
ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కధానాయికలు పరిచయం అవుతుంటారు, అందులో కొంతమంది విజయం సాధిస్తే మరికొంతమంది అపజయాన్ని చూస్తారు. మరి అలాంటి విజయాన్ని చూసి విజయవంతమైన చిత్రాల్లో నటించిన కధానాయిక గురించి తెలుసుకుందాం.
తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నటి, స్వర్ణయుగాన్ని సాధించిన నటీమణులలో ఒకరు సౌందర్య. ఆమె కేవలం గ్లామర్‌కు పరిమితం కాకుండా, అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న అద్భుత నటి.
కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన కన్నడ అమ్మాయి సౌందర్య. మాతృభాషా కన్నడ, కానీ తెలుగు భాషలోనే ఎక్కువ చిత్రాలు చేయడం విశేషం. తన నటన, అభినయంతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు సౌందర్య మరియు తెలుగు సినీ ప్రేక్షకులు తనని తమ తెలుగింటి ఆడపడుచుగా అభిమానించారు.
తెలుగు భాషలో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం మరియు హిందీ భాషలో కూడా నటించడం విశేషం. మరి అలంటి తెలుగు వారి అభిమానాన్ని సంపాదించుకున్న సౌందర్య సినీ ప్రయాణం తెలుసుకుందాం.
సినీ ప్రయాణం
పి. ఎస్. రామచంద్రరావు దర్శకత్వంలో హరీష్ కధానాయకుడిగా నటించిన మనవరాలి పెళ్లి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సౌందర్య. 1993 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి ఎం. దశరధ రాజు నిర్మించగా విద్యాసాగర్ సంగీతాన్ని అందించారు మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది.
ఎస్. వి. కృష్ణరెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య, గుండు హనుమంత్ రావు, కోట శ్రీనివాసరావు కలిసి నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం భారీ విజయం సాధించింది. కిశోర్ రాఠీ సమర్పణలో కె. అచ్చిరెడ్డి నిర్మాణంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఏనుగు నేపధ్యం మీద రూపిందించడం జరిగింది.
1993 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి ఎస్. వి. కృష్ణరెడ్డి సంగీతం అందించగా పాటలన్ని ప్రేక్షకులని అలరించాయి. కాట్రవల్లీ అంటూ అలీ, బుచ్చికి బుచ్చికి అంటూ బాబూమోహన్ అలాగే బ్రహ్మానందం తో జరిగే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ చిత్రాన్ని జోడీదార్ పేరుతొ హిందీ భాషలో నిర్మించడం జరిగింది.
ఎస్. వి. కృష్ణరెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య కలిసి నటించిన మరో చిత్రం మాయలోడు. కిశోర్ రాఠీ సమర్పణలో కె. అచ్చి రెడ్డి నిర్మాణంలో తెరకెక్కించిన ఈ చిత్రం గారడీ నేపధ్యం మీద మరియు ఒక చిన్న పాపా మీద రూపొందించడం జరిగింది. 1993 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి ఎస్. వి. కృష్ణరెడ్డి సంగీతం అందించగా పాటలన్ని ప్రేక్షకులని అలరించాయి. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతోపాటు రెండు నంది పురస్కారాలు తీసుకొచ్చింది.
కె. సదాశివరావు దర్శకత్వంలో బాలాజీ నిర్మాణంలో “సహజ నటి” జయసుధ, హరీష్, సౌందర్య కలిసి నటించిన ఇన్స్పెక్టర్ ఝాన్సీ చిత్రం విజయం సాధించింది. 1993 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి రాజ్ – కోటి సంగీతం అందించారు. వై. నాగేశ్వరరావు దర్శకత్వంలో 1993 సంవత్సరంలో వినోద్ కుమార్, సౌందర్య కలిసి నటించిన మాయదారి మోసగాడు చిత్రం పరవాలేదనిపించింది. వద్దే అంజమ్మ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి రాజ్ – కోటి సంగీతం అందించారు.
పి. ఎస్. రామచంద్రరావు దర్శకత్వంలో నరేష్, సౌందర్య కలిసి నటించిన అసలే పెళ్ళైన వాణ్ణి, శరత్ దర్శకత్వంలో సుమన్, సౌందర్య కలిసి నటించిన దొంగల్లుడు, పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఘట్టమనేని రమేష్ బాబు, సౌందర్య, ఆమని కలిసి నటించిన అన్న చెల్లెలు, తమ్మ రెడ్డి దర్శకత్వంలో సుమన్, సౌందర్య, మాలాశ్రీ కలిసి నటించిన ఊర్మిళ చిత్రాలు 1993 సంవత్సరంలో విడుదలవడం జరిగింది.
1994 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు
ఎస్. వి. కృష్ణ రెడ్డి దర్శకత్వంలో “సూపర్ స్టార్ నటశేఖర” కృష్ణ, సౌందర్య కలిసి నటించిన నంబర్ 1 చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఎస్. వి. కృష్ణ రెడ్డి సంగీతం అందించారు మరియు ఈ చిత్రాన్ని దాన్ వీర్ పేరుతొ హిందీ భాషలో రూపిందించారు. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో కింగ్ అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో సౌందర్య, రమ్య కృష్ణ కలిసి నటించిన హలో బ్రదర్ చిత్రం భారీ విజయం సాధించింది.
కె. ఎల్. నారాయణ, ఎస్. గోపాల్ రెడ్డి నిర్మాణంలో 1994 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి రాజ్ – కోటి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని హిందీ భాషలో జూడ్ద్వా పేరుతొ రెండు సార్లు రీమేక్ చేయడం జరిగింది. ఒకటి 1997 సంవత్సరంలో మరియు 2017 సంవత్సరంలో రీబూట్ జూడ్ద్వా పేరుతొ రీమేక్ చేశారు. అలాగే కన్నడ మరియు బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ చేయడం విశేషం.
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగపతిబాబు, సౌందర్య, రంభ, కంచన్ మరియు రమ్య కృష్ణ కలిసి నటించిన అల్లరి పేరేమికుడు చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రానికి ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు. కె. మురళి మోహనరావు దర్శకత్వంలో దగ్గుబాటి సురేష్ నిర్మాణంలో “విక్టరీ” వెంకటేష్, సౌందర్య, నగ్మా కలిసి నటించిన సూపర్ పోలీస్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో జయసుధ ప్రత్యేక పాత్రలో నటించగా ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందించడం విశేషం.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో కొల్లి వెంకటేశ్వరావు, ఎస్. అది రెడ్డి నిర్మాణంలో అర్జున్, సౌందర్య, ప్రియరామన్ కలిసి నటించిన మా ఊరి మారాజు చిత్రం ఘన విజయం సాధించింది. 1994 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి రాజ్ – కోటి సంగీతాన్ని అందించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య కలిసి నటించిన మేడం చిత్రం ఘన విజయం సాధించింది మరియు రెండు నంది పురస్కారాలు లభించాయి.
ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ మహిళా వేషం వేసి ప్రేక్షకులను అలరించారు. ఎస్. వి. కృష్ణ రెడ్డి దర్శకత్వంలో ఆచంట గోపినాథ్ నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ, సౌందర్య కలిసి నటించిన టాప్ హీరో చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రానికి ఎస్. వి. కృష్ణ రెడ్డి సంగీతం అందించారు. త్రిపురనేని శ్రీ ప్రసాద్ దర్శకత్వంలో త్రిపురనేని మహారథి నిర్మించిన రైతు భరతం చిత్రంలో కృష్ణ, భాను చందర్, సౌందర్య కలిసి నటించిన ఈ చిత్రానికి రాజ్ – కోటి సంగీతాన్ని అందించారు.
1995 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు
సాగర్ దర్శకత్వంలో కృష్ణ, సౌందర్య, ఆమని, ఇంద్రజ కలిసి నటించిన అమ్మదొంగ చిత్రం ఘన విజయం సాధించింది. సి. హెచ్. సుధాకర్ బాబు, భారతి దేవి మౌళి కలిసి నిర్మించిన ఈ చిత్రం 1995 సంవత్సరంలో విడుదలైంది మరియు ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో సి. సురేంద్ర బాబు నిర్మాణంలో వచ్చిన చిలకపచ్చకపురం చిత్రం ఘన విజయం సాధించింది. జగపతిబాబు, మీన, సౌందర్య కలిసి నటించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందించారు.
కె. రాఘవేంద్రరరావు దర్శకత్వంలో రాజశేఖర్, సౌందర్య, రమ్యకృష్ణ కలిసి నటించిన రాజా సింహం చిత్రం విజయాన్ని అందించింది. సి. హెచ్. వి. అప్పారావు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ చిత్రానికి రాజ్ – కోటి సంగీతం అందించారు. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు, భాను ప్రియా, సౌందర్య, రాజా రవీంద్ర కలిసి నటించిన పెదరాయుడు చిత్రం భారీ విజయాన్ని సాధించింది. తమిళ్ “సూపర్ స్టార్” రజని కాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించి ఆకట్టుకున్నారు నటులు మోహన్ బాబు.
తమిళ్ భాషలో విడుదలై భారీ విజయం సాధించిన నట్టమై చిత్రానికి తెలుగు భాషలో పెదరాయుడు పేరుతొ రీమేక్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మించగా కోటి సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలో నటి నటుల నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం. శరత్ దర్శకత్వంలో జగపతిబాబు, సౌందర్య కలిసి నటించిన భలే బుల్లోడు, సాగర్ దర్శకత్వంలో వినోద్ కుమార్, సౌందర్య కలిసి నటించిన అమ్మ నా కోడలా చిత్రాలలో నటించారు సౌందర్య.
తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో రాజశేఖర్, సౌందర్య కలిసి నటించిన వేటగాడు, వై. నాగేశ్వర్రావు దర్శకత్వంలో సుమన్, సౌందర్య కలిసి నటించిన బాలరాజు బంగారు పెళ్ళాం, పురాణం సూర్య దర్శకత్వంలో వినోద్ కుమార్, సౌందర్య, దాసరి నారాయణ రావు, శారదా కలిసి నటించిన మాయదారి కుటుంబం చిత్రాలలో నటించి అలరించారు సౌందర్య.
మరికొన్ని చిత్రాలు
దాసరి నారాయణరావు దర్శకత్వంలో సుమన్, ఆమని నటించిన మాయాబజార్ చిత్రంలో అతిధి పాత్రలో నటించారు సౌందర్య మరియు ఈ చిత్రంలో దాసరి నారాయణరావు ఒక ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో సురేష్, సౌందర్య కలిసి నటించిన అమ్మోరు చిత్రం భారీ విజయం సాధించింది.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో కె. చక్రవర్తి, శ్రీ కొమ్మినేని కలిసి సంగీతం అందించిన ఈ చిత్రంలో సౌందర్య అమాయకపు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది మరియు దేవత పాత్రలో ప్రముఖ నటి రమ్య కృష్ణ నటించారు అనడంకంటే జీవించారు అని చెప్పుకోవచ్చు. అమ్మోరు చిత్రానికి ఉత్తమ నటిగా ఫీల్ ఫేర్ పురస్కారం అందుకున్నారు సౌందర్య.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, నగ్మా, సౌందర్య, జయసుధ కలిసి నటించిన రిక్షావోడు చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ఈ చిత్రంలో తండ్రి, కొడుకు పాత్రలో నటించారు చిరంజీవి.
1996 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు
విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ, సౌందర్య కలిసి నటించిన పుట్టింటి గౌరవం చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రానికి జి. ఉమామహేష్ నిర్మించగా ఎం. సురేష్ సంగీతాన్ని అందించారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నాగార్జున, సౌందర్య కలిసి నటించిన రాముడొచ్చాడు చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రాన్ని యార్లగడ్డ సురేంద్ర నిర్మించగా రాజ్ సంగీతాన్ని అందించారు.
ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో కె. ఎల్. నారాయణ నిర్మాణంలో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో వెంకటేష్, సౌందర్య, వినీత కలిసి నటించిన ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. సరద సరదాగా సాగిపోయే ఈ చిత్రం ప్రేక్షకులని అలరించింది.
సాగర్ దర్శకత్వంలో కృష్ణ, సౌందర్య, ఇంద్రజ కలిసి నటించిన జగదేకవీరుడు, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో శ్రీకాంత్, వినోద్ కుమార్, సౌందర్య కలిసి నటించిన ప్రేమ ప్రయాణం చిత్రాలతో అలరించారు సౌందర్య. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య కలిసి నటించిన పవిత్రబంధం చిత్రం భారీ విజయాన్ని సాధించింది. సి. వెంకటరాజు, జి. శివరాజు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.
పవిత్రబంధం చిత్రంలో సౌందర్య నటన ప్రేక్షకులని ఆకట్టుకుంది మరియు ఈ చిత్రాన్ని కన్నడ, హిందీ, తమిళ్ మరియు బెంగాలీ భాషలో రీమేక్ చేయడం విశేషం. ప్రముఖ గాయకులు ఎస్. పి. బాలసుబ్రమణ్యం ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఓం సాయి ప్రకాష్ దర్శకత్వంలో శశి కుమార్, సౌందర్య కలిసి నటించిన మా ఇంటి ఆడపడుచు చిత్రం పరవాలేదనిపించింది.
1997 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు
కోడి రామకృష్ణ దర్శకత్వంలో జగపతిబాబు, సురేష్, సౌందర్య, రైతు శివ్ పూరి కలిసి నటించిన చిత్రం దొంగాట. శరత్ బాబు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రానికి Dr. కె. ఎల్. నారాయణ నిర్మించగా భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సౌందర్య అమాయకపు పాత్రలో నటించి మెప్పించారు.
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య, లైలా కలిసి నటించిన పెళ్లి చేసుకుందాం భారీ విజయాన్ని సాధించింది. సి. వెంకటరాజు, జి. శివరాజు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. ఈ చిత్రం తమిళ్, హిందీ మరియు కన్నడ భాషల్లో రీమేక్ అవ్వడం విశేషం.
ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, సౌందర్య, మహేశ్వరి కలిసి నటించిన ప్రియరాగాలు చిత్రం ఘన విజయం సాధించింది. సుంకర మధు మురళి నిర్మించిన ఈ చిత్రానికి ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు. మలయాళం చిత్రానికి తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. వీరు కె. దర్శకత్వంలో వినీత్, సౌందర్య కలిసి నటించిన ఆరోప్రాణమా చిత్రం విజయాన్ని అందించింది. వి. శ్రీనివాసరెడ్డి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి వీరు కె. సంగీతం అందించడం జరిగింది.
తన కన్నా వయసులో ఉన్న వ్యక్తి ప్రేమించే పాత్రలో వినీత్ నటించర్రు మరియు తమ ప్రేమని పెద్దలు ఎలా ఒప్పుకున్నారనేది ఈ చిత్ర నేపధ్యం. ఆర్. వి. ఉదయ్ కుమార్ దర్శకత్వంలో శ్రీకాంత్, సౌందర్య కలిసి నటించిన తారకరాముడు చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ఏ. మోహన్ గాంధీ దర్శకత్వంలో రాజశేఖర్, సౌందర్య కలిసి నటించిన మా ఆయన బంగారం చిత్రం పరవాలేదనిపించింది. పోకూరిబాబు రావు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
ఈ చిత్రంలో ఆక్సిడెంట్ జరిగి గతం మరిచిపోయి మతిస్థిమితం లేని పాత్రలో నటించారు సౌందర్య మరియు లారి డ్రైవర్ పాత్రలో రాజ్ శేఖర్ నటించడం విశేషం. సాగర్ దర్శకత్వంలో సుమన్, సౌందర్య కలిసి నటించిన ఓసి నా మరదలా చిత్రం పరవాలేదనిపించింది.
1998 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు
ఎస్. వి. కృష్ణ రెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, సౌందర్య కలిసి నటించిన పెళ్లి పీటలు చిత్రం ఘన విజయం సాధించింది. వి. బి. రాజేంద్రప్రసాద్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించారు. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు, రచన, సౌందర్య కలిసి నటించిన రాయుడు చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఎస్. ఏ. రాజ్ కుమార్ సంగీతంలో వచ్చిన ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మించారు.
గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి, సౌందర్య, అంజలి ఝవేరి కలిసి నటించిన చూడాలనివుంది చిత్రం భారీ విజయం సాధించింది. మణిశర్మ సంగీతంలో వచ్చిన ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మించారు. పద్మావతి పాత్రలో సౌందర్య నటించి ప్రేక్షకులని అలరించారు. ఎన్. శంకర్ దర్శకత్వంలో మోహన్ బాబు, సౌందర్య కలిసి నటించిన శ్రీరాములయ్య చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రముఖ నటులు నందమూరి హరికృష్ణ ప్రత్యేక పాత్రలో నటించి ప్రేక్షకులని అలరించారు.
రాజకీయ నేపధ్యం మీద రూపొందించిన ఈ చిత్రానికి పరిటాల సునీతా నిర్మించారు మరియు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రాజశేఖర్, సౌందర్య కలిసి నటించిన సూర్యుడు చిత్రం ఘన విజయం సాధించింది. మేడికొండ మురళీకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
పి. ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో అర్జున్, సౌందర్య కలిసి నటించిన శుభవార్త చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ్ భాషలో ఏకకాలంలో రూపొందించడం జరిగింది. కోటి సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎం. వై. మహర్షి మరియు కైలపులి ఎస్. థను నిర్మించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో సాయి కుమార్, సౌందర్య, జగపతిబాబు కలిసి నటించిన అంతఃపురం చిత్రం భారీ విజయం సాధించింది.
పి. కిరణ్ నిర్మాణంలో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకున్నారు సౌందర్య. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శారదా, తెలంగాణ శకుంతల ముఖ్య పత్రాలు పోషించిన ఈ చిత్రం రాయలసీమ నేపధ్యం మీద రూపొందించడం జరిగింది. హిందీ మరియు తమిళ్ భాషలో అంతఃపురం చిత్రాన్ని రీమేక్ చేయడం విశేషం.
అయ్యప్ప శర్మ దర్శకత్వంలో సాయి కుమార్, సౌందర్య కలిసి నటించిన ఈశ్వర్ అల్లా చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. సాయి ప్రకాష్ దర్శకత్వంలో వద్దే నవీన్, సౌందర్య కలిసి నటించిన తాంబూలాలు చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రానికి రాజ్ సంగీతం అందించారు.
1999 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు
ముప్పలేని శివ దర్శకత్వంలో వెంకటేష్, అబ్బాస్, సౌందర్య కలిసి నటించిన రాజా చిత్రం భారీ విజయం సాధించింది. తమిళ్ రీమేక్ గా తెలుగులో విడుదలైన ఈ చిత్రానికి ఆర్. బి. చౌదరి నిర్మించగా ఎస్. ఏ. రాజ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో గాయని పాత్రలో నటించారు సౌందర్య. 1999 సంవత్సరారంలో విడుదలైన రాజా చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు సౌందర్య.
ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో చక్రవర్తి, రవితేజ, సౌందర్య కలిసి నటించిన ప్రేమకువెళాయర చిత్రం ఘన విజయం సాధించింది. తరంగ సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో నటించి అలరించారు. క్రాంతి కుమార్ దర్శకత్వంలో రామ్ కుమార్, సౌందర్య కలిసి నటించిన అరుంధతి చిత్రం పారవేలాడనిపించింది. వెంకటేశ్వరరావు కొల్లి నిర్మాణంలో ఎం. ఎం. కీరవాణి సంగీతంలో వచ్చిన ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం.
రమేష్ సరంగన్ దర్శకత్వంలో శ్రీకాంత్, అబ్బాస్, సౌందర్య, పూనమ్ కలిసి నటించిన అనగనగ ఓక అమ్మాయి చిత్రం నిరాశపరిచింది. కృష్ణప్రసాద్ నిర్మాణంలో మణిశర్మ సంగీతంలో వచ్చిన ఈ చిత్రంలో రఘువరన్ ప్రత్యేక పాత్రలో నటించారు. కృష్ణ నటించి దర్శకత్వం వహించిన మానవుడు దానవుడు చిత్రంలో కధానాయికగా నటించారు సౌందర్య మరియు ఈ చిత్ర్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
2000 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ, వెంకట్, సౌందర్య, షీశ్వ, చాందిని కలిసి నటించిన అన్నయ్య చిత్రం ఘన విజయం సాధించింది. కె. వెంకటేశ్వరావు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. బి. గోపాల్ దర్శకత్వంలో కృష్ణ, రాజశేఖర్, సౌందర్య, సంఘవి కలిసి నటించిన రావన్న చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ముప్పలేని శివ దర్శకత్వంలో మోహన్ బాబు, సౌందర్య, రాశి కలిసి నటించిన పోస్టుమాన్ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
క్రాంతికుమార్ దర్శకత్వంలో విక్రమ్ సౌందర్య కలిసి నటించిన 9 నెలలు, రాఘవేంద్రరరావు దర్శకత్వంలో జగపతిబాబు, సౌందర్య, రంభ, రాశి కలిసి నటించిన మూడు ముక్కలాట, ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, సౌందర్య, ఆశాషైనీ కలిసి నటించిన సర్దుకుపోదామా రండి చిత్రాలతో అలరించారు సౌందర్య.
ఆర్. ఆర్ షిండే దర్శకత్వంలో నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య కలిసి నటించిన నిన్నే ప్రేమిస్తా చిత్రం ఘన విజయం సాధించింది. ప్రముఖ నటులు కె. చక్రవర్తి, రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఆర్. బి. చౌదరి నిర్మించగా ఎస్. ఏ. రాజ్ కుమార్ సంగీతం అందించారు. తమిళ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో సౌందర్య నటన ఆకట్టుకుంటుంది.
తిరుపతిస్వామి దర్శకత్వంలో నాగార్జున, సౌందర్య, శిల్ప శెట్టి కలిసి నటించిన ఆజాద్ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. జర్నలిస్ట్ పాత్రలో మరియు ఆజాద్ అనే కల్పిత పాత్ర సృష్టించి నటించారు సౌందర్య.
ఎన్. శంకర్ దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య, భానుప్రియ కలిసి నటించిన జయం మనదేరా చిత్రం ఘన విజయం సాధించింది. ఈ ఛిట్ర్రంలో వెంకటేష్ ద్విపాత్రాభినయంలో నటించడం విశేషం. డి. సురేష్ బాబు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
2001 – 2003 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం. ఎస్. రాజు నిర్మాణంలో వచ్చిన దేవిపుత్రుడు చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. వెంకటేష్, సురేష్, సౌందర్య, అంజలి ఝవేరి కలిసి నటించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం పేక్షకులను నిరాశపఱిచింది.
జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగార్జున, సౌందర్య, షెనాజ్ కలిసి నటించిన ఎదురులేని మనిషి చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో నాగార్జున అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయంలో నటించడం విశేషం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్, సౌందర్య కలిసి నటించిన కలిసినడుద్దాం చిత్రం పరవాలేదనిపించింది.
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా కలిసి నటించిన శ్రీ మంజునాథ చిత్రం విజయాన్ని చూసింది. పరమ శివుడి భక్తురాలిగా సౌందర్య నటన ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సౌందర్య భర్త పాత్ర పోషించిన అర్జున్ నాస్తికుడైతే అతన్ని మార్చే పాత్రలో నటించారు సౌందర్య. ఈ చిత్రంలో శివ పార్వతుల్లాగా చిరంజీవి, మీనా నటించడం విశేషం. నారా జయశ్రీ దేవి నిర్మాణంలో హంసలేఖ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు మరియు కన్నడ భాషలో ఏకకాలంలో రూపిందించారు.
ఆర్. ఆర్. షిండే దర్శకత్వంలో శ్రీకాంత్, సౌందర్య, రిచా కలిసి నటించిన నా మానసిస్తారా చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు, నాగార్జున, సౌందర్య, ప్రీతి ఝిన్గానియా కలిసి నటించిన అధిపతి చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో మోహన్ బాబు, సౌందర్య, లయ కలిసి నటించిన కొండవీటి సింహాసనం చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ఈ చిత్రంలో దాసరి నారాయణరావు ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం.
త్రిపురనేని దర్శకత్వంలో గెలుపు చిత్రంలో నటించారు సౌందర్య. ఈ చిత్రంలో నటి లయ కూడా నటించడం విశేషం. ఏ. మోహన్ గాంధీ దర్శకత్వంలో వినోద్ కుమార్, సౌందర్య కలిసి నటించిన ప్రేమదొంగ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. షూటింగ్ మొదలై మధ్యలో ఆగిపోయి మళ్ళి కొన్ని సంవత్సరాల తరువాత చిత్రాన్ని ముగించడం విశేషం.
2004 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు
సంజీవి దర్శకత్వంలో అబ్బాస్, సౌందర్య కలిసి నటించిన శ్వేతనాగు చిత్రం ప్రేక్షకులను పరవాలేదనిపించింది. ఈ చిత్రంలో శరత్ బాబు ప్రత్యేక పాత్ర్రలో నటించడం జరిగింది. తెలుగు మరియు కన్నడ భాషల్లో ఎకకకాలంలో రూపొందించారు. ఈ చిత్రం సౌందర్య నటించిన 100వ చిత్రం అవ్వడం విశేషం.
కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో మోహన్ బాబు సౌందర్య కలిసి నటించిన శివ శంకర్ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. మోహన్ బాబు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతమే అందించారు. ఈ చిత్రం పూర్తవకముందే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు సౌందర్య. నందమూరి బాలకృష్ణ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న నర్తనశాల చిత్రంలో సౌందర్య ద్రౌపది పాత్రలో ఎంపికయ్యారు. కానీ సౌందర్య కన్ను మూయడం వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోవడం జరిగింది.
మిగితా భాషలో సౌందర్య నటించిన చిత్రాలు
హెచ్. ఆర్. భార్గవ దర్శకత్వంలో విష్ణువర్ధన్, రూపిణి, సౌందర్య కలిసి నటించిన కన్నడ చిత్రం రాజాధిరాజా. శ్రీ వైష్ణవి ఇంటెర్నేషనల్స్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి విజయానంద్ సంగీతం అందించారు.పేరాల దర్శకత్వంలో దేవరాజ్, అంజనా సంజయ్ శాంతారాం, సౌందర్య కలిసి నటించిన నన్న తంగి చిత్రంలో నటించారు సౌందర్య.
సిద్ద లింగయ్య దర్శకత్వంలో శశికుమార్, సౌందర్య కలిసి నటించిన బానన్న ప్రీతిసు చిత్రం విజయం సాధించింది. రామ్నాథ్ రుగ్వేది. హెచ్. ఎస్. రాజశేఖర్ కలిసి దర్శకత్వంలో వచ్చిన గాంధర్వ అనే కన్నడ చిత్రంలో నటించారు సౌందర్య. శశికుమార్, బృంద కలిసి నటించిన ఈ చిత్రానికి హంసలేఖ సంగీతం అందించారు.
ఆర్. వి. ఉదయ కుమార్ దర్శకత్వంలో వచ్చిన పొన్నుమణి చిత్రంతో తమిళ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు సౌందర్య. ఈ చిత్రంలో కార్తీక్ కధానాయకుడిగా నటించడం జరిగింది. 1993 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదనిపించింది. రాజేంద్ర కుమార్ దర్శకత్వంలో శశికుమార్, దేవరాజ్, సౌందర్య కలిసి నటించిన కన్నడ చిత్రం విజయ క్రాంతి.
వసంత కునిగళ్ దర్శకత్వంలో అనంత్ నాగ్, సౌందర్య కలిసి నటించిన తూగువే కృష్ణ్ణన అనే కన్నడ చిత్రంలో నటించి మెప్పించారు సౌందర్య. గోకుల కృష్ణన్ దర్శకత్వంలో కార్తీక్, సౌదర్యం కలిసి నటించిన తమిళ చిత్రం ముతుకలై, ఎం. సోలై రాజేంద్రన్ దర్శకత్వంలో రెహమాన్, శివకుమార్, సౌందర్య కలిసి నటించిన డియర్ సన్ మరుతూ చిత్రంలో నటించారు సౌందర్య.
రవిచంద్రన్ నటిస్తూ దర్శకత్వం వహించిన సిపాయి అనే కన్నడ చిత్రం నటించారు సౌందర్య మరియు ఈ చిత్రంలో చిరంజీవి ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో మేజర్ పేరుతొ తెలుగులో అనువదించారు. ఎం. రత్నకుమార్ దర్శకత్వంలో సత్యరాజ్, సుకన్య, సౌందర్య కలిసి నటించిన సేనాతిపతి, సుందర్ సి. దర్శకత్వంలో రజనీకాంత్, సౌందర్య, రంభ కలిసి నటించిన అరుణాచలం, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హస్సన్, ప్రభుదేవా, సౌందర్య, రంభ కలిసి నటించిన కాథల కాథల అనే తమిళ చిత్రాలలో నటించి అలరించారు సౌందర్య.
రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వంలో శశి కుమార్, గిరీష్ శెట్టి, సౌందర్య కలిసి నటించిన దోనీ సగాలి అనే కన్నడ చిత్ర్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర పురస్కారం లభించింది మరియు ఈ చిత్రాన్ని మహిళా పేరుతొ తెలుగు విడుదల చేయాం జరిగింది.
కె. ఎస్. రామనాథ్ దర్శకత్వంలో రమేష్ అరవింద్, దేవరాజ్, సౌందర్య కలిసి నటించిన కన్నడ చిత్రం ఆర్యభట, కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, అబ్బాస్, సౌందర్య, రమ్య కృష్ణ, ప్రీతి కలిసి నటించిన పడయప్పా అనే తమిళ చిత్రం భారీ విజయం సాధించింది. తెలుగులో నర్రాసింహ పేరుతొ అనువాదం చేయగా ఇక్కడ కూడా భారీ విజయం సాధించడం విశేషం.
మరికొన్ని చిత్రాలు
వి. ఎస్ రెడ్డి దర్శకత్వంలో రవిచంద్రన్, సౌందర్య, ప్రేమ కలిసి నటించిన కన్నడ చిత్రం నన్ను నాన్న హెన్దతి చిత్రం విజయం సాధించింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, జయసుధ, రచన, ఖాదర్ ఖాన్, అనుపమ్ ఖేర్, కలిసి నటించిన సూర్యవంశం చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సౌందర్య.
తమిళ్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని కన్నడ భాషలో రూపొందించారు మరియు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేయడం జరిగింది. ఓం సాయి ప్రకాష్ దర్శకత్వంలో సాయికుమార్, ప్రేమ, సౌందర్య, చారులత కలిసి నటించిన నాగ దేవతే అనే కన్నడ చిత్రంలో దేవత పాత్రలో నటించారు సౌందర్య.
కె. ఆర్. ఉదయశంకర్ దర్శకత్వంలో విజయకాంత్ సరసన తవసి, పార్తీబన్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఇవాన్ అనే తమిళ చిత్రాలలో నటించారు సౌందర్య. గిరీష్ కాసారవల్లి దర్శకత్వంలో అవినాష్, సౌందర్య కలిసి నటించిన ద్విప చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు సౌందర్య. ఈ చిత్రానికి ఉత్తమ నిర్మాతగా జాతీయ సినీ పురస్కారం లభించింది మరియు ఉత్తమ నటిగా కర్ణాటక స్టేట్ ఫిలిం పురస్కారం, ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు సౌందర్య.
మరికొన్ని చిత్రాలు
సత్యన్ అంతికడ్ దర్శకత్వంలో జయరాం, సౌందర్య కలిసి నటించిన యాత్రాకారకుడే శ్రద్ధకు చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంతో మలయాళం చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు సౌందర్య. కె భాగ్యరాజ్ దర్శకత్వంలో విజయకాంత్, సౌందర్య కలిసి చొక్క తంగం అనే తమిళ చిత్రంలో నటించారు మరియు ఈ చిత్రం విజయం సాధించింది.
ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్, సౌందర్య కలిసి నటించిన మలయాళం చిత్రం కీలిచుందన్ మంపజం ప్రేక్షకులని నిరాశపరిచింది. భారతి కన్నన్ దర్శకత్వంలో సాయి కుమార్, సౌందర్య, ప్రేమ కలిసి నటించిన విజయదశమి అనే కన్నడ చిత్రంలో భువనేశ్వరి దేవి అనే దేవత పాత్రలో నటించి అలరించారు సౌందర్య.
నాగేంద్ర మగడి దర్శకత్వంలో సాయి కుమార్, జయప్రద, సౌందర్య, ప్రేమ కలిసి నటించిన శ్రీ రేణుకాదేవి అనే కన్నడ చిత్రంలో నటించారు సౌందర్య. పి. వాసు దర్శకత్వంలో విష్ణువర్ధన్, రమేష్ అరవింద్, సౌందర్య, ప్రేమ కలిసి నటించిన ఆప్తమిత్ర అనే కన్నడ చిత్రం భారీ విజయం సాధించింది. మలయాళం భాషలో వచ్చిన చిత్రానికి రీమేక్ గా కన్నడలో ఆప్తమిత్ర పేరుతొ రూపొందించారు పి. వాసు మరియు ఇదే చిత్రాన్ని తమిళ్ భాషలో చంద్రముఖి పేరుతొ రీమేక్ చేయడం జరిగింది మరియు తెలుగులో చంద్రముఖి చిత్రాన్ని అనువదించారు.
వ్యక్తిగతం
సౌందర్య పూర్తి పేరు సౌమ్య సత్యనారాయణ, 1972 సంవత్సరం, 18 ఏప్రిల్ న కర్ణాటక రాష్ట్రం, కోలార్ జిల్లాలో ములబగిలు అనే ప్రాంతంలో జన్మించారు. సౌందర్య తండ్రి కె. ఎస్. సత్యనారాయణ మరియు తల్లి మంజుళ, సౌందర్య తండ్రి కన్నడ సినీ పరిశ్రమలో నిర్మాతగా మరియు సినీ రచయితగా సుప్రసిద్ధులు. సౌందర్య చదువంతా బెంగళూరు నగరంలో కొనసాగింది.
2003 సంవత్సరంలో జి. ఎస్. రఘు అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు సౌందర్య మరియు వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2004 సంవత్సరంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూశారు సౌందర్య అలాగే తన అన్నయ్య కూడా అదే ప్రమాదంలో కన్నుమూశారు.
చివరిగా
సౌందర్య మరణించినా ఆమె అభినయ సమృద్ధిగా ఉండే సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఆమె అందం, అభినయం, సుసంపన్నమైన వ్యక్తిత్వం, తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. సౌందర్య తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉండే నటి. ఆమె సినిమాలు, నటన మరియు అమితమైన అభిమానంతో గుర్తుండిపోతాయి.
సౌందర్య నటించిన చిత్రాలు
- మనవరాలి పెళ్లి
- రాజేంద్రుడు గజేంద్రుడు
- మాయలోడు
- ఇన్స్పెక్టర్ ఝాన్సీ
- మాయదారి మోసగాడు
- అసలే పెళ్ళైన వాణ్ని
- దొంగ అల్లుడు
- అన్న చెల్లెలు
- ఊర్మిళ
- నం 1
- హలో బ్రదర్
- అల్లరి ప్రేమికుడు
- సూపర్ పోలీస్
- మా ఊరి మారాజు
- మేడం
- టాప్ హీరో
- రైతు భారతం
- అమ్మ దొంగ
- చిలకపచ్చ కాపురం
- రాజా సింహం
- పెదరాయుడు
- భలే బుల్లోడు
- అమ్మ నా కోడలా
- వేటగాడు
- బాలరాజు బంగారు పెళ్ళాం
- మాయదారి కుటుంబం
- మాయాబజార్ (అతిధి పాత్ర)
- అమ్మోరు
- రిక్షావోడు
- పుట్టింటి గౌరవం
- రాముడొచ్చాడు
- ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
- జగదేకవీరుడు
- ప్రేమప్రయాణం
- పవిత్రబంధం
- మా ఇంటి ఆడపడుచు
- దొంగాట
- పెళ్లిచేసుకుందాం
- ప్రియరాగాలు
- ఆరో ప్రాణం
- తారక రాముడు
- మా అయన బంగారం
- ఓసి నా మరదలా
- పెళ్లి పీటలు
- రాయుడు
- చూడాలని వుంది
- శ్రీ రాములయ్య
- సూర్యుడు
- శుభవార్త
- అంతఃపురం
- ఈశ్వర్ అల్లా
- తాంబూలాలు
- రాజా
- ప్రేమకు వేళాయెరా
- అరుంధతి
- అనగానే ఓ అమ్మాయి
- మానవుడు దానవుడు
- అన్నయ్య
- రావన్న
- పోస్టుమ్యాన్
- 9 నెలలు
- మూడు ముక్కలాట
- సర్దుకుపోదాం రండి
- నిన్నే ప్రేమిస్తా
- ఆజాద్
- జయం మనదేరా
- దేవి పుత్రుడు
- ఎదురులేని మనిషి
- కలిసినడుద్దాం
- శ్రీ మంజునాథ
- నా మానసిస్తా రా
- అధిపతి
- కొండవీటి సింహాసనం
- గెలుపు
- ప్రేమ దొంగ
- శ్వేతా నాగు
- శివ శంకర్
- నర్తనశాల
మిగితా భాషలో సౌందర్య నటించిన చిత్రాలు
- రాజాధి రాజా (కన్నడ)
- నన్న తంగి (కన్నడ)
- బా నన్న ప్రీతిసు (కన్నడ)
- గంధర్వ (కన్నడ)
- పొన్నుమణి (తమిళ్)
- విజయ క్రాంతి (కన్నడ)
- తూగువే కృష్ణన (కన్నడ)
- ముత్తు కాలై (తమిళ్)
- డియర్ సన్ మరుతూ (తమిళ్)
- సిపాయి (కన్నడ)
- సేనాతిపతి (తమిళ్)
- అరుణాచలం (తమిళ్)
- కాతల కాతల (తమిళ్)
- దోనీ సగాలి (కన్నడ)
- ఆర్యభట్ట (కన్నడ)
- పడయప్పా (తమిళ్)
- నన్ను నన్న హేండ్తిరు (కన్నడ)
- సూర్యవంశం (హిందీ)
- నాగదేవతే (కన్నడ)
- శ్రీ మంజునాథ (కన్నడ)
- ఠవసి (తమిళ్)
- ఇవాన్ (తమిళ్)
- ద్వీప (కన్నడ)
- యాత్రాక్కరుడే శ్రద్ధకు (మలయాళం)
- చొక్కా తంగం (తమిళ్)
- కిలిచున్దన్ మంపజం (మలయాళం)
- విజయదశమి (కన్నడ)
- శ్రీ రేణుకాదేవి (కన్నడ)
- ఆప్తమిత్ర (కన్నడ)