Rana Daggubati Movies List

Rana Daggubati
Rana Daggubati

వ్యాపారవేత్తగా, కధానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా రకరకాలుగా ప్రయాణం చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా భారత్ సినీ పరిశ్రమలో కూడా అందరితో స్నేహానికి కొనసాగిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న దగ్గుబాటి రానా గురించి తెలుసుకుందాం.

సినిమా ప్రయాణం

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2010 సంవత్సరంలో వచ్చిన చిత్రం లీడర్. రానా దగ్గుబాటి కధానాయకుడిగా తెరంగ్రేటం చేసిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలుగా నటించిన లీడర్ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. తమిళ సినీ నిర్మాణ సంస్థ AVM నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.

మొదటి చిత్రం విడుదలైన తరువాత తన రెండవ చిత్రాన్ని హిందీ భాషలో నటించారు రానా. రోహన్ సిప్పి దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, రానా దగ్గుబాటి, బిపాషా బసు కలిసి నటించిన చిత్రం దమ్ మారో దమ్ మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, ఇలియానా కలిసి నటించిన చిత్రం నేను నా రాక్షసి. ప్రొఫెషనల్ కిల్లర్ గా రానా దగ్గుబాటి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జెనీలియా కలిసి నటించిన చిత్రం నా ఇష్టం. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “బాలీవుడ్ బిగ్ బి” అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రానా దగ్గుబాటి, లక్ష్మి మంచు, మధుశాలిని కలిసి నటించిన హిందీ చిత్రం డిపార్ట్మెంట్. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రానా దగ్గుబాటి, నయనతార కలిసి నటించిన చిత్రం కృష్ణం వన్డే జగద్గురుమ్. మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది మరియు ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక పాటలో కాసేపు కనిపించి అలరించడం విశేషం. అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, రానా దగ్గుబాటి, తాప్సి పన్ను కలిసి నటించిన హిందీ చిత్రం బేబీ. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంది.

ప్రతినాయకుడి పాత్ర, భారీ చిత్రాలు

ప్రముఖ దర్శకులు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, అడవిశేష్ కలిసి నటించిన చిత్రం బాహుబలి: ది బిగినింగ్ మరియు బాహుబలి: ది కంక్లూషన్. మొదటి పార్ట్ 2015 సంవత్సరంలో రెండవ పార్ట్ 2017 సంవత్సరంలో విడుదలై తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ఈ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో కూడా భారీ విజయాన్ని సాధించింది.

ఈ చిత్రాలలో రానా దగ్గుబాటి “రెబెల్ స్టార్” ప్రభాస్ అన్నయ్యగా భళ్లాలదేవ పాత్రలో నటించడమే కాకుండా ప్రతినాయకుడి పాత్ర పోషించారు రానా దగ్గుబాటికి. రానా దగ్గుబాటి పాత్రకి ఎన్నో పురస్కారాలతో పాటు మంచి పేరు కూడా లభించడం విశేషం. రానా దగ్గుబాటి తనయుడిగా అడవిశేష్ నటించడం జరిగింది.

ప్రముఖ దర్శకులు గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, అనుష్క కలిసి నటించిన చిత్రం రుద్రమ్మదేవి. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రాణి రుద్రమ్మదేవి జీవిత ఆధారంగా తీసిన చిత్రంలో అనుష్క రుద్రమ్మదేవి పాత్రలో మరియు చాళుక్య వీరభద్ర పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ, మలయాళంలో విడుదలై విజయం సాధించింది. “మాస్ట్రో” ఇళయరాజా అందించిన సంగీతం పరవాలేదనిపించింది.

మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ విజయం సాధించిన బెంగళూరు డేస్ చిత్రాన్ని తమిళ్ భాషలో బెంగళూర్ నాట్కల్ పేరుతొ చిత్రీకరించారు దర్శకులు భాస్కర్. ఆర్య, బాబీ సింహ, రానా దగ్గుబాటి, శ్రీ దివ్య, పార్వతి పార్వతి తిరువొతు, లక్ష్మి రాయి, పారిస్ లక్ష్మి, ప్రకాష్ రాజ్ కలిసి నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది మరియు ఈ చిత్రంలో సమంత అతిధి పాత్రలో నటించడం విశేషం.

2017 సంవత్సరంలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రానా దగ్గుబాటి, తాప్సి, సత్యదేవ్ కలిసి నటించిన చిత్రం ఘాజి. భారత నేవి సబ్మెరైన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 1971 సంవత్సరం సముద్రంలో జరిగిన భారత్, పాకిస్తాన్ యుద్ధం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఘాజి చిత్రం తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా చిత్రీకరించడం జరిగింది.

ప్రముఖ దర్శకులు తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి. అశుతోష్ రానా, నవదీప్, క్యాథెరిన్ థెరెసా కలిసి ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందించింది. జోగేంద్ర పాత్రలో రానా దగ్గుబాటి అద్భుతంగా నటించారు అని చెప్పడంకంటే జీవించారు అని చెప్పొచ్చు. భార్య పాత్ర కాజల్ అగర్వాల్ అడిగిన కోరిక తీర్చే క్రమంలో అందరి ప్రాణాలు తీస్తూ ఆ కోరికను ఎలా తీర్చాడు అనేది చూడొచ్చు.

మరికొన్ని చిత్రాలు

ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ఎన్.టి.ఆర్: కధానాయకుడు మరియు ఎన్.టి.ఆర్: మహానాయకుడు. విశ్వవిఖ్యాత నటసావభౌమ నందమూరి తారకరామారావు జీవిత ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం నందమూరి నటసింహం బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారకరామారావు పాత్ర పోషించడం జరిగింది. అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో సుమంత్ మరియు నందమూరి తారకరామారావు అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటించి మెప్పించడం విశేషం.

అక్షయ్ కుమార్, రితేష్ దేశముఖ్, బాబీ డియోల్, కృతిసనన్, పూజ హెగ్డే, కృతి కర్బందా కలిసి నటించిన హిందీ చిత్రం హౌసేఫుల్ 4. ఫర్హాద్ సంజయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి ద్విపాత్రాభినయం చేయడం విశేషం మరియు ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

ప్రభు సొలొమోన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలో చిత్రీకరించిన చిత్రం అరణ్య. రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్లాన్కర్ కలిసి నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. సత్యశివ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, రెజీనా కస్సన్ద్ర కలిసి నటించిన చిత్రం 1945, ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషలో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ చిత్రం నిరాశపరిచింది.

సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో “పవర్ స్టార్” పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త కలిసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం విజయాన్ని అందుకుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, నవీన్ చంద్ర, ప్రియమణి, నందితాదాస్ కలిసి నటించిన చిత్రం విరాటపర్వం. తెలంగాణ లో నక్సలిజం నేపథ్యంలో తీసిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంది.

టి. జె. జ్ఞనావెల్ దర్శకత్వంలో “సూపర్ స్టార్” రజనికాంత్ “బిగ్ బి” అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, రితిక సింగ్ కలిసి నటించిన తమిళ చిత్రం వేటైయన్ మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది.

మరికొన్ని విషయాలు

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలైన సంథింగ్ సంథింగ్, ఆరంభం, దొంగాట, సైజ్ జీరో, వెల్కమ్ టూ న్యూయార్క్, ఎనై నోకి పాయుమ్ తొట, స్పై చిత్రాలలో అతిధి పాత్రలో మెరిశారు రానా దగ్గుబాటి. స్పిరిట్ మీడియా అనే కంపెనీ స్థాపించి విసువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ రూపొందించేవారు, అలా కొన్ని చిత్రాలకి విసువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ చేసేవారు రానా దగ్గుబాటి. బొమ్మలాట అనే చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించారు రానా దగ్గుబాటి మరియు ఈ చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది.

కొన్ని చిత్రాలకి గాత్ర దానం చేస్తే మరికొన్ని చిత్రాలలో ఉన్న పాత్రకి గాటర్మ్ అందించారు అలాగే మరికొన్ని చిత్రాలని సమర్పించారు. రెండవసారి ఐఫా ఉత్సవం జరిగినప్పుడు రానా దగ్గుబాటి, “నాచురల్ స్టార్” నాని  మరియు మూడవసారి ఐఫా ఉత్సవం జరిగినప్పుడు యువ నటుడు తెహతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సామాజిక మాధ్యమాలైన ఆహా, వియూ, డిస్కవరీ +లో  ప్రైమ్ వీడియోస్ లో  No. 1 యారి విత్ రానా, ది రానా దగ్గుబాటి షో, మిషన్ ఫ్రంట్ లైన్ విత్ రానా దగ్గుబాటి కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వియూ యాప్ లో ప్రసారమైన సోషల్ నెట్ఫ్లిక్ యాప్లో ప్రసారమైన రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించారు. రానా నాయుడు వెబ్ సిరీస్ లో బాబాయ్ “విక్టరీ” వెంకటేష్ తో కలిసి నటించడం విశేషం.

వ్యక్తిగతం

రానా దగ్గుబాటి పూర్తి పేరు రామానాయుడు దగ్గుబాటి. తన తాతయ్య డా. డి. రామానాయుడు పేరునే రానా దగ్గుబాటికి పెట్టడం విశేషం. 1984 సంవత్సరం డిసెంబర్ 14న చెన్నై నగరంలో జన్మించారు రానా దగ్గుబాటి. దగ్గుబాటి సురేష్ బాబు, లక్ష్మి దంపతులకు మొదటి సంతానం రానా దగ్గుబాటి.

అభిరాం అనే సోదరుడు మరియు మాళవిక అనే సోదరి ఉన్నారు రానా దగ్గుబాటికి మరియు దగ్గుబాటి వెంకటేష్ బాబాయ్ అవుతారు. రానా దగ్గుబాటి చదువంతా చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కొనసాగింది. “కింగ్” అక్కినేని నాగార్జున మేనమామ వరుస అలాగే అక్కినేని నాగచైతన్య బావ వరుస అవుతారు రానా దగ్గుబాటి. 2020 సంవత్సరంలో మిహిక బజాజ్ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు.

రానా దగ్గుబాటి నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
  1. లీడర్
  2. దమ్ మారో దమ్ (హిందీ)
  3. నేను నా రాక్షసి
  4. నా ఇష్టం
  5. డిపార్ట్మెంట్ (హిందీ)
  6. కృష్ణం వన్డే జగద్గురుమ్
  7. ఏ జవానీ హే దీవాని (హిందీ)
  8. సంథింగ్ సంథింగ్ (అతిధి పాత్ర)
  9. ఆరంభం (తమిళ్)
  10. బేబీ (హిందీ)
  11. దొంగాట (అతిధి పాత్ర)
  12. బాహుబలి ది బిగినింగ్
  13. రుద్రమ్మదేవి
  14. సైజ్ జీరో (అతిధి పాత్ర)
  15. ఇంజీ ఇడుప్పఝాగి
  16. బెంగుళూరు నాట్కళ్ (తమిళ్)
  17. ఘాజి
  18. బాహుబలి ది కంక్లూషన్
  19. నేనే రాజు నేనే మంత్రి
  20. వెల్కమ్ తో న్యూయార్క్ (హిందీ)
  21. ఎన్.టి.ఆర్ కధానాయకుడు
  22. ఎన్.టి.ఆర్ మహానాయకుడు
  23. హౌసేఫుల్ – 4  (హిందీ)
  24. ఎనై నొకి పాయుమ్ తోట (తమిళ్)
  25. కాదన్ (తమిళ్)
  26. అరణ్య
  27. హాతి మేర సాతి (హిందీ)
  28. 1945
  29. భీమ్లా నాయక్
  30. స్పై (అతిధి పాత్ర)
  31. రానా నాయుడు (హిందీ వెబ్ సిరీస్)

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *