధు తులాని కలిసి నటించిన అతనొక్కడే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు సురేందర్ రెడ్డి. 2005 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. నందమూరి జానకి రామ్ నిర్మాణంలో మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఉత్తమ నూతన దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్నారు సురేందర్ రెడ్డి.
మొదటి చిత్ర దర్శకులు
హరీష్ శంకర్: “మాస్ మహారాజ” రవితేజ, జ్యోతిక, టబు ముఖ్య పాత్రలో నటించిన షాక్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు హరీష్ శంకర్. 2006 సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ చిత్రానికి సంగీతం అజేయ్ – అతుల్ మరియు నేపధ్య సంగీతం వచ్చేసి అమర్ మొహాలే.
కొరటాల శివ: “రెబెల్ స్టార్” ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కలిసి నటించిన మిర్చి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కొరటాల శివ. 2013 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
వి. వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన మొదటి చిత్రానికే నంది, ఫిలిం ఫేర్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ పురస్కారాలు అందుకోవడం విశేషం.
నందిని రెడ్డి: “నాచురల్ స్టార్” నాని, నిత్యా మీనన్, స్నేహ ఉల్లాల్ కలిసి నటించిన అలా మొదలైంది చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు నందిని రెడ్డి. 2011 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి నిర్మాత కె. ఎల్. దామోదర ప్రసాద్ మరియు సంగీతం అందించింది కళ్యాణి మాలిక్.
అలా మొదలైంది చిత్రానికి ఉత్తమ నూతన దర్శకురాలిగా నంది మరియు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ పురస్కారాలు అందుకోవడం విశేషం.
బి. జయ: బాలాదిత్య, సుహాసిని కలిసి నటించిన చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు బి. జయ. 2003 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదనిపించింది. బి. ఏ. రాజు నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
ఇంద్రగంటి మోహన్ కృష్ణ: తనికెళ్ళ భరణి, సూర్య, జయలలిత కలిసి నటించిన గ్ర్రాహణం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. 2004 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి బి. వి. సుబ్బారావు, ఎన్. అంజలి రెడ్డి, పి. వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రానికి కె. విజయ్ సంగీతం అందించారు మరియు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ మరియు నంది పురస్కారం మరియు గొల్లపూడి శ్రీనివాస్ పురస్కారం అందుకున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.
మొదటి చిత్ర దర్శకులు
క్రిష్ జాగర్లమూడి: అల్లరి నరేష్, శర్వానంద్, కమిలిని ముఖేర్జీ కలిసి నటించిన గమ్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు క్రిష్ జాగర్లమూడి. 2008 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి సాయిబాబు జాగర్లమూడి నిర్మించగా ఈ. ఎస్. మూర్తి, ఆర్. అనిల్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఒక పాత్రలో కూడా నటించారు క్రిష్ జాగర్లమూడి. ఉత్తమ దర్శకుడిగా నంది మరియు ఫిలిం ఫేర్ పురాక్షరం అందుకున్నారు దర్శకులు క్రిష్ జాగర్లమూడి.
శేఖర్ కమ్ముల: నూతన నటీనటులతో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన మొదటి చిత్రం డాలర్ డ్రీమ్స్. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు శేఖర్ కమ్ముల.
గోపీచంద్ మలినేని: “మాస్ మహారాజ్” రవితేజ, శ్రియ శరన్, శ్రీహరి, అంజనా సుఖాని కలిసి నటించిన డాన్ శీను చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు గోపీచంద్ మలినేని. 2010 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి ఆర్. ఆర్. వెంకట్ నిర్మించగా, మణిశర్మ సంగీతం అందించారు.
కె. ఎస్. రవీంద్ర: “మాస్ మహారాజ్” రవితేజ, హన్సిక, రెజీనా కస్సన్ద్ర కలిసి నటించిన పవర్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కె. ఎస్. రవీంద్ర. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రం 2014 సంవత్సరంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఎస్. ఎస్ థమన్ సంగీతం అందించారు.
మారుతి: ఈరోజుల్లో చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు మారుతి. అంతా కొత్తవాళ్లతో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందించడం విశేషం. గుడ్ సినిమా గ్రూప్ మీద 2012 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి జీవం బాబు సంగీతం అందించారు. ప్రేమకథ నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించింది.
వంశీ పైడిపల్లి: “రెబెల్ స్టార్” ప్రభాస్, ఇలియానా కలిసి నటించిన మున్నా చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు వంశీ పైడిపల్లి. దిల్ రాజు నిర్మాణంలో 2007 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదనిపించింది. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో నటించారు.