Mass Maharaja Raviteja Movies

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి గుర్తింపులేని పాత్రలతో మరియు చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ అంచలంచలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక అభిమానులని సంపాదించుకుని ఆగ్ర కథానాయకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవితేజ గురించి చెప్పుకుందాం.

మొదటి అవకాశం

లేడీ అమితాబ్ బచ్చన్ అని పిలవబడే కధానాయిక విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాలో ఒక పాత్రలో నటించారు రవితేజ. కన్నడ నటులు వినోద్ కుమార్ ఈ ఛితంలో కధానాయకుడిగా నటించారు. కన్నడ భాషలో అభిమన్యు, కింగ్ అక్కినేని నాగార్జున నటించిన చైతన్య, “మెగాస్టార్” చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ హిందీ రీమేక్ ఆజ్ కా గూండారాజ్, కలెక్టర్ గారి అల్లుడు, లాఠీ, వారసుడు, అల్లరి ప్రియుడు మరియు నిన్నే పెళ్లాడతా చిత్రాల్లో గుర్తింపులేని పాత్రలు చేయడం జరిగింది.

సహాయనటుడి పాత్రలో

ప్రముఖ దర్శకులు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సింధూరం. బ్రహ్మాజీ, సంఘవి నటించిన ఈ చిత్రం లో రవితెజ మరో కధానాయకుడిగా నటించారు. సింధూరం చిత్రంతో పూర్తి నిడివి ఉన్న పాత్ర చేశారు రవితేజ. వినీత్, హీరా కలిసి నటించిన చిత్రం పాడుతా తీయగా, ఈ చిత్రంలో వినీత్ స్నేహితులతో ఒకరిగా నటించారు రవితేజ.

ప్రముఖ నటులు సురేష్ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం ఓ పనైపోతుందిబాబు. ఈ చిత్రంలో మరో కధానాయకుడిగా రవితెజ నటించారు మరియు తను కూడా ద్విపాత్రాభినయంలో నటించారు అంతేకాకుండా హాస్యనటులు బ్రహ్మానందం కూడా ద్విపాత్రాభినయంలో నటించడం జరిగింది. వడ్డే నవీన్, రాశి కలయికలో వచ్చిన చిత్రం మనసిచ్చిచూడు మరియు నటి సుహాసిని ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో వడ్డే నవీన్ స్నేహితుడిగా నటించారు రవితేజ.

నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగార్జున కలయికలో వచ్చిన సీతారామరాజు చిత్రంలో ప్రతినాయకుడి ఛాయా ఉన్న పాత్రలో మరియు వారి చెల్లెల్ని ప్రేమించే వ్యక్తి పాత్రలో నటించారు రవితేజ. సాక్షి శివానంద్, సంఘవి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దర్శకులు వై. వి. ఎస్ చౌదరి. వడ్డే నవీన్ స్నేహితుడిగా ప్రేమించేమనసు, ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ప్రేమకువెళాయేరా చిత్రంలో జె. డి. చక్రవర్తి స్నేహితుడిగా నటించారు రవితేజ మరియు ఈ చిత్రంలో కథానాయికగా సౌందర్య నటిస్తే ప్రత్యేక పాటలో రమ్య కృష్ణ నటించడం విశేషం.

కృష్ణవంశీ దర్శకత్వంలో జగపతిబాబు, సాక్షి శివానంద్ నటించిన సముద్రం చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు రవితేజ. 1999 సంవత్సరంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ, మహేశ్వరి కలిసి నటించిన చిత్రం నీకోసం. కధానాయకుడిగా రవితేజ కి మొదటి చిత్రం కానీ ఈ చిత్రం అపజయం సాధించిన కొన్ని పురస్కారాలు సాధించింది. మనసిచ్చాను అనే చిత్రంలో కూడా కధానాయకుడిగా నటించారు రవితేజ కానీ అది చిత్రం నిరాశపరిచింది.

“మెగాస్టార్” చిరంజీవి నటించిన అన్నయ్య చిత్రంలో ఇద్దరు తమ్ముళ్లలో ఒక తమ్ముడిగా, శ్రీకాంత్ నటించిన క్షేమంగావెళ్లి లాభంగారండి, తిరుమల తిరుపతి వెంకటేశా, సకుటుంబ సపరివార సమేతంగా చిత్రాలలో నటించారు రవితేజ. కన్నడ చిత్రం వందేమాతరం అలాగే జగపతిబాబు, రమ్యకృష్ణ కలిసి నటించిన బడ్జెట్ పద్మనాభం చిత్రంలో రమ్యకృష్ణ తమ్ముడి పాత్రలో నటించారు రవితేజ. ఈ చిత్రానికి దర్శకులు ఎస్. వి. కృష్ణారెడ్డి

వినీత్, రవితేజ, ఆలీ, శివారెడ్డి, మీనా కలిసి నటించిన అమ్మాయికోసం చిత్రంలో నలుగురు కథానాయకులలో ఒక కధానాయకుడిగా నటించారు రవితేజ. ఈ చిత్రంలో “డైలాగ్ కింగ్” సాయి కుమార్ మరియు ప్రకాష్ రాజ్ తండ్రీ, కొడుకులుగా ప్రత్యేక పాత్రలో నటించారు. రవితేజ, బ్రహ్మాజీ, శివాజీ కలిసి నటించిన చిరంజీవులు చిత్రంలో ఒక కధానాయకుడిగా నటించారు.

కధానాయకుడిగా

2001 సంవత్సరంలో పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో రవితేజ, తనూరాయ్ కలిసి నటించారు మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది. చక్రి అందించిన సంగీతం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇదే సంవత్సరంలో వచ్చిన ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రంలో కధానాయిక కళ్యాణి తో కలిసి నటించారు రవితేజ మరియు ఈ చిత్రానికి దర్శకులు వంశీ. ఈ చిత్రం కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది.

2002 సంవత్సరంలో పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ చిత్రంలో రవితేజ, రక్షిత, ప్రకాష్ రాజ్ కలిసి నటించారు మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో రవితేజ నటన, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కమిషనర్ కూతురిని ప్రేమించకూడదా పెళ్లిళ్లు అవ్వవా”, “సిటీ కి ఎంతోమంది కమిష్నర్లు వస్తుంటారు పోతుంటారు కానీ చంటిగాడు ఇక్కడే ఉంటాడు లోకల్” లాంటి సంభాషణలు ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేస్తాయి. రక్షిత తండ్రిగా ప్రకాష్ రాజ్ నటన అద్భుతంగా నటించారు.

శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కలిసి నటించిన చిత్రం ఖడ్గం. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాలి బెంద్రే, సంగీత కథానాయికలుగా మరియు ప్రత్యేకపాత్రలో శివాజీరాజా, ఉత్తేజ్, కిమ్ శర్మా నటించారు. ఇండియా, పాకిస్తాన్ నేపథ్యంతో తీసిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. సినిమాలో నటించడానికి స్టూడియోల చుట్టూ ఒక ఛాన్స్ అంటూ రవితేజ చేసిన నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇదే సంవత్సరంలో అన్వేషణ చిత్రం లో నటించిన అది నిరాశపరిచింది. 

2003 సంవత్సరంలో వచ్చిన ఈ అబ్బాయి చాల మంచోడు చిత్రం పరవాలేదనిపించినా ఆ తరువాత వచ్చిన చిత్రం అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రవితేజ సరసన ఆసిన్ నటించారు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. పూరీజగన్నాధ్, రవితేజ కలయికలో వచ్చిన మూడవ చిత్రం అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మరియు మూడు చిత్రాలు విజయం సాధించడం విశేషం. ఈ ఇద్దరి కలయికలో సంగీత దర్శకులు చక్రి కూడా తోడయ్యి ఈ మూడు చిత్రాలకి సంగీతం అందించడం విశేషం.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం తరువాత రవితేజ ఇంకా వెనక్కి తీరిగి చూసుకోకుండా వరుసగా చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. నమితతో కలిసి నటించిన ఒకరాజు ఒకరాణి, కళ్యాణి తో కలిసి నటించిన దొంగోడు మరియు ఆర్తి అగర్వాల్ తో కలిసి నటించిన వీడే చిత్రాలు కూడా 2003 సంవత్సరంలో విడుదలవడం విశేషం.

వరుస చిత్రాలు

నీకోసం తరువాత దర్శకులు శ్రీనువైట్ల, రవితేజ కలిసి చేసిన చిత్రం వెంకీ. 2004 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రంలో కథానాయికగా స్నేహ నటించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మాస్ ప్రేక్షకులని ఉర్రుతలుగుంచింది. అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు స్నేహితులు అప్పులు చేస్తూ ఇంటోవాళ్ళతో తిట్లు తింటూ ఆ తరువాత ఒక రైలు ప్రయాణంలో హత్య నేరంలో ఇరుక్కుని దాని నుంచి ఎలా బయట పడ్డారో అనేది ఈ కధ. ముఖ్యంగా రైలు ప్రయాణంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపు చెక్కేలయ్యేలా నవ్వు తెప్పిస్తుంది.

తమిళ భాషలో వచ్చిన ఆటోగ్రాఫ్ చిత్రాన్ని తెలుగులో నా ఆటోగ్రాఫ్ పేరుతొ రీమేక్ చేశారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ . గోపాల్ రెడ్డి మొదటి సారి దర్శకత్వం చేసిన నా ఆటోగ్రాఫ్ చిత్రంలో రవితేజ సరసన  కథానాయికలుగా గోపిక మరియు భూమిక నటించారు. రవితేజ, ఛార్మి కలిసి నటించిన చంటి చిత్రం నిరాశపరిచింది.

2005 సంవత్సరంలో బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం భద్ర. రవితేజ, మీరా జాస్మిన్ నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. శ్రియ శరన్ తో కలిసి నటించిన భగీరథ నిరాశపరిచింది. 2006 సంవత్సరంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రంలో రవితేజ, జ్యోతిక నటించారు మరియు ప్రత్యేక పాత్రలో ప్రముఖ కధానాయిక టాబు నటించారు. ఈ చిత్రం నిరాశపరిచింది.  

2006 సంవత్సరంలో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం విక్రమార్కుడు మరియు ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించడం జరిగింది. పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ రాథోడ్ మరియు దొంగతనాలు చేసే అత్తిలి సత్తిబాబు పాత్రలో రవితేజ అద్భుతంగా నటించారు. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించడమే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ, బెంగాలీ మరియు బంగాళాదేశ్ దేశంలో కూడా రీమేక్ చేయడం విశేషం.

ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఖతర్నాక్ చిత్రంలో నటించారు రవితేజ మరియు ఇలియానా కథానాయికగా నటించారు కానీ చిత్రం నిరాశపరిచింది. 2007 సంవత్సరంలో దర్శకులు శ్రీనువైట్లతో కలిసి దుబైశీను చిత్రంలో నయనతారతో కలిసి నటించారు రవితేజ. ఈ చిత్రం ఫరవాలేదనిపించింది.

2008 సంవత్సరంలో వి. వి. వినాయక్ దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం కృష్ణ. త్రిష కధానాయిక నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. సరదాగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే సంవత్సరంలో “సూపర్ స్టార్” కృష్ణ ముఖ్యపాత్రలో వచ్చిన చిత్రం బలాదూర్. రవితేజ, అనుష్క కలిసి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

నాల్గవసారి పూరీజగన్నాధ్, రవితేజ కలయికలో వచ్చిన చిత్రం నేనింతే. 2008 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన రవితేజ నటన అద్భుతం అని చెప్పాలి. ఎలాగైనా దర్శకుడిగా మారి ఒక చిత్రాన్నిదర్శకత్వం వహించాలి అనే పాత్రలో రవితేజ కనిపిస్తారు మరియు ఈ చిత్రంలో కథానాయికగా శియా గౌతమ్ నటించారు. ఈ చిత్రానికి ఉత్తమ నటుడు నంది పురస్కారం అందుకున్నారు రవితేజ.

2009 సంవత్సరంలో వచ్చిన చిత్రం కిక్ చిత్రంలో రవితేజ, ఇలియానా కలిసి నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమిళ నటుడు శ్యామ్ ప్రత్యేక పాత్ర చేశారు. కిక్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని చూడ్డమే కాకుండా హిందీ, తమిళ్,  కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేయడం జరిగింది.    

రవితేజ నయనతార కలిసి నటించిన చిత్రం ఆంజనేయులు మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది. 2010 సంవత్సరంలో రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ,ప్రియమణి, అభినయ కలిసి నటించిన చిత్రం శంభో శివ శంభో. తమిళ్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఫరవాలేదనిపించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన డాన్ శీను  చిత్రంలో రవితేజ, శ్రియ శరన్ నటించారు. ఈ చిత్రం కూడా ఫరవాలేదనిపించింది. 2011 సంవత్సరంలో విడుదలైన మిరపకాయ్ చిత్రం నుంచి ఇప్పుడు 2024 సంవత్సరంలో విడుదలైన Mr. బచ్చన్ చిత్రం వరకు వరుసగా చిత్రాలు చేస్తూ జయాపజయాలతో సంభందం లేకుండా సినిమాలు చేస్తున్నారు రవితేజ. 

మరికొన్ని విశేషాలు

నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలని నిర్మించారు రవితేజ. ఆర్. టి. వర్క్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి గట్టి కుస్తీ అనే తమిళ చిత్రంతో పాటు రావణాసుర, ఛాంగురేబంగారురాజా మరియు సుందరం మాస్టర్ చిత్రాలు నిర్మించారు రవితేజ.

మర్యాద రామన్న చిత్రంలో సునీల్ నడిపే సైకిల్ కి గాత్ర దానం చేశారు అలాగే దూసుకెళ్తా చిత్రానికి గాత్ర దానం చేశారు అలాగే అ! అనే చిత్రానికి చెట్టుకి, మహావీరుడు చిత్రానికి మరియు హనుమాన్ చిత్రంలో కోతి పాత్రకి గాత్ర దానం చేశారు. రవితేజకి అభిమానులు “మాస్ మహారాజ” అనే బిరుదుతో పిలవడం విశేషం. బలుపు, పవర్, రాజా ది గ్రేట్, డిస్కో రాజా, రావణాసుర చిత్రాల్లో గాయకుడిగా పాడటం చేశారు రవితేజ.

వ్యక్తిగతం

రవితేజ పూర్తిపేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. 1968 సంవత్సరం 26 జనవరి న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని జగ్గంపేట లో జన్మించారు. తన చదువంతా జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ మరియు విజయవాడ కొనసాగింది. తండ్రి ఉద్యోగ నిమిత్తం వల్ల వివిధ నగరాల్లో చదువుకున్నారు రవితేజ. ముగ్గురు అన్నదమ్ముల్లో రవితేజ అందరికన్నా పెద్ద మరియు ఇద్దరు తమ్ముళ్లలో ఒక తమ్ముడు ఆక్సిడెంట్ లో మృతి చెందడం జరిగింది. 2002 సంవత్సరంలో రవితేజ వివాహం జరిగింది మరియు వీరికి ఇద్దరు పిల్లలు.

సినిమాల్లో అందరికీ నచ్చే వినోదాన్ని అందిస్తూ, తెలుగు చలనచిత్ర ప్రపంచంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రవితేజ, మాస్ మహారాజాగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ ఉన్నారు. “రవి తేజ అంటేనే ఎనర్జీ” అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన స్థానం చిరస్థాయిగా ఉంటుంది.

రవితేజ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం

  1. కర్తవ్యమ్
  2. అభిమన్యు (కన్నడ)
  3. చైతన్య
  4. ఆజ్ కా గూండారాజ్ (హిందీ)
  5. కలెక్టర్ గారి అల్లుడు
  6. లాఠీ
  7. వారసుడు
  8. అల్లరి ప్రియుడు
  9. నిన్నే పెళ్లాడత
  10. సింధూరం
  11. పాడుతా తీయగా
  12. ఓ పనైపోతుందిబాబు
  13. మానసిచ్చి చూడు
  14. సీతారామరాజు
  15. ప్రేమించేమనసు
  16. ప్రేమకువెళాయేరా
  17. సముద్రం
  18. నీకోసం
  19. మానసిచ్చాను
  20. క్షేమంగా వెళ్లి లాభంగా రండి
  21. తిరుమల తిరుపతి వేంకటేశ
  22. సకుటుంబ సపరివార సమేతం
  23. అన్నయ్య
  24. వందేమాతరం (కన్నడ)
  25. చిరంజీవులు
  26. అమ్మాయికోసం
  27. బడ్జెట్ పద్మనాభం
  28. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
  29. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
  30. ఇడియట్
  31. అన్వేషణ
  32. ఖడ్గం
  33. ఈ అబ్బాయి చాల మంచోడు
  34. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
  35. ఒక రాజు ఒక రాణి
  36. దొంగోడు
  37. వీడే
  38. వెంకీ
  39. నా ఆటోగ్రాఫ్
  40. చంటి
  41. భద్ర
  42. భగీరథ
  43. షాక్
  44. విక్రమార్కుడు
  45. ఖతర్నాక్
  46. దుబాయ్ శీను
  47. శంకర్ దాదా జిందాబాద్ (ఒక పాటలో అతిధి పాత్ర)
  48. కృష్ణ
  49. బలాదూర్
  50. నేనింతే
  51. కిక్
  52. ఆంజనేయులు
  53. శంభో శివ శంభో
  54. డాన్ శీను
  55. మిరపకాయ్
  56. దొంగలముఠా
  57. వీర
  58. కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు (అతిధి పాత్ర)
  59. నిప్పు
  60. దరువు
  61. దేవుడు చేసిన మనుషులు
  62. సారొచ్చారు
  63. బలుపు
  64. దూసుకెళ్తా (వోయిసువర్)
  65. పవర్
  66. రోమియో (అతిధి పాత్ర)
  67. కిక్ 2
  68. బెంగాల్ టైగర్
  69. దొంగాట (అతిధి పాత్ర)
  70. వజ్రకాయ (కన్నడ ) (అతిధి పాత్ర)
  71. రాజా ది గ్రేట్
  72. టచ్ చేసి చూడు
  73. నెల టికెట్
  74. అమర్ అక్బర్ ఆంథోనీ
  75. డిస్కో రాజా
  76. క్రాక్
  77. ఖిలాడీ
  78. రామారావు ఆన్ డ్యూటీ
  79. ధమాకా
  80. వాల్తేరు వీరయ్య
  81. రావణాసుర
  82. టైగర్ నాగేశ్వర్ రావు
  83. ఈగల్
  84. Mr. బచ్చన్

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *