List of Manchu Vishnu Movies

Manchu Vishnu
Manchu Vishnu

బాలనటుడిగా, కధానాయకుడిగా, నిర్మాతగా ప్రయాణిస్తూ సినీమా తరువాత సినిమా చేస్తూ జయాపజలతో సంభందం లేకుండా ముందుకెళ్తున్న మంచు విష్ణువర్ధన్ బాబు గురించి తెలుసుకుందాం.

సినిమా ప్రయాణం

మోహన్ బాబు నటించిన రగిలే గుండెలు చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు మంచు విష్ణు, ఈ చిత్రానికి దర్శకులు పి. చంద్రశేఖర్ రెడ్డి మరియు లక్ష్మి ప్రసన్న బ్యానర్ మీద మోహన్ బాబు నిర్మించారు. 1985 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం పరవాలేదనిపించింది.

2003 సంవత్సరంలో షాజీ కైలాష్ దర్శకత్వంలో మంచు విష్ణు, శిల్ప శివానంద్ కలిసి నటించిన విష్ణు చిత్రం ఆకట్టుకుంది. ఈ చిత్రంతో మొదటిసారి కధానాయకుడిగా వెండితెరకి పరిచయం అయ్యారు మంచు విష్ణు మరియు కథానాయక శిల్పా శివానంద్. ఈ చిత్రానికి ఇస్మైల్ దర్బార్ సంగీతం వహించారు. ప్ర్రముఖ నటి సాక్షి శివానంద్ సోదరి శిల్పా శివానంద్ అవ్వడం విశేషం.

2004 సంవత్సరంలో సముద్ర దర్శకత్వంలో మంచు విష్ణు, సెలీనా జైట్లీ, వేద కలిసి నటించిన చిత్రం సూర్యం. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2006 సంవత్సరంలో మంచు విష్ణు, అనుష్క కలిసి నటించిన చిత్రం అస్త్రం. సర్ఫరోష్ అనే హిందీ చిత్రానికి రీమేక్ గా వచ్చిన అస్త్రం చిత్రంలో ప్రముఖ హిందీ నటులు జాకీష్రాఫ్ ప్రతినాయకుడి పాత్ర పోషించడం జరిగింది మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది.

మోహన్ బాబు, మంచు విష్ణు, శోభన, పార్వతి మెల్టన్ కలిసి నటించిన చిత్రం గేమ్. 2006 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రానికి దర్శకులు రాంప్రసాద్ జి. మరియు ఈ చిత్రం నిరాశపరిచింది. హిందీ చిత్రం టాక్సీ No. 9211 చిత్రానికి రీమేక్ గా వచ్చిన గేమ్ చిత్రంలో చాల రోజుల తరువాత ప్రముఖ నటి శోభన నటించడం విశేషం.

మొదటి విజయం

ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల దర్శకత్వంలో 2007 సంవత్సరంలో మంచు విష్ణు, జెనీలియా డి. సౌజ, శ్రీహరి, ప్రేమ కలిసి నటించిన ఢీ చిత్రం భారీ విజయం సాధించింది. ఢీ చిత్రంతో మొదటి విజయాన్ని అందుకున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో హాస్యనటులైన బ్రహ్మానందం మరియు సునీల్ పండించే హాస్యం ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఢీ చిత్రాన్ని తమిళ్, ఒడియా మరియు బెంగాలీ భాషలో కూడా రీమేక్ చేయడం విశేషం. తన తెలివితేలతో అందరిని ఆశ్చర్యపరుస్తూ మంచు విష్ణు పాత్ర ఎలా బురిడీ కొట్టిస్తాడనేది ఈ చిత్రంలో చూడొచ్చు.

సరదా సరదాగా సాగిపోయే ఢీ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి మరియు ఢీ చిత్రానికి చక్రి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించడమే కాకుండా పాటలు కూడా ఆకట్టుకున్నాయి.

“కింగ్” అక్కినేని నాగార్జున, మంచు విష్ణు కలిసి నటించిన చిత్రం కృష్ణార్జున. “సూపర్ స్టార్” రజనీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రాన్ని దర్శకత్వం వహించిన పి. వాసు ఈ చిత్రానికి దర్శకులు మరియు ఈ చిత్రంలో మమతా మోహన్దాస్ కధానాయికగా నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన కృష్ణార్జున చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈతరానికి తగ్గట్టు రూపొందించిన ఈ చిత్రంలో కృష్ణుడిగా నాగార్జున మరియు అర్జునుడిగా మంచు విష్ణు నటించడం విశేషం.

వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో మంచు విష్ణు, మోహన్ బాబు, ఇలియానా కలిసి నటించిన సలీం చిత్రం నిరాశపరిచింది. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మంచు విష్ణు, తాప్సి, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, అడవిశేష్ కలిసి నటించిన వస్తాడు నా రాజు చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద మంచు విష్ణు నిర్మించగా మణిశర్మ సంగీతం అందించారు.

జి. నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, హన్సిక కలిసి నటించిన దేనికైనా రెడీ చిత్రం విజయాన్ని అందించింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద మోహన్ బాబు నిర్మించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ చిత్రంలో తమిళ నటులు ప్రభు ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. వీరు పోట్ల దర్శకత్వంలో మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన దూసుకెళ్తా చిత్రం విజయం సాధించింది.

వరుస చిత్రాలు

మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ కథానాయకులుగా, రవీనా టండన్, హన్సిక, ప్రణీత కథానాయికలుగా నటించిన చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద. శ్రీవాస్ దర్శకత్వంలో మంచు విష్ణు, మంచు మనోజ్ నిర్మించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, మంచు విష్ణు, “సహజ నటి” జయసుధ, శాన్వి కలిసి నటించిన చిత్రం రౌడీ. హిందీ భాషలో వచ్చిన సర్కార్ చిత్రాన్ని తెలుగులో రౌడీ పేరుతొ రీమేక్ చేశారు రామ్ గోపాల్ వర్మ మరియు ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన రెండవ చిత్రం అనుక్షణం. డి. సి. పి పాత్రలో మంచు విష్ణు నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటి రేవతి ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు పాత్రకి మంచి పేరు రావడంతో పాటు చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. “దర్శకరత్న” దాసరి నారాయణరావు దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన చిత్రం ఎర్రబస్.

దాసరి నారాయణరావు, మంచు విష్ణు కలిసి తాతమనవడిగా నటించిన ఈ చిత్రంలో క్యాథెరిన్ థెరిస్సా కథానాయికగా నటించింది. ఎర్రబస్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయం చూసింది. దేవాకట్టా దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రణీత కలిసి నటించిన చిత్రం డైనమైట్ మరియు ఈ చిత్రంలో జె. డి. చక్రవర్తి ప్రత్యక పాత్రలో నటించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది.

జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, రాజ్ తరుణ్, రాజేంద్రప్రసాద్, సోనారిక బడోరియా, హేభ పటేల్ కలిసి నటించిన చిత్రం ఈడోరకం ఆడోరకం చిత్రం పరవాలేదనిపించింది. మంచు విష్ణు, హన్సిక కలిసి నటించిన మూడవ చిత్రం లకున్నోడు, ఈ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.

మోహన్ బాబు ద్విపాత్రాభినయంలో మంచు విష్ణు అతిధి పాత్రలో నటించిన చిత్రం గాయత్రీ. శ్రియ శరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, బ్రహ్మానందం, ప్రగ్య జైస్వాల్ కలిసి నటించిన ఆచారి అమెరికా యాత్ర చిత్రం ప్రేక్షకులను నిర్రశపరిచింది.

మరికొన్ని చిత్రాలు

జి. ఎస్. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, సురభి, సంపత్ రాజ్ కలిసి నటించిన ఓటర్ చిత్రం నిరాశపరిచింది. జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, రుచి సింగ్, నవదీప్, నవీన్ చంద్ర కలిసి నటించిన మోసగాళ్లు చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ కధానాయకుడు సునీల్ శెట్టి ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం.

24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద మంచు విష్ణు నిర్మించడమే కాకుండా ఈ చిత్రనికి కధ కూడా రాయడం విశేషం. మోసగాళ్లు చిత్రంలో మంచు విష్ణు, కాజల్ అగర్హ్వాల్ అన్న చెల్లిగా నటించడం విశేషం. ఐటీ పరిశ్రమలో జరిగిన ఒక కుంభకోణం నేపధ్యం మీద ఈ చిత్రం రూపొందించడం జరిగింది. అన్న చెల్లెలైన విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ కుంభకోణం చేసే పాత్రలో నటించారు మరియు వారిని పట్టుకునే పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి నటించారు.

ఈశాన సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు, పాయల్ రాజపుట్, సన్నీ లియోని కలిసి నటించిన జిన్నా చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రాన్ని 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద మోహన్ బాబు నిర్మించారు మరియు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో జారు మిఠాయి అనే పాట ప్రజాదరణ పొందింది.

వ్యక్తిగతం

చెన్నై నగరంలో 23 నవంబర్ 1981 సంవత్సరంలో మోహన్ బాబు, విద్య దేవి దంపతులకు జన్మించారు మంచు విష్ణు. తన చదువంతా చెన్నై, తిరుపతి లో జరిగింది. మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మి ప్రసన్న మరియు సోదరుడు మంచు మనోజ్ కుమార్. విరానికా అనే యువతితో మంచు విష్ణు ప్రేమ వివాహం చేసుకున్నారు మరియు వీరికి 4 పిల్లలు, 3 అమ్మాయిలు ఒక అబ్బాయి.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ స్థాపించి కొన్ని చిత్రాలని నిర్మించారు. తండ్రి మోహన్ బాబు స్థాపించిన విద్యానికేతన్ విద్యాసంస్థలను దెగ్గరుండీ చూసుకుంటున్నారు మంచు విష్ణు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కి గట్టి పోటీ ఇచ్చి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మొదటి సారి ఎన్నికయ్యారు మంచు విష్ణు ఇంకా రకరకాల కార్యక్రమాలు, సేవలు చేస్తూ చురుకుగా పాల్గొంటున్నారు మంచు విష్ణు.

మంచు విష్ణు నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం

బాలనటుడిగా
  1. రగిలే గుండెలు
కధానాయకుడిగా
  1. విష్ణు
  2. సూర్యం
  3. పొలిటికల్ రౌడీ (పాటలో అతిధి పాత్ర)
  4. అస్త్రం
  5. గేమ్
  6. ఢీ
  7. కృష్ణార్జున
  8. సలీం
  9. వస్తాడు నా రాజు
  10. దేనికైనా రెడీ
  11. దూసుకెళ్తా
  12. పాండవులు పాండవులు తుమ్మెద
  13. రౌడీ
  14. అనుక్షణం
  15. ఎర్ర బస్
  16. డైనమైట్
  17. ఇడొ రకం ఆడో రకం
  18. లక్కున్నోడు
  19. గాయత్రీ
  20. ఆచారి అమెరిక యాత్ర
  21. ఓటర్
  22. మోసగాళ్లు
  23. జిన్నా
  24. కన్నప్ప

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *