Telugu Cinema Hero Sharwanand Filmography

చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తరువాత సహాయ నటుడిగా, కధానాయకుడిగా వరుసగా సినిమాలు చేస్తున్న నటుడు శర్వానంద్ గురించి తెలుసుకుందాం.

మొదటి అవకాశం

ఐదో తారీఖు అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు నటులు శర్వానంద్ కానీ ఆ చిత్రానికి గుర్తింపురాలేదు. బి . వి . రమణ దర్శకత్వంలో సుమంత్, చార్మ్ నటించిన గౌరీ చిత్రంలో సుమంత్ స్నేహితుడి పాత్రలో నటించారు శర్వానంద్. 2004 సంవత్సరంలో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో చిరంజీవి, సోనాలి బెంద్రే కలిసి నటించిన శంకర్ దాదా M.B.B.S. చిత్రాల్లో ఒక పాత్రలో నటించి మెప్పించారు శర్వానంద్.

మలయాళం దర్శకులు జయరాజ్ దర్శకత్వంలో భరత్ కధానాయకుడిగా గోపిక కథానాయికగా నటించిన చిత్రం యువసేన. ఎక్కడ సమస్య వచ్చిన నలుగురు కుర్రాళ్ళు కలిసి ఆ సమస్యని పరిష్కరిస్తారు. నలుగురు స్నేహితులలో శర్వానంద్ కూడా ఒక పాత్ర చేయడం విశేషం మరియు ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ముప్పలేని శివ దర్శకత్వంలో చంద్రమోహన్, “ఊర్వశి” శారదా, “విక్టరీ” వెంకటేష్, శ్రీకాంత్ , శివబాలాజీ, శర్వానంద్, ఆర్తి అగర్వాల్, స్నేహ, సంగీత, రతి కలిసి నటించిన చిత్రం సంక్రాంతి.

సంక్రాంతి చిత్రంలో శర్వానంద్ వెంకటేష్ తమ్ముడి పాత్రలో నటించి అందర్నీ మెప్పించారు మరియు ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. నూతన దర్శకులు దేవాకట్టా దర్శకత్వంలో రాజా, పార్వతి మెల్టన్ కలిసి నటించిన చిత్రం వెన్నెల. ఈ చిత్రంలో శర్వానంద్ ప్రతినాయకుడి ఛాయా ఉన్న పాత్రలో నటించారు మరియు ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది అంతేకాకుండా ఈ చిత్రం చిత్రీకరణ మొత్తం విదేశాల్లో జరగడం విశేషం.

వి. వి. వినాయక్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నయనతార, ఛార్మి కౌర్ కలిసి నటించిన లక్ష్మి చిత్రంలో రాజీవ్ కనకాల, శర్వానంద్ వెంకటేష్ తమ్ముళ్ల పాత్రలో నటించారు మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది. రమణ గోగుల అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది.

కధానాయకుడిగా

గంగరాజు గుణ్ణం దర్శకత్వంలో శర్వానంద్ మొదటిసారి కధానాయకుడిగా నటించిన చిత్రం అమ్మ చెప్పింది. శ్రియా రెడ్డి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటి సుహాసిని తల్లి పాత్రలో నటించారు. మానసిక ఎదుగుదల లేని కుర్రాడి పాత్రలో శర్వానంద్ ఆకట్టుకున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంది.

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద రామోజీ రావు నిర్మాణంలో వచ్చిన చిత్రం వీధి. వి. దొరైరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శర్వానంద్, గోపిక కలిసి నటించారు. ఒక యదార్ధ సంఘటన నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవి కిశోరె నిర్మాతగా వచ్చిన చిత్రం క్లాస్మేట్స్. సుమంత్, శర్వానంద్, సునీల్, కమిలిని ముఖర్జీ, సదా కలిసి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో “అల్లరి” నరేష్, శర్వానంద్, కమిలిని ముఖర్జీ కలిసి నటించిన చిత్రం గమ్యం. పెద్దింటి కుర్రాడి పాత్రలో నటించిన శర్వానంద్ తన ప్రేమను వెతుక్కునే క్రమంలో ఒక దొంగతో స్నేహం చేసి అతని వల్ల కొత్త ప్రపంచాన్నితెలుసుకుంటాడు మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది. నాళై నామదే అనే చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు శర్వానంద్ మరియు ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మోహన్ బాబు, శర్వానంద్, రమ్యకృష్ణ, సుర్వీన్ చావ్లా కలిసి నటించిన చిత్రం రాజు మహారాజు. ఈ చిత్రానికి దర్శకులు శంకర్నాధ్ దుర్గ మరియు ఈ చిత్రం నిరాశపరిచింది. ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అందరి బంధువయా. శర్వానంద్, పద్మ ప్రియా కలిసి నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది.

వరుస చిత్రాలు

దేవాకట్టా దర్శకత్వంలో శర్వానంద్, సాయికుమార్, రూబీ పరిహార్ కలిసి నటించిన చిత్రం ప్రస్థానం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడం విశేషం మరియు ఈ చిత్రంతో నటులు సందీప్ కిషన్ ఆరంగ్రేటం చేయడం జరిగింది. ప్రస్థానం చిత్రానికి ఎన్నో ప్రశంసలు మరియు పురస్కారాలు లభించాయి.

2011 సంవత్సరంలో తమిళ్ భాషలో లో శర్వానంద్ నటించిన చిత్రం ఎంగయేయం ఇప్పోతుమ్.  శర్వానంద్ సరసన అనన్య నటించిన ఈ చిత్రంలో మరో జోడిగా జై, అంజలి నటించడం జరిగింది. ఈ చిత్రం తెలుగులో జర్నీ పేరుతొ విడుదలై భారీ విజయం సాధించింది. “అల్లరి” నరేష్, శర్వానంద్ కలిసి నటించిన రెండవ చిత్రం నువ్వా నేనా.

శ్రియ శరన్ కథానాయికగా నటించిన నువ్వా నేనా చిత్రం 2012 సంవత్సరంలో విడుదలై పరవాలేదనిపించింది మరియు ఈ చిత్రంలో “వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్” పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా విజయం సాధించింది.శర్వా ఆర్ట్స్ బ్యానర్ మీద శర్వానంద్ మొదటిసారి నిర్మాతగా మారి తీసిన చిత్రం కో అంటే కోటి.

అనీష్ కురువిళ్ళ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శర్వానంద్, ప్రియా ఆనంద్ మరియు ప్రత్యేక పాత్రలో శ్రీహరి నటించారు. ఈ చిత్రం నిరాశపరిచింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్, అనైక సాటి కలిసి నటించిన చిత్రం సత్య 2. ఈ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించడం విశేషం మరియు ఈ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది.

వరుస విజయాలు

సుజీత్ దర్శకత్వంలో ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి కలిసి నిర్మించిన చిత్రం రన్ రాజా రన్. శర్వానంద్, అడవి శేష్, సీరత్ కపూర్ కలిసి నటించిన రన్ రాజా రన్ చిత్రం భారీ విజయం సాధించింది. దర్శకుడిగా సుజీత్ మొదటి చిత్రం కావడం విశేషం. 2015 సంవత్సరంలో శర్వానంద్, నిత్యామీనన్ కలిసి నటించిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది మరియు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు ఈ చిత్రంలోని నటి నటులు. శర్వానంద్, నిత్యామీనన్ కలిసి తమిళ్ సినిమాలో నటించిన చిత్రం జె కె ఎనుం నన్ బనీన్ వాఙకై. చేరాం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో నటించారు మరియు ఈ చిత్రం తెలుగులో రాజాధిరాజా పేరుతొ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 2016 సంవత్సరంలో వచ్చిన చిత్రం ఎక్ష్ప్రెస్స్ రాజా. శర్వానంద్, సురభి కలిసి నటించిన ఈ చిత్రానికి వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు మరియు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, సహజనటి జయసుధ, నరేష్, ఇంద్రజ కలిసి నటించిన చిత్రం శతమానంభవతి.

2017 సంవత్సరం సంక్రాతికి విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పూర్తిగా కుటుంబ కధ నేపథ్యంలో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం జరిగింది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం గుండెలకు హత్తుకుంటుంది.

నూతన దర్శకులు చంద్రమోహన్ దర్శకత్వంలో శర్వానంద్, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన చిత్రం రాధ. ఈ చిత్రంలో శర్వానంద్ ఎస్. ఐ పాత్రలో నటించడం జరిగింది మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది. 2017 సంవత్సరంలో మహానుభావుడు చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చారు శర్వానంద్. మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ పీర్జాద కథానాయికగా వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

ఎస్ . ఎస్. థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి నటించిన చిత్రం పడి పడి లేచే మనసు, ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్ కలిసి నటించిన చిత్రం రణరంగం. ఈ చిత్రంలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలో నటించారు మరియు ఈ చిత్రం నిరాశపరిచింది.

మరికొన్ని చిత్రాలు

తమిళ దర్శకులు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్, సమంత కలిసి నటించిన చిత్రం జాను. తమిళ భాషలో వచ్చిన 96 చిత్రానికి ఈ చిత్రం రీమేక్ గా వచ్చింది. తమిళ్ భాషలో విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగులో పరవాలేదనిపించింది. శర్వానంద్, ప్రియాంక మోహన్ కలిసి నటించిన చిత్రం శ్రీకారం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన శర్వానంద్, సిద్దార్థ్, అదిరావు హైదరి, అను ఇమ్మాన్యూల్ కలిసి నటించిన చిత్రం మహాసముద్రం.

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. తిరుమల కిశోరె దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు రాధికా శరత్ కుమార్, ఖుష్బూ సుందర్ మరియు ఊర్వశి కలిసి ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం పరాజయాన్ని నోచుకుంది. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్, రీతువర్మ కలిసి నటించిన చిత్రం ఒకే ఒక జీవితం.

ఒకే ఒక జీవితం చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల నటించడం విశేషం. కణం పేరుతొ తమిళ్ భాషలో చిత్రీకరించారు మరియు ఈ చిత్రం రెండు భాషల్లో మంచి విజయం సాధించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి కలిసి నటించిన చిత్రం మనమే. ఈ చిత్రం పరవాలేదనిపించింది.

వ్యక్తిగతం

1984 సంవత్సరం, మార్చ్ 6 న విజయవాడలో జన్మించారు శర్వానంద్. వ్యాపారవేత్తలైన మైనేని వసుంధర దేవి, మైనేని రత్నగిరి వర ప్రసాద్ రావు గారి తనయుడు శర్వానంద్. తన ఎదుగుదల మరియు చదువంతా హైదరాబాద్లో కొనసాగింది. 2023 సంవత్సరంలో రక్షితా రెడ్డి అనే యువతితో వివాహం జరిగింది మరియు వీరికి ఒక కుమార్తె.

ప్రముఖ నటుడు రామ్ మరియు శర్వానంద్ మధ్య బంధుత్వం ఉండటం విశేషం. ముంబై లోని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరడం జరిగింది. శీతల పానీయమైన థమ్స్ అప్ ప్రకటనలో “మెగాస్టార్” చిరంజీవితో కలిసి నటించారు శర్వానంద్.

శర్వానంద్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
  1. ఐదో తారీఖు
  2. గౌరీ
  3. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
  4. యువసేన
  5. సంక్రాంతి
  6. వెన్నెల
  7. లక్ష్మి
  8. అమ్మ చెప్పింది
  9. వీధి
  10. క్లాస్మేట్స్
  11. గమ్యం
  12. కథల్నా సుమ్మా ఇల్లై (తమిళ్)
  13. నాళై నమదే (తమిళ్)
  14. రాజు మహారాజు
  15. అందరి బంధువయా
  16. ప్రస్థానం
  17. ఎంగేయుమ్ ఇప్పోతుమ్ (తమిళ్)
  18. నువ్వా నేనా
  19. కో అంటే కోటి
  20. సత్య 2
  21. రన్ రాజా రన్
  22. మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు
  23. జె కె ఎనుం నన్ బనీన్ వాఙకై (తమిళ్)
  24. ఎక్ష్ప్రెస్స్ రాజా
  25. రాజాధి రాజా
  26. శతమానం భవతి
  27. రాధా
  28. మహానుభావుడు
  29. పది పది లేచే మనసు
  30. రణరంగం
  31. జాను
  32. శ్రీకారం
  33. మహా సముద్రం
  34. ఆడవాళ్లు మీకు జోహార్లు
  35. ఒకే ఒక జీవితం
  36. కణం (తమిళ్)
  37. మనమే

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *