Megastar Chiranjeevi Movies List

Chiranjeevi
Chiranjeevi

నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి ఉద్ధండులు దూకుడు మీద సినిమాలు చేస్తు విజయాలు సాధిస్తున్న రోజులు మరోవైపు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి పాత్రను వైవిధ్యంగా పోషిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న మోహన్ బాబు చిత్రాలు, కన్నడ సినిమాలో విజయాలు అందుకుని తెలుగు సినిమాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తెలుగులో సినిమాలు చేస్తున్న సుమన్, భానుచందర్, అర్జున్.

అప్పుడే సినీ పరిశ్రమలోకి అడుగులు వేస్తూ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, వీరితో పాటు ఐదుగురు వారసులు సినీ పరిశ్రమలోకి దూసుకొచ్చి సినిమా తరువాత సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వారి అభిమానాన్ని సంపాదిస్తున్నారు, వారు ఎవరంటే నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున, నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేష్, దర్శక నిర్మాత వి. బి. రాజేంద్ర ప్రసాద్ తనయుడు జగపతిబాబు మరియు నటి విజయ నిర్మల తనయుడు నరేష్.

ఇంతమంది నటుల మధ్య ఒక వ్యక్తి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ నటులతో పోటీ పడి కొన్ని సంవత్సరాలపాటు అగ్ర కధానాయకుడిగా ఉంటూ మరి కొంతమంది కొత్త నటులకు ఆదర్శంగా ఉంటూ ఎవరికీ అందని విజయాలు సాధించిన మెగాస్టార్ చిరంజీవి గురించి తెల్సుకుందాం.

బాక్గ్రౌండ్ లేకుండా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకుని ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు చేస్తూ సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు చిరంజీవి. మరి చిరంజీవి నటించిన చిత్రాలు వాటి విశేషాలు తెలుసుకుందాం.

సినీ ప్రస్థానం

కె. వాసు దర్శకత్వంలో రావు గోపాల రావు, జయసుధ, చంద్రమోహన్ కలిసి నటించిన చిత్రం ప్రాణం ఖరీదు, ఈ చిత్రంతో చిరంజీవి, కోట శ్రీనివాసరావు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. 1978 సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైంది. బాపు దర్శకత్వంలో జయకృష్ణ నిర్మాణంలో కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి కలిసి నటించిన చిత్రం మనవూరి పాండవులు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

ఈరంకి శర్మ దర్శకత్వంలో చిరంజీవి, మాధవి కలిసి నటించిన కుక్క కాటుకు చెప్పుదెబ్బ, పి. సాంబశివరావు దర్శకత్వంలో కృష్ణ, మోహన్ బాబు, జయప్రద, చిరంజీవి కలిసి నటించిన కొత్తల్లుడు చిత్రంలో నటించి అలరించారు చిరంజీవి. వాయు నందనరావు దర్శకత్వంలో చిరంజీవి, సువర్ణ కలిసి నటించిన ఐ లవ్ యు విజయం సాధించగా ఆ తరువాత వచ్చిన చిత్రం పునాదిరాళ్ళు విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి దర్శకులు గుడిపాటి రాజ్ కుమార్.

తమిళ దర్శకులు కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హస్సన్, జయసుధ,చిరంజీవి కలిసి నటించిన ఇది కధ కాదు, ఐ.ఎన్. మూర్తి దర్శకత్వంలో మోహన్ బాబు, చిరంజీవి, గీత కలిసి నటించిన శ్రీ రామబంటు, కె. వాసు దర్శకత్వంలో చిరంజీవి, మాధవి, కలిసి నటించిన కోతలరాయుడు చిత్రాలు విజయాన్ని అందించాయి.

1980 సంవత్సరంలో వచ్చిన చిత్రాలు

చిరంజీవి, కవిత, సుహాసిని కలిసి నటించిన అగ్నిసంస్కారం, కృష్ణ, జయప్రద, చిరంజీవి కలిసి నటించిన కొత్తపేట రౌడీ, శోభన్ బాబు, జయప్రద, చిరంజీవి కలిసి నటించిన చండీప్రియ, చిరంజీవి, కవిత నటించిన ఆరనిమంటలు, ధవళ సత్యం దర్శకత్వం లో చిరంజీవి నటించిన జాతర, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, శ్రీదేవి, చిరంజీవి కలిసి నటించిన చిత్రం మోసగాడు, ఈ చిత్రం విజయాన్ని అందించింది.

రాజశేఖర్ దర్శకత్వంలో నరసింహరాజు, చిరంజీవి, రతి అగ్నిహోత్రి, మేనక కలిసి నటించిన పున్నమినాగు, ఎస్. డి. లాల్ దర్శకత్వంలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించిన నకిలీ మనిషి, ఐ. వి. శశి దర్శకత్వంలో వచ్చిన కాళీ, బి. వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తాతయ్య ప్రేమలీలలు, ఓ ఎస్ ఆర్ ఆంజనేయులు దర్శకత్వంలో వచ్చిన లవ్ ఇన్ సింగపూర్ చిత్రాలతో అలరించారు చిరంజీవి.

కృష్ణంరాజు, సావిత్రి, జయసుధ, చిరంజీవి, సుజాత కలిసి నటించిన చిత్రం ప్రేమ తరంగాలు, కోట సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన మొగుడు కావాలి, అల్లూరి రవి దర్శకత్వంలో వచ్చిన రక్తబంధం చిత్రాలు విడుదలై అలరించాయి.

1981 – 1985 సంవత్సరంలో వచ్చిన చిత్రాలు

ఎం . ఎస్ . కోటిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పార్వతి పరమేశ్వరులు, కె. వాసు దర్శకత్వంలో కృష్ణ, చిరంజీవి, మధు మాలిని, గీత కలిసి నటించిన తోడు దొంగలు, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, రతి అగ్నిహోత్రి, చిరంజీవి కలిసి నటించిన తిరుగులేనిమనిషి చిత్రాలతో అలరించారు చిరంజీవి.

ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మాణంలో చిరంజీవి, రాధికా, శారదా కలిసి నటించిన న్యాయం కావాలి చిత్రం విడుదలై ఘానా విజయం సాధించింది. ఎం. బాలయ్య దర్శకత్వంలో చిరంజీవి, సుధాకర్, మాధవి, కవిత కలిసి నటించిన ఊరికిచ్చినమాట, చిరంజీవి శ్రీదేవి కలిసి నటించిన రాణికాసుల రంగమ్మ, కె. బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి, జయప్రద నటించిన తమిళ చిత్రం 47 నాట్కళ్, చిరంజీవి, సరితా నటించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రాలు అలరించాయి.

చంద్రమోహన్, చిరంజీవి, రాధికా, స్వప్న కలిసి నటించిన ప్రియా, చిరంజీవి, మాధవి, లక్ష్మి కలిసి నటించిన చట్టానికి కళ్ళు లేవు, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, రాధికా, శారదా కలిసి నటించిన న్యాయం కావాలి, మరియు మోహన్ బాబు, చిరంజీవి, రాధికా కలిసి నటించిన కిరాయి రౌడీలు చిత్రాలతో అలరించారు చిరంజీవి.

భారీ విజయాలు

కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, మాధవి కలిసి నటించిన చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య. భార్య భర్తల మధ్య జరిగే గొడవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్తరం భారీ విజయాన్ని అందుకుంది మరియు ఈ చిత్రం తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేయడం జరిగింది.

కె. విశ్వనాధ్ దర్శకత్వంలో చిరంజీవి, సుమలత కలిసి నటించిన చిత్రం శుభలేఖ, అల్లు అరవింద్, వి. వి. శాస్ట్రీ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. చిరంజీవి నటనకి మరియు దర్శకులు కే. విశ్వనాధ్ దర్శకత్వానికి పురస్కారాలు లభించాయి. డి. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో చిరంజీవి, రాధికా కలిసి నటించిన ఇది పెళ్లంటారా, ఈరంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన సీతాదేవి, బరిశెట్టి భాస్కర్ రావు దర్శకత్వంలో వచ్చిన రాధా మై డార్లింగ్ ప్రేక్షకులను అలరించాయి.

చిరంజీవి, గీత నటించిన టింగురంగాడు మరియు మోహన్ బాబు, చిరంజీవి, రాధికా, గీత కలిసి నటించిన పట్నం వచ్చిన పతివ్రతలు ఒకే రోజు విడుదలై విజయాలు సాధించాయి, ముఖ్యంగా పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రం భారీ విజయం సాధించాయి. పట్నం వెళ్లి పని వెతుక్కోవాలి అనుకునే రాధికా, గీత కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ఆ సమస్యల నుంచి ఎలా బయట పడ్డారు అనేది కధ. ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

కె.ఎస్. ఆర్. దాస్ దర్శకత్వంలో చిరంజీవి, మోహన్ బాబు, రాధికా కలిసి నటించిన చిత్రం బిల్లా రంగా పరవాలేదనిపించిన ఆ తరువాత రాజ్ భారత్ దర్శకత్వంలో చిరంజీవి, రాధికా, శరత్ బాబు కలిసి నటించిన యమకింకరుడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

రాజా చంద్ర దర్శకత్వంలో చిరంజీవి, రాధిక కలిసి నటించిన మొండిఘటం, నూతన దర్శకులు వంశీ దర్శకత్వంలో చిరంజీవి సుహాసిని, రాజేంద్ర ప్రసాద్, నారాయణరావు, సాయి చాంద్ కలిసి నటించిన మంచుపల్లకి చిత్రాలతో అలరించారు. హెచ్. ఆర్. భార్గవ దర్శకత్వంలో శోభన్ బాబు, లక్ష్మి, చిరంజీవి, రంగనాథ్ కలిసి నటించిన చిత్రం బంధాలు అనుబంధాలు, ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.

వరుస చిత్రాలు

ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, రాధికా, కవిత కలిసి నటించిన ప్రేమ పిచ్చోళ్ళు, చిరంజీవి, రాధికా కలిసి నటించిన పల్లెటూరి మొనగాడు చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, రాధికా కలిసి నటించిన చిత్రం అభిలాష. ఈ చిత్రంలో న్యాయవాది పాత్రలో నటించారు చిరంజీవి మరియు నేరం చేసిన ముద్దాయికి శిక్ష పడాలి కానీ ఉరి శిక్ష పడొద్దు, ఉరి శిక్ష రద్దు చేయాలి అనే భావాలూ కలిగి ఉండే న్యాయవాది పాత్రలో కనిపిస్తారు చిరంజీవి.

ఈ చిత్రంలో చిరంజీవి నటన అద్భుతం అని చెప్పొచ్చు అలాగే ఇళయరాజా అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. “బంతి చామంతి”, “నవ్వింది మల్లె చండు”, “సందె పొద్దు కాడ” పాటలు ఇప్పటికి ప్రేక్షకులు వింటూనే ఉంటారు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆలయశిఖరం చిత్రంలో నటించారు చిరంజీవి, సుమలత. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, రాధికా కలిసి నటించిన చిత్రం శివుడు శివుడు శివుడు నిరాశపరిచింది. కృష్ణంరాజు, చిరంజీవి, జయప్రద, రాధికా కలిసి నటించిన పులి బెబ్బులి, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన గూఢచారి No 1 చిత్రాలు అలరించాయి.

విజయ్ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, సుహాసిని కలిసి నటించిన చిత్రం మగమహారాజు. ఉద్యోగం కోసం ఎదురు చూసే చిరంజీవికి వరుసగా 8 రోజులు కిందకి దిగకుండా పగలు రాత్రి సైకిల్ తొక్కాలని షరతు పెడతారు సుహాసిని తండ్రి పాత్ర రావు గోపాల్ రావు, ఆలా చేస్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని షరతు పెడతారు.

ఆ తరువాత ఎం జరిగింది అనేది సినిమా మగమహారాజు చిత్రం చూసి తెలుసుకోవాలి మరియు ఈ చిత్రం ఘన విజయం సాధించింది అంతే కాకుండా చిరంజీవి నటనకి ప్రేక్షకులు ప్రశంసించారు. చిరంజీవి, మాధవి కలిసి నటించిన రోషగాడు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, మాధవి, రాధికా కలిసి నటించిన సింహపురి సింహం ప్రేక్షకులను అలరించాయి.

మలుపు తిప్పిన చిత్రం

ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, మాధవి కలిసి నటించిన చిత్రం ఖైదీ. కె. ధనుంజయరెడ్డి, కె. నరసారెడ్డి, ఎస్. సుధాకర్ రెడ్డి కలిసి నిర్మించిన ఖైదీ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ విజయంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూడని విధంగా విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. ఖైదీ చిత్రంలో చిరంజీవి నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ చిత్ర విజయంతో అగ్ర కధానాయకుల జాబితాలో చేరిపోయారు చిరంజీవి.

ఖైదీ చిత్రాన్ని హిందీ కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేయడం విశేషం. కె. చక్రవర్తి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. బాపు దర్శకత్వంలో చిరంజీవి, పూర్ణిమ కలిసి నటించిన మంత్రిగారి వియ్యంకుడు ఘన విజయం సాధించింది. కె. మురళి మోహన్ రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడెక్షన్స్ నిర్మాణంలో దగ్గుబాటి రామానాయుడు నిర్మాతగా చిరంజీవి, విజయశాంతి, నళిని కలిసి నటించిన సంఘర్షణ చిత్రం భారీ విజయం సాధించింది.

1984 సంవత్సరంలో వచ్చిన చిత్రాలు

కె. వాసు దర్శకత్వంలో చిరంజీవి, చంద్రమోహన్, సులక్షణ, గీత కలిసి నటించిన అల్లుళ్ళు వస్తున్నారు ఆ తరువాత ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి రాధా కలిసి నటించిన గూండా చిత్రం భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్రంలో చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి డాన్ గా ఎదిగి ఆ తరువాత మంచి మనిషిగ మారే పాత్రలో చిరంజీవి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

విజయ్ బాపినీడు దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన హీరో చిత్రంలో చిరంజీవి, రాధికా నటించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. చిరంజీవి, విజయ శాంతి కలిసి నటించిన దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించాయి.

ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన ఛాలెంజ్ చిత్రం భారీ విజయం సాధించింది. ఇళయరాజా అందించిన సంగీతం ప్రేక్షకులను ఇప్పటికి అలరించడం విశేషం. ఉద్యోగం ప్రకటన చూసి వ్యాపారవేత్త దెగ్గరికి ఇంటర్వ్యూ కి వెళ్లారు చిరంజీవి అక్కడ రావు గోపాల్ రావు తనను అవమానించడం జరుగుతుంది.

అవమానం తట్టుకోలేక ఐదేళ్లలో 50 లక్షలు సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తారు చిరంజీవి, అందుకు రావు గోపాల్ రావు ఒక వేళ నువ్వు గెలిస్తే నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటారు ఆ తరువాత కధ ఆసక్తిగా ఉంటుంది. ఈ చిత్రంలో చిరంజీవి నటన అద్భుతం అని చెప్పొచ్చు.

చిరంజీవి, నళిని, సుహాసిని కలిసి నటించిన చిత్రం ఇంటిగుట్టు, చిరంజీవి రాధా కలిసి నటించిన నాగు, చిరంజీవి, సుమలత కలిసి నటించిన అగ్నిగుండం చిత్రాలు అలరించాయి. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, ఊర్వశి కలిసి నటించిన చిత్రం రుస్తుం, ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

1985 సంవత్సరంలో వచ్చిన చిత్రాలు

చిరంజీవి, మాధవి, సుమలత, కలిసి నటించిన చిత్రం చట్టంతోపోరాటం విజయం సాధించగా ఆ తరువాత ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, రాధా కలిసి నటించిన దొంగ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు ఈ చిత్రంలో నటించిన నటి నటులకు ప్రశంసించడం జరిగింది. చక్రవర్తి అందించినగా సంగీతం ప్రేక్షకులను అలరించింది మరియు ఈ చిత్రంలో “గోలీమార్” పాత ప్రేక్షకులను ఇప్పటికి అలరించడం విశేషం.

సి. వి. రాజేంద్రన్ దర్శకత్వంలో చిరంజీవి, భానుప్రియ, విజయశాంతి కలిసి నటించిన చిత్రం చిరంజీవి, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో వచ్చిన చిత్రం జ్వాలా, రాధికా, భాను ప్రియా కలిసి నటించిన ఈ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రంలో కన్నడ ప్రభాకర్ ప్రతినాయకుడిగా నటించగా ఇళయరాజా సంగీతం అందించారు.

చిరంజీవి, రాధ కలిసి నటించిన పులి చిత్రం నిరాశపరచగా, రక్త సింధూరం చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి ఏ. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, రాధ కలిసి నటించిన అడవిదొంగ చిత్రం భారీ విజయం సాధించింది.

ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, భానుప్రియ కలిసి నటించిన విజేత చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు పురస్కారాలు తీసుకొచ్చింది. ఫుట్ బాల్ క్రీడాకారుడిగా చిరంజీవి నటించడం జరిగింది మరియు చెల్లి పెళ్లి కోసం తన తండ్రి డబ్బులు సహాయం చూస్తుంటే కిడ్నీ అమ్మి డబ్బులిచ్చి పెళ్లి జరిపిస్తారు. ఈ చిత్రంలో చిరంజీవి నటన అద్భుతం అని చెప్పాలి మరియు తన పాత్రకి ప్రేక్షకులు ప్రశంసించడం జరిగింది.

1986 – 1987 సంవత్సరంలో వచ్చిన చిత్రాలు

ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, సుహాసిని కలిసి నటించిన కిరాతకుడు అలరించగా, ఆ తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన కొండవీటి రాజా విజయం సాధించింది.చిరంజీవి, జయసుధ నటించిన మగధీరుడు పరవాలేదనిపించిన ఆ తరువాత వచ్చిన వేట చిత్రం భారీ పరాజయం చూసింది. ఈ చిత్రంలో చిరంజీవి, జయప్రద నటించారు.

జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి, సుహాసిని కలిసి నటించిన హాస్య చిత్రం చంటబ్బాయి నిరాశపరిచింది. ఈ చిత్రం చిరంజీవి హాస్య కధానాయకుడిగా డిటెక్టివ్ పాత్రలో నటించి అలరించారు. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, సుహాసిని, రాధ కలిసి నటించిన రాక్షసుడు చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంతో వెండితెరకి పరిచయం అయ్యారు చిరంజీవి సోదరుడు నాగబాబు.

చిరంజీవి, విజయశాంతి, సితార కలిసి నటించిన చిత్రం ధైర్యవంతుడు అలరించగా, ఆ తరువాత చిరంజీవి, విజయశాంతి కలయికలో వచ్చిన చాణిక్య శపథం నిరాశపరిచింది. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో మాధవి, రాధికా, భానుప్రియ కలిసి నటించిన చిత్రం దొంగ మొగుడు ప్రేక్షకులను అలరించింది. ఒక పాత్ర వ్యాపారవేత్తగా మరో పాత్ర దొంగగా నటించి మెప్పించారు చిరంజీవి.

భారతీరాజా దర్శకత్వంలో చిరంజీవి, రాజా శేఖర్, సుహాసిని, రాధికా కలిసి నటించిన ఆరాధన చిత్రం నిరాశపరిచింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి, మోహన్ బాబు, రమ్య కృష్ణ, భానుప్రియ కలిసి నటించిన చక్రవర్తి విజయాన్ని అందించగా ఆ తరువాత చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన చిత్రం పసివాడిప్రాణం. ఈ చిత్రంలో రఘువరన్ ప్రతినాయకుడి పాత్ర పోషించగా బేబీ సుజిత ముఖ్య పాత్ర పోషించడం జరిగింది మరియు ఈ చిత్రం భారీ విజయాన్ని అందించింది.

కె. విశ్వనాధ్ దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి, సుమలత, చరణ్ రాజ్ కలిసి నటించిన స్వయంకృషి చిత్రం ఘన విజయం సాధించింది. చెప్పులు కొట్టుకునే వ్యక్తి కృషి, పట్టుదలతో కోటీశ్వరుడు ఎలా అయ్యాడో అని చూపించే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం రష్యా భాషలో విడుదలై సంచలనం సృష్టించింది మరియు ఎన్నో పురస్కారాలు వచ్చాయి. చిరంజీవి, భానుప్రియ, రాధా నటించిన జేబుదొంగ నిరాశపరిచింది.

1988 – 1990 సంవత్సరంలో వచ్చిన చిత్రాలు

చిరంజీవి, విజయశాంతి, సుహాసిని కలిసి నటించిన మంచిదొంగ చిత్రం పరవాలేదనిపించగ ఆ తరువాత వచ్చిన రుద్రవీణ ప్రేక్షకులను నిరాశపరిచింది. చిరంజీవి, శోభన కలిసి నటించిన ఈ చిత్రానికి కె. బాలచందర్ దర్శకత్వం వహించారు మరియు ఈ చిత్రంలో జెమినీ గణేశన్ ప్రత్యేక పాత్రలో నటించారు. కులం, మతం నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రాన్ని చిరంజీవి సోదరుడు నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించారు. రుద్రవీణ చిత్రం అపజయం పాలైన ఎన్నో పురస్కారాలు లభించాయి.

చిరంజీవి, రాధ, విజయశాంతి కలిసి నటించిన చిత్రం యముడికి మొగుడు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. యమధర్మరాజు మరియు మానవుడి మధ్య జరిగే సరదా సన్నివేశాలతో తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరంజీవి, భానుప్రియ, మోహన్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఖైదీ No. 786 చిత్రం విజయాన్ని అందుకుంది.

ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, రాధ, సుహాసిని కలిసి నటించిన మరణమృదంగం విజయం సాధించింది. భానుప్రియతో కలిసి త్రినేత్రుడు, విజయశాంతితో కలిసి యుద్ధభూమి చిత్రాలలో నటించారు చిరంజీవి. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి, వాణిశ్రీ కలిసి నటించిన చిత్రం అత్తకి యముడు అమ్మాయికి మొగుడు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది మరియు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, బాంగ్లాదేశ్ భాషల్లో రీమేక్ చేయడం విశేషం.

మరికొన్ని చిత్రాలు

బి. గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి, రాధ, భానుప్రియ కలిసి నటించిన స్టేట్ రౌడీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. బాలీవుడ్ సంగీత దర్శకులు బప్పీలహరి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది మరియు అన్ని పాటలు ప్రజాదరణ పొందడం విశేషం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రుద్రనేత్ర విజయం సాధించగా ఆ తరువాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు పరవాలేదనిపించింది.

చిరంజీవి, రాధ, విజయశాంతి కలిసి నటించిన కొండవీటి దొంగ చిత్రం భారీ విజయం సాధించింది. కె, రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. సోషియో ఫాంటసీ నేపధ్యం మీద తీసిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇంద్రలోకం నుంచి తన చెలికార్తెలతో భూలోకం మీదకి వచ్చి తన ఉంగరాన్ని పోగొట్టుకుని తిరిగి వెళ్లలేక ఎలా ఇబ్బంది పడింది చివరికి ఆ ఉంగరం ఎక్కడ దొరికింది అనే కధ తో తీసిన చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.

ఈ చిత్రంలో ఇళయరాజా అందించిన సంగీతంతో పాటు ఈ చిత్రంలో అన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి మరియు ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించాయి. కె. మురళి మోహరరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం కొదమసింహం, సోనమ్, రాధ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు హిందీ నటులు ప్రాణ్ నటించారు. కొదమసింహం చిత్రం విజయం సాధించడంతో పాటు చిరంజీవి నటన ప్రేక్షకులను అలరించింది. చిరంజీవి, అమల, రాధికా కలిసి నాటికిఞ్హిన రాజా విక్రమార్క ప్రేక్షకులను నిరాశపరిచింది.

1991 – 2000 సంవత్సరం మధ్యలో వచ్చిన చిత్రాలు

చిరంజీవి, విజయశాంతి, నిరోషా కలిసి నటించిన స్టువార్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం నిరాశపరిచింది. చిరంజీవి, విజయశాంతి, మురళీమోహన్ కలిసి నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. స్నేహితులతో అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరితో గొడవపడుతూ బామ్మాతో తిట్లు తింటూ ఉండే ఒక కుర్రాడు తన అన్న చదువు కోసం చేయని నేరాన్ని మీద వేసుకుని జైలుకి వెళ్లడం జరుగుతుంది ఆ తరువాత ఎలాంటి పరానిమాలు ఎదురయ్యాయి ఈ చిత్రం చూడొచ్చు.

గ్యాంగ్ లీడర్ చిత్రంలో చిరంజీవి నటన అద్భుతం అని చెప్పొచ్చు మరియు ఈ చిత్రంలో కొన్ని సంభాషణలు అభిమానులని అలరించాయి. “చేయి చూడు ఎంత రఫ్ గా ఉందొ రఫ్ ఆడిస్తా” అనే డైలాగ్ ఇప్పటికి ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. బప్పీలహరి అందించిన సంగీతం భారీ విజయం సాధించింది మరియు ఈ చిత్రంలో అన్ని పాటలు జనాదరణ పొందడం విశేషం.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శోభన, దివ్యభారతి కలిసి నటించిన చిత్రం రౌడీ అల్లుడు మరియు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించారు చిరంజీవి. ఆటో జానీ గా, పారిశ్రామకవేత్త కళ్యాణ్ గా నటించి అందర్నీ అలరించారు చిరంజీవి. ఈ చిత్రానికి బప్పి లహరి సంగీతం అందించారు.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, నగ్మా, వాణి విశ్వనాధ్ కలిసి నటించిన ఘరానా మొగుడు చిత్రం భారీ విజయం సాధించింది. ఎం. ఎం. కీరవాణి అందించిన సంగీతం ప్రేక్షకులు అలరించింది. కె. విశ్వనాధ్ దర్శకత్వంలో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి కలిసి నటించిన ఆపద్భాందవుడు చిత్రం నిరాశపరచగా చిరంజీవి నటనకి ప్రశంసలు అందాయి మరియు ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం.

మరికొన్ని చిత్రాలు

చిరంజీవి, రోజా, మీనా కలిసి నటించిన ముఠామేస్త్రి విజయం సాధించగా ఆ తరువాత అక్కినేని నాగేశ్వర్రావు, చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన మెకానిక్ అల్లుడు నిరాశపరిచింది. శ్రీదేవితో కలిసి ఎస్. పి. పరుశురాం, రమ్యకృష్ణ, రంభ తో కలిసి అల్లుడా మజాకా, రోజా తో కలిసి బిగ్ బాస్, జయసుధ, సౌందర్య, నగ్మా తో కలిసి నటించిన రిక్షావోడు చిత్రాలతో అలరించారు చిరంజీవి.

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి, రాజేంద్రప్రసాద్, రంభ కలిసి నటించిన హిట్లర్ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి తండ్రి గా “దర్శకరత్న” దాసరి నారాయణరావు నటించడం విశేషం. ఐదుగురు చెల్లెళ్లకి అన్నయ్యగా వాళ్ళ బాగోగులు చూస్తూ ఉండే అన్నయ్య పాత్రలో నటించారు. కోటి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరిచింది.

సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, సాక్షి శివానంద, రోషిని నటించిన మాస్టర్ చిత్రం విజయం సాధించింది మరియు ఈ చిత్రంలో చిరంజీవి “తమ్ముడు అరె తమ్ముడు” పాట పడటం జరిగింది. చిరంజీవి, రంభ, రచన కలిసి నటించిన బావగారు బాగున్నారా చిత్రం విజయం సాధించగా ఆ తరువాత సౌందర్య, అంజలి ఝవేరి తో కలిసి చిరంజీవి నటించిన చూడాలనివుంది చిత్రం భారీ విజయం సాధించింది.

చిరంజీవి ద్విపాత్రాభినయంలో విజయకుమార్, మీనా నటించిన స్నేహంకోసం, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, సురేష్, రమ్యకృష్ణ, సాక్షివానంద్ కలిసి నటించిన ఇద్దరు మిత్రులు విజయం సాధించాయి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ, వెంకట్, సౌందర్య, షీశ్వ, చాందిని కలిసి నటించిన అన్నయ్య ఘన విజయం సాధించాయి.

2001 – 2007 సంవత్సరాల మాద్య వచ్చిన చిత్రాలు

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మృగరాజు చిత్రం నిరాశపరచగా ఆ తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషలో చిత్రీకరించిన శ్రీ మంజునాథ చిత్రంలో చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా కలిసి నటించగా ఈ చిత్రం విజయం సాధిచింది మరియు ఈ చిత్రంలో శివుడి వేషం ధరించి అలరించారు చిరంజీవి. ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డాడీ చిత్రం పరవాలేదనిపించగా ఆ తరువాత వచ్చిన ఇంద్ర చిత్రం భారీ విజయం సాధించింది. చిరంజీవి, ఆర్తి అగర్వాల్, సోనాలి బెంద్రే కలిసి నటించిన ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వం వహించగా అశ్వినీదత్ నిర్మించారు. ఫ్యాక్షన్ నేపధ్యం లో రూపొందించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

చిరంజీవి నటించారు అనడంకంటే జీవించారు అని చెప్పొచ్చు మరియు మొదటి సారి ఫ్యాక్షన్ నేపధ్యం చిత్రంలో నటించారు చిరంజీవి. ఈ చిత్రంలోని సంభాషణలు తూటాల్లా పేలాయి అని చెప్పుకోవచ్చు. “మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్త” లాంటి డైలాగులు ఇప్పటికి ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు.

వి. వి. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి, శ్రియ శరన్, జ్యోతిక కలిసి నటించిన చిత్రం ఠాగూర్, ఈ చిత్రం ఘన విజయం సాధించింది. చిరంజీవి, నమ్రత శిరోద్కర్ కలిసి నటించిన భారీ చిత్రం అంజి నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన శంకర్ దాదా MBBS చిత్రం భారీ విజయం సాధించింది. చిరంజీవి, శ్రీకాంత్, సోనాలి బెంద్రే కలిసి నటించిన ఈ చిత్రం హిందీ లో వచ్చిన మున్నాభాయ్ MBBS చిత్రానికి రీమేక్. దేవిశ్రీ అందించిన సంగీతం ఉర్రుతలూగించింది.

చిరంజీవి ద్విపాత్రాభినయంలో వచ్చిన అందరివాడు నిరాశపరచగా ఆ తరువాత చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక చావ్లా కలిసి నటించిన జై చిరంజీవ పరవాలేదనిపించింది. తమిళ దర్శకులు మురుగుదాస్ దర్శకత్వంలో చిరంజీవి, ఖుష్బూ, త్రిష కలిసి నటించిన స్టాలిన్, ప్రభుదవా దర్శకత్వంలో చిరంజీవి, శ్రీకాంత్, కరిష్మా కోటక్ నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలు పరవాలేదనిపించాయి.

2017 సంవత్సరం నుంచి వచ్చిన చిత్రాలు

తమిళ్ భాషలో విజయం సాధించిన కత్తి చిత్రాన్ని తెలుగులో ఖైదీ No 150 పేరు తో రీమేక్ చేయడం జరిగింది. చిరంజీవి, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన ఈ చిత్రానికి వి. వి. వినాయక్ దర్శకత్వం వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత ఆధారంగా రూపొందించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయసేతుపతి, రవికిషన్, నయనతార, తమన్నా భాటియా కలిసి నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రాంచరణ్, పూజ హెగ్డే కలిసి నటించిన ఆచార్య, చిరంజీవి, సత్యదేవ్, నయనతార, కలిసి నటించిన మలయాళం చిత్ర రీమేక్ గాడ్ ఫాదర్ నిరాశపరిచాయి. కె. ఎస్. బాబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ, శృతి హస్సన్, క్యాథెరిన్ థెరిస్సా కలిసి నటించిన వాల్తేర్ వీరయ్య చిత్రం భారీ విజయం సాధించింది. మెహెర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా, సుశాంత్, కీర్తి సురేష్ కలిసి నటించిన భోళా శంకర్ ప్రేక్షకులను నిరాశపరిచింది.

మరికొన్ని విశేషాలు

ప్రతిబంద్ చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మొత్తం మూడు చిత్రాల్లో నటించారు. సిపాయి చిత్రంతో కన్నడ చిత్రంలో నటించారు చిరంజీవి. కొన్ని చిత్రాలకి గాత్ర దానం చేశారు చిరంజీవి. స్టార్ మా తెలుగు ఛానెల్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కొన్ని తెలుగు చిత్రాల్లో అతిధి పాత్రతో మెరిశారు.

2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తిరుపతి నియోజగకవర్గం నుంచి ఎం. ఎల్. ఏ గా ఎన్నికయ్యారు. ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభ లో ఎం. పీ గా మరియు టూరిజం శాఖా మంత్రి గా సేవ చేశారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండి సినిమాలు చేస్తున్నారు.

బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పేరుతొ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఎవరు కూడా రక్తం దొరక్క చనిపోవద్దు అని బ్లడ్ బ్యాంక్, అలాగే కంటి చూపు కోల్పోయిన వాళ్లకి ఐ బ్యాంక్ సేవలు ప్రారంభించారు. కరోనా లో కూడా ఎన్నో రకాల సేవలు చేశారు చిరంజీవి. సినీ పురస్కారాలతో పాటు ప్రభిత్వా పురస్కారాలు కూడా అందుకున్నారు చిరంజీవి.

2006 సంవత్సరంలో పద్మభూషణ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, 2024 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ఉత్తమమైన డాన్సర్ ని గిన్నిస్ రికార్డు అందుకున్నారు. అక్కినేని నాగేశ్వర్రావు పురస్కారం, రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా అందుకున్నారు. అభిమానులు మాత్రం మెగాస్టార్, సుప్రీమ్ హీరో, బాస్, అన్నయ్య అని ఇష్టాంగా పిలుచుకుంటారు.

వ్యక్తిగతం

1955 సంవత్సరంలో, ఆగష్టు 22 న మొగల్తూరు లో జన్మించారు. తండ్రి వెంకట్రావు కానిస్టేబుల్ తల్లి అంజనీ దేవి. నిడదవోలు, మంగళగిరి, మొగల్తూరు, ఒంగోలు నగరాల్లో చదువుని అభ్యసించారు మరియు చెన్నై నగరంలో ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్స్ లో చేరడం జరిగింది. 1980 సంవత్సరం లో ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ తో వివాహం జరిగింది మరియు వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

ఇద్దు సోదరులు, ఇద్దరు సోదరీమణులు లో చిరంజీవి మొదటివారు, మరియు ఇద్దరు సోదరులు సినిమాలో, రాజకీయాల్లో చురుక్కా ఉన్నారు. నిర్మాత అల్లు అరవింద్ బావమరిది, అల్లు అర్జున్మే, అల్లు శిరీష్ మేనల్లుళ్లు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ చెల్లెలి కుమారులు, వరుణ్ తేజ్, నిహారిక సోదరుడి పిల్లలు.

చిరంజీవి నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
  1. ప్రాణం ఖరీ దు
  2. మనవూరి పాండవులు
  3. తాయారమ్మ బంగారయ్య
  4. కుక్క కాటుకు చెప్పు దెబ్బ
  5. కొత్తల్లుడు
  6. ఐ లవ్ యు
  7. పునాదిరాళ్ళు
  8. ఇది కధ కాదు
  9. శ్రీ రామ బంటు
  10. కోతల రాయుడు
  11. అగ్ని సంస్కారం
  12. కొత్తపేట రౌడీ
  13. చండీప్రియ
  14. ఆరనిమంటలు
  15. జాతర
  16. మోసగాడు
  17. పున్నమి నాగు
  18. నకిలీ మనిషి
  19. కాళీ
  20. తాతయ్య ప్రేమలీలలు
  21. లవ్ ఇన్ సింగపూర్
  22. ప్రేమతరంగాలు
  23. మొగుడు కావాలి
  24. రక్త బంధం
  25. ఆడవాళ్లు మీకు జోహార్లు
  26. పార్వతి పరేమేశ్వరులు
  27. తోడుదొంగలు
  28. తిరుగులేని మనిషి
  29. ప్రేమనాటకం
  30. న్యాయం కావాలి
  31. ఊరికిచ్చిన మాట
  32. రాణికాసుల రంగమ్మ
  33. 47 నాట్కల్ (తమిళ్)
  34. రాణువ వీరన్ (తమిళ్)
  35. శ్రీరస్తు శుభమస్తు
  36. ప్రియా
  37. చట్టానికి కళ్లులేవు
  38. కిరాయి రౌడీలు
  39. ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య
  40. శుభలేఖ
  41. ఇది పెళ్లంటారా
  42. సీతాదేవి
  43. రాధా మై డార్లింగ్
  44. టింగు రంగడు
  45. పట్నం వచ్చిన పతివ్రతలు
  46. బిల్లా రంగ
  47. యమకింకరుడు
  48. మొండిఘటం
  49. మంచుపల్లకి
  50. బంధాలు అనుబంధాలు
  51. ప్రేమ పిచ్చోళ్ళు
  52. పల్లెటూరి మొనగాడు
  53. అభిలాష
  54. ఆలయశిఖరం
  55. శివుడు శివుడు శివుడు
  56. పులి బెబ్బులి
  57. గూఢచారి No 1
  58. మగమహారాజు
  59. రోషగాడు
  60. మా ఇంటి ప్రేమాయణం
  61. సింహపురిసింహం
  62. ఖైదీ
  63. మంత్రిగారి వియ్యంకుడు
  64. సంఘర్షణ
  65. ఆల్లుళ్లొస్తున్నారు
  66. గూండా
  67. హీరో
  68. దేవాంతకుడు
  69. మహానగరంలో మాయగాడు
  70. ఛాలెంజ్
  71. ఇంటిగుట్టు
  72. నాగు
  73. అగ్నిగుండం
  74. రుస్తుం
  75. చట్టంతోపోరాటం
  76. దొంగ
  77. చిరంజీవి
  78. జ్వాలా
  79. పులి
  80. రక్తసింధూరం
  81. అడవిదొంగ
  82. విజేత
  83. కిరాతకుడు
  84. కొండవీటిరాజా
  85. మగధీరుడు
  86. వేట
  87. చంటబ్బాయి
  88. రాక్షసుడు
  89. ధైర్యవంతుడు
  90. ఛంక్యశపధం
  91. దొంగమొగుడు
  92. ఆరాధన
  93. చక్రవర్తి
  94. పసివాడిప్రాణం
  95. స్వయంకృషి
  96. జేబుదొంగ
  97. మంచిదొంగ
  98. రుద్రవీణ
  99. యముడికిమొగుడు
  100. ఖైదీ No 786
  101. మరణ మృదంగం
  102. త్రినేత్రుడు
  103. యుద్ధభూమి
  104. అత్తకి యముడు అమ్మాయికి మొగుడు
  105. స్టేట్ రౌడీ
  106.  రుద్రనేత్ర
  107. లంకేశ్వరుడు
  108. మాపిళ్ళై (తమిళ్ అతిధి పాత్ర)
  109. కొండవీటి దొంగ
  110. జగదేకవీరుడు అతిలోకసుందరి
  111. కొదమసింహం
  112. రాజా విక్రమార్క
  113. ప్రతిబంద్ (హిందీ)
  114. స్టువార్టుపురం పోలీస్ స్టేషన్
  115. గ్యాంగ్ లీడర్
  116. రౌడీ అల్లుడు
  117. ఘరానా మొగుడు
  118. ఆపద్బాంధవుడు
  119. ఆజ్ కా గూండారాజ్ (హిందీ)
  120. ముఠామేస్త్రి
  121. మెఖానిక్ అల్లుడు
  122. ముగ్గురు మొనగాళ్లు
  123. ఎస్.పి. పరశురామ్
  124. ది జెంటిల్ మెన్
  125. అల్లుడా మజాకా
  126. బిగ్ బాస్
  127. రిక్షావోడు
  128. సిపాయి (కన్నడ)
  129. హిట్లర్
  130. మాస్టర్
  131. బావగారుబాగున్నారా
  132. చూడాలనివుంది
  133. స్నేహంకోసం
  134. ఇద్దరుమిత్రులు
  135. అన్నయ్య
  136. హ్యాండ్సప్ (అతిధి పాత్ర)
  137. మృగరాజు
  138. శ్రీ మంజునాథ (కన్నడ)
  139. డాడీ
  140. ఇంద్ర
  141. ఠాగోర్
  142. అంజి
  143. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
  144. జై చిరంజీవ
  145. అందరివాడు
  146. స్టాలిన్
  147. స్టైల్ (అతిధి పాత్ర)
  148. శంకర్ దాదా జిందాబాద్
  149. మగధీర (అతిధి పాత్ర)
  150. బ్రూస్ లీ (అతిధి పాత్ర)
  151. ఖైదీ No 150
  152. సైరా నరసింహారెడ్డి
  153. ఆచార్య
  154. గాడ్ ఫాదర్
  155. వాల్తేర్ వీరయ్య
  156. భోళాశంకర్

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *