Nerella Venumadhav – Father of Indian Mimicry

ఒక వ్యక్తిని అనుకరించడం కానీ లేదా వారి ధ్వనిని నోటితో అనుకరించడం కానీ లేదా జంతువుల ధ్వని లేదా ప్రకృతిలో వచ్చే శబ్దాలు లేదా వాహనాల శబ్దాలు మన ధ్వనితో అనుకరించినట్టైతే దానిని మిమిక్రీ అంటారు అదే తెలుగులో ధ్వని అనుకరణ అంటారు. మరి మొదటి ధ్వని అనుకరణ చేసిన వ్యక్తి ఎవరు, ఏంటి తెలుసుకుందాం.

nerella venumadhav
Nerella Venumadhav

మిమిక్రీ కళ

మిమిక్రీ కళను భారత దేశానికి పరిచయం చేసిన వ్యక్తి  నేరెళ్ల వేణుమాధవ్. మిమిక్రీ కళాకారుడు, మిమిక్రీ కళకి పితామహుడు, మిమిక్రీ కళని మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ కళని డిప్లొమా కోర్స్ లో చేర్చిన వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్.

1932 సంవత్సరం 28 డిసెంబర్ అప్పటి హైదరాబాద్ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని మట్టెవాడ ప్రాంతంలో హరి, శ్రీలక్ష్మి దంపతులకి జన్మించారు నేరెళ్ల వేణుమాధవ్. 1952 సంవత్సరంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేశారు నేరెళ్ల వేణుమాధవ్. డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ కళాశాల ప్రధానోపాధ్యాయుడు తన ప్రతిభని ఎంతగానో ప్రోత్సహించేవారు, అలాగే 60 రూపాయిలు స్కాలర్షిప్ ఇచ్చేవారు. తన ఇంటి చుట్టూ ఉండే జనాలతో పాటు తన ఇంట్లో వాళ్ళని మరియు ఇంటికి వచ్చే అతిదులని కూడా అనుకరించేవారు నేరెళ్ళ వేణుమాధవ్.

ప్రముఖుల ధ్వని అనుకరణ

1947 సంవత్సరం నుంచి మిమిక్రీ చేయడం మొదలుపెట్టారు నేరెళ్ల వేణుమాధవ్. రాజకీయ నాయకులూ, సినిమా తారలు మరియు ఇతర స్థానిక వ్యక్తులను తెలంగాణ యాసలో అనుకరించేవారు. 1953 సంవత్సరంలో హన్మకొండలో పాఠశాల లో టీచర్ గా పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ ఫాకల్టీ గా పని చేయడం జరిగింది. భారతీయ శాస్త్రీయ సంగీతం మీద ఎక్కువ ఇష్టం చూపించేవారు అలాగే తెలుగు, ఉర్దూ మరియు ఇంగ్లీష్ భాషల్లో సాహిత్యాన్ని ఇష్టపడేవారు.

నేరెళ్ల వేణుమాధవ్ గారు వి. నాగయ్య గారి గొంతుతో ధ్వని అనుకరణ చేయడం ప్రారంభించారు. ప్రపంచ దేశాలు తిరిగిన నేరెళ్ల వేణుమాధవ్ గారు ఎంతోమంది ఆంగ్ల నటుల్ని విదేశీ నాయకుల గాత్రాన్ని అనుకరించేవారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్ భాషలలో ధ్వని అనుకరిస్తూ ఉండేవారు అదికూడా నేపధ్య సంగీతంతో.

మెకన్నాస్ గోల్డ్ అనే హాలీవుడ్ ఛితంలోని సన్నివేశానికి నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ధ్వని అనుకరణకి ఎంతగానో పేరు రావడం విశేషం. హిందీ చిత్రం ముఘల్ ఏ అజమ్ చిత్రంలో పృథ్వీ రాజకపూర్ గారిని అలాగే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి గారిని ధ్వని అనుకరించడం విశేషం.

రాజకీయం మరియు సినిమాలు

న్యూయార్క్ నగరంలోని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజషన్ లో ప్రదర్శన ఇచ్చిన మొదటి వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్. అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు గారు శాసనమండలి సభ్యుడిగా నేరెళ్ల వేణుమాధవ్ గారిని నామినెట్ చేయడం జరిగింది.

నిర్మాత బి.ఎన్ రెడ్డి ప్రోత్సహించడంతో నేరెళ్ల వేణుమాధవ్ గారు తెలుగు సినిమాలో నటించడం జరిగింది. 12 తెలుగు చిత్రాల్లో నటించారు నేరెళ్ల వేణుమాధవ్. ఆయన నటించిన మొదటి చిత్రం గూఢచారి 118. నటశేఖర కృష్ణ మరియు జయలలిత ఇందులో కధానాయకి నాయకులు. మిమిక్రీ కళ పేరుతొ నేరెళ్ల వేణుమాధవ్ గారు ఒక పుస్తకం రచించడం జరిగింది. 19 జూన్ 2018 సంవత్సరంలో అనారోగ్యంతో కన్నుమూశారు నేరెళ్ల వేణుమాధవ్. 1975 సంవత్సరంలో నేరెళ్ల వేణుమాధవ్ గారు శోభావతి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది మరియు వారికి నలుగురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు.

నేరెళ్ల వేణుమాధవ్ గారి గురించి మరికొన్ని విశేషాలు

  • నేరెళ్ల వేణుమాధవ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకుంటారు అయన శిష్యులు
  • 2001 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
  • ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ పురస్కారం అందుకున్నారు.
  • ఆంధ్ర విశ్వా విద్యాలయం, కాకతీయ విశ్వా విద్యాలయం మరియు ఇగ్నో విశ్వా విద్యాలయం నుంచి డాక్టరేట్ పురస్కారం అందుకోవడం విశేషం.
  • వరంగల్ లోని ఒక వీధికి నేరెళ్ల వేణుమాధవ్ పేరు పెట్టడం విశేషం.
  • తిరుమ తిరుపతి దేవస్థానం వారిచే గజారోహణం జరగడం విశేషం.
  • తెలంగాణ ఆవిభావ దినోత్సవం నాడు తెలంగాణా ప్రభుత్వం నేరెళ్ల వేణుమాధవ్ గారిని సత్కరించింది.
  • నేరెళ్ల వేణుమాధవ్ గారి చిహ్నంతో పోస్ట్ కవర్ విడుదల చేశారు భారత పోస్ట్.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *