Nandamuri Natasimham Balakrishna Movies List

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

విశ్వా విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరువాత రాజకీయంలో అడుగుపెట్టి ప్రజలకు సేవ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక అభిమానాన్ని సంపాదించినా నందమూరి బాలకృష్ణ గురించి తెలుసుకుందాం.

సినీ ప్రస్థానం

నందమూరి తారక రామారావు దర్శక నిర్మాతగా వచ్చిన చిత్రం తాతమ్మకల. ఎన్. టి. రామారావు, భానుమతి రామకృష్ణ, బాలకృష్ణ కలిసి నటించిన చిత్రం తాతమ్మకల. 1974 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రానికి ఎస్. రాజేశ్వరరావు సంగీతం అందించారు మరియు ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. బి. ఏ. సుబ్బారావు దర్శకత్వంలో బాలకృష్ణ, హరికృష్ణ కలిసి నటించిన చిత్రం రామ్ రహీం.

ఎస్. డి. లాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణ కలిసి అన్నదమ్ములుగా నటించిన చిత్రం అన్నదమ్ముల అనుబంధం. లతా కధానాయికగా నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది. నందమూరి తారక రామారావు, బాలకృష్ణ కలిసి నటించిన చిత్రం వేములవాడ భీమకవి పరవాలేదనిపించింది.

నందమూరి తారక రామారావు దర్శక నిర్మాతగా మారి తీసిన చిత్రం దన వీర శూర కర్ణ. ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ, బి. సరోజాదేవి, ప్రభ కలిసి నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. పురాణ ఇతిహాసమైన మహాభారతం కధ నుంచి కర్ణుడి పాత్ర నేపథ్యంతో తీసిన ఈ చిత్రంలో అభిమన్యు పాత్రలో నటించారు బాలకృష్ణ.

నందమూరి తారక రామారావు దర్శక నిర్మాణంలో వచ్చిన చిత్రం అక్బర్ సలీమ్ అనార్కలి. ఎన్టీఆర్, బాలకృష్ణ, దీప కలిసి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. నందమూరి తారక రామారావు దర్శక నిర్మాతగా మారి తీసిన చిత్రం శ్రీమద్విరాట పర్వము. ఎన్టీఆర్, బాలకృష్ణ, వాణిశ్రీ కలిసి నటించిన ఈ చిత్రం మహాభారతం కధ నుండి విరాట పర్వం ఘట్టం ఆధారంగా రూపొందించడం జరిగింది.

ఎన్టీఆర్, జయసుధ, జయప్రద, బాలకృష్ణ కలిసి నటించిన చిత్రం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ చిత్రానికి నందమూరి తారక రామారావు దర్శక నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. కె. రాఘవేంద్రరరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నిర్మించిన చిత్రం రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, టి . రామారావు దర్శకత్వంలో వచ్చిన అనురాగదేవత, డి. యోగానంద్ ద్దర్శకత్వంలో వచ్చిన సింహం నవ్వింది చిత్రాలలో నటించారు బాలకృష్ణ.

కధానాయకుడిగా

సాహసమే జీవితం చిత్రంతో మొదటిసారి కధానాయకుడిగా నటించారు బాలకృష్ణ. భారతి, వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విజ్జి కథానాయకిగా నటించారు. 1984 సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైంది. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో బాలకృష్ణ, తులసి నటించిన డిస్కో కింగ్ చిత్రం విజయం సాధించింది.

కె. విశ్వనాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ, సుమలత కలిసి నటించిన జనని జన్మభూమి చిత్రం విజయం సాధించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ, సుహాసిని, భానుమతి రామకృష్ణ కలిసి నటించిన చిత్రం మంగమ్మ గారి మనవడు. కె. వి. మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ వసూళ్లు సాధించడం విశేషం. బామ్మా మనవడిగా భానుమతి, బాలకృష్ణ అద్భుతంగా నటించడం విశేషం.

1984 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రానికి ఎస్. గోపాలరెడ్డి నిర్మించారు. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పల్నాటిపులి పరవాలేదనిపించింది. నందమూరి తారక రామారావు దర్శక నిర్మాతగా వచ్చిన చిత్రం శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.

కథానాయకుడు, ఆత్మబలం, బాబాయ్ – అబ్బాయి, భార్య భర్తల బంధం, భలే తమ్ముడు, కత్తుల కొండయ్య, పట్టాభిషేకం, నిప్పులాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య చిత్రాలతో అలరించారు బాలకృష్ణ. జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ, రజని కలిసి నటించిన సీతారామ కళ్యాణం చిత్రం భారీ విజయం సాధించింది మరియు ఈ చిత్రంలో “రాళ్ళల్లో ఇసుకల్లో” పాట జనాదరణ పొందింది.

మరికొన్ని చిత్రాలు

ఏ. కోందండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, భానుప్రియ, శారదా కలిసి నటించిన అనుసూయమ్మ గారి అల్లుడు చిత్రం విజయం సాధించింది. చక్రవర్తి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించిన దేశోద్ధారకుడు, కె. మురళి మోహనరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ కృష్ణుడు భారీ విజయాలు సాధించాయి.

ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, భానుప్రియ కలిసి నటించిన భార్గవరాముడు, వై. నాగేశ్వర్రావు దర్శకత్వంలో వచ్చిన రాము, నందమూరి రమేష్ దర్శకత్వంలో వచ్చిన అల్లరి క్రిష్నయ్య, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సహస సామ్రాట్ టి. రామారావు దర్శకత్వంలో వచ్చిన ప్రెసిడెంట్ గారి అబ్బాయి చిత్రాలతో అలరించారు బాలకృష్ణ.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి, శోభన కలిసి నటించిన మువ్వ గోపాలుడు చిత్రం భారీ విజయం సాధించింది. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన భానుమతి గారి మొగుడు చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించారు మరియు ఈ చిత్రం విజయం సాధించింది. కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన దొంగ రాముడు అలరించగా ఆ తరువాత వచ్చిన తిరగబడ్డ తెలుగుబిడ్డ నిరాశపరిచింది.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారతంలో బాలచంద్రుడు, రాముడు భీముడు రక్తాభిషేకం చిత్రాలు అలరించాయి. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భలేదొంగ.బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ముద్దుల మావయ్య. బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించిన ఈ చిత్రం విజయాన్ని అందించింది.

అశోక చక్రవర్తి చిత్రం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన చిత్రం బాల గోపాలుడు చిత్రం విజయం సాధించింది. ప్రాణానికి పురాణం చిత్రం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన నారి నారి నడుము మురారి చిత్రం భారీ విజయం సాధించింది. బాలకృష్ణ, శోభన, నిరోషా కలిసి నటించిన ఈ చిత్రానికి ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముద్దుల మేనల్లుడు విజయం సాధించగా ఆ తరువాత బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన లారీ డ్రైవర్ చిత్రం భారీ విజయం సాధించింది. బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు.

1991 – 1995 మధ్య చిత్రాలు

టి. రామారావు దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించిన తల్లిదండ్రులు చిత్రం విజయం సాధించింది. ఎన్టీఆర్ దర్శక నిర్మాతగా వచ్చిన చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ చిత్రం నిరాశపరిచింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 చిత్రం భారీ విజయం సాధించింది. పూర్తిగా కొత్త కధ తో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

బాలకృష్ణ, మోహిని కలిసి నటించిన ఈ చిత్రం టైం ట్రావెల్ నేపధ్యం మీద చిత్రీకరించడం జరిగింది. శాస్త్రవేత్తయన మోహిని తండ్రి పాత్రైనా తిళ్ళు ఆనంద్ ఒక యంత్రాన్ని కనిపెట్టడం జరుగుతుంది. తెలీకుండా ఆ యంత్రంలోకి బాలకృష్ణ, మోహిని, సుత్తివేలు ప్రవేశించడం ఆ తరువాత ఆ యంత్రం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలోకి ఆగిపోవడం జరుగుతుంది. అక్కడ జరిగే సరదా సన్నివేశాలు, గొడవలు చూడ్డానికి భలేగా ఉంటుంది.

మళ్లీ ఆ యంత్రాన్ని ఎక్కి కొన్నేళ్లు ముందుకెళ్తారు అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనలు అలరిస్తాయి. ఏ. కోదంరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధర్మక్షేత్రం చిత్రం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం ఘన విజయం సాధించింది. బాలీవుడ్ సంగీత దర్శకులు బప్పి లహరి అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ఈ చిత్రంలో “అరే ఓ సాంబా” అనే పాట జనాదరణ పొందింది.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటభూషణ శోభన్ బాబు, బాలకృష్ణ, మీనా, నగ్మా కలిసి నటించిన అశ్వమేధం చిత్రం నిరాశపరిచింది. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించిన చిత్రం నిప్పురవ్వ. యువరత్న ఆర్ట్స్ బ్యానర్ మీద ఎం. వి. శ్రీనివాస్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి బప్పీలహరి, రాజ్ – కోటి సంగీతం అందించగా ఏ. ఆర్. రెహ్మాన్ నేపధ్యసంగీతం అందించడం విశేషం మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

వరుస విజయాలు

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వి. బి. రాజేంద్రప్రసాద్ నిర్మాణంలో బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టండన్ కలిసి నటించిన బంగారు బుల్లోడు చిత్రం బాక్సాఫీస్ వడ భారీ విజయం సాధించింది. రాజ్ – కోటి అందించిన సంగీతమ్, బాలకృష్ణ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో రవీనా టండన్ తెలుగు సినీ పరిశమలోకి అడుగుపెట్టారు.

నిప్పురవ్వ, బంగారు బుల్లోడు చిత్రాలు ఒకే రోజు విడుదలై భారీ విజయం సాధించడం విశేషం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ, రోజా, కలిసి నటించిన ఫాంటసీ చిత్రం భైరవద్వీపం. ఒక కల్పిత కధతో రూపొందించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. బాలకృష్ణ నటన అద్భుతం అని చెప్పొచ్చు.

మలయాళం దర్శకులు ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన గాండీవం చిత్రం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన బొబ్బిలి సింహం భారీ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ, మీనా, రోజా కలిసి నటించిన ఈ చిత్రానికి ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో బాలకృష్ణ తెలుగు భాషతో పాటు మిగితా భాషల్లో కూడా మాటలాడి ప్రేక్షకులను అలరిస్తారు. సౌందర్య తో కలిసి నటించిన టాప్ హీరో, రోజా, రంభ తో కలిసి నటించిన మాటపెట్టుకోకు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.

1996 – 2000 మధ్య చిత్రాలు

శరత్ దర్దకత్వంలో బాలకృష్ణ, రమ్యకృష్ణ, ఆమని కలిసి నటించిన వంశానికొక్కడు చిత్రం భారీ విజయం సాధించింది. కోటి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించగా బాలకృష్ణ అద్భుతంగా నటించారు అని చెప్పొచ్చు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వసిసిన శ్రీ కృష్ణ విజయం ప్రేక్షకులను నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన ముద్దుల మొగుడు భారీ విజయాన్ని అందుకుంది.

ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, మీనా నటించిన ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో రోజా, ఇంద్రజ కలిసి నటించిన పెద్దన్నయ్య చిత్రం భారీ విజయం సాధించింది. అన్నదమ్ముల నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రంలో అచ్యుత్, రాజ్ కుమార్ నటించారు.

బాలకృష్ణ, రమ్యకృష్ణ, రుచిత ప్రసాద్ కలిసి నటించిన దేవుడు చిత్రం నిరాశపరిచింది.అమాయకపు పాత్రలో బాలకృష్ణ నటన ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బాలకృష్ణ, హీరా కలిసి నటించిన యువరత్న రానా చిత్రం నిరాశపరచగా ఆ తరువాతా లైలా తో కలిసి నటించిన పవిత్రప్రేమ చిత్రం విజయం సాధించింది.

వరుస విజయాలు

బి. గోపాల్ దర్శకత్వంలో చెంగల వెంకట్రావు నిర్మించిన చిత్రం సమరసింహారెడ్డి. బాలకృష్ణ, జయప్రకాష్రెడ్డి, పృథ్వీరాజ్, అంజలా ఝవేరి, సిమ్రాన్, సంఘవి కలిసి నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో రెండు కుటుంబంలా మధ్య ఉండే పగలు ప్రతీకారాలు మీద తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం జరిగింది.

ప్రతినాయకుడి పాత్ర పోషించిన జయప్రకాష్రెడ్డి మరియు బాలకృష్ణ మధ్య జరిగే పోటా పోటీ సన్నివేశాలు, మతాల తూటాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో ముఖ్యనగ రైల్వే స్టేషన్ లో వచ్చే సన్నివేశం ఎప్పటికి గుర్తుంటుంది. కూతురు అంజలి జవేరిని రైలు ఎక్కించడానికి తండ్రి జయప్రకాష్ రెడ్డి వస్తే కొడుకుని స్వగతం పలకడానికి బాలకృష్ణ తండ్రి వెళ్లడం అక్కడ ఇద్దరు ఎదురుపడటం ఆ తరువాత జరిగే గొడవలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

ఈ చిత్రంలో రైల్వే స్టేషన్ లో వచ్చే సంభాషణలు అలాగే జయప్రకాశ్రెడ్డి ఇంటికి రక్తంతో కత్తి పట్టుకుని వెళ్లే సన్నివేశంలో వచ్చే సంభాషణ  “ఒరేయ్ వీర రాఘవరెడ్డి నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా” లాంటి డైలాగులు ప్రేక్షకులను ఈలలు వేసేలా చేసాయి. సమరసింహారెడ్డి చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను ఇప్పటికి అలరించడం విశేషం. ఈ చిత్రంలో నేపధ్య సంగీతంతో పాటు ఈ చిత్రంలోని ప్రతి పాట ఉర్రుతలూగించింది. ఈ చిత్రానికి కొన్ని పురస్కారాలు లభించడం విశేషం.

శరత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణంరాజు, బాలకృష్ణ, రోజా, రచన, దీప్తి భట్నాగర్ కలిసి నటించిన సుల్తాన్ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించగా కోటి సంగీతం అందించారు. ముస్త్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ, అబ్బాస్, మీనా, రాశి కలిసి నటించిన ఈ చిత్రం విజయం సాధించింది.

శరత్ దర్శకత్వంలో వచ్చిన వంశోద్ధారకుడు నిరాశపరచగ ఆ తరువాత వచ్చిన గొప్పింటి అల్లుడు పరవాలేదనిపించింది. ఈ చిత్రానికి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

2001 – 2005 మధ్య చిత్రాలు

బి. గోపాల్ దర్శకత్వంలో ఎం. వి. మురళీకృష్ణ నిర్మాణంలో వచ్చిన చిత్రం నరసింహనాయుడు. బాలకృష్ణ, సిమ్రాన్, ఆశ షైనీ, ప్రీతి జింగానీయ, ముకేశ్ ఋషి, జయప్రకాశ్ రెడ్డి కలిసి నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. సమరసింహారెడ్డి లాంటి చిత్రం తరువాత బి. గోపాల్, బాలకృష్ణ కలయికలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

పగ, ప్రతీకారాలు నేపధ్యం మీద తీసిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రి పాత్రలో కె. విశ్వనాధ్ నటించడం జరిగింది. మణిశర్మ అందించిన సంగీతం తో పాటు నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో ప్రతీ పాట జనాదరణ పొందింది. నరసింహనాయుడు చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం.

పి. ఏ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన భలేవాడివి బాసు, జి. రాంప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సీమ సింహం నిరాశపరిచాయి. వి. వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో, శ్రియ శరన్, టబు కలిసి నటించిన చిత్రం చెన్నకేశవరెడ్డి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. దేవయాని, పృథ్విరాజ్ ప్రత్యేకపాత్రలో నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

బి. గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ, ఆర్తి అగర్వాల్, సోనాలి బెంద్రే కలిసి నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రం నిరాశపరిచింది. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో బెల్లంకొండా సురేష్ నిర్మించిన లక్ష్మి నరసింహ చిత్రం భారీ విజయం సాధించింది. బాలకృష్ణ, ఆసిన్ కలిసి నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.

లక్ష్మి నరసింహ చిత్రంలో బాలకృష్ణ పోలీస్ పాత్ర వేసి తన నట విశ్వారావుపం చూపించారు మరియు ఈ చిత్రంలో బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను అలరించాయి. మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరిచింది. బాలకృష్ణ, లయ, అంకిత, సంగీత కలిసి నటించిన విజయేంద్రవర్మ, జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన అల్లరి పిడుగు నిరాశపరిచాయి.

వీరభద్ర, మహారథి, ఒక్కమగాడు, పాండురంగడు, మిత్రుడు చిత్రాలు నిరాశపరిచాయి. 2010 సంవత్సరంలో బోయపాటి శీను దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మాణంలో వచ్చిన చిత్రం సింహ. తండ్రి కొడుకుల పాత్రలో నటించారు బాలకృష్ణ మరియు ఈ చిత్రంలో నయనతార, స్నేహ ఉల్లాల్, నమిత కధానాయికలుగా నటించారు. చక్రి అందించిన సంగీతంతో పాటు ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించాయి.

మరికొన్ని చిత్రాలు

దాసరి నారాయణరావు దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన పరమవీర చక్ర చిత్రం అపజయాన్ని మూటగట్టుకుంది. బాపు దర్శకత్వంలో, యలమంచలి సాయిబాబు నిర్మాణంలో బాలకృష్ణ, శ్రీకాంత్, నయనతార కలిసి నటించిన భక్తిరస చిత్రం శ్రీరామరాజ్యం. శ్రీరాముడి పాత్రలో బాలకృష్ణ, లక్ష్మణుడిగా, శ్రీకాంత్, సీత దేవిగా నయనతార నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకుంది.

తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ భాషలో కూడా విడుదల చేయడం జరిగింది. పరుచూరి మురళి దర్శకత్వంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం అధినాయకుడు మరియు ఈ చిత్రం నిరాశపరిచింది. శేఖర్ రాజా దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, బాలకృష్ణ, సోను సూద్, మంచు లక్ష్మి, దీక్ష సేథ్ కలిసి నటించిన చిత్రం ఊ కొడతారా ఉలిక్కిపడతారా. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించిన బాలకృష్ణ పాత్రకి మంచి పేరు రావడం విశేషం.

రవికుమార్ చావాలి దర్శకత్వంలో వచ్చిన శ్రీమన్నారాయణ చిత్రం పరవాలేదనిపించిన ఆ తరువాత వచ్చిన లెజెండ్ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. బోయపాటి శీను దర్శకత్వంలో బాలకృష్ణ, జగపతిబాబు, రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ కలిసి నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు మొదటిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించడం విశేషం.

లెజెండ్ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో అద్భుతంగా నటించారు మరియు ఈ చిత్రంలోని సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తాయి. జితేంద్ర పాత్రలో జగపతిబాబు నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పొచ్చు. బాలకృష్ణ, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు పోటా పోటీగా ఉంటాయి.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఘన విజయం సాధించింది. ప్రొద్దుటూరు నగరంలోని థియేటర్ లో ఈ చిత్రం 1000 డేస్ ఆడటం విశేషం మరియు ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం. బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టే కలిసి నటించిన లయన్ చిత్రం నిరాశపరిచింది.

2016 నుండి ఇప్పటివరకు

శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహన్ కలిసి నటించిన డిక్టేటర్ చిత్రం పరవాలేదనిపించగా ఆ తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి విజయం సాధించింది. బాలకృష్ణ, శ్రియ శరన్, హేమ మాలిని కలిసి నటించిన ఈ చిత్రం బాలకృష్ణ కి 100 వ చిత్రం గా విడుదలైంది.

అమరావతి నగరం లోని శాతవాహన రాజ్యాన్ని పరిపాలించిన శాతకర్ణి రాజు మీద వచ్చిన ఈ చిత్రంలో గౌతమీ పాత్రలో నటించారు నటి హేమ మాలిని. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ, శ్రియ కలిసి నటించిన చిత్రం పైసవసూల్. ఈ చిత్రంలో రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు బాలకృష్ణ మరియు ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో “మామ ఏక్ పెగ్ లా” పాట పాడి ప్రేక్షకులను అలరించారు బాలకృష్ణ మరియు మొదటి సారి తన సినీ కెరీర్లో పాట పడటం విశేషం.కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ, నయనతార కలిసి నటించిన చిత్రం జై సింహ విజయం సాధించింది.

నందమూరి తారక రామారావు జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు ఎన్టీఆర్: కధానాయకుడు, ఎన్టీఆర్: మహానాయకుడు. బాలకృష్ణ, సుమంత్, రానా దగ్గుబాటి, విద్యాబాలన్ కలిసి నటించిన ఈ చిత్రాలలో బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు పాత్ర పోషించడం విశేషం. తండ్రి నందమూరి తారక రామారావు పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించిన కూడా ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేపాయాయి.

కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ, భూమిక చావ్లా, వేదిక, సోనాల్ చౌహన్ కలిసి నటించిన రూలర్ చిత్రం నిరాశపరిచింది. బోయపాటి శీను దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో శ్రీకాంత్, ప్రగ్య జైస్వాల్, జగపతిబాబు కలిసి నటించిన చిత్రం అఖండ. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఎస్. ఎస్. థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో శృతి హస్సన్, హనీ రోజ్ కథానాయికలుగా వరలక్ష్మి శరత్కుమార్ ప్రత్యేక పాత్రలో కలిసి నటించిన చిత్రం వీర సింహారెడ్డి. దునియా విజయ్ ప్రతినాయకుడిగా చేసిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ కలిసి నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో కొత్త రకమైన పాత్రలో కనిపిస్తారు బాలకృష్ణ. స్నేహితుడు చనిపోతే తన కూతురిని పెంచి పోషించడమే కాకుండా భారత ఆర్మీ లో చేర్పించడానికి కష్టపడుతూ ఉంటారు బాలకృష్ణ. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఎస్. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం అందించారు. డాకు మహారాజ్, అఖండ 2 చిత్రాలతో 2025 సంవత్సరంలో ప్రేక్షకులను అలరించాడనికి వస్తున్నారు బాలకృష్ణ.

వ్యక్తిగతం

చెన్నై నగరంలో 1960 సంవత్సరం, జూన్ 10న జన్మించారు బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక్ రామారావు నటులు, దర్శకులు మరియు నిర్మాత. తల్లి బసవతారకమ్. చెన్నై, మరియు హైదరాబాద్ లో చదువుకున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి ఆరుగురు సోదరులు నలుగురు సోదరీమణులు. 1982 సంవత్సరంలో వసుంధర దేవి తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ బావ బావమరిది అవుతారు మరియు నారా లోకేష్ స్వయానా అల్లుడు అవుతారు. తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీలో సభ్యుడిగా ఉంటూ ఆ తరువాత 2014, 2019 మరియు 2024 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే గా ప్రజల చేత్తో ఎన్నుకోబడ్డారు.

ఒకప్పుడు యువరత్న బాలకృష్ణ అంటూ అభిమానులు పిలిచేవారు ఆ తరువాత నందమూరి నటసింహం బాలకృష్ణ అంటూ అభిమానంతో పిలుస్తున్నారు. మరికొంతమంది అభిమానులు ప్రేమతో బాలయ్య బాబు అంటూ అభిమానంతో పిలుస్తారు. ఆహా ఓటిటి యాప్ లో అంస్టప్పబల్ పేరుతొ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
  1. తాతమ్మకల
  2. రామ్ రహీం
  3. అన్నదమ్ముల అనుబంధం
  4. వేములవాడ భీమకవి
  5. దాన వీర శూర కర్ణ
  6. అక్బర్ సలీమ్ అనార్కలి
  7. శ్రీ మద్విరాట పర్వము
  8. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం
  9. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు
  10. అనురాగ దేవత
  11. సింహం నవ్వింది
  12. సాహసమే జీవితం
  13. డిస్కో కింగ్
  14. జనని జన్మభూమి
  15. మంగమ్మగారి మనవడు
  16. పల్నాటి పులి
  17. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
  18. కథానాయకుడు
  19. ఆత్మబలం
  20. బాబాయ్ అబ్బాయి
  21. భార్యాభర్తల బంధం
  22. భలే తమ్ముడు
  23. కత్తుల కొండయ్య
  24. పట్టాభిషేకం
  25. నిప్పులాంటి మనిషి
  26. ముద్దుల క్రిష్నయ్య
  27. సీతారామ కళ్యాణం
  28. అనసూయమ్మగారి అల్లుడు
  29. దేశోద్ధారకుడు
  30. కలియుగ కృష్ణుడు
  31. అప్పోర్వ సహోదరులు
  32. భార్గవ రాముడు
  33. రాము
  34. అల్లరి క్రిష్నయ్య
  35. సహస సామ్రాట్
  36. ప్రెసిడెంట్ గారి అబ్బాయి
  37. మువ్వగోపాలుడు
  38. భానుమతి గారి మొగుడు
  39. ఇన్స్పెక్టర్ ప్రతాప్
  40. దొంగ రాముడు
  41. తిరగబడ్డ తెలుగుబిడ్డ
  42. భారతంలో బాలచంద్రుడు
  43. రాముడు భీముడు
  44. రక్తాభిషేకం
  45. భలేదొంగ
  46. ముద్దుల మావయ్య
  47. అశోక చక్రవర్తి
  48. బాలగోపాలుడు
  49. ప్రాణానికి ప్రాణం
  50. నారి నారి నడుము మురారి
  51. ముద్దుల మేనల్లుడు
  52. లారీ డ్రైవర్
  53. తల్లిదండ్రులు
  54. బ్రహ్మర్షి విశ్వామిత్ర
  55. ఆదిత్య 369
  56. ధర్మక్షేత్రం
  57. రౌడీ ఇన్స్పెక్టర్
  58. అశ్వమేధం
  59. నిప్పు రవ్వ
  60. బంగారు బుల్లోడు
  61. భైరవ దీపం
  62. గాండీవం
  63. బొబ్బిలి సింహం
  64. టాప్ హీరో
  65. మాతో పెట్టుకోకు
  66. వంశానికొక్కడు
  67. శ్రీ కృష్ణ అర్జున విజయం
  68.  ముద్దుల మొగుడు
  69. పెద్దన్నయ్య
  70. దేవుడు
  71. యువరత్న రాణా
  72. పవిత్ర ప్రేమ
  73. సమరసింహా రెడ్డి
  74. సుల్తాన్
  75. కృష్ణ బాబు
  76. వంశోద్ధారకుడు
  77. గొప్పింటి అల్లుడు
  78. నరసింహ నాయుడు
  79. భలేవాడివిబాసు
  80. సీమసింహం
  81. చెన్నకేశవ రెడ్డి
  82. పల్నాటి బ్రహ్మనాయుడు
  83. లక్ష్మీనరసింహ
  84. విజయేంద్ర వర్మ
  85. అల్లరి పిడుగు
  86. వీరభద్ర
  87. మహారథి
  88. ఒక్క మగాడు
  89. పాండురంగడు
  90. మిత్రుడు
  91. సింహ
  92. పరమవీర చక్ర
  93. శ్రీ రామ రాజ్యం
  94. అధినాయకుడు
  95. ఊ కొడతారా ఉల్లిక్కిపడతారా
  96. శ్రీమన్నారాయణ
  97. లెజెండ్
  98. లయన్
  99. డిక్టేటర్
  100. గౌతమీపుత్ర శాతకర్ణి
  101. పైసా వసూల్
  102. జై సింహ
  103. ఎన్.టి.అర్ కధానాయకుడు
  104. ఎన్.టి.అర్ మహానాయకుడు
  105. రూలర్
  106. అఖండ
  107. వీరసింహారెడ్డి
  108. భగవంత్ కేసరి
  109. డాకు మహారాజ్

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *