
చిన్న చిన్న పాత్రలతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తరువాత హాస్య నటుడిగా, సహాయ నటుడిగా, కధానాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ గురించి తెలుసుకుందాం.
మొదటి సినిమా
సినీ పరిశ్రమకి వచ్చిన కొత్తలో కొన్ని చిత్రాల్లో నటించినా కూడా అవి విడుదలవకపోవడం బాధాకరం. జగపతిబాబు నటించిన ఫామిలీ సర్కస్ చిత్రంలో ఒక చిన్న పాత్ర వేయడం జరిగింది కానీ ఈ చిత్రానికి ముందు నువ్వేకావాలి చిత్రం విడుదలైంది. నువ్వేకావాలి చిత్రంలో తరుణ్ స్నేహితుడి పాత్రలో నటించారు సునీల్. వేణు కధానాయకుడిగా వచ్చిన చిరునవ్వుతో, శ్రీకాంత్ నటించిన నా మానసిస్తారా మరియు గోపీచంద్ నటించిన తొలివలపు చిత్రాల్లో కూడా నటించారు.
గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం
తేజ దర్శకత్వంలో 2001 సంవత్సరంలో ఉదయ్ కిరణ్, అనిత కలిసి నటించిన నువ్వు నేను చిత్రంలో ఉదయ్ కిరణ్ స్నేహితుడి పాత్రలో నటించారు సునీల్. తన హాస్యంతో ప్రేక్షకులని అలరించారు సునీల్. “నువ్వు యూత్ ఏంట్రా” అంటూ మిగితా స్నేహితులు ఆటపట్టించే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. నువ్వు నేను చిత్రంలో సునీల్ చేసిన పాత్రకి మంచి పేరు, గుర్తింపు లభించాయి.
విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో బంతి పాత్రలో నటించారు సునీల్. ఈ చిత్రంలో సునీల్ నటన మరియు తను పలికే సంభాషణలు ప్రేక్షకులను నవ్వు తెప్పిస్తాయి.
ఉదయ్ కిరణ్, రీమాసేన్ కలిసి నటించిన మనసంతానువ్వే చిత్రంలో స్నేహితుడి పాత్రలో నటించి అలరించారు. తరుణ్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన నువ్వులేక నేనులేను చిత్రంలో తన హాస్యంతో అలరించారు. ప్రేమకుస్వాగతం, కలుసుకోవాలని చిత్రంలో అలరించారు. ఆడుతూ పాడుతూ, వాసు, సంతోషం, శ్రీరామ్, నీతో, ఇంద్ర, సొంతం, హోలీ, ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రాల్లో అలరించారు సునీల్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్, శ్రియ శరన్ కలిసి నటించిన నువ్వే నువ్వే చిత్రంలో సునీల్ పండించిన హాస్యం ప్రేక్షకులను అలరిస్తుంది. పిలిస్తే పలుకుతా, బాబీ, యువరత్న, తొట్టిగ్యాంగ్,ప్రేమలో పావని కళ్యాణ్ మరియు మన్మధుడు చిత్రాల్లో నటించి అలరించారు.
శ్రీకాంత్, వేణు కలిసి నటించిన పెళ్ళాం ఊరెళితే, అల్లు అర్జున్ నటించిన గంగోత్రి, శ్రీకాంత్ నటించిన ఒట్టేసిచెబుతున్న, తరుణ్ నటించిన నిన్నే ఇష్టపడ్డాను, వేణు నటించిన కల్యాణరాముడు, ప్రభాస్ నటించిన వర్షం, వెంకటేష్ నటించిన మల్లీశ్వరి, జగపతిబాబు నటించిన పెదబాబు, పల్లకిలో పెళ్లికూతురు, దొంగదొంగది, నా ఆటోగ్రాఫ్, మాస్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రావణమాసం, భద్ర, అందరివాడు, అతడు, ఆంధ్రుడు, జై చిరంజీవ, లక్ష్మి, చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, చిత్రాల్లో అలరించారు.
కధానాయకుడిగా
లక్ష్మీనారాయణ దర్శకత్వంలో సునీల్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన అందాలరాముడు చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంతో మొదటి సారి కధానాయకుడి పాత్రలో నటించారు సునీల్. ప్రముఖ నటులు ఆకాష్ ప్రత్యేక పాత్రలో నటించగా సునీల్ కి బామ్మా పాత్రలో తమిళ నటి వడివుక్కరసి నటించారు. ఎస్. ఏ. రాజ్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలన్ని ప్రేక్షకులను అలరించాయి.
పెళ్ళైనకొత్తలో, రాఖి, ఢీ, ఆడవారిమాటలకు అర్ధాలేవేరులే, ఆట, దుబాయ్ శీను, అతిధి, నవవసంతం, కృష్ణ, జల్సా, పరుగు, కంత్రి, బుజ్జిగాడు, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, కథానాయకుడు, చింతకాయల రవి, కింగ్, మస్కా, ఓయ్, శంభో శివ శంభో చిత్రాల్లో నటించి మెప్పించారు. “దర్శకధీరుడు” ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సునీల్. సలోని కలిసి నటించిన మర్యాదరామన్న చిత్రం భారీ విజయం సాధించింది.
మర్యాదరామన్న చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించగా ప్రసాద్ దేవినేని, శోబు యార్లగడ్డ నిర్మించారు. ఖలేజా, మిరపకాయ్ చిత్రాల్లో నటించిన సునీల్ ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ కధ స్క్రీన్ప్లే దర్శకత్వం అప్పలరాజు అనే చిత్రంలో నటించారు. సునీల్, స్వాతి కలిసి నటించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.
కధ స్క్రీన్ప్లే దర్శకత్వం అప్పలరాజు చిత్రంలో సునీల్ దర్శకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో సునీల్ దర్శకత్వం వహించే చిత్రాన్ని తన చుట్టూ ఉన్నవారు మధ్యలో కలగచేసుకుని ఎంత విసిగిస్తారు, చివరికి తను అనుకున్న కథతో చిత్రాన్ని రూపొందించారా లేదా అనేది ఈ చిత్ర నేపధ్యం.
కధానాయకుడిగా వరుస చిత్రాలు
వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సునీల్, ఇషాచావ్లా కలిసి నటించిన పూలరంగడు చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు మరియు పూలరంగడు చిత్రంలో సునీల్ 6 పలకల శరీరంతో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. దేవి ప్రసాద్ దర్శకుడిగా సునీల్, ఇషా చావ్లా కలిసి నటించిన Mr. పెళ్ళికొడుకు నిరాశపరిచింది.
హిందీ చిత్రం తాను వెడ్స్ మను చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందించారు. కిశోరె కుమార్ పార్ధసాని దర్శకత్వంలో సునీల్, నాగ చైతన్య, తమన్నా, ఆండ్రియా జెరెమియా కలిసి నటించిన తడాఖా చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రంలో సునీల్, నాగ చైతన్య అన్నదమ్ములుగా నటించారు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.
ఉదయశంకర్ దర్శకత్వంలో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాణంలో సునీల్, ఎస్తర్ కలిసి నటించిన భీమవరం బుల్లోడు చిత్రం పరవాలేదనిపించింది. వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సునీల్, నిక్కీ గల్రాని కలిసి నటించిన కృష్ణాష్టమి ప్రేక్షకులను నిరాశపరిచింది. వీరు పోట్ల దర్శకత్వంలో సునీల్ సూహ్మరాజ్, రిచా పనై కలిసి నటించిన ఈడు గోల్డ్ ఎహె చిత్రం అపజయాన్ని చూసింది.
వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సునీల్, మన్నార్ చోప్రా కలిసి నటించిన జక్కన చిత్రం, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మాణంలో సునీల్, మియా కలిసి నటించిన ఉంగరాల రాంబాబు చిత్రాలు నిరాశపరిచాయి. ఎన్. శంకర్ దర్శకత్వంలో సునీల్, మనీషా రాజ్ కలిసి నటించిన 2 కంట్రీస్ చిత్రం నిరాశపరిచింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్, సునీల్, చిత్రా శుక్ల, నందిని రాయి కలిసి నటించిన సిల్లీ ఫెలోస్ చిత్రం నిరాశపరిచింది.
సహాయనటుడిగా, హాస్యనటుడిగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సామెత వీర రాఘవ చిత్రంలో సహాయ నటుడి పాత్రలో నటించారు సునీల్. చిత్రలహరి, చాణక్య, ఆలా వైకుంఠపురంలో, డిస్కో రాజా చిత్రాలతో అలరిచించారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో 2020 సంవత్సరంలో వచ్చిన కలర్ ఫోటో చిత్రంలో మొదటిసారి ప్రతినాయకుడి పాత్రలో నటించారు సునీల్. సుహాస్, చాందిని చౌదరి కలిసి నటించిన ఈ చిత్రంలో కధానాయిక చాందిని చౌదరి అన్నగా, ఇన్స్పెక్టర్ పాత్రలో నటించారు సునీల్. తన పాత్రకి మంచి పేరు లభించడం విశేషం.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్ చిత్రాలలో కొంచెం ప్రతినాయకుడి ఛాయా ఉన్న పాత్రలో నటించారు సునీల్. ఈ చిత్రంలో మంగళం శీను పాత్రలో నటించిన సునీల్, తన భార్య పాత్రలో ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ నటించారు.
F3, గాడ్ ఫాదర్, బుజ్జి ఇలా రా, విరూపాక్ష, మాయాపేటిక, గుంటూరు కారం, గీతాంజలి మళ్ళీ వచ్చింది, మత్తు వదలరా 2, స్వాగ్, చిత్రాల్లో నటించారు సునీల్. ఇప్పుడు తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రాంచరణ్, శ్రీకాంత్, అంజలి, కియారా అద్వానీ కలిసి నటించిన గేమ్ చేంజెర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తెలుగులో కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటించారు సునీల్. తిరురంగా, మావీరన్, “సూపర్ స్టార్” రజనీకాంత్ నటించిన జైలర్, విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ, కార్తీ నటించిన జపాన్ మరి కొన్ని తమిళ చిత్రాలతో పాటు టర్బో అనే మలయాళ చిత్రం, మాక్స్ అనే కన్నడ చిత్రంతో పాటు ఒక నేపాలీ చిత్రంలో కూడా నటించడం జరిగింది.
వ్యక్తిగతం
ఫిబ్రవరి 28, 1974 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో జన్మించారు సునీల్ మరియు తన చదువంతా భీమవరంలోనే కోనసాగింది. 2002 సంవత్సరంలో సునీల్ వివాహం చేసుకున్నారు మరియు తనకి ఇద్దరు పిల్లలు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మరియు సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్ ముగ్గురు స్నేహితులు. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ నగరం లోని పంజాగుట్టలో ఒక రూమ్ అద్దెకు తీసుకొని అవకాశాల కోసం స్టూడియో చుట్టూ తిరుగుతూ ఉండేవారు.
సునీల్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
- నువ్వేకావాలి
- చిరునవ్వుతో
- ఫామిలీ సర్కస్
- నా మానసిస్తా రా
- తొలివలపు
- నువ్వు నేను
- నువ్వు నాకు నచ్చావ్
- మనసంతా నువ్వే
- నువ్వు లేక నేను లేను
- ప్రేమకు స్వాగతం
- కలుసుకోవాలని
- ఆడుతూ పాడుతూ
- వాసు
- సంతోషం
- శ్రీరామ్
- నీతో
- ఇంద్ర
- సొంతం
- హోలీ
- ఒకటో నెంబర్ కుర్రాడు
- నువ్వే నువ్వే
- పిలిస్తే పలుకుతా
- బాబీ
- యువరత్న
- తొట్టిగ్యాంగ్
- ప్రేమలో పావని కళ్యాణ్
- మన్మధుడు
- నాగ
- పెళ్ళాం ఊరెళితే
- గంగోత్రి
- రన్
- ఒట్టేసి చెబుతున్న
- విజయం
- నిన్నే ఇష్టపడ్డాను
- ఒక రాజు ఒక రాణి
- వసంతం
- కల్యాణ రాముడు
- దొంగోడు
- సింహాచలం
- ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి
- ఠాగూర్
- ఎలా చెప్పను
- తొలిచూపులోనే
- ఓరి నీ ప్రేమ బంగారం కాను
- నేను పెళ్ళికి రెడీ
- నీ మనసు నాకు తెలుసు
- నీకే మానసిచ్చాను
- లక్ష్మి నరసింహ
- వర్షం
- అతడే ఒక సైన్యం
- లవ్ టుడే
- ఆనందమానందమాయే
- మల్లీశ్వరి
- మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఎం తెస్తారు
- శీను వాసంతి లక్ష్మి
- నేనున్నాను
- ఖుషి ఖుషీగా
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు
- పెదబాబు
- ఆర్య
- నాని
- కొడుకు
- పల్లకిలో పెళ్లికూతురు
- దొంగ దొంగది
- నా ఆటోగ్రాఫ్
- గుడుంబా శంకర్
- చెప్పవే చిరుగాలి
- ఆప్తుడు
- సూర్యం
- మాస్
- బాలు ఏ,బి,సి,డి,ఇ,ఎఫ్,జి
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా
- రాధా గోపాలం
- శ్రావణమాసం
- సదా మీ సేవలో
- సోగ్గాడు
- సుభాష్ చంద్ర బోస్
- Mr. ఎర్రబాబు
- హంగామా
- భద్ర
- అందరివాడు
- ఒక ఊరిలో
- కాంచనమాల కేబుల్ టి.వి
- సూపర్
- అతడు
- ఆంధ్రుడు
- అల్లరి బుల్లోడు
- పొలిటికల్ రౌడీ
- భగీరథ
- మొదటి సినిమా
- శ్రీ
- జై చిరంజీవ
- గౌతమ్ ఎస్.ఎస్. సి
- లక్ష్మి
- చుక్కల్లో చంద్రుడు
- సరదా సరదాగా
- శివకాశి
- శ్రీ రామదాసు
- పౌర్ణమి
- కితకితలు
- అమృత వర్షం
- గేమ్
- బొమ్మరిల్లు
- అందాల రాముడు
- స్టాలిన్
- బాస్
- గోపి – గోడ మీద పిల్లి
- పెళ్లైన కొత్తలో
- రాఖి
- అన్నవరం
- యోగి
- పగలే వెన్నెల
- అత్తిలి సత్తిబాబు ఎల్.కే.జి
- ఢీ
- క్లాస్మేట్స్
- ఆడవారి మాటలకు అర్ధాలేవేరులే
- ఆట
- తీరు రంగ (తమిళ్)
- దుబాయ్ శీను
- బహుమతి
- సత్యభామ
- శంకర్ దాదా జిందాబాద్
- హలో ప్రేమిస్తారా
- పెళ్లయింది కానీ
- అతిధి
- నవ వసంతం
- గొడవ
- నవ్వులే నవ్వులు
- కృష్ణ
- పౌరుడు
- వాన (ఒక పాటలో)
- స్వాగతం
- కృష్ణార్జున
- అందమైన మనసులో
- ఒంటరి
- ఇది సంగతి
- ప్రేమాభిషేకం
- జల్సా
- భలే దొంగలు
- కాళిదాసు
- మావీరన్ (తమిళ్)
- మైఖేల్ మదన కామరాజు
- పరుగు
- కంత్రి
- బుజ్జిగాడు
- పాండురంగడు
- రెడీ
- ఉల్లాసంగా ఉత్సాహంగా
- కథానాయకుడు
- బలాదూర్
- చింతకాయల రవి
- రెయిన్బో
- నేను మీకు తెలుసా?
- కింగ్
- మస్కా
- ద్రోణ
- ఆ ఒక్కడు
- రాజు మహారాజు
- నేరము శిక్ష
- ఓయ్!
- మగధీర
- నీలో నాలో
- జోష్
- ఏక్ నిరంజన్
- ప్రవరాఖ్యుడు
- ఓం శాంతి
- శంభో శివ శంభో
- బిందాస్
- వరుడు (ఒక పాటలో)
- ఖలేజా
- మిరపకాయ్
- కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
- దొంగల ముఠా
- పూల రంగడు
- Mr. పెళ్ళికొడుకు
- తడాఖా
- భీమవరం బుల్లోడు
- కృష్ణాష్టమి
- ఈడు గోల్డెహే
- జక్కన్న
- ఉంగరాల రాంబాబు
- 2 కంట్రీస్
- సిల్లీ ఫెలోస్
- అరవింద సామెత వీర రాఘవ
- అమర్ అక్బర్ ఆంథోనీ
- పడి పడి లేచే మనసు
- ఆపరేషన్ 2019 (ఒక పాటలో)
- చిత్రలహరి
- చాణక్య
- అలా వైకుంఠపురంలో
- డిస్కో రాజా
- కలర్ ఫోటో
- కనబడుటలేదు
- ఇచట వాహనములు నిలపరాదు (అతిధి పాత్ర)
- హెడ్స్ అండ్ టేల్స్ (అతిధి పాత్ర)
- పుష్పక విమానం
- పుష్ప – 1
- భీమ్లా నాయక్
- సన్ అఫ్ ఇండియా
- F3
- చోర్ బజార్
- దర్జా
- థ్యాంక్యూ (ఒక పాటలో)
- గాడ్ ఫాదర్
- సీతా రామం
- బుజ్జి ఇలా రా
- జిన్నా
- ముఖచిత్రం
- చెప్పాలని ఉంది
- ఉర్వశివో రాక్షసీవో
- S 5 నో ఎగ్జిట్
- వాలెంటైన్స్ నైట్
- Mr. కింగ్
- ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు
- విరూపాక్ష
- భువన విజయం
- కథ వెనుక కథ
- మాయా పేటిక
- నేను స్టూడెంట్ సర్
- జైలర్ (తమిళ్)
- మార్క్ ఆంథోనీ (తమిళ్)
- జపాన్ (తమిళ్)
- గుంటూరు కారం
- బూట్ కట్ బాలరాజు
- వెయ్ దరువేయ్
- గీతాంజలి మళ్ళీ వచ్చింది
- టర్బో (మలయాళం)
- రాష్వో దీర్ఘ (నేపాలీ)
- మాక్స్ (కన్నడ)
- పారిజాత పర్వం
- హరోం హర
- మత్తువదలరా – 2
- విశ్వం
- జీబ్రా
- స్వాగ్
- మెకానిక్ రాకీ
- పుష్ప -2 ది రూల్
- గేమ్ చేంజెర్