అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అరవింద్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్. బాలనటుడిగా తెలుగు సినిమాకి పరిచయమై ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ చిత్రంలో డాన్స్ నేర్చుకునే కుర్రాడి పాత్రలో నటించారు అల్లు అర్జున్. ఇది ఒక అతిధి పాత్ర కావడం విశేషం.
కధానాయకుడిగా తెరంగ్రేటం
ప్రముఖ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన వందవ చిత్రం గంగోత్రి చిత్రంతో అల్లు అర్జున్ కధానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో కథానాయకిగా ప్రముఖ నటి ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ నటించడం జరిగింది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన రెండవ చిత్రం ఆర్య. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు అల్లు అర్జున్ పాత్రకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో కథానాయకిగా అను మెహతా నటించారు. విభిన్నమైన ప్రేమ కధ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
వి. వి. వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన మూడవ చిత్రం బన్నీ. గౌరీ ముంజల్ కథానాయకిగా నటించిన ఈ చిత్రం భారీ విజయంతో పాటు భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంతో “స్టైలిష్ స్టార్” అనే బిరుదు అల్లు అర్జున్ కి ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాట్రిక్ విజయాలు సాధించిన కొంతమంది కధానాయకుల జాబితాలో అల్లు అర్జున్ చేరడం విశేషం.
సంవత్సరానికి ఒక సినిమా చొప్పున వరసగా చిత్రాలు చేస్తున్నారు అల్లు అర్జున్. 2006 నుంచి 2021 సంవత్సరం వరకు రక రకాల పాత్రలు చేస్తూ కొన్ని విజయాలు మరియు కొన్ని అపజయాలతో ముందుకు సాగుతూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్థానంతో పాటు అభిమానులని కూడా సంపాదించుకున్నారు. తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా కేరళ రాష్ట్రంలో కూడా అల్లు అర్జున్ కి అభిమానులు ఉండడం విశేషం.
పాన్ ఇండియా చిత్రం
ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కలయికలో వచ్చిన చిత్రం పుష్ప. రష్మిక మందన కథానాయకిగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటించాడు అనడం కంటే జీవించేసారు అని చెప్పాలి. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే పాత్రలో అల్లు అర్జున్ చేసిన నటనకి ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో కూడా ఈ చిత్రం విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పుష్ప చిత్రానికి రెండవ భాగం రావడానికి సిద్ధంగా ఉంది అంతేకాకుండా ఈ సరి ఈ చిత్రాన్ని బెంగాలీ భాషలో కూడా విడుదల చేస్తుండడం విశేషం.
పురస్కారాలు
సినీ మా పురస్కారం, ఫిలిం ఫేర్, నంది పురస్కారం, ఐఫా ఉత్సవం పురస్కారం, సంతోషం పురస్కారం ఇంకా మరి కొన్ని పురస్కారాలు అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
అల్లు అర్జున్ గురించి మరి కొన్ని విశేషాలు
- సంవత్సరానికి ఒక చిత్రం చేసే అల్లు అర్జున్ 2010 సంవత్సరంలో మాత్రం రెండు చిత్రాలు విడుదల చేయడం జరిగింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన వేదం చిత్రాలు విడుదలయ్యాయి.
- కేరళ రాష్ట్రంలో అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని అభిమానులు పిలుచుకుంటారు.
- గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమ్మదేవి చిత్రంలో గోన గన్న రెడ్డి పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
- ఇన్ని సంవత్సరాల జాతీయ సినీ పురస్కారాల్లో మొదటి సారి తెలుగు కథానాయకుడికి ఉత్తమ నటుడు పురస్కారం రావడం జరిగింది. పుష్ప చిత్రానికి ఈ పురస్కారం లభించింది.
- స్టైలిష్ స్టార్ బిరుదుతో పాటు “ఐకాన్ స్టార్” అనే బిరుదు కూడా అభిమానులు ఇవ్వడం జరిగింది.
- హైదరాబాద్ లోని అమీర్పేట్ లో ఉన్న సత్యం థియేటర్ ను AAA సినిమాస్ గా పునర్నిర్మించడం జరిగింది.
- ఐ యాం దట్ చేంజ్ అనే సామజిక భాద్యత ఉన్న షార్ట్ ఫిలిం లో నటించారు.
వ్యక్తిగతం
చెన్నై నగరంలో 1982 సంవత్సరం ఏప్రిల్ 8న అల్లు వారి కుటుంబంలో జన్మించారు అల్లు అర్జున్. తాతయ్య ప్రసిద్ధి హాస్యనటులు మరియు తండ్రి నిర్మాత అల్లు అరవింద్. అల్లు అర్జున్ కి ఒక అన్నయ్య వెంకటేష్ మరియు ఒక తమ్ముడు శిరీష్ ఉన్నారు. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి అల్ల్లు అర్జున్ కు స్వయానా మేన మామ అవుతారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడంతో అల్లు అర్జున్ చదువంతా ఇక్కడే సాగింది. 2011 సంవత్సరం మార్చ్ 6న అల్లు అర్జున్ వివాహం స్నేహ రెడ్డితో జరిగింది, వారికి ఇద్దరు పిల్లలు.
అల్లు అర్జున్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
బాలనటుడిగా:
- విజేత
- స్వాతిముత్యం
కధానాయకుడిగా:
- డాడీ (అతిధి పాత్ర)
- గంగోత్రి
- ఆర్య
- బన్నీ
- హ్యాపీ
- దేశముదురు
- శంకర్ దాదా జిందాబాద్ (పాటలో అతిధి పాత్ర)
- పరుగు
- ఆర్య 2
- వరుడు
- వేదం
- బద్రీనాథ్
- జులాయి
- ఇద్దరమ్మాయిలతో
- ఐ ఆమ్ దట్ చేంజ్ (షార్ట్ ఫిలిం)
- ఎవడు
- రేసుగుర్రం
- సన్ అఫ్ సత్యమూర్తి
- రుద్రమ్మదేవి
- సరైనోడు
- దువ్వాడ జగన్నాధం
- నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
- అలా వైకుంఠపురంలో
- పుష్ప: ది రైజ్
- పుష్ప: ది రూల్