Major Dhyanchand – The Hockey Wizard

ఒలంపిక్స్ లో భారత్ తరపున ఫీల్డ్ హాకీ క్రీడలో మూడు “బంగారు పతకాలు” సాధించి “హాకీ మాంత్రికుడిగా” పేరు పొందిన మేజర్ ధ్యాన్ చంద్ గురించి తెలుసుకుందాం.

బాల్యం మరియు చదువు

అలాహాబాద్ నగరంలో  1905 ఆగస్టు 29 న రాజపుట్ కుటుంబంలో శారదా సింగ్, సమేశ్వర్ సింగ్ దంపతులకు జన్మించారు ధ్యాన్ చంద్. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ధ్యాన్ చంద్ తండ్రి పనిచేసేవారు. బదిలీల కారణంగా రకరకాల ప్రాంతాలలో నివసించారు, చివరికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఝాన్సీ అనే నగరంలో స్థిరపడ్డారు ధ్యాన్ చంద్ కుటుంబం. ధ్యాన్ చంద్ కి మూల్ సింగ్ మరియు రూప్ సింగ్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు, వారు కూడా హాకీ క్రీడా ఆడటం జరిగింది.

ఝాన్సీ నగరంలో స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ ఉండేవారు ధ్యాన్ చంద్. కుస్తీ ఆటని తప్ప మిగిత ఆటలలో అంత ఇష్టం చూపించేవారు కాదు. గ్వాలియర్ నగరంలో విక్టోరియా కళాశాల నుంచి పట్టా పొందారు.

సైన్యంలో ఉద్యోగం మరియు హాకీ క్రీడ

1922 సంవత్సరంలో తన పుట్టినరోజు నాడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సిపాయి గా చేరారు ధ్యాన్ చంద్. 1922 సంవత్సరం నుంచి 1926 సంవత్సరం వరకు ఆర్మీలో హాకీ టోర్నమెంట్ మరియు రీజిమెంట్ గేమ్ లు ఆడారు. ఆ తరువాత న్యూజీలాండ్ లో ఆడటానికి భారత ఆర్మీ జట్టుకి ఎంపికవ్వడం జరిగింది. అక్కడ భారత హాకీ జట్టు 18 మ్యాచ్ లలో గెలిచి, ఒకటి ఓడిపోయి రెండు మాత్రమే డ్రా చేసుకుంది. ఆ తరువాత న్యూజిలాండ్ తో జరిగిన 2 మ్యాచ్ లలో భారత జట్టు ఒకటి ఓడిపోయి మరొకటి గెలిచారు. 1927 సంవత్సరంలో “లాన్స్ నాయక్” గా భారత ఆర్మీ నుంచి పదోన్నతి లభించింది.

ఒలంపిక్స్ లో 1908 సంవత్సరం లో హాకీ క్రీడా చేర్చినప్పటికీ 1924 సంవత్సరంలో అంతర్జాతీయ క్రీడా నిర్మాణం సరిగ్గా ఉండకపోవటం వల్ల హాకీ క్రీడని తొలగించారు మళ్ళీ 1928 సంవత్సరంలో హాకీ క్రీడని చేర్చడం జరిగింది.

1928 సంవత్సరంలో “భారత హాకీ ఫెడరేషన్” ఆంస్టర్డామ్ లో జరిగే  ఒలంపిక్స్ కోసం భారత హాకీ జట్టు ని 1925 సంవత్సరం నుంచే ఎంపిక చేసేపనిలో పడింది. ఉత్తమ జట్టు ని ఒలంపిక్స్ లో ఎంపిక చేసి పంపించడానికి “ఇంటర్-ప్రొవిన్షియల్ టోర్నమెంట్” జరిగింది. ఈ టోర్నమెంట్ లో 5 జట్లు పాల్గొనటం జరిగింది, యునైటెడ్ ప్రావిన్సెస్, పంజాబ్, బెంగాల్, రాజపుతాన మరియు సెంట్రల్ ప్రావిన్స్ జట్లు పోటీ పడ్డాయి. ధ్యాన్ చంద్ యునైటెడ్ ప్రావిన్స్ జట్టు తరపున ఆడటానికి భారత ఆర్మీ అనుమతి ఇచ్చింది.

టోర్నమెంట్ లో మొదటి ఆటలోనే సెంటర్ ఫార్వర్డ్ గా ధ్యాన్ చంద్ మరియు మార్టిన్స్ అనే ఆటగాడితో కలిసి చాలా చక్కగా ఆడటం జరిగింది. హాకీ కర్రని తెలివితో అటు ఇటు తిప్పుతూ వేగంతో పరిగెడుతూ పాస్ ని అందిస్తూ అందరి ద్రుష్టిని తన వైపు తిప్పుకునేలా ఆడారు. మార్టిన్స్ తో కలిసి బంతిని పాస్ చేసుకుంటూ మెరుపు వేగంతో పరిగెడుతూ గోల్ కొట్టారు ధ్యాన్ చంద్.

ఒలంపిక్స్ లో హాకీ క్రీడా పునరాగమనం

బొంబాయి నగరంలో “భారత హాకీ ఫెడరేషన్” సమావేశం అయ్యి ఒలింపిక్స్ కి పంపించాల్సిన జట్టు ని ప్రకటించింది. బ్రూమ్ ఎరిక్ పిన్నిగర్ అనే ఆటగాడిని భారత హాకీ జట్టుకి సారధిగా ప్రకటించారు మరియు “సెంటర్ ఫార్వర్డ్” ఆటగాడిగా ధ్యాన్ చంద్ పేరు కూడా ప్రకటించారు. ఒలంపిక్స్ కి ముందు భారత హాకీ జట్టు బాంబే జట్టుతో ఒక మ్యాచ్ ఆడింది ఆ మ్యాచ్ లో ధ్యాన్ చంద్ గోల్స్ కొట్టినా కూడా ఆ మ్యాచ్ భారత హాకీ జట్టు ఓడిపోయింది.

భారత హాకీ జట్టు తమ తరువాతి మ్యాచ్లు ఆడటానికి ఇంగ్లాండ్ దేశం బయలుదేరి వెళ్ళింది అక్కడ స్థానిక జట్లతో లండన్ లోని “ఫాల్క్ స్టోన్ ఫెస్టివల్ లో 11 మ్యాచ్లు ఆడి అన్నిటిని గెలిచింది. ఏప్రిల్ 24, 1927 న భారత హాకీ జట్టు ఆంస్టర్డామ్ దేశానికి చేరుకుంది. “ప్రీ – ఒలంపిక్స్” పేరుతొ భారత జట్టు డచ్, జర్మన్, బెల్జియన్ జట్లపై ఆడి భారీ తేడాతో విజయం సాధించింది.

ఒలంపిక్స్ లో భారత విజయం

1928 సంవత్సరంలో ఒలంపిక్స్ క్రీడలు మొదలవడం జరిగింది. భారత హాకీ జట్టు తమ ప్రత్యర్థులైన ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్ మరియు స్విట్జర్లాండ్ దేశాలతో ఆడి విజయాలు సాధించింది. ప్రతి మ్యాచ్ లో తన వంతు ఆట ఆడి విజయాన్ని తీసుకొచ్చారు ధ్యాన్ చంద్.

ఒలంపిక్స్ లో హాకీ విభాగంలో భారత జట్టు తో పాటు నెథర్లాండ్స్ జట్టు ఫైనల్ లో పోటీ పడి భారత జట్టు చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్ సమయంలో ముగ్గురు ఆటగాళ్లతో పాటు ధ్యాన్ చంద్ కూడా అనారోగ్యం పాలయ్యారు, అనారోగ్యాన్ని లెక్క చెయ్యకుండా ఫైనల్ మ్యాచ్ లో ఆడి భారత్ కి బంగారు పతాకాన్ని తీసుకొచ్చారు ధ్యాన్ చంద్. ఈ ఒలంపిక్స్ లో 14 గోల్స్ తో ధ్యాన్ చంద్ టాపర్ గా నిలిచారు. ఈ విజయం గురించి, ధ్యాన్ చంద్ ఆట గురించి ఒక వార్తా పత్రిక ఇలా రాసుకొచ్చింది. “ఇది ఆటకాదు మాయాజాలం ధ్యాన్ చంద్ ఒక మాంత్రికుడు అని”.

ధ్యాన్ చంద్ గోల్స్ కొట్టడం చుసిన నెథర్లాండ్స్ అధికారులు తన కర్రలో ఏమైనా ఐస్కాంతం ఉందేమో అని అనుమానంతో కర్రని విరగ గొట్టారు. ఒలంపిక్స్ లో బంగారు పతాకం గెలిచి భారత జట్టు తమ దేశానికి తిరుగుప్రయాణంలో బాంబే నగరంలో అభిమానులు ఘాన స్వాగతం పలికారు. కొత్త ఒలంపిక్ జట్టు కోసం మళ్ళీ “ఇంటర్-ప్రొవిన్షియల్ టోర్నమెంట్” నిర్వహించడానికి సిద్ధమవ్వగా దాని కోసం భారత హాకీ ఫీల్డ్ ఎలాగైనా ధ్యాన్ చంద్ గారికి సెలవు మంజూరు చేయాలని రాసిన లేఖని భారత ఆర్మీ నిరాకరించింది. కానీ భారత హాకీ లీగ్ నేరుగా ధ్యాన్ చంద్ ను జట్టులో ఎంపిక చేయగా మిగితా వారిని టోర్నమెంట్ లో చూపించిన ప్రతిభ ద్వారా ఎంపికయ్యారు. ఈ ఒలంపిక్స్ లో ధ్యాన్ చంద్ సోదరుడు రూప్ సింగ్ ని కూడా జట్టులో ఎంపిక చేశారు. ఈ జట్టు కి సారధిగా లాల్ సింగ్ బొఖారి ఉన్నారు.

ఒలంపిక్స్ మరియు చివరి మ్యాచ్

1932 సంవత్సరంలో జరిగే ఒలంపిక్స్ కి ముందు భారత జట్టు ఒలంపిక్ జట్టైన సిలోన్ XI జట్టుతో ఆడి గెలిచింది. ఆ తరువాత భారత జట్టు ఒలంపిక్స్ కోసం లాస్ ఏంజెల్స్ నగరానికి చేరుకొని జపాన్ జట్టుని ఓడించింది. ఈ ఒలంపిక్స్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు అమెరికా జట్టుని ఓడించి మరోసారి బంగారు పతాకం గెలిచింది భారత జట్టు. ఈ ఒలంపిక్స్ లో ధ్యాన్ చంద్ మరియు అతని సోదరుడు కలిసి 25 గోల్స్ చేసినందుకు వారికి “హాకీ కవలలు” అని పేరు పెట్టడం జరిగింది. భారత జట్టు ఆ తరువాత వరుసపెట్టి మ్యాచ్లు ఆడటం అవి గెలవడం అలా సాగిపోయింది.

భారత జట్టు 1934 సంవత్సరంలో న్యూజిలాండ్ పర్యటనకు  బయలుదేరిన జట్టుకు ధ్యాన్ చంద్ సారధిగా వ్యవహరించారు. 1936 సంవత్సరంలో జరిగిన ఒలంపిక్స్ లో భారత జట్టు ఫైనల్ మ్యాచ్ జర్మని మీద ఆడి విజయం సాధించి మరో బంగారు పతాకాన్ని గెలుచుకుంది. ధ్యాన్ చంద్ ఆట  చుసిన జర్మని నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ తమ దేశం తరపున ఆడాలని ఒక వేళ ఆడితే తమ దేశం పొరసత్వంతో పాటు సైన్యం లో “కల్నల్” పదవి ఇస్తామంటూ ప్రకటన చేశారు కానీ ధ్యాన్ చంద్ సున్నితంగా తిరస్కరించారు.

తూర్పు ఆఫ్రికా జట్టు తో ఆడిన మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకుని కేవలం ఎక్సిబిషన్ మ్యాచ్లు ఆడటం మొదలుపెట్టారు. 1948 సంవత్సరంలో రెస్ట్ అఫ్ ఇండియా జట్టుకి సారధిగా ఉంటూ బెంగాల్ జట్టుతో ఆడి హాకీ క్రీడ నుంచి తప్పుకున్నారు. 1956 సంవత్సరంలో  భారత సైన్యం నుండి పదవి విరమణ చేశారు ధ్యాన్ సింగ్. అది కూడా తన పుట్టినరోజు నాడే. అదే సంవత్సరం భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో ధ్యాన్ చంద్ ను సత్కరించింది. చివరికి 1979 డిసెంబర్ 3న కాలేయ క్యాన్సర్ తో మరణించారు.

ధ్యాన్ చంద్ గురించి మరి కొన్ని విషయాలు
  • ధ్యాన్ చంద్ అసలు పేరు ధ్యాన్ సింగ్ కానీ రాత్రి పుట “చంద్రకాంతి” లో హాకీ సాధన చేయడంతో ధ్యాన్ చంద్ అని పేరు పెట్టారు. హిందీ భాషలో చాంద్ అంటే చంద్రుడు అని అర్ధం.
  • ధ్యాన్ చంద్ పుట్టినరోజు నాడు “జాతీయ క్రీడా దినోత్సవం” పేరు తో జరుపుకుంటారు. ఆ రోజు క్రీడలు సంబంధించిన పురస్కారాలు అందజేస్తారు.
  • క్రీడాకారులకు ఇవ్వడానికి ధ్యాన్ చంద్ పేరు మీద పురస్కారం ప్రారంభించారు. క్రీడలలో ఇదే అత్యుత్తమ పురస్కారం
  • ధ్యాన్ చంద్ 90వ పుట్టినరోజు పురస్కరించుకుని 2002 సంవత్సరంలో ఢిల్లీ నగరంలోని ఒక మైదానం లో తన విగ్రహం ఆవిష్కరించారు. అలాగే ఆ మైదానంకి ధ్యాన్ చంద్ పేరు పెట్టడం జరిగింది.
  • వెయ్యి కన్నా ఎక్కువ గోల్స్ కొట్టి చరిత్ర సృష్టించారు.
  • ధ్యాన్ చంద్ పేరు మీద పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది భారత ప్రభుత్వం.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *