రంజీ ట్రోఫీని రంజిత్ సింహ్జి అనే వ్యక్తి పేరుమీద ప్రారంభించారని మనం చెప్పుకున్నాం మరి రంజిత్ సింహ్జి ఎవరు, భారత్ తరపున కాకుండా ఇంగ్లాండ్ దేశం తరపున ఎందుకు ఆడారు ఆ విషయాలు కూడా తెలుసుకుందాం.
రంజిత్ సింహ్జి సెప్టెంబర్ 10, 1872 సంవత్సరంలో సదోడర్ ప్రాంతం నవనగర్ రాష్ట్రం లో పశ్చిమ భారత ప్రావిన్స్ లో రాజపుట్ కుటుంబంలో జన్మించారు. వీరిది రాజుల కుటుంబం. రంజిత్ సింహ్జి తాతగారు ఝాలం సింహ్జి, నవనగర్ రాష్ట్రాన్ని పరిపాలించేవారు. రంజిత్ సింహ్జి తండ్రి ఒక రైతు. రాజ్ కుమార్ కళాశాలలో రంజిత్ సింహ్జి చదువుకున్నారు.
క్రికెట్ పరిచయం
పాఠశాల వయసులోనే క్రికెట్ ఆడి జట్టుకి సారధ్యం వహించారు రంజిత్ సింహ్జి. కొన్ని సంవత్సరాలు సారధిగా ఉంటూ పాఠశాలలో జరిగే మ్యాచ్ లలో శతకాలు సాధించినా కూడా తన మనసు మాత్రం టెన్నిస్ మీద ఇష్టం చూపించేది.
1886 సంవత్సరంలో రంజిత్ సింహ్జి మరో ఇద్దరు విద్యార్థులు తమ కళాశాల ప్రిన్సిపాల్ తో కలిసి చదువుకోడానికి లండన్ వెళ్లారు. అక్కడ సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ తరుపున క్రికెట్ ఆడారు రంజిత్ సింహ్జి. ఆస్ట్రేలియా జట్టు మీద ఆడిన మ్యాచ్ లో శతకం సాధించి అందరి ద్రుష్టి తన వైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్ చార్లెస్ టర్నర్ మెచ్చుకోవడం విశేషం.
క్రికెట్, టెన్నిస్, బిలియర్డ్స్ మరియు ఫోటోగ్రఫీ లో ఇష్టాన్ని కనబరిచేవాడు రంజిత్ సింహాజి. ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు, చదువుల్లో కాకుండా ఆటల మీద ఇష్టం ఎక్కువ ఉండటంతో డిగ్రీ పట్టా పొందలేకపోయారు.
1890 సంవత్సరం వేసవిలో కళాశాల కి సెలవు పెట్టి బౌర్నెమౌత్ అనే నగర పర్యటనకి వెళ్లడం జరిగింది. అక్కడ రంజిత్ సింహ్జి కి క్రికెట్ మీద ఎక్కువ ఆసక్తి కలగడంతో స్థానిక మ్యాచ్లు ఆడి విజయం సాధించారు. ఆట పరంగా అంతా బాగున్నాకూడా సాంకేతికంగా ఇంకా మెరుగవ్వాలి అని అనుకున్నారు రంజిత్ సింహ్జి. 1891 సంవత్సరంలో కేంబ్రిడ్జిషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ లో చేరి క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు.
బ్యాట్టింగ్ సూచనలు
రంజిత్ సింహ్జి తన బ్యాటింగ్ మెరుగు పరుచుకోవడానికి ఫస్ట్ క్లాస్ క్రికెటర్ డేనియల్ హేవార్డ్ దెగ్గర సూచనలు తీసుకోవడం, ఆటలో మెళకువలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ సూచనలు పాటిస్తూ రంజిత్ సింహ్జి బ్యాటింగ్ మెరుగుపరుచుకుని ఆ సంవత్సరం పరుగుల వరద సృష్టించారు. రంజిత్ సింహ్జి ఎంత గొప్పగా ఆడిన కూడా కొంతమంది ఆటగాళ్లు సంతృప్తి చెందలేదు.
1892 సంవత్సరంలో ట్రినిటీ తరఫునుంచి క్రికెట్ ఆడటం జరిగింది, కానీ ఎవరు కూడా తన ఆతని పట్టించుకోలేదు. నెట్స్ లో ఎక్కువ సేపు సాధన చేసేవారు రంజిత్ సింహ్జి. 1893 సంవత్సరంలో కేంబ్రిడ్జి తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టారు. 9వ స్థానంలో దిగి 18 పరుగులు చేశారు. ఆ తరువాత తన ప్రదర్శన మెరుగవడం ప్రారంభించింది.
ఆస్ట్రేలియా సిరీస్ మరియు పేరు మార్పు
ఆస్ట్రేలియా జట్టు తో ఓడిపోయిన ఒక మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 58 పరుగులు మరియు రెండో ఇన్నింగ్స్ లో 37 పరుగులు సాధించి ప్రేక్షకుల చేత జేజేలు పలికించుకున్నారు రంజిత్ సింహ్జి. ఒక సీజన్ ముగిసిన తరువాత రంజిత్ సింహ్జి గణాంకాలు ఇలా ఉన్నాయి, బ్యాటింగ్ సగటు 29.90 మరియు స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తూ 19 క్యాచులు పట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు.
క్రికెట్ లో రంజిత్ సింహ్జి విజయంతో తనకు మరింత ఆదరణ లభించింది. రంజిత్ సింహ్జి అని పలకడం ఇబ్బందిగా ఉందని తన స్నేహితులు రంజీ పేరుతొ పిలవడం మొదలుపెట్టారు. చివరివరకు ఆ పేరు ఉండడం విశేషం.
రంజిత్ సింహ్జి ఎంతగొప్పగా ఆడిన కూడా ఇంగ్లాండ్ జట్టు ఆడుతున్న టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ లో చోటు కల్పించలేదు. ఆ తరువాత రెండవ టెస్ట్ కి జట్టుని ఎంపిక చేసింది మరో కొత్త కమిటీ. ఆ కమిటీ రంజిత్ సింహ్జి పేరుని జట్టులో చేర్చడం జరిగింది. 1896 సంవత్సరంలో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు మీద మొదటి మ్యాచ్ ఆడారు రంజిత్ సింహ్జి. ఈ మ్యాచ్ లో తాను శతకం సాధించినా కూడా ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయింది కానీ రంజిత్ సింహ్జి ఆటకి ప్రేక్షకులు మరియు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆశ్చర్యపోవడం జరిగింది కానీ కొంతందనికి తన సొంత జట్టు ఆటగాళ్లకు రుచించలేదు.
పరుగుల వరద
1897 సంవత్సరంలో ఆస్ట్రేలియా టూర్ కి మ్యాచ్ ఆడటానికి వెళ్లడం జరిగింది. అక్కడ సిరీస్ ప్రారంభానికి ముందు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఆడి రాణించడం జరిగింది. 60.89 సగటుతో 1,157 పరుగు చేశారు. ఇక టెస్ట్ సిరీస్ మొదలయ్యాకా శతకాలు, అర్ధశతకాలతో చెలరేగి ఆడారు. ఆ తరువాత ఒక మ్యాచ్ లో అత్యధిక స్కోర్ చేసి ఇంగ్లాండ్ తరపున ఎక్కువ స్కోర్ చేసిన మొదటి ఆటగాడిగా పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు ఒకటి గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయింది.
1899 సంవత్సరం లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో తన ఆటతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. కౌంటీ క్రికెట్ లో జూన్ మరియు ఆగష్టు నెలలో 1,000 పరుగులు చేశారు. అంతకుముందు ఎవరు కూడా ఇన్ని పరుగులు చేయలేదు. ఫస్ట్ క్లాస్ సీజన్ లో 63.18 సగటుతో 3,159 పరుగులు చేశారు మరియు 8 శతకాలు ఉండటం విశేషం.
సారధి భాద్యతలు, చివరి సిరీస్
1899 ససంవత్సరంలో సస్సెక్స్ జట్టుకి రంజిత్ సింహ్జిని సారధిగా నియమించడం జరిగింది. తన సారధ్యంలో జట్టుని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లో కొత్త పద్ధతులు అమలు చేస్తూ జట్టుని ముందుకు నడిపించారు. 1900 సంవత్సరంలో జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ సీజన్లో పరుగుల వరద సృష్టించారు రంజిత్ సింహ్జి. అర్ధ శతకాలు, శతకాలు మరియు డబల్ సెంచరీ చేసి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు.
1902 సంవత్సరంలో వ్యక్తిగత కారణాలతో కొన్ని మ్యాచ్లకి దూరం అవ్వడం ఇంకొన్ని మ్యాచ్లు ఆడిన కూడా సంతృప్తి లేకపోవడం జరిగాయి. 1903 సంవత్సరంలో జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ సీజన్ లో రంజిత్ సింహ్జి 56.58 సగటుతో 1,924 పరుగులు చేయడం జరిగింది. అన్ని పరుగులు చేసినా కూడా తన మీద నమ్మకం తానే కోల్పోయి సారధ్యా పదవికి రాజీనామా చేశారు. 1904 సంవత్సరం లోను పరుగుల వరద సృష్టించారు. 1920 సంవత్సరంలో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడటం జరిగింది. మొత్తానికి 56.37 సగటుతో 24,692 పరుగులు సాధించారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో.
రంజిత్ సింహ్జి భారత దేశం వచ్చినప్పుడు క్రికెట్ కోసం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం కానీ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించమని కోరినా నిరాకరించారు, కానీ భారత క్రికెట్ బోర్డు మాత్రం క్రికెట్ ఆడిన మొదటి భారతీయుడు రంజిత్ సింహ్జి కాబట్టి గౌరవంతో తన పేరు మీద రంజీ ట్రోఫీ ప్రారంభించి క్రికెట్ ఆడటం విశేషం. 1933 సంవత్సరం ఏప్రిల్ 2న గుండెపోటుతో రంజిత్ సింహ్జి మరణించారు.