
కధానాయకుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తరువాత ప్రతినాయకుడిగా మారి మంచి పేరు తెచ్చుకుని మళ్ళీ కధానాయకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ నటులు గోపీచంద్ గురించి తెలుసుకుందాం.
తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటులలో గోపీచంద్ ఒకరు. తన ప్రత్యేకమైన అభినయ శైలి, పవర్‌ఫుల్ డైలాగ్స్, హై యాక్షన్ సీన్లతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. గోపీచంద్ కేవలం నటనలోనే కాకుండా, తన ప్రత్యేకమైన శ్రద్ధతో తెలుగు చిత్రసీమకు గుర్తింపు తెచ్చిన కథానాయకుడిగా నిలిచారు.
సినీ ప్రయాణం
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 2001 సంవత్సరంలో గోపీచంద్ వెండితెరకి పరిచయమైన చిత్రం తొలివలపు. స్నేహ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటులు సాయి కుమార్ సోదరుడు పి. రవిశంకర్ ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయిన సంగీతం మాత్రం అలరించడం విశేషం. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించడం జరిగింది.
ప్రతినాయకుడిగా
మొదటి చిత్రం విఫలం అవ్వడంతో తన రెండవ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించారు గోపీచంద్. తేజ దర్శకత్వంలో నితిన్, సదా కలిసి నటించిన జయం చిత్రం భారీ విజయం సాధించింది. అంతా కొత్తవాళ్లతో నిర్మించిన ఈ చిత్రంలో గోపీచంద్ ప్రతినాయకుడి పాత్ర పోషించడం జరిగింది. జయం చిత్రంలో గోపీచంద్ నటనకి ప్రశంసలతో పాటు పురస్కారాలు లభించాయి.
జయం చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలోని పాటలన్ని ప్రేక్షకుల్ని అలరించాయి. “రాను రాను అంటూనే చిన్నదో” పాట ఇప్పటికి సంగీత అభిమానులు వింటూ ఆనందిస్తారు. జయం చిత్రం భారీ విజయం సాధించడంతో దర్శకులు తేజ మహేష్ బాబు, రక్షిత కలయికలో నిజం చిత్రాన్ని రూపొందించారు.
2003 సంవత్సరంలో విడుదలైన నిజం చిత్రంలో దేవుడు పాత్రలో గోపీచంద్ నటించి అందర్నీ భయపెట్టారు. ఈ చిత్రం ప్రేక్షకుల్ని నిరాశపరిచినా కూడా నటి నటులకి మంచి పేరు రావడం విశేషం. నిజం చిత్రంలో గోపీచంద్ సరసన రాశి నటించడం జరిగింది. పెద్దమ్మ ఈరోజు నీకు రక్తాభిషేకం కన్ఫార్మ్ అంటూ గోపీచంద్ నటన మరియు తను పలికే సంభాషణ చప్పట్లు కొట్టిస్తాయి. ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.
ఎం. రాజా దర్శకత్వంలో రవి, సదా, గోపీచంద్, కలిసి నటించిన తమిళ చిత్రం జయం. తెలుగులో వచ్చి భారీ విజయం సాధించిన జయం చిత్రాన్ని తమిళ్ భాషలో చిత్రీకరించడం జరిగింది. తెలుగులో నితిన్ చేసిన పాత్రని తమిళ్ భాషలో రవి నటించగా మిగిలిన పాత్రలైనా సదా, గోపీచంద్ పాత్రలు వారే పోషించడం విశేషం. ఈ చిత్రంతో గోపీచంద్ తమిళ సినీ పరిశ్రమకి అడుగుపెట్టడం జరిగింది మరియు జయం చిత్రం తమిళ్ భాషలో కూడా విజయాన్ని చూసింది. తమిళ్ చిత్రం జయం సినిమాతో నటుడు రవిని జయం రవి అని పిలవడం విశేషం.
శోభన్ దర్శకత్వంలో 2004 సంవత్సరంలో ప్రభాస్, త్రిష, గోపీచంద్ కలిసి నటించిన వర్షం చిత్రం భారీ విజయం సాధించింది. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఎం. ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో గోపీచంద్ నటించారు. భద్రన్న పాత్రలో గోపీచంద్ నటించారు అనడంకంటే జీవించారు అని చెప్పొచ్చు. ప్రభాస్, గోపీచంద్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
వర్షం చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా పాటలు కూడా విజయవంతం అవ్వడం జరిగింది మరియు “ఇన్నాళ్లకు గుర్తొచ్చాన వాన పాట” ప్రజాదరణ పొందించి. వర్షం చిత్రానికి గోపీచంద్ నటనకి ప్రశంసలే కాకుండా కొన్ని పురస్కారాలు లభించడం విశేషం.
మళ్ళీ కధానాయకుడిగా
2004 సంవత్సరంలో ఏ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్, మూన్ బెనర్జీ కలిసి నటించిన యజ్ఞం చిత్రం భారీ విజయం సాధించింది. ప్రతినాయకుడిగా నాలుగు చిత్రాలు చేసిన తరువాత యజ్ఞం చిత్రంలో కధానాయకుడిగా నటించారు గోపీచంద్. ఈ చిత్రానికి పోకిరి బాబురావు నిర్మించగా మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించింది. యజ్ఞం చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుమంత్ శెట్టి, ఝానవి పండించిన హాస్యం ప్రేక్షకులని అలరించింది.
పరుచూరి మురళి దర్శకత్వంలో 2005 సంవత్సరంలో గోపీచంద్, గౌరీపండిట్ కలిసి నటించిన ఆంధ్రుడు చిత్రం ఘాన విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు కె. విశ్వనాధ్ ప్రత్యేక పాత్రలో నటించి అలరించారు. ఆంధ్రుడు చిత్రంలో హాస్యనటులు సునీల్, లక్ష్మీపతి కలిసి పండించిన హాస్యం ప్రేక్షకులను అలరించింది. కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.
పోకిరి బాబురావు నిర్మాణంలో ప్రముఖ నృత్య దర్శకులు అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో గోపీచంద్, కామ్నా జెట్మలానీ కలిసి నటించిన రణం చిత్రం భారీ విజయం సాధించింది. రణం చిత్రంతో అమ్మ రాజశేఖర్ మొదటి సారి దర్శకుడిగా మారి దర్శకత్వం వహించారు. అలీ, వేణుమాధవ్, సుమన్ శెట్టి పండించిన హాస్యం ప్రేక్షకులను అలరిస్తుంది. హాస్య నటులు అలీ మీద చిత్రీకరించిన “నమ్మొద్దు నమ్మొద్దు” పాట ప్రజాదరణ పొందింది.
ఛుమ్మా అంటూ గోపీచంద్ చేసిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మరియు మణిశర్మ అందించిన సంగీతం అలరిస్తుంది. ఉదయశంకర్ దర్శకత్వంలో గోపీచంద్, మీరా జాస్మిన్, శివాజీ, అంకిత కలిసి నటించిన రారాజు చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఇంకొన్ని చిత్రాలు
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గోపీచంద్, నేహాజుల్క కలిసి నటించిన ఒక్కడున్నాడు చిత్రం విజయాన్ని అందుకుంది. బొంబాయి బ్లడ్ గ్రూప్ నేపథ్యంతో మీద విడుదలైన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. శ్రీవాస్ దర్శకత్వంలో జగపతిబాబు, కళ్యాణి, గోపీచంద్, అనుష్క కలిసి నటించిన లక్ష్యం చిత్రం ఘన విజయం సాధించింది.
2007 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రంలో జగపతిబాబు, గోపీచంద్ అన్నదమ్ములుగా నటించారు. మణిశర్మ అందించిన సంగీతంతో పాటు పాటలు కూడా విజయం సాధించాయి. పోకూరి బాబురావు నిర్మాణంలో బి. వి. రమణ దర్శకత్వంలో గోపీచంద్, భావన కలిసి నటించిన ఒంటరి చిత్రం పరవాలేదనిపించింది.
2008 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా పాటలన్ని ప్రేక్షకులని అలరించాయి. ఈ చిత్రం బాంగ్లాదేశ్ భాషలో రెండు సార్లు రీమేక్ చేయడం విశేషం. శివ దర్శకత్వంలో గోపీచంద్, అనుష్క, పూనమ్ కౌర్ కలిసి నటించిన శౌర్యం చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అలీ పండించిన హాస్యం ప్రేక్షకుల్ని ఇప్పటికి అలరిస్తుంది.
శౌర్యం చిత్రంలో అలీ తన శరీరానికి బెలూన్లు కట్టుకుని భారీ శరీరం ఉన్నట్టు అందర్నీ నమ్మించి మోసం చేసే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వు తెప్పిస్తాయి. శౌర్యం చిత్రాన్ని కన్నడ, తమిళ్, బాంగ్లాదేశ్ భాషలో రీమేక్ చేయడం విశేషం.
శివ దర్శకత్వంలో గోపీచంద్, త్రిష నటించిన శంఖం చిత్రం పరవాలేదనిపించింది. వర్షం చిత్రం తరువాత గోపీచంద్, త్రిష కలిసి నటించిన ఈ చిత్రం 2009 సంవత్సరంలో విడుదలైంది.
వరుస చిత్రాలు
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో గోపీచంద్, ప్రియమణి, రోజా కలిసి నటించిన గోలీమార్ చిత్రం భారీ విజయం సాధించింది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గంగారాం పాత్రలో గోపీచంద్ అద్భుతంగా నటించారు. చక్రి అందించిన సంగీతం మరియు మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో పాటలన్ని ప్రజాదరణ పొందాయి ముఖ్యంగా గుండెల్లో ఎదో సడి, మొగాళ్ళు ఒత్తి మాయగాళ్లే పాటలు మళ్ళీ మళ్ళీ వినాలింపించేలా ఉన్నాయి.
బి. వి. ఎస్. రవి దర్శకత్వంలో గోపీచంద్, దీక్షాసేథ్ కలిసి నటించిన వాంటెడ్ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో గోపీచంద్, తాప్సి, రాజేంద్ర ప్రసాద్, నరేష్, రోజా కలిసి నటించిన మొగుడు చిత్రం భారీ పరాజయాన్ని చూసింది. నల్లమలపు బుజ్జి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి బాబు శంకర్ సంగీతం అందించారు.
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గోపీచంద్, తాప్సి కలిసి నటించిన సాహసం చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే గోపీచంద్ తన పూర్వికులు సంపాదించిన ఆస్తి పాకిస్తాన్ దేశంలో ఉందని తెలిసి ఎలాగైనా పాకిస్తాన్ దేశం వెళ్ళాలి అనుకుంటాడు, అప్పుడే పాకిస్తాన్ దేశంలో ఉన్న హింగ్లాజ్ మాత గుడికి వెళ్ళాలి అని నటి తాప్సి ప్రయాణం మొదలుపెడుతుంది, మరి ఆ తరువాత ఇద్దరు కలిసి ఆ దేశం వెళ్లడం, ఆ తరువాత జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
సాహసం చిత్రంలో “నాది కానిది కోటి రూపాయలు కూడా తీసుకోను, కానీ నాది అనుకున్న ఒక పైసా కూడా వదలను” అని గోపీచంద్ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. సాహసం చిత్రానికి శ్రీ కొమ్మినేని సంగీతం అందించారు. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన లౌక్యం చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో గోపీచంద్ నటన ఆకట్టుకుంటుంది మరియు ఈ చిత్రాన్ని బెంగాలీ, కన్నడ, తమిళ్ భాషల్లో రీమేక్ చేయడం విశేషం. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరిస్తుంది.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీచంద్, రాశిఖన్నా కలిసి నటించిన జిల్ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఏ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్, రెజీనా కస్సన్ద్ర కలిసి నటించిన సౌఖ్యం చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, హన్సిక, క్యాథరిన్ థెరిస్సా కలిసి నటించిన గౌతంనంద చిత్రం పరవాలేదనిపించింది. గౌతంనంద చిత్రంలో మొదటిసారి గోపీచంద్ ద్విపాత్రాభినయంలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
వరుస పరాజయాలు
ఏ. ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో జగపతి బాబు, గోపీచంద్, రాశిఖన్నా, అను ఇమ్మానుయేల్ కలిసి నటించిన ఆక్సిజన్ చిత్రం నిరాశపరిచింది. కె. చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్, మెహ్రీన్ పిర్జాద కలిసి నటించిన పంతం చిత్రం పరవాలేదనిపించింది. తీరు దర్శకత్వంలో గోపీచంద్, జరీన్ ఖాన్, మెహ్రీన్ పిర్జాద కలిసి నటించిన చాణిక్య చిత్రం నిరాశపరిచింది.
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా భాటియా, దిగంగాన కౌశిక్ కలిసి నటించిన సీటిమార్ చిత్రం విజయాన్ని అందించింది. కబడ్డీ నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా జట్టు కోచ్ పాత్రలో గోపీచంద్ మరియు తెలంగాణ కబడ్డీ మహిళా జట్టు కోచ్ పాత్రలో తమన్నా నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించగా “జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి” అనే పాట ప్రజాదరణ పొందింది.
బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్, నయనతార కలిసి నటించిన ఆరడుగుల బులెట్ చిత్రం ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశిఖన్నా కలిసి నటించిన పక్క కమర్షియల్ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఆడ్వకెట్ పాత్రలో గోపీచంద్ నటించారు.
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, జగపతి బాబు, డింపుల్ హయతి, ఖుష్బూ కలిసి నటించిన రామబాణం చిత్రం నిరాశపరిచింది. గోపీచంద్, శ్రీవాస్ కలయికలో వచ్సిన మూడవ చిత్రం రామబాణం. ఏ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్, ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ కలిసి నటించిన భీమా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో గోపీచంద్ ద్విపాత్రాభినయంలో నటించారు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో 2024 సంవత్సరంలో గోపీచంద్, కావ్య థప్పర్ కలిసి నటించిన విశ్వం చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
వ్యక్తిగతం
గోపీచంద్ తొట్టెంపూడి 1979 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు లో జన్మించారు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకులు టి. కృష్ణ. ఒంగోలు, చెన్నై మరియు రష్యా దేశంలో గోపీచంద్ విద్యాభ్యాసం జరిగింది. గోపీచంద్ సోదరుడు కార్ ప్రమాదంలో మృతి చెందగా సోదరి దంత వద్యురాలి వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రముఖ సినీ నటులు శ్రీకాంత్ మేనకోడలు రేష్మని గోపీచంద్ 2013 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు మరియు వీరికి ఇద్దరు కుమారులు.
గోపీచంద్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
- తొలివలపు
- జయం
- నిజం
- జయం (తమిళ్)
- వర్షం
- యజ్ఞం
- ఆంధ్రుడు
- రణం
- రారాజు
- ఒక్కడున్నాడు
- లక్ష్యం
- ఒంటరి
- శౌర్యం
- శంఖం
- గోలీమార్
- వాంటెడ్
- మొగుడు
- సాహసం
- లౌక్యం
- జిల్
- సౌఖ్యం
- గౌతమ్ నంద
- ఆక్సిజన్
- పంతం
- చాణక్య
- సీటిమార్
- ఆరడుగులాబుల్లెట్
- పక్క కమర్షియల్
- రామబాణం
- భీమా
- విశ్వం