
“నటసామ్రాట్” అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా “కింగ్” అక్కినేని నాగార్జున మేనల్లుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరువాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సుమంత్ గురించి తెలుసుకుందాం.
సినీ ప్రయాణం
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1999 సంవత్సరంలో సుమంత్, అంతరామాలి కలిసి నటించిన చిత్రం ప్రేమకధ. ఈ చిత్రంతో సుమంత్, అంతరామాలి వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి రాధికా సుమంత్ తల్లి పాత్రలో నటించారు. పల్లెటూరి ప్రేమకథ నేపధ్యంతో వచ్చిన ప్రేమకథ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోకపోయిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు లభించడం విశేషం.
ఈ చిత్రానికి సందీప్ చౌతా అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించగా, పాటలు కూడా అలరిచించాయి ముఖ్యంగా “దేవుడు కరుణిస్తాడని” పాట ఇప్పటికి ప్రేక్షకులను అలరించడం విశేషం. తొలిప్రేమ సినిమా దర్శకత్వం వహించిన కరుణాకరన్ దర్శకత్వంలో సుమంత్, భూమిక కలిసి నటించిన యువకుడు చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు మరియు ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రం జ్యూరీ పురస్కారం గెలుచుకుంది.
“దర్శకేంద్రుడు” కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్రావు, సుమంత్ కలిసి తాత, మనవడిగా నటించిన చిత్రం పెళ్ళిసంభందం. సి. అశ్వినీదత్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలో సాక్షిశివానంద్, సంఘవి కథానాయికలుగా నటించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ప్రముఖ దర్శకులు తమ్మరెడ్డి భరద్వాజ దర్శకత్వంలో సుమంత్, లయ కలిసి నటించిన చిత్రం రామ్మా చిలకమ్మా ఆశించిన విజయం సాధించలేకపోయింది.
రామ్మా చిలకమ్మా చిత్రంలో ఆకాష్ ప్రత్యేక పాత్రలో నటించారు మరియు ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు. బాలశేఖరన్ దర్శకత్వంలో 2001 సంవత్సరంలో అక్కినేని నాగార్జున, సుమంత్ మరియు సుధాకర్ కలిసి స్నేహితులుగా నటించిన చిత్రం స్నేహమంటే ఇదేరా. భూమిక, ప్రత్యూష కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది మరియు శివశంకర్ అందించిన సంగీతంతో పాటు ఈ చిత్రంలోని పాటలన్ని ప్రేక్షకులను అలరించాయి.
మొదటి విజయం
దర్శకుడిగా సూర్యకిరణ్ ని పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం సత్యం. 2003 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రంలో సుమంత్, జెనీలియా డి. సౌజ కలిసి నటించారు మరియు ఈ చిత్రంతో మొదటి విజయం అందుకున్నారు నటులు సుమంత్. సత్యం చిత్రంతో జెనీలియా డి. సౌజ తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు.
కొడుకుని అర్ధం చేసుకొని తండ్రి, అలాగే తండ్రి మాటని వినని కోడుకు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. చక్రి అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది అంతేకాకుండా ఈ చిత్రంలో పాటలన్ని విజయం సాధించడం విశేషం. ఒక ప్రత్యేక గీతంలో నృత్య దర్శకులు రాఘవ లారెన్స్ అలరిస్తారు.
సత్యం చిత్రం ఇచ్చిన విజయంతో ఉత్సాహంలో ఉన్న సుమంత్ తన తర్వాతి చిత్రం గౌరీ చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చారు. చార్మి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దర్శకులు బి. వి. రమణ. స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు మరియు గౌరీ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది మరియు ఈ చిత్రంలో శర్వానంద్ స్నేహితుడి పాత్రలో నటించారు.
సూర్యకిరణ్ దర్శకత్వంలో సుమంత్, సలోని కలిసి నటించిన ధన 51 చిత్రం ఆకట్టుకోలేకపోయింది. సత్యం చిత్రం తరువాత సూర్యకిరణ్, సుమంత్ కలయికలో వచ్చిన రెండవ చిత్రం ధన 51 చిత్రం. భారీ అంచనాలతో విడుదలై ఈ చిత్రం నిరుత్సాహపరిచింది మరియు ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. వి. సముద్ర దర్శకత్వంలో సుమంత్, అనుష్క, శ్రీహరి కలిసి నటించిన మహానంది చిత్రం పరవాలేదనిపించింది మరియు ఈ చిత్రంలో సాయికిరణ్ ఒక పాత్రలో నటించడం జరిగింది.
వరుస చిత్రాలు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2006 సంవత్సరంలో సుమంత్, కమిలిని ముఖర్జీ కలిసి నటించిన చిత్రం గోదావరి. కె. ఎం. రాధాకృష్ణన్ అందించిన సంగీతం నిజంగా గోదావరి నదిలో వెళ్తున్నట్టే ఉంటుంది అంత బాగా సంగీతం సమకూర్చారు మరియు ఈ చిత్రంలోని పాటలు ఎంతో మధురంగా ప్రేక్షకులను అలరిస్తాయి అంతేకాకుండా ప్రతీ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
ప్రముఖ గాయకులూ ఎస్. పి. బాలసుబ్రమణ్యం పాడిన “ఉప్పొంగెలే గోదావరి” పాట వినడానికి మరియు చూడటానికి ఎంతో మధురంగా ఉంటుంది మరియు ఎంతోబాగా చిత్రీకరించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు ఎన్నో పురస్కారాలు కైవసం చేసుకుంది. కన్మణి దర్శకత్వంలో సుమంత్, ఛార్మి కలిసి నటించిన చిన్నోడు చిత్రం నిరాశపరిచింది.
చిన్నోడు చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలో సుమంత్ నటనకి ప్రశంసలు వచ్చాయి. కె. హనుమంత్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్, చాందిని కలిసి నటించిన విజయ్ ఐ. పి. ఎస్ చిత్రం నిరాశపరిచింది.
కె. విజయభాస్కర్ దర్శకత్వంలో సుమంత్, శర్వానంద్, సదా, కమిలిని ముఖర్జీ, రవి వర్మ, సునీల్ కలిసి నటించిన క్లాస్మేట్స్ చిత్రం పరవాలేదనిపించింది మరియు ఈ చిత్రానికి కోటి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.
చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో 2007 సంవత్సరంలో సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్ కలిసి నటించిన మధుమాసం ఘన విజయం సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
రాజ్ ఆదిత్య దర్శకత్వంలో 2008 సంవత్సరంలో సుమంత్, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన పౌరుడు చిత్రం ఘన విజయం సాధించింది. సుమంత్ సోదరి సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. రాజ్ పిప్పళ్ల దర్శకత్వంలో సుమంత్, కృతి కర్బందా కలిసి నటించిన బోణి చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు రమణ గోగుల నిర్మించడమే కాకూండా సంగీతం అందించారు.
మరికొన్ని చిత్రాలు
2011 సంవత్సరంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుమంత్, స్వాతి, తనికెళ్లభరణి, సుబ్బరాజు, షఫీ కలిసి నటించిన గోల్కొండ హై స్కూల్ విజయాన్ని అందించింది. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించడం జరిగింది. చదువులతో పాటు క్రీడలు కూడా ముఖ్యం అని తెలియచేసే చిత్రం గోల్కొండ హై స్కూల్.
స్కూల్ లో ఉన్న ప్లే గ్రౌండ్ లో ఇన్స్టిట్యూట్ నిర్మించాలనే ఆలోచించే ఒక వర్గం లేదు ఆటలాడే ప్లే గ్రౌండ్ అలాగే ఉండనివ్వాలి అని ఇంకో వర్గం మధ్య మాటల యుద్ధం నడిచి చివరికి ఎం జరుగుతుంది అనే కధతో తీసిన చిత్రం గోల్కొండ హై స్కూల్. ఈ చిత్రంలో సుమంత్ విద్యార్థులకి క్రికెట్ నేర్పించే కోచ్ పాత్రలో మరియు కధానాయిక స్వాతి టీచర్ గా కలిపిస్తారు. ఈ చిత్రంలో వర్ధమాన నటులైన సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ గోల్కొండ హై స్కూల్ చిత్రంలో విద్యార్థుల పాత్రలో నటించారు.
వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో సుమంత్, విమల రామాన్, ప్రియమణి కలిసి నటించిన రాజ్ చిత్రం నిరాశపరిచింది. రవికుమార్ చావాలి దర్శకత్వంలో సుమంత్, వేదిక, సింధు తులాని కలిసి నటించిన దెగ్గరగా దూరంగా చిత్రం పరవాలేదనిపించగా ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందించారు.
చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో సుమంత్, పింకీ సావిక ఛాయాదేచ్ కలిసి నటించిన ఏమో గుర్రం ఎగర వచ్చు చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించగా సుమంత్ నటనకి ప్రశంసలు వచ్చాయి. మల్లిక్ రామ్ దర్శకత్వంలో 2016 సంవత్సరంలో సుమంత్, పల్లవి శుభాష్, తనికెళ్ళ భరణి కలిసి నటించిన నరుడా డోనరుడా చిత్రం నిరాశపరిచింది.
హిందీ చిత్రం విక్కీ డోనర్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. వీర్య దానం నేపధ్యం మీద తీసిన ఈ చిత్రం హిందీ భాషలో భారీ విజయం సాధించినా తెలుగులో ఆకట్టుకోలేయకపోయింది.
నూతన దర్శకులు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సుమంత్, ఆకాంక్ష సింగ్ కలిసి నటించిన మళ్ళిరావా చిత్రం విజయాన్ని అందించింది. చిన్ననాటి స్నేహితులు పెరిగి ఆ స్నేహం ప్రేమగా మారి వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకోకుండా ప్రేమికులుగానే మిగిపోవడంతో కధ ముగుస్తుంది. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం అలరించింది.
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఇషా రెబ్బ కలిసి నటించిన సుబ్రమణ్యపురం చిత్రం ఆకట్టుకుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి రానా దగ్గుబాటి గాత్ర దానం చేయడం విశేషం. సుబ్రమణ్యపురం అనే ఊరిలో జరిగే సంఘటనలు ఛేదించే పాత్రలో సుమంత్ నటించారు. అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో సుమంత్, అంజు కురియన్ కలిసి నటించిన ఇదం జగత్ చిత్రం నిరాశపరిచింది.
ఎన్టీఆర్ బయోపిక్, ప్రత్యేక పత్రాలు
ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్: కధానాయకుడు మరియు ఎన్టీఆర్: మహానాయకుడు చిత్రంలో సుమంత్ తన తాత అక్కినేని నాగేశ్వర్రావు పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. 2019 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.
ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్, నందిత శ్వేతా కలిసి నటించిన కపటదారి చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. టి. జి. కీర్తి కుమార్ దర్శకత్వంలో సుమంత్, నైనా గంగూలీ, వర్షిణి సౌందర్యరాజన్ కలిసి నటించిన మళ్ళీ మొదలైంది చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రం థియేటర్ లో కాకుండా జీ 5 ఓటిటి యాప్ లో విడుదలైంది మరియు ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో డుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన సీతారామం చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించారు సుమంత్. సీతారామం చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు సుమంత్ పాత్రకి మంచి పేరు రావడం విశేషం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్, సంయుక్త మీనన్ కలిసి నటించిన సర్ చిత్రంలో సుమంత్ ఇ. ఎ. ఎస్ పాత్రలో నటించారు.
ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో సుమంత్ నటించిన అహం రీబూట్ చిత్రం నేరుగా ఆహా ఓటిటి యాప్ లో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దులూరి సంగీతం అందించారు.
1983 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచినందుకుగాను హిందీ భాషలో కబీర్ ఖాన్ దర్శకుడిగా 83 అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది మరియు ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ కధానాయకుడిగా నటించారు. 83 పేరుతోనే తెలుగులో అనువదించగా రణ్వీర్ సింగ్ పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పారు సుమంత్.
వ్యక్తిగతం
హైదరాబాద్ నగరంలో 1975 సంవత్సరం ఫిబ్రవరి 9న నిర్మాత సురేంద్ర యార్లగడ్డ, సత్యవతి దంపతులకు జన్మించారు సుమంత్. తన చదువంతా హైదరాబాద్ మరియు విదేశాలలో కొనసాగింది. ప్రముఖ నటి, నిర్మాత సుప్రియ సుమంత్ సోదరి. 2006 సంవత్సరంలో నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు సుమంత్ కాని కొన్ని కారణల వల్ల వీళ్లిద్దరు విడిపోయారు.
సౌమ్యమైన నటన, విలక్షణమైన పాత్రల ఎంపిక, కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సంప్రదాయ విలువలు ఇవన్నీ కలిపి సుమంత్‌ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. తెలుగు సినిమా ప్రేక్షకులు ఇలాంటి గొప్ప నటుడి ప్రతిభను మరింత ఆస్వాదించాలనుకోవడం సహజం.
సుమంత్ నటించిన కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం
- ప్రేమకథ
- యువకుడు
- పెళ్ళిసంబంధం
- రమ్మ చిలకమ్మా
- స్నేహమంటే ఇదేరా
- సత్యం
- గౌరీ
- సోగ్గాడు (అతిధి పాత్ర)
- ధన 51
- మహానంది
- గోదావరి
- చిన్నోడు
- విజయ్ ఐపిఎస్
- క్లాస్మేట్స్
- మధుమాసం
- పౌరుడు
- బోణి
- గోల్కొండ హై స్కూల్
- రాజ్
- దెగ్గర దూరంగా
- ఏమో గుర్రం ఎగరా వచ్చు
- నరుడా డోనారుడా
- మళ్ళిరావా
- సుబ్రహమణ్యపురం
- ఇదం జగత్
- ఎన్.టి.ఆర్ కధానాయకుడు
- ఎన్.టి.ఆర్ మహానాయకుడు
- కపటదారి
- మళ్ళి మొదలైంది
- సీత రామం
- వాతి (తమిళ్)
- సార్
- అహం రీబూట్