Nandamuri Kalyan Ram Filmography

Kalyan Ram
Kalyan Ram

బాలనటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరువాత కధానాయకుడిగా, నిర్మాతగా విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ, నిర్మిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి తెలుసుకుందాం .

కోడి రామకృష్ణ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, సుహాసిని, రేఖ హర్రీస్ కలిసి నటించిన బాలగోపాలుడు చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు కళ్యాణ్ రామ్. 1989 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది. 2003 సంవత్సరంలో కాశి విశ్వనాధ్ దర్శకత్వంలో రామోజీరావు నిర్మాణంలో ఉషాకిరణ్ బ్యానర్ మీద రూపొందించిన చిత్రం తొలిచూపులోనే.

కళ్యాణ్ రామ్, ఆకాంక్ష నటించిన ఈ చిత్రంలో సుమన్ ఒక పాత్రలో నటించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఏ. మల్లికార్జున్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా కళ్యాణ్ రామ్, రమ్య నటించిన అభిమన్యు చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి సుహాసిని ప్రత్యేక పాత్రలో నటించారు మరియు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సొంత బ్యానర్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నందమూరి జానకిరామ్ నిర్మాణంలో కళ్యాణ్ రామ్, సింధు తులాని కలిసి నటించిన అతనొక్కడే చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంతో మొదటి విజయాన్ని అందుకున్నారు నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించగా ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయి.

2005 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్ధి, చంద్రమోహన్, వేణుమాధవ్ నటించగా నటి సింధు తులానికి ఈ చిత్రం పరిచయ చిత్రం అవ్వడం విశేషం. ఈ చిత్రంలో వేణుమాధవ్ పండించిన హాస్యం అలరించింది. అతనొక్కడే చిత్రాన్ని కొన్ని పురస్కారాలు లభించడం విశేషం మరియు ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ భాషలలో రీమేక్ చేయడం జరిగింది.

అనిల్ కృష్ణ దర్శకత్వంలో 2006 సంవత్సరంలో కళ్యాణ్ రామ్, దియా కలిసి నటించిన అసాధ్యుడు చిత్రం నిరాశపరిచింది మరియు ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ నటించిన లక్ష్మీకళ్యాణం చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రంతో కాజల్ అగర్వాల్ కధానాయికగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

షాయాజీషిండే, యువ కథానాయకి సుహాసిని నటించిన ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలో “అలిగావా చిట్టి చిలక” పాట జనాదరణపొందింది. వి. సముద్ర దర్శకత్వంలో ఈదర రంగారావు నిర్మించిన విజయదశమి చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. కళ్యాణ్ రామ్, సాయికుమార్, వేదిక నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు.

హర్షవర్ధన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ నటించి నిర్మించిన చిత్రం హరే రామ్. ఈ చిత్రంలో ప్రియమణి, సింధు తులాని కథానాయికగా నటించగా కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయంలో నటించడం విశేషం. హరి అనే పాత్ర నిజాయితీగల పోలీస్ పాత్రలో నటిస్తే, రామ్ అనే పాత్ర సైకో కిల్లర్ గా ఎవర్ని పడితే వాళ్ళని హత్య చేసే పాత్రలో నటించారు కళ్యాణ్ రామ్.

హరే రామ్ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన అద్భుతం అని చెప్పొచ్చు మరియు తన పాత్రలకి ప్రశంసలు దక్కాయి. 2008 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది మరియు చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. నరేన్ కొండపాటి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, హన్సిక కలిసి నటించిన జయీభవ ప్రేక్షకులను నిరాశపరిచింది

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించారు. మల్లికార్జున్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, శ్యామ్, సనాఖాన్, శరణ్య కలిసి నటించిన చిత్రం కళ్యాణ్ రామ్ కత్తి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది.

మరికొన్ని చిత్రాలు

సునీల్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా కళ్యాణ్ రామ్, నికీషా పటేల్, కృతి కర్బందా కలిసి నటించిన చిత్రం ఓం 3డి. ఈ చిత్రాన్ని 3డి ఫార్మాట్లో 5కే రెసొల్యూషన్ లో రూపొందించడం విశేషం. ఈ చిత్రానికి అచ్చు రాజమణి, సాయి కార్తీక్ సంగీతం అందించగా ఈ చిత్రం నిరాశపరిచింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో కళ్యాణ్ రామ్, శృతి సోధి, సాయికుమార్ కలిసి నటించిన పటాస్ చిత్రం ఘన విజయం సాధించింది. ఏసిపి కళ్యాణ్ సిన్హా పాత్రలో కళ్యాణ్ రామ్ మరియు తండ్రిగా డిజిపి పాత్రలో సాయికుమార్ నటించి ప్రేక్షకులను అలరించారు. దర్శకుడిగా అనిల్ రావిపూడి ఇది తోలి చిత్రం.

ఒక లంచగొండి పోలీస్ ఆఫీసర్ నుంచి మంచి పోలీస్ అధికారిగా ఎలా మారిపోయాడు అనేది ఈ చిత్ర నేపధ్యం. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించగా, నందమూరి బాలకృష్ణ, విజాశాంతి నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రంలోని అరెవో సాంబ పాటను పటాస్ చిత్రంలో రీమిక్స్ చేయడం విశేషం.

ఏ. మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మాణంలో కళ్యాణ్ రామ్, సోనాలి చౌహన్ కలిసి నటించిన చిత్రం షేర్. ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో కళ్యాణ్ రామ్, అదితి ఆర్య, జగపతిబాబు కలిసి నటించిన చిత్రం ఇజం. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది.

ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన చిత్రం ఎంఎల్ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి). రవికిషన్ ప్రత్యకే పాత్రలో నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది. జయేంద్ర పంచపకేశన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, తమన్నా కలిసి నటించిన నా నువ్వే చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఎన్టీఆర్ బయోపిక్

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ఎన్టీఆర్: కధానాయకుడు మరియు ఎన్టీఆర్: మహానాయకుడు. ప్రముఖ నటులు “విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ” నందమూరి తారక రామారావు జీవిత ఆధారంగా తీసిన ఈ రెండు చిత్రాలు 2019 సంవత్సరంలో విడుదలయాయ్యి. ఎన్. బి. కే. ఫిలిమ్స్, వారాహి చలన చిత్రం మరియు విబ్రి మీడియా నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు వర్ధన్ ఇందూరి కలిసి నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఈ చిత్రంలో నందమూరి తారకర రామారావు పాత్రను నందమూరి బాలకృష్ణ పోషించడం జరిగింది. నందమూరి హరికృష్ణ పాత్రను అయన తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్ పోషించడం విశేషం. నందమూరి తారక రామారావు సినీ ప్రయాణం, రాజకీయ ప్రయాణం మీద తీసిన ఈ చిత్రంలో హిందీ నటి విద్య బాలన్ మొదటిసారి తెలుగులో నటించారు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.

కె. వి. గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్ కలిసి నటించిన 118 చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ ఎస్. కోనేరు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో సుభాష్ గుప్త, ఉమేష్ గుప్త నిర్మాణంలో కళ్యాణ్ రామ్, మెహ్రీన్ పిర్జాద కలిసి నటించిన చిత్రం ఎంత మంచివాడవురా.

ఈ చిత్రంలో నరేష్, సుహాసిని, శరత్ బాబు, విజయ్ కుమార్, బాలాదిత్యతో పాటు మరి కొంతమంది భారీ తారాగణంతో రూపొందించిన ఈ చిత్రం నిరాశపరిచింది మరియు ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.

మరికొన్ని చిత్రాలు

మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం బింబిసారా. సంయుక్త మీనన్, క్యాథెరిన్ థెరిస్సా, కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఒక కల్పిత కధ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు త్రికర్త సామ్రాజ్యం అధినేత బింబిసార రాజు పాత్రలో మరియు అతని సోదరుడు దేవదత్త పాత్రల్లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు.

చిన్నా, పెద్ద అంటూ తేడా లేకుండా అందర్నీ హింసించే రాజు కి ఒక అద్దం బహుమానం రావడం, సోదరుడితో గొడవపడుతూ ఆ అద్దంలోకి అనుకోకుండా ప్రవేశించడం, ఆ రాజ్యం నుంచి కొన్ని మైళ్లుదాటి వర్తమాన కాలం హైదరాబాద్ కి రావడం, ఇక్కడ ఆ రాజుకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి లాంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

బింబిసారా రాజుకి మంత్రి గా ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి పోషించడం జరిగింది మరియు తను కూడా అనుకోకుండా అద్దంలోకి ప్రవేశించి ఆ రాజుని వెతుకుతూ పడే ఇబ్బందులు నవ్వులు తెప్పిస్తాయి, చివరికి రాజుని ఎలా గుర్తించాడు అనేది చిత్ర కధ. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.

2022 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. బింబిసారా చిత్రంలో నేపధ్య గాయకులూ మోహన భోగరాజు, శాండిల్య పీసపాటి కలిసి పాడిన “నీతో ఉంటె చాలు” ప్రేక్షకాదరణ పొందింది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ కలిసి నటించిన చిత్రం అమిగోస్.

2023 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషించడం విశేషం. బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు. అభిషేక్ నామ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్ కలిసి నటించిన డెవిల్ చిత్రం పరవాలేదనిపించింది.

భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగిన ఒక సంఘటన ఆధారణగా రూపొందించిన చిత్రం డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ స్సంగీతం అందించారు. నందమూరి కళ్యాణ్ రామ్ తన చిత్రాలనే నిర్మించడం కాకుండా తను నటించని చిత్రాలని కూడా నిర్మించారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన కిక్ 2, కె. ఎస్. రవీంద్ర దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో రాశిఖన్నా, నివేద థామస్ కలిసి నటించిన జై లవ కుశ, కొరటాల శివ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన దేవర: పార్ట్ 1 చిత్రాలని నిర్మించారు.

వ్యక్తిగతం

1978 సంవత్సరం 5 జులైన హైదరాబాద్ నగరంలో నందమూరి హరికృష్ణ, లక్ష్మి దంపతులకు జన్మించారు. తనకు జానకిరామ్, తారకరామ్ అనే సోదరులు మరియు సోదరి సుహాసిని ఉన్నారు. కళ్యాణ్ రామ్ చదువంతా హైదరాబాద్, విజయవాడ, కోయంబతూర్ మరియు చికాగో నగరాల్లో చదువుకున్నారు.

2006 సంవత్సరంలో స్వాతి అనే యువతిని పెళ్లిచేసుకున్నారు కళ్యాణ్ రామ్ మరియు వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె. కళ్యాణ్ రామ్ కి ప్రముఖ నటులు నందమూరి తారక రామారావు తాతయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మేనమామ మరియు నారా లోకేష్ బావ వరస అవుతారు.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం.
బాలనటుడిగా:
  1. బాలగోపాలుడు
కధానాయకుడిగా:
  1. తొలిచూపులోనే
  2. అభిమన్యు
  3. అతనొక్కడే
  4. అసాధ్యుడు
  5. లక్ష్మి కళ్యాణం
  6. విజయదశమి
  7. హరే రామ్
  8. జయీభవ
  9. కళ్యాణ్ రామ్ కత్తి
  10. ఓం 3d
  11. పటాస్
  12. షేర్
  13. ఇజం
  14. ఎం.ఎల్.ఏ
  15. నా నువ్వే
  16. ఎన్.టి.ఆర్ కధానాయకుడు
  17. ఎన్.టి.ఆర్ మహానాయకుడు
  18. 118
  19. ఎంతమంచివాడవుర
  20. బింబిసార
  21. అమిగోస్
  22. డెవిల్

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *