Telugu Actor Nani Filmography

Actor Nani
Actor Nani

బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి సహాయ దర్శకుడిగా, కధానాయకుడిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, మరియు అభిమానులని సంపాదించిన “నాచురల్ స్టార్” నాని గురించి చెప్పుకుందాం.

ప్రముఖ దర్శకులు బాపు దర్శకత్వంలో వచ్చిన రాధాగోపాళం చిత్రానికి సహాయ దర్శకత్వం వహించిన నాని, అలాగే మిగితా చిత్రాలైన అల్లరి బుల్లోడు, అస్త్రం, ఢీ చిత్రాలకి కూడా సహాయ దర్శకుడిగా పని చేశారు నాని.

మొదటి చిత్రం

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి కలిసి నటించిన చిత్రం అష్టాచెమ్మా. రామ్ మోహన్ పి. నిర్మాణంలో దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో వచ్చిన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. తణికెళ్లభరణి, ఝాన్సీ, హేమ ,  నటించిన ఈ చిత్రం 2008 సంవత్సరంలో విడుదలై మంచి విజయం సాధించింది.

నాని, తనీష్, అక్ష, శ్వేతాబసుప్రసాద్ కలిసి నటించిన చిత్రం రైడ్. బైక్ నేపధ్యం మీద తీసిన ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు మరియు బెల్లంకొండ సురేష్ నిర్మించారు. గాయకుడూ హేమచంద్ర ఈ చిత్రానికి మొదటిసారి సంగీతం అందించడం విశేషం. 2009 సంవత్సరంలో వచ్చిన రైడ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం. ఇదే సంవత్సరంలో వచ్చిన స్నేహితుడా చిత్రంలో నాని, మాధవీలత కలిసి నటించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రంలో “ఇంతకీ నువ్వెవరు” పాటని సంగీత ప్రియులు ఇప్పటికి వింటూ ఆనందిస్తారు.

2010 సంవత్సరంలో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలో నాని, శరణ్య మోహన్ కలిసి నటించారు మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో చివరికి కధానాయకుడు నాని కబడ్డీ ఆడుతూ చనిపోవడం జరుగుతుంది. వెప్పం చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు నాని మరియు ఈ చిత్రంలో కథానాయకిగా నిత్యామీనన్ నటించారు. సెగ పేరుతొ తెలుగులో విడుదల చేసిన ఈ చిత్రం ఫరవాలేదనిపించింది.

వరుస చిత్రాలు

నాని, హరిప్రియ, బిందుమాధవి కలిసి నటించిన పిల్ల జమిందార్ చిత్రంతో మరో విజయం అందుకున్నారు నాని. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఈగ. నాని, సమంత నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సమంత ని ప్రేమించిన నాని ని కిచ్చ సుదీప్ హతమార్చడం ఆ తరువాత చనిపోయిన నాని ఈగ లాగా పుట్టి కిచ్చ సుదీప్ మీద పగ తీర్చుకోవడం, ఈగ గా మరీనా నాని ని సమంత గుర్తుపడుతుందా లేదా అనే దాని మీద తీసిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

ఈగ చిత్రం తరువాత నాని, సమంత కలిసి చేసిన రెండవ చిత్రం ఎటో వెళ్ళిపోయింది మనసు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడమే కాకుండా ఈ చిత్రంలోని సంగీతం కూడా ప్రేక్షకులని అలరించింది. “క్రియేటివ్ డైరెక్టర్” కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పైసా. నాని, క్యాథెరిన్ థెరిసా కలిసి నటించిన ఈ చిత్రం పరాజయం పాలైంది.

హిందీ లో విజయం సాధించిన బ్యాండ్ బాజా భారత్ చిత్రాన్ని తమిళ్ భాషలో ఆహ కళ్యాణం పేరుతొ రీమేక్ చేయడం జరిగింది. నాని, వాణి కపూర్ మరియు సిమ్రాన్ నటించిన ఈ చిత్రం ఇదే పేరుతొ తెలుగులో కూడా విడుదలైంది మరియు ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. సముద్రఖని దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం జెండాపైకపిరాజు. అమలాపాల్, రాగిణి ద్వివేది కథానాయికలుగా చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

2015 సంవత్సరంలో నూతన దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకులుగా ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా నాని, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, రైతు వర్మ కలిసి నటించిన ఎవడె సుబ్రహ్మణ్యం చిత్రం ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రముఖ నటులు “రెబెల్ స్టార్” కృష్ణంరాజు ప్రత్యేక పాత్రలో నటించారు.

మారుతి దర్శకత్వంలో వి. వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, బన్నీవాస్ కలిసి నిర్మించిన చిత్రం భలే భలే మగాడివోయ్. నాని, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిశోర్ కలిసి నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఒక పని చేస్తూ మరో పని మరిచిపోయే పాత్రలో నాని అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో నాని, ప్రవీణ్ , వెన్నెల కిశోరె పండించే హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

వరుస విజయాలు

హను రాఘవపూడి దర్శకత్వంలో నాని, మెహ్రీన్ పీర్జాద కలిసి నటించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాధ. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తారు నాని మరియు ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని నటించిన రెండవ చిత్రం జెంటిల్మెన్. నివేద థామస్, సురభి, శ్రీనివాస్ అవసరాల కలిసి నటించిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ చిత్రం నానికి మంచి పేరుతొ పాటు చిత్రం కూడా భారీ విజయం సాధించింది.

విరించి వర్మ దర్శకత్వంలో నాని, అను ఇమ్మాన్యూల్, రియా సుమన్ కలిసి నటించిన మజ్ను కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో అతిధి పాత్రలో దర్శకులు ఎస్. ఎస్. రాజమౌళి నటించడం విశేషం. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం నేను లోకల్. ఈ చిత్రంలో నవీన్ చంద్ర ప్రత్యేక పాత్రలో నటించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని, నివేద థామస్, అది పినిశెట్టి కలిసి నటించిన చిత్రం నిన్నుకోరి. ఈ చిత్రం భారీ విజయం సాధించడమే కాకుండా ఈ చిత్రంలోని పాటలు కూడా విజయం సాధించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించడం జరిగింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా నాని, సాయి పల్లవి, భూమిక చావ్లా, రాజీవ్ కనకాల,నరేష్, ఆమని కలిసి నటించిన చిత్రం ఎం. సి. ఏ – మిడిల్ క్లాస్ అబ్బాయి.

ఈ చిత్రంలో నానికి అన్న, వదిన పాత్రలో వదిన పాత్రలో రాజీవ్ కనకాల, భూమిక చావ్లా మరియు బాబాయ్, పిన్ని పాత్రలో నరేష్, ఆమని కలిసి నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలతో పాటు చిత్రం కూడా మంచి విజయం సాధించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని మూడవ సారి ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం కృష్ణ అర్జున యుద్ధం. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ ధిల్లాన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం పరాజ్యమైంది.

ముల్టీస్టారర్, విజయాలు

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో “కింగ్” అక్కినేని నాగార్జున, నాని కలిసి నటించిన చిత్రం దేవదాసు. అక్కినేని నాగార్జున డాన్ పాత్రలో మరియు నాని వైద్యుడి పాత్రలో నటించిన దేవదాసు చిత్రం ఫరవాలేదనిపించింది. ఈ చిత్రంలో కథానాయికలుగా రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం జెర్సీ. నాని, శ్రద్ధ శ్రీనాథ్ కలిసి నటించిన ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపిస్తారు. జాతీయ జట్టులో చోటు సంపాదించాలనే కోరిక ఉన్న అర్జున్ పాత్రలో నాని నటించారు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

ప్రముఖ దర్శకులు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన నాని ‘ స్ గ్యాంగ్ లీడర్ చిత్రం లో నాని, ప్రియాంక మోహన్, శరణ్య మరియు లక్ష్మి కలిసి నటించారు. ఈ చిత్రంలో యువనటులు కార్తీక గుమ్మకొండ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం తో పాటు ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు, నివేదా థోమస్, అదితి రావు హైదరి కలిసి నటించిన చిత్రం V. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ మరియు ప్రత్యేక పాత్రలో జగపతిబాబు కలిసి నటించిన టక్ జగదీశ్ చిత్రం ఫరవాలేదనిపించింది. రాహుల్ సంకీర్తీయన్ దర్శకత్వంలో నాని, సాయి పల్లవి, కృతి శెట్టి కలిసి నటించిన చిత్రం శ్యామ్ సింగా రాయ్. ప్రస్తుత కధ తో పాటు పూర్వ జన్మ కధ నేపథ్యంలోసాగే ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా, శౌర్యు వి. దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సరిపోదా శనివారం చిత్రాలు మంచి విజయాలు అందుకోవడం విశేషం.

మరికొన్ని విశేషాలు

హైదరాబాద్ లో జరిగిన ఐఫా ఉత్సవ పురస్కారంలో ప్రముఖ నటులు దగ్గుబాటి రానా తో కలిసి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. స్టార్ మా తెలుగు టీవీ ఛానెల్ లో వచ్చే బిగ్ బాస్ తెలుగు సీజన్ – 2 కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు నాని. డి ఫార్ దోపిడీ, అ! హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్ చిత్రాలతో పాటు సోనీ లివ్ ఓటిటి అప్ లో మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ ని నిర్మించారు. నాని సోదరి దీప్తి దర్శకత్వం వహించడం విశేషం.

ఓకే బంగారం చిత్రం తెలుగులో దుల్కర్ సల్మాన్ పాత్రకి, అ! చిత్రంలో చేప పాత్రకి జెర్సీ చిత్రంలో నాని కొడుకు పాత్రకి మరియు ది లయన్ కింగ్ చిత్రంలో శింబ పాత్రకి గాత్ర దానం చేశారు. కధానాయకుడు అవ్వకముందు నాని రేడియోలో వ్యాఖ్యాతగా పనిచేయడం విశేషం. అభిమానులు “నాచురల్ స్టార్” అని అభిమానం తో పిలుచుకుంటారు.

వ్యక్తిగతం

నాని అసలు పేరు నవీన్ బాబు, 1984 సంవత్సరం ఫిబ్రవరి 24 న హైదరాబాద్ నగరంలో జన్మించారు. తన చదువంతా హైదరాబాద్ లో కొనసాగింది. అంజనా యలవర్తి అనే యువతిని నాని ప్రేమ వివాహంచేసుకున్నారు మరియు వారికి ఒక బాబు ఉన్నారు.

నాని నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
  1. అష్టాచమ్మా
  2. రైడ్
  3. స్నేహితుడా
  4. బీమిలి కబడ్డీ జట్టు
  5. అలా మొదలైంది
  6. వెప్పం (తమిళ్)
  7. పిల్ల జమిందార్
  8. ఈగ
  9. ఎటోవెళ్లిపోయింది మనసు
  10. నేతానె ఎన్ పోన్ వసంతం (తమిళ్ అతిధి పాత్ర పాటలో)
  11. పైసా
  12. ఆహ కళ్యాణం
  13. నిమిర్న్దు నిల్ (తమిళ్ అతిధి పాత్ర పాటలో)
  14. జండాపై కపిరాజు
  15. ఎవడే సుబ్రహ్మణ్యం
  16. దొంగాట (అతిధి పాత్ర పాటలో)
  17. సూపర్ స్టార్ కిడ్నాప్ (అతిధి పాత్ర)
  18. భలే భలే మొగాడివోయ్
  19. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ
  20. జెంటిల్ మెన్
  21. జ్యో అచ్యుతానంద (అతిధి పాత్ర)
  22. మజ్ను
  23. నేను లోకల్
  24. నిన్ను కోరి
  25. మిడిల్ క్లాస్ అబ్బాయి
  26. కృష్ణ అర్జున యుద్ధం
  27. నీవెవరో (అతిధి పాత్ర)
  28. దేవదాస్
  29. జెర్సీ
  30. నానీ”స్” గ్యాంగ్ లీడర్
  31. వి
  32. టాక్ జగదీష్
  33. శ్యామ్ సింగారాయ్
  34. అంటే సుందరానికి
  35. హిట్ – 2 (అతిధి పాత్ర)
  36. దసరా
  37. హాయ్ నాన్న
  38. సరిపోదా శనివారం

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *