List of Mahesh Babu Movies

Mahesh Babu
Mahesh Babu

ప్రముఖ నటుడు “సూపర్ స్టార్, నటశేఖర” కృష్ణ వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి ఆ తరువాత కధానాయకుడిగా తనదైన శైలిలో దూసుకెళ్తున్న “సూపర్ స్టార్” మహేష్ బాబు గురించి తెలుసుకుందాం.

బాలనటుడిగా ప్రారంభం

ప్రముఖ దర్శకులు “దర్శకరత్న” దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ, మురళీమోహన్ కలిసి నటించిన నీడ చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు మహేష్ బాబు. 1979 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది. ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో కృష్ణ, జయసుధ కలిసి నటించిన పోరాటం చిత్రంలో నటించారు.

శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు,  గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్న తమ్ముడు, బాలచంద్రుడు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు మహేష్ బాబు. కృష్ణ దర్శక నిర్మాతగా వచ్చిన కొడుకు దిద్దిన కాపురంలో చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయడం విశేషం మరియు విడిపోయిన తల్లిదండ్రులని కలిపే పాత్రలో నటించారు మహేష్ బాబు. ఈ చిత్రంలో విజయశాంతి కథానాయకిగా నటించారు.

కధానాయకుడిగా ఆరంగ్రేటం

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరరావు దర్శకత్వంలో 1999 సంవత్సరంలో వచ్చిన రాజకుమారుడు చిత్రంతో కధానాయకుడిగా పరిచయమయ్యారు మహేష్ బాబు. బాలీవుడ్ భామ ప్రీతిజింటా ఈ చిత్రంలో కథానాయకిగా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, సుమలత, జయప్రకాశ్ రెడ్డి కలిసి నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది మరియు నంది పురస్కారాలు అందుకుంది.

వై. వి. ఎస్ చౌదరి దర్శకతవరంలో మహేష్ బాబు, సిమ్రాన్, సాక్షి శివానంద్, వెంకట్, శివాజీ కలిసి నటించిన యువరాజు చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రానికి రమణ గోగుల అందించిన సంగీతం ఆకట్టుకుంది. బి. గోపాల్ దర్శకత్వంలో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కలిసి నటించిన వంశీ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఈ చిత్రంలో కృష్ణ ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద ఆదిశేషగిరి రావు ఈ చిత్రాన్ని నిర్మించగా మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని అలరించింది.

కొన్ని విజయాలు కొన్ని అపజయాలు

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో 2001 సంవత్సరంలో మహేష్ బాబు, సోనాలి బేంద్రరే కలిసి నటించిన మురారి చిత్రం భారీ విజయం సాధించింది. ఒక కుటుంబం చేసిన తప్పు వల్ల ప్రతి 48 సంవత్సరాలకు ఆ కుటుంబంలో దుర్గా దేవి వల్ల ఒకరు బలవుతారు. ఈ సారి బలయ్యేది మురారి కాబట్టి ఆ శాపాన్ని ఎలా జయిస్తారు చివరికి ఆ శాపం ఉంటుందా లేదా అనేది ఈ చిత్ర కధనం.

కుటుంబ కధ నేపధ్యం మీద తీసిన మురారి చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి లక్ష్మి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, రఘుబాబు, ప్రసాద్ బాబు, అన్నపూర్ణ మరి కొంతమంది నటులు నటించి మెప్పించారు. మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తుంది, ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే పెళ్ళి పాట “అలనాటి రామచంద్రుడు” ఇప్పటికి ప్రతీ పెళ్ళిలో వినిపిస్తుండటం విశేషం.

జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో మహేష్ బాబు, లిసా రే, బిపాషా బసు కలిసి నటించిన టక్కరిదొంగ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు కౌబాయ్ పాత్రలో నటించి మెప్పించారు మరియు ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం. టక్కరిదొంగ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలో “నలుగురికి నచ్చినది” పాట జనాదరణ పొందింది. శోభన్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన బాబీ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది మరియు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

వరుస చిత్రాలు

2003 సంవత్సరంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఒక్కడు. మహేష్ బాబు, భూమిక కలిసి నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఒక వైపు కబడ్డీ ఆడుతూ మరో వైపు భూమికను ప్రకాష్ రాజ్ నుండి కాపాడే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా ఎన్నో పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రంలో చార్మినార్ సెట్ వేసి ప్రేక్షకులందరిని ఆశ్చర్యపరిచారు దర్శకులు గుణశేఖర్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా అన్ని పాటలు విజయం సాధించాయి.

తేజ దర్శకత్వంలో మహేష్ బాబు, రక్షిత కలిసి నటించిన నిజం చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటులు గోపీచంద్ నటించగా కధానాయిక రాశి కీలక పాత్రలో నటించి మెప్పించారు. లంచం నేపధ్యం మీద తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, తాళ్లూరి రామేశ్వరి, ప్రత్యేక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రానికి కొన్ని నంది పురస్కారాలు లభించడం విశేషం.

తమిళ దర్శకులు ఎస్. జె. సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు, అమీషా పటేల్ కలిసి నటించిన నాని చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విభిన్న కధ నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రంలో రఘువరన్ శాస్త్రవేత్త నటించారు మరియు ఒక ప్రయోగం చేయడం వల్ల మహేష్ బాబు పొద్దున్న ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు చిన్న పిల్లోడిలా ఆ తరువాత సమయమంతా పెద్దవాడిలా మారడం విశేషం. ఈ చిత్రంలో సునీల్ ఒక పాత్రలో నటించగా ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు.

మరికొన్ని చిత్రాలు

గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రియ శరన్, కీర్తి రెడ్డి, రాజా కలిసి నటించిన అర్జున్ చిత్రం పరవాలేదనిపించింది. అక్క తమ్ముడిగా మహేష్ బాబు, కీర్తి రెడ్డి నటించి ప్రేక్షకులని మెప్పించారు. ఈ చిత్రంలో అక్కని తన అత్త మామ నుంచి కాపాడుకునే తమ్ముడి పాత్రలో నటించారు మహేష్ బాబు.

అర్జున్ చిత్రాన్ని మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు నిర్మించారు మరియు ఈ చిత్రంలో మధుర మీనాక్షి ఆలయం సెట్ నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించడం జరిగింది మరియు ఈ చిత్రానికి కొన్ని పురస్కారాలు లభించడం విశేషం. గుణశేఖర్, మహేష్ బాబు కలయికలో వచ్చిన రెండవ చిత్రం అర్జున్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, త్రిష కలిసి నటించిన అతడు చిత్రం పరవాలేదనిపించింది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద దుగ్గిరా కిశోర్, ఎం. రామ్ మోహన్ నిర్మించిన ఈ చిత్రం 2005 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రంలో నటుడు సోను సూద్ మరియు మహేష్ బాబు ప్రొఫెషనల్ కిల్లర్స్ పాత్రలో నటించారు.

ఈ చిత్రంలో ప్రకాష రాజ్ సిబిఐ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శకులు కె. విశ్వనాధ్ అతిధి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది మరియు ఈ చిత్రంలోని పాటలు జనాదరణ పొందడం విశేషం.

ఈ చిత్రం “స్టార్ మా” తెలుగు ఛానెల్లో 1000 సార్లకి పైగా ప్రసారం అయ్యి రికార్డు సృష్టించింది మరియు చుసిన ప్రతి సారి కొత్తగా ఉంటుంది. అతడు చిత్రం థియేటర్ కంటే టీవీలో ఎక్కువమంది వీక్షకులు చూడటం విశేషం. ఈ చిత్రంలో బ్రహ్మానందం చిరాకు పడుతూ చేసే హాస్యం ప్రేక్షకులను అలరిస్తుంది.

రికార్డు బ్రేక్ చిత్రం

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2006 సంవత్సరంలో మహేష్ బాబు, ఇలియాన కలిసి నటించిన పోకిరి చిత్రం భారీ విరాజయం సాధించడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టింది. అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగరాయడం విశేషం. పోకిరి చిత్రాన్ని మహేష్ బాబు సోదరి మంజుళ ఘట్టమనేని మరియు పూరి జగన్నాధ్ కలిసి నిర్మించారు.

ఈ చిత్రం అండర్ కవర్ కాప్ నేపథ్యం మీద చిత్రీకరించడం జరిగింది మరియు మొదటిసారి ఈ చిత్రంలో నటుడు మహేష్ బాబు పోలీస్ పాత్రలో కనిపించి అలరించారు. తెలుగు సినిమా అంటే పోకిరి ముందు పోకిరి తరువాత ఆనేలాగా ప్రేక్షకులు చెప్పుకోవడం మొదలుపెట్టారు.

అప్పటివరకు మహేష్ బాబుని క్లాస్ మరియు సాఫ్ట్ పాత్రలలో చుసిన ప్రేక్షకులను పూరి జగన్నాధ్ మాస్ పాత్రలో చూపించి ఆశ్చర్యపరిచారు. ప్రతి డైలాగ్ ప్రతి సన్నివేశం, ప్రతి ఫైట్ అన్ని ఒక కొత్త మహేష్ బాబుని చూపించారు దర్శకులు పూరి జగన్నాధ్. మొదటి సన్నివేశం నుంచి మహేష్ బాబు పాత్రని ఒక ఆకు రౌడీ లాగ, డబ్బులు తీసుకుని ఎవరినైనా కొట్టే వ్యక్తిగా చిత్రకరించి సినిమా చివరికి వచ్చేసరికి తనొక పోలీస్ అని తెలిసేసరికి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు.

ఈ చిత్రంలో ఇలాంటి మలుపుతో వచ్చిన సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అంతేకాకుండా పోకిరి చిత్రంలో కొన్ని సంభాషణలు అభిమానులకు ఇప్పటికి గుర్తుండడం విశేషం. “ఎప్పుడొచ్చాను కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా అనేది ముఖ్యం”, “ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపొద్దో ఆడే పండుగాడు”, “నేనెంత ఎదవనో నాకే తెలీదు” లాంటి సంభాషణలు ప్రేక్షకులను ఈలలు కొట్టేలా చేశాయి. పోకిరి చిత్రం తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ మరియు బాంగ్లాదేశ్ భాషలలో కూడా రీమేక్ చేయడం జరిగింది.

ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. ఈమధ్య పోకిరి చిత్రాన్ని రి రిలీజ్ చేస్తే అప్పుడు కూడా ప్రేక్షకులు ఆదరించడం విశేషం. ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం.

వరుస పరాజయాలు

పోకిరి చిత్రం తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సైనికుడు చిత్రం భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. ఒక్కడు, అర్జున్ చిత్రాల తరువాత మహేష్ బాబు, గుణశేఖర్ కలయికలో వచ్చిన మూడవ చిత్రం సైనికుడు. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి హర్రీస్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు, అమ్రిత రావు కలిసి నటించిన అతిధి చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రంతో మురళి శర్మ ప్రతినాయకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం అలరించింది. 2010 సంవత్సరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, అనుష్క కలిసి నటించిన ఖలేజా చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రేక్షకులను అలరించింది.

ఖలేజా చిత్రంలో మహేష్ బాబు మొదటి సారి హాస్యాన్ని పండించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్లో నిరాశపరిచిన టీవిలో ప్రసారమైన ప్రతిసారి ప్రేక్షకులు వీక్షించడం విశేషం. ఈ చిత్రం జెమినీ టీవీలో ప్రసారమైన ప్రతిసారి ప్రేక్షకులు చూడటం విశేషం. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం అలరించింది.

వరుస విజయాలు, మల్టీస్టారర్

శ్రీను వైట్ల దర్శకత్వంలో 2011 సంవత్సరంలో మహేష్ బాబు, సమంత కలిసి నటించిన దూకుడు చిత్రం భారీ విజయం సాధించింది. తండ్రిని చంపాలని చుసిన సోను సూద్ మరియు అతని గ్యాంగ్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది చిత్ర నేపధ్యం. ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది.

డివైడ్ టాక్ తెచ్చుకున్న తరువాత కూడా అందరి అంచనాలని పటాపంచలు చేస్తూ భారీ విజయం సాధించడంతోపాటు భారీ వసూళ్లు కూడా రాబట్టింది దూకుడు చిత్రం. ఒక వైపు ఐపీఎస్ వృత్తిలో సేవ చేస్తూ మరోవైపు తండ్రిని నమ్మించడానికి ఎం. ఎల్. ఏ పాత్రలో నటించారు మహేష్ బాబు. దూకుడు చిత్రంలో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించి మెప్పించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎం. ఎస్. నారాయణ పండించిన హాస్యం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన బిజినెస్మెన్ చిత్రం భారీ విజయం సాధించింది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర చాల కొత్తగా ఉండడం విశేషం. ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. ముంబై నగరంలో జరిగే మాఫియా నేపధ్యం మీద ఈ చిత్రాన్ని రూపొందించారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013 సంవత్సరంలో “విక్టరీ” వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఘన విజయం సాధించింది. తెలుగు సినిమాలో చాల రోజుల తరువాత ఇద్దరు అగ్ర కథానాయకులు కలిసి నటించడం విశేషం. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలో సమంత, అంజలి కథానాయికలుగా నటించారు.

కోట శ్రీనివాసరావు, తణికెళ్లభరణి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, తేజస్వి, రమాప్రభ, రోహిణి హట్టంగిడి మరియు మిగితా నటులు అద్భుతంగా నటించారు. పెద్దోడు, చిన్నోడు పాత్రలో వెంకటేష్, మహేష్ బాబు చక్కగా నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో వచ్చే ప్రతి సన్నివేశం మళ్ళి మళ్ళి చూడాలనిపిస్తుంది.

మిక్కీ జె. మేయర్ అందించిన సంగీతం మరియు మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో అన్ని పాటలు ప్రేక్షకులను అలరించడం విశేషం. ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించాయి.

వరుస పరాజయాలు, సామజిక చిత్రాలు

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు, కృతిసనన్ కలిసి నటించిన 1: నేనొక్కడినే చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు కొత్త పాత్రలో కనిపించడం జరిగింది. లేనిది ఉన్నట్టు, జరగనిది జరిగినట్టు, తను చేయనిది చేసినట్టు ఒక ఊహా ప్రపంచంలో ఉంటారు మహేష్ బాబు. నేపధ్యం కొత్తగా ఉన్న ప్రేక్షకులని అలరించడంలో ఈ చిత్రం విఫలమైంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అలరించింది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు, తమన్నా కలిసి నటించిన ఆగడు చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నటించడం విశేషం. ఎస్. ఎస్. థమన్ అందించిన సంగీతం పరవాలేదనిపించింది. శ్రీను వైట్ల, మహేష్ బాబు కలియికలో వచ్చిన రేబీదవా చిత్రం ఆగడు.

కొరటాల శివ దర్శకత్వంలో 2015 సంవత్సరంలో మహేష్ బాబు, శృతి హస్సన్ కలిసి నటించిన శ్రీమంతుడు చిత్రం భారీ విజయం సాధించింది. ఊరిని దత్తత తీసుకునే పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించారు. ఈ చిత్రం జగపతిబాబు మహేష్ బాబు తండ్రిగా నటించారు మరియు తమిళ నటులు రాహుల్ రవీంద్రన్ ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికి ప్రేక్షకులని అలరిస్తుంది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత కలిసి నటించిన బ్రహ్మోత్సవం చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. “సహజ నటి” జయసుధ, సత్యరాజ్, నరేష్, రావురమేష్, రేవతి మరియు మరికొంతమంది నటులతో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. మిక్కీ జె. మేయర్ అందించిన సంగీతం పరవాలేదనిపించింది.

ఏ. ఆర్. మురుగుద దర్శకత్వంలో మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన స్పైడర్ చిత్రం నిరాశపరిచింది. హర్రీస్ జయరాజ్ అందించిన సంగీత కూడా ఆకట్టుకోలేపోయింది. ఈ చిత్రంలో దర్శకులు ఎస్. జె. సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు భాషతో పాటు తమిళ భాషలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

మరికొన్ని చిత్రాలు

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, కియారా అద్వానీ కలిసి నటించిన భారత్ అనే నేను చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రిగా శరత్ కుమార్ ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. తండ్రి చనిపోయాక ఆ ముఖ్యమంత్రి పదవి మహేష్ బాబు తీసుకోవడం ఆ తరువాత జరిగే సన్నివేశాలు చూసే విధంగా ఉంటాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అలరించింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెగ్డే, అనన్య కలిసి నటించిన మహర్షి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు మొదటి భాగం విద్యార్థిగా ఆ తరువాత వ్యాపారవేత్తగా కనిపిస్తారు. అల్లరి నరేష్, మహేష్ బాబు ఈ చిత్రంలో స్నేహితులుగా నటించడం విశేషం.

ఈ చిత్రంలో జగపతిబాబు ప్రతినాయకుడి పాత్రలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అలరించింది. వ్యవసాయం నేపధ్యం మీద ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రానికి కొన్ని పురస్కారాలు లభించడం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరూ చిత్రం విజయం సాధించింది.

ఈ చిత్రంలో రావు రమేష్, సంగీత, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పాత్రలో నటించారు. చాల రోజుల తరువాత ఈ చిత్రంతో మళ్ళి వెండితెర మీద కనిపించరు “లేడీ సూపర్ స్టార్” విజయశాంతి. ఆర్మీ నేపథ్యంతో పాటు హాస్య ప్రధానం జత చేసి నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక పాటలో నటించడం విశేషం.

పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ కలిసి నటించిన సర్కారు వారి పాట చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించారు. 2024 సంవత్సరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, జయరాం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కలిసి నటించిన గుంటూరు కారం చిత్రం పారవేలేదనిపించింది. ఎస్. ఎస్. థమన్ అందించిన సంగీతం అలరించగా ఈ చిత్రంలో “కుర్చీ మడతపెట్టి” పాట ఉర్రుతలూగించింది.

వ్యక్తిగతం

ఆగష్టు 9, 1975 సంవత్సరంలో చెన్నై నగరంలో మహేష్ బాబు జన్మించారు. తండ్రి “సూపర్ స్టార్” కృష్ణ మరియు తల్లి పేరు ఇందిరా. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కూడా ప్రసిద్ధ నటులు మరియు కొన్ని చిత్రాల్లో నటించారు అలాగే ఇద్దరు అక్కలు మరియు ఒక చెల్లెలు కూడా ఉన్నారు. మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు కూడా సినిమాలో కధానాయకుడిగా నటిస్తున్నారు.

మహేష్ బాబు పెద్ద బావ గల్లా జయదేవ్ రాజకీయాల్లో చురుకుగా ఉండగా మరో బావ సంజయ్ స్వరూప్ కుడా చిత్రాల్లో నటించారు. మహేష్ బాబు అక్క మంజుళ కూడా కొన్నిచిత్రాల్లో నటించగా ఆ తరువాత ఇందిరా ప్రొడక్షన్స్ పేరుతో కొన్ని చిత్రాలు నిర్మించారు. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కూడా కొన్ని చిత్రాలని నిర్మించారు.

మహేష్ బాబు బాబాయ్ ఆది శేషగిరి రావు నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించారు. 2005 సంవత్సరంలో ప్రముఖ నటి నమ్రత శిరోద్కర్ తో మహేష్ బాబు వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం కావడం విశేషం మరియు వీరికి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె.

మహేష్ బాబు గురించి మరి కొన్ని విషయాలు

“ప్రిన్స్”, “సూపర్ స్టార్” బిరుదులతో మహేష్ బాబును అభిమానులు పిలుచుకుంటారు. ఇప్పటివరకు ఎన్నో నంది పురస్కారాలు, ఫిలిం ఫేర్ పురస్కారాలు మరియు ఇతర పురస్కారాలు సాధించారు మహేష్ బాబు. శ్రీమంతుడు చిత్రంతో మొదటి సారి సహా నిర్మాతగా మారి GMB ప్రొడక్షన్స్ పేరుతొ నిర్మాణ సంస్థని స్థాపించారు.

AMB పేరుతొ మల్టీప్లెక్స్ థియేటర్ స్థాపించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు. మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించారు మహేష్ బాబు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బుర్రిపాలెం మరియు తెలంగాణ రాష్ట్రంలో సిద్దాపురం ఊళ్ళని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు మహేష్ బాబు.

జల్సా, బాద్షా, శ్రీ శ్రీ, మనసుకు నచ్చింది, ఆచార్య చిత్రాలకి గాత్ర దానం చేశారు మహేష్ బాబు. ఇంగ్లీష్ చిత్రం ముఫాస: ది లయన్ కింగ్ చిత్రంలో సింహానికి డబ్బింగ్ చెప్పారు మహేష్ బాబు మరియు ఎన్నో ప్రకటనలలో కనిపిస్తున్నారు మహేష్ బాబు.

మహేష్ బాబు నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
బాలనటుడిగా:
  1. నీడ
  2. పోరాటం
  3. శంఖారావం
  4. బజారురౌడీ
  5. ముగ్గురు కొడుకులు
  6. గూఢచారి 117
  7. కొడుకు దిద్దిన కాపురం
  8. అన్న తమ్ముడు
  9. బాలచంద్రుడు
కధానాయకుడిగా:
  1. రాజకుమారుడు
  2. యువరాజు
  3. వంశీ
  4. మురారి
  5. టక్కరిదొంగ
  6. బాబీ
  7. ఒక్కడు
  8. నిజం
  9. నాని
  10. అతడు
  11. పోకిరి
  12. సైనికుడు
  13. అతిధి
  14. ఖలేజా
  15. దూకుడు
  16. బిజినెస్ మెన్
  17. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
  18. 1-నేనొక్కడినే
  19. ఆగడు
  20. శ్రీమంతుడు
  21. బ్రహ్మోత్సవం
  22. స్పైడర్
  23. భారత్ అనే నేను
  24. మహర్షి
  25. సరిలేరు నీకెవ్వరూ
  26. సర్కారువారిపాట
  27. గుంటూరు కారం

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *