Raghupati Venkaiah Naidu Biography in Telugu

రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు సినిమా నిర్మాత, సినీ పితామహుడు మరియు భారత చలన చిత్రానికి మార్గదర్శకుడిలో ఒకరు. 1869 సంవత్సరం 15 అక్టోబర్ మచిలీపట్నంలో జన్మించారు. రఘుపతి వెంకయ్య నాయుడు తండ్రి అప్పయ్య నాయుడు భారత ఆర్మీ లో సుబేదార్గా ఉండేవారు. నాయుడు గారి అన్నయ్య రఘుపతి వెంకటరత్నం నాయుడు, విద్యావేత్త మరియు సంఘసంస్కర్త. నాయుడుగారి పూర్వికులు హైదరాబాద్ రెజిమెంట్లోని మద్రాస్ ఆర్మీ లో మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ లో కమాండర్లుగా పనిచేసేవారు.

Father of Telugu Cinema
                         Pioneer Of Telugu Cinema

ఫోటో స్టూడియో మరియు లఘు చిత్రాలు

1909 సంవత్సరంలో మద్రాస్ వెళ్లి ఫోటోగ్రఫీ నేర్చుకుని అక్కడ సొంతంగా ఫొటోస్టూడియో ప్రారంభించారు రఘుపతి వెంకయ్య నాయుడు. తన ఫోటో స్టూడియో అద్దెకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బుతో ఒక శబ్ద పరికరం కొనడం జరిగింది. ఆ శబ్ద పరికరం పేరు “క్రోనో మెగా ఫోన్”. ఈ పరికరం వల్ల ఉపయోగం ఏంటంటే చిత్రాలకి శబ్దాలు జతచేయొచ్చు.

క్రోనో మెగా ఫోన్ పరికరంతో రఘుపతి వెంకయ్య నాయుడు గారు 12 లఘు చిత్రాలు తీసి “విక్టోరియా పబ్లిక్ హాల్” లో ప్రదర్శించారు. ఈ లఘు చిత్రాలని ప్రదర్శించడానికి రఘుపతి వెంకయ్య నాయుడు బెంగళూరు, విజయవాడ, శ్రీలంక, రంగూన్ మరియు పేగు లాంటి ప్రదేశాలకి వెళ్లడం జరిగింది.

థియేటర్ నిర్మాణం

“ఎస్ప్లానాడే టెన్ హౌస్” అంటే ఒక టెంట్ హౌస్ లాగ వేసి అక్కడ పెద్ద స్క్రీన్ మీద 1910 లో కొన్ని చిత్రాలని ప్రదర్శించడం జరిగింది. 1912 సంవత్సరంలో మౌంట్ రోడ్ దెగ్గర “గైటీ టాకీస్” థియేటర్ నిర్మించారు. ఈ థియేటర్ చెన్నై లోని మొదటి భారతీయుడు కట్టించిన థియేటర్ గా గుర్తింపు లభించింది. ఇవి కాకుండా క్రౌన్ థియేటర్, గ్లోబ్ థియేటర్ పేర్లతో చెన్నై లో నిర్మించడం జరిగింది.

ఈ థియేటర్లలో అమెరికా చిత్రాలు మరియు బ్రిటిష్ చిత్రాలు ప్రదర్శించడం జరిగింది. మిలియన్ డాలర్ మిస్టరీ, మిస్టరీస్ అఫ్ మీరా, క్లట్చింగ్ హ్యాండ్, బ్రోకెన్ కాయిన్, రాజాస్ క్యాస్కెట్, పెరల్ ఫిష్, గ్రేట్ బర్డ్ చిత్రాలన్నీ తను నిర్మించిన థియేటర్ లో ప్రదర్శించారు. సినిమాకి సంభందించిన గ్రంధాలయం నెలకొల్పి సినిమాకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞ్యానం నేర్పించేవారు.

1919 సంవత్సరంలో “స్టార్ అఫ్ ఈస్ట్ ఫిలిమ్స్” పేరుతో ఒక కంపెనీ స్థాపించారు అలాగే “గ్లాస్ స్టూడియో” పేరుతొ సినిమా స్టూడియో స్థాపించారు. తన తనయుడు రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడుని సినిమాటోగ్రఫీ మరియు చిత్ర నిర్మాణం విద్యని నేర్చుకోమని లండన్ పంపించారు రఘుపతి వెంకయ్య నాయుడు. లండన్ నుంచి అమెరికా దేశం వెళ్లి అక్కడ దిగజ్జ దర్శకులైన “సిసిల్ బి డెమిల్లి” దెగ్గర సహాయకుడిగా చేరడం జరిగింది. ఆ సమయంలో ఆ దిగజ్జ దర్శకులు “టెన్ కమాండ్మెంట్స్” చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అక్కడ రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడు పని నేర్చుకోవడం జరిగింది. లండన్ నుంచి తిరిగి వచ్చిన రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడు తన తండ్రి రఘుపతి వెంకయ్య నాయుడుతో కలిసి కొన్ని చిత్రాలు నిర్మించారు.

సినిమా నిర్మాణం

మీనాక్షి కళ్యాణం పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మధుర మీనాక్షి దేవాలయం పరిసరాల ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. గజేంద్ర మోక్షం, మత్స్యావతారం, నందనార్, భీష్మ ప్రతిజ్ఞ లాంటి చిత్రాలు నిర్మించారు. ఈ చిత్రాలన్నీ మూకీ చిత్రాలు కావడం విశేషం. తెలుగులో మొదటిసారి మూకీ చిత్రాలు నిర్మించిన ఘనత రఘుపతి వెంకయ్య నాయుడు గారికి దక్కుతుంది. భీష్మ ప్రతిజ్ఞ చిత్రంలో రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడు భీష్ముడిగా నటించారు. భీష్ముడి తల్లి గంగ పాత్రలో ఆంగ్లనాటి డీ కాస్టెల్లో నటించారు.

“ఈస్ట్ ఇండియన్ కంపెనీ” తో తమకి సినిమాలు నిర్మించడంలో పోటీ ఎక్కువ ఉండేది. ఆ తరువాత రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడు మరియు మరో వ్యక్తి యర్రగుడిపాటి వరద రావు తో కలిసి భక్తి చిత్రాలు తీయడం మొదలు పెట్టారు.

రఘుపతి వెంకయ్య నాయుడు తీసిన చిత్రాలలో నందనార్, గజేంద్ర మోక్షం మరియు మత్స్యావతార చిత్రాలు విలువలతో కూడిన చిత్రాలు గా నిలిచిపోవడం జరిగింది. రఘుపతి వెంకయ్య నాయుడు మనవరాలు కూడా నటిగా కొనసాగారు. ఆవిడ పేరు దేవిక. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించడం జరిగింది. ఇక దేవిక తనయ కనక కూడా నటించడం జరిగింది. 1941 మార్చ్ 15న రఘుపతి వెంకయ్య నాయుడు గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది.

పురస్కారం

రఘుపతి వెంకయ్య నాయుడు పేరు మీద అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1981 సంవత్సరంలో రఘుపతి  వెంకయ్య పురస్కారం ఇవ్వాలని నిర్ణయించారు. భారత చలన చిత్రానికి ఎంతో కృషి,సేవ చేసిన వ్యక్తులకి ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఈ పురస్కారం దక్కించుకున్న మొదటి వ్యక్తి ఎల్.వి. ప్రసాద్ మరియు ఆఖరిగా ఈ పురస్కారం తీసుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్

2019 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య నాయుడు పేరు మీద చిత్రం రూపొందించడం జరిగింది. ఈ చిత్రానికి దర్శకులు బాబ్జి. మండవ సతీష్ బాబు నిర్మించడం జరిగింది. ఈ చిత్రం లో రఘుపతి వెంకయ్య నాయుడు పాత్రలో విజయ నిర్మల గారి తనయుడు విజయ కృష్ణ నరేష్ నటించారు. తనికెళ్ళ భరణి, మహర్షి రాఘవ, ఏ వి ఎస్, దేవరాజ్, సత్యప్రియ ఇతర పాత్రలో నటించారు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *