Neetu David – Legend of Indian Women Cricket

క్రికెట్ అనగానే పురుషుల ఆట అని మహిళలు చూడరు విసుక్కుంటారు లేదా ఛానెల్ మార్చేస్తారు అని చాలామంది అనుకుంటారు కానీ మహిళలు కూడా క్రికెట్ ని ఇష్టపడతారు మరియు ఈ మధ్య కాలంలో మహిళా క్రికెటర్లు కూడా రాణిస్తూ భారత మహిళా క్రికెట్ లో జాతీయ జట్టుకి ఆడి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. మరి అలంటి భారత మహిళా క్రికెటర్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.

భారత మహిళా క్రికెట్ చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ అజరామరమై ఉంటాయి. వాటిలో ఒకటి నీటూ డేవిడ్. భారత జట్టులో ప్రధానంగా స్పిన్ బౌలింగ్‌కి ప్రాధాన్యం తీసుకొచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ప్రపంచ స్థాయిలో భారత క్రికెట్‌కు పేరు తెచ్చారు.

వ్యక్తిగతం

నీతూ డేవిడ్ పూర్తి పేరు నీతూ లారెన్స్ డేవిడ్. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో సెప్టెంబర్ 1, 1977 సంవత్సరంలో జన్మించారు. చిన్నతనం నుంచి క్రికెట్ మీద మక్కువ తో సాధన చేయడం మొదలుపెట్టారు నీతూ డేవిడ్. తన కృషి పట్టుదల చూసి తల్లిదండ్రులు కూడా  ప్రోత్సహించారు.

అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగ్రేటం

ఉత్తరప్రదేశ్ జట్టు తరుపున రంజీ ట్రోఫీ ఆడుతూ అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు నీతూ డేవిడ్. రంజీ ట్రోఫీ లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నారు నీతూ డేవిడ్. 1995 సంవత్సరంలో న్యూజిలాండ్ తో జరిగిన టేట్స్ మ్యాచ్ లో మొదటి సారి జాతీయ జట్టు తరుపు నుంచి బరిలోకి దిగారు నీతూ డేవిడ్.

స్వతాహాగా బౌలరైనా నీతూ డేవిడ్ ఎడమ చేత్తో బౌలింగ్ మరియు కుడి చేత్తో బ్యాట్టింగ్ చేస్తారు. ఎడమ చేత్తో స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ తో స్పిన్ వేయగల సామర్థ్యం ఉన్న క్రీడాకారిణి నీతూ డేవిడ్. ఆడిన మొదటి మ్యాచ్ లో 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. 1995 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టు తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 8 వికెట్లు తీసి మరో సంచలనం సృష్టించారు నీతూ డేవిడ్. అంత బాగా ఆడిన భారత జట్టు ఓడిపోవడం బాధాకరం.

మొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్

1995 సంవత్సరంలో న్యూజిలాండ్ జట్టు తో జరిగిన మ్యాచ్ తో మొదటిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో అడుగుపెట్టారు నీతూ డేవిడ్. వన్డే మ్యాచ్ లో కూడా తన అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు నీతూ డేవిడ్. తన కెరీర్లో మొత్తం మూడు అంతర్జాతీయ మహిళా వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఆడిన ఘనత నీతూ డేవిడ్ సొంతం.

1997 సంవత్సరం భారత్ లో జరిగిన ప్రపంచకప్, 2000 సంవత్సరం న్యూజిలాండ్ లో జరిగిన ప్రపంచకప్ మరియు 2005 సంవత్సరంలో దక్షిణాఫ్రికా లో జరిగిన ప్రపంచకప్ లో పాల్గొన్నారు నీతూ డేవిడ్. 1997, 2000 సంవత్సరాలలో భారత్ సెమీఫైనల్ లో నిష్క్రమించింది. ఇక 2005 సంవత్సరంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడం బాధాకరం. నీతూ డేవిడ్ ఆడిన మూడు ప్రపంచకప్ లో అత్త్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.

ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్లు

ఇంగ్లాండ్ జట్టుతో 2006 సంవత్సరం లో జరిగిన టెస్ట్ మ్యాచ్ తరువాత నీతూ డేవిడ్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2008 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అంతర్జాతీయ వన్డే క్రికెట్ తరువాత వన్డే క్రికెట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. 2013 సంవత్సరం తరువాత రంజీ ట్రోఫీ టోర్నమెంట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు నీతూ డేవిడ్.

గణాంకాలు

నీతూ డేవిడ్ తన మొత్తం క్రికెట్ కెరీర్లో 10 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడి 25 పరుగులు సాధించారు. బ్యాటింగ్ సగటు 6.25 మరియు తన అత్యధిక పరుగులు 11. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 18.90 సగటుతో 41 వికెట్లు పడగొట్టడం విశేషం. ఒక మ్యాచ్లో తన అత్త్యుత్తమ బౌలింగ్ గణాంకాలు వచ్చేసి 8 వికెట్లు పడగొట్టి 53 పరుగులు ఇవ్వడం జరిగింది.

అంతర్జాతీయ వన్డే క్రికెట్ విషయానికి వస్తే మొత్తం 97 వన్డే మ్యాచ్లు ఆడి 74 పరుగులు సాధించారు. బ్యాటింగ్ సగటు 4.93 మరియు తన అత్యధిక పరుగులు 18. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 16.34 సగటుతో 141 వికెట్లు పడగిట్టడం విశేషం. ఒక మ్యాచ్లో తన అత్త్యుత్తమ బౌలింగ్ గణాంకాలు వచ్చేసి 5 వికెట్లు తీసి 20 పరుగులు ఇవ్వడం విశేషం. వన్డే క్రికెట్లో మొత్తం 2 సార్లు 5 వికెట్లు అలాగే టెస్ట్ క్రికెట్లో ఒక్కసారి 5 వికెట్లు తీయడం జరిగింది. టెస్ట్ మ్యాచ్లలో 4 వన్డే క్రికెట్లో 21 క్యాచ్ లు పట్టుకోవడం విశేషం.

రంజీ ట్రోఫీ, లిస్ట్ ఏ క్రికెట్ గణాంకాలు

రంజీ ట్రోఫీ లో 38 మ్యాచ్లు ఆది 6.50 బ్యాటింగ్ సగటుతో 39 పరుగులు సాధించారు నీతూ డేవిడ్. అత్యధిక స్కోర్ 11 పరుగులు. బౌలింగ్ విషయానికి వస్తే 13.67 సగటుతో 115 వికెట్లు పడగొట్టారు మరియు అత్యుత్తమ బౌలింగ్ 8 వికెట్లు పడగొట్టి 53 పరుగులు ఇవ్వడం జరిగింది అలాగే 11 క్యాచ్ లు పట్టారు నీతూ డేవిడ్.

లిస్ట్ ఏ క్రికెట్ విషయానికి వస్తే 205 మ్యాచ్లు ఆడి 6.11 సగటుతో 104 పరుగులు చేశారు మరియు అత్యధిక స్కోర్ వచ్చి 29. బౌలింగ్ విషయానికి వస్తే 12.78 సగటుతో 330 వికెట్లు పడగొట్టారు మరియు తన అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 5 వికెట్లు తీసి 3 పరుగులు ఇవ్వడం విశేషం అలాగే 40 క్యాచ్ లు పట్టుకోవడం జరిగింది.

క్రికెట్ తర్వాత జీవితం

క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత నీతూ డేవిడ్ భారత మహిళా క్రికెట్ సెలక్షన్ కమిటీ లో సభ్యురాలుగా నియమింపబడ్డారు. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో నీతూ డేవిడ్ ని  బి. సి. సి. ఐ మహిళా సెలక్షన్ కమిటీ చైర్ పెర్సన్ గా నియమించి తనకి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చారు.

ఐసీసీ క్రికెట్ హాల్ అఫ్ ఫేమ్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సభ్యులు 2009 సంవత్సరం జనవరి 2న దుబాయ్ లో ఐసీసీ క్రికెట్ హాల్ అఫ్ ఫేమ్ అనే కొత్త కార్యక్రమం ప్రారంభించింది. అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య తో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ప్రపంచ క్రికెట్ లో అపారమైన సేవ చేసిన క్రికెట్ క్రీడాకారులను గౌరవంతో సత్కరించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు.

ఐసీసీ క్రికెట్ హాల్ అఫ్ ఫేమ్ లో ఎంతోమంది దిగ్గజా క్రికెటర్లను చేర్చడం జరిగింది మరి అలంటి హాల్ అఫ్ ఫేమ్ లో భారత మహిళా క్రికెటర్ కు చోటు దక్కడం గర్వకారణం అని చెప్పుకోవాలి. 2024 సంవత్సరం అక్టోబర్ 16న నీతూ డేవిడ్ ను ఐసీసీ క్రికెట్ హాల్ అఫ్ ఫేమ్ లో చేరుస్తున్నట్టు ప్రకటించారు.

ఐసీసీ క్రికెట్ హాల్ అఫ్ ఫేమ్ లో చేరిన రెండవ భారత మహిళా క్రికెటర్ గా నీతూ డేవిడ్ ను ఎంపిక చేయడం జరిగింది. ఐసీసీ క్రికెట్ హాల్ అఫ్ ఫేమ్ లో ఎంపికైన మొదటి భారత మహిళా క్రికెటర్ గా డయానా ఎడుల్జీ ఉండడం విశేషం.

నీతూ డేవిడ్ కు ఐసీసీ క్రికెట్ హాల్ అఫ్ ఫేమ్ లో ఎంపిక చేయడంతో ప్రముఖ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ ఒక ఉత్తరం ద్వారా తన మనసులోని మాటను బయటపెడుతూ హర్షం వ్యక్తం చేశారు.

నీతూ డేవిడ్ మీకు ఐసీసీ క్రికెట్ హాల్ అఫ్ ఫేమ్ కు స్వగతం. ఇప్పటి వరకు భారత మహిళా క్రికెట్ తరఫునుంచి నేను ఒంటరిగా ఉన్నాను అనుకునేదాన్ని ఇప్పుడు మీరు కూడా తోడవ్వడంతో చాలా అనందంగా ఉంది. మీలాంటి గొప్ప క్రీడాకారిణికి ఈ అవకాశం దక్కడం నాకు చాలా ఆనందంగా ఉంది.

మీరు ఇంతగొప్ప స్పిన్ వేయగలరో నాకు తెలుసు అంతేకాకుండా మీరు ఈ సాధిస్తారని అప్పుడే అనుకున్న. మరిన్ని పురస్కారాలు మీరు అందుకోవాలని కోరుకుంటున్న. మన భారత మహిళా క్రికెటర్లు ఇంకా ఎంతోమంది ఈ ఐసీసీ క్రికెట్ హాల్ అఫ్ ఫేమ్ లో గౌరవ్ దక్కించుకోవాలి అని కోరుకుంటున్న అని డయానా ఎడుల్జీ అన్నారు.

నీతూ డేవిడ్ గురించి మరికొన్ని విశేషాలు

రంజీట్రోఫీ లో 3 సంవత్సరాలు (1992-1995) వరకు ఉత్తరప్రదేశ్ జట్టు తరఫునుంచి ఆడటం జరిగింది, ఆ తరువాత 17 సంవత్సరాలు (1996-2013) వరకు రైల్వేస్ జట్టు తరుపున ఆడటం జరిగింది. అంతర్జాతీయ మహిళా వన్డే క్రికెట్ లో భారత జట్టు తరఫునుంచి 100 వికెట్లు తీసిన మొదటి క్రికెటర్ గా గుర్తింపు పొందారు నీతూ డేవిడ్.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *