
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు సినిమాతో పాటు హిందీలో భాషల్లో కూడా నటిస్తూ అభిమానాన్ని సంపాదించుకున్నారు “కింగ్” అక్కినేని నాగార్జున. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, స్టూడియో అధినేతగా ప్రయాణిస్తూ అగ్ర కధానాయకుల్లో ఒకరిగా ఉన్న అక్కినేని నాగార్జున గురించి తెలుసుకుందాం.
సినీ ప్రస్థానం
వెలుగు నీడలు చిత్రంలో చిన్న బాబు పాత్రలో మెరిసిన నాగార్జున సుడిగుండాలు చిత్రంలో బాలనటుడిగా నటించారు. 1986 సంవత్సరంలో వి. మధుసూధనరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని వెంకట్ నిర్మించిన విక్రమ్ చిత్రంతో వెండితెరకు కధానాయకుడిగా పరిచయం అయ్యారు నాగార్జున. శోభన కథానాయికగా నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది.
వి. బి. రాజేంద్రప్రసాద్ దర్శక నిర్మాతగా వచ్చియినా కెప్టెన్ నాగార్జున చిత్రంలో నాగార్జున, రాజేంద్ర ప్రసాద్, ఖుష్బూ నటించారు మరియు ఈ చిత్రం నిరాశపరిచింది. క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన అరణ్యకాండ పరవాలేదనిపించిన ఆ తరువాత వచ్చిన మజ్ను చిత్రం భారీ విజయం సాధించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నాగార్జున, రజని, మున్ మున్ సేన్ నటించారు.
గీత కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ కలిసి నటించిన సంకీర్తన చిత్రం విజయాన్ని అందుకుంది. బి. గోపాల్ దర్శకత్వంలో యార్లగడ్డ సురేంద్ర నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, శారదా, రజని కలిసి నటించిన చిత్రం కలెక్టర్ గారి అబ్బాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు.
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్నిపుత్రుడు, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిరాయిదాదా చిత్రాలలో అలరించారు నాగార్జున. అశ్వినీదత్ నిర్మాణంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలోనాగార్జున, శ్రీదేవి, సుహాసిని కలిసి నటించిన ఆఖరిపోరాటం భారీ విజయం సాధించింది. ఇళయరాజా అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.
చినబాబు, జానకీరాముడు, విజయ్, విక్కీ దాదా చిత్రాలతో అలరించారు నాగార్జున. 1989 సంవత్సరంలో తమిళ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున, గిరిజ కలిసి నటించిన చిత్రం గీతాంజలి. ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని చూసింది. కధానాయికగా గిరిజకి గీతాంజలి మొదటి చిత్రం అవ్వడం విశేషం. ఇళయరాజా అందించిన సంగీతం ప్రేక్షకులు ఇప్పటికి అలరిస్తుంది. గీతాంజలి చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్ని చిత్రం పరవాలేదనిపించింది.
మలుపు తిప్పిన చిత్రం
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర కలిసి నిర్మించిన చిత్రం శివ. నాగార్జున, అమల, రఘువరన్ కలిసి నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు భారీ వసూళ్ళని సాధించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరించింది.
శివ చిత్రంతో రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు మరియు ఈ చిత్రం పూర్తిగా కాలేజ్ నేపధ్యం మరియు అక్కడ జరిగే అల్లర్లు, గొడవలు మీద తీయడం జరిగింది. కాలేజ్ విద్యార్థిగా నాగార్జున నటన అద్భుతం అని చెప్పొచ్చు. ముఖ్యంగా సైకిల్ చైన్ తో జె. డి. చక్రవర్తి తో చేసిన ఫైట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. 1989 సంవత్సరంలో విడుదలైన శివ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం.
నాగార్జున నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం జరిగింది. కొన్ని నిజజీవిత సంఘటనలు, పాత్రలను తీసుకొని ఈ చిత్రం రూపొందించారు దర్శకులు రామ్ గోపాల్ వర్మ. నాగార్జున, మోహన్ బాబు, అమల కలిసి నటించిన ప్రేమ యుద్ధం విజయాన్ని అందుకుంది. క్రాంతికుమార్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు, నాగార్జున, శోభన, అయేషా ఝల్కా కలిసి నటించిన నేటి సిద్దార్థ చిత్రం విజయాన్ని అందుకుంది.
ఇద్దరు ఇద్దరే చిత్రం పరవాలేదనిపించిన ఆ తరువాత హిందీ భాషలో శివ చిత్రాన్ని నిర్మించారు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో నాగార్జున హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హిందీ భాషలో కూడా భారీ విజయాన్ని అందించింది శివ చిత్రం. నిర్ణయం, చైతన్య, శాంతి క్రాంతి, జైత్రయాత్ర చిత్రాలతో అలరించారు నాగార్జున. ఫాజిల్ దర్శకత్వంలో నాగార్జున, నగ్మా కలిసి నటించిన కిల్లర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
మరికొన్ని చిత్రాలు
అమితాబ్ బచ్చన్, నాగార్జున, శ్రీదేవి, శిల్ప శిరోద్కర్ కలిసి నటించిన హిందీ చిత్రం ఖుదాగవ. ముకుల్ ఎస్. ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీదేవి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, ఊర్మిళ కలిసి నటించిన చిత్రం అంతం. ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషలో కలిపి చిత్రీకరించడం విశేషం మరియు ఈ చిత్రం విజయాన్ని చూసింది. ద్రోహి పేరుతొ హిందీ భాషలో విడుదలైంది అంతం చిత్రం.
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నాగార్జున, మీనా కలిసి నటించిన చిత్రం ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. వి. దొరస్వామిరాజు నిర్మించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఎం. ఎం. కీరవాణి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో నాగార్జున, శోభన, రోజా కలిసి నటించిన చిత్రం రక్షణ. ఈ చిత్రం భారీ విజయాన్ని అందించింది.
ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో “నటశేఖర” “సూపర్ స్టార్” కృష్ణ, నాగార్జున, నగ్మా కలిసి నటించిన చిత్రం వారసుడు. సరదా సరదాగా సాగిపోతూ ఆ తరువాత తండ్రీకొడుకుల మధ్య జరిగే పోరాటం చివరికి తండ్రిని అపార్ధం చేసుకొనే సన్నివేశంతో కధ సుఖాంతం అవుతుంది. తండ్రి కొడుకు గా కృష్ణ, నాగార్జున నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఈ చిత్రం లో హాస నటులు బ్రహ్మానందం పండించిన హాస్యం ప్రేక్షకులను అలరిస్తుంది.
హిందీ దర్శకులు మహేష్ భట్ దర్శకత్వంలో నాగార్జున, రమ్య కృష్ణ, మనీషా కొయిరాలా కలిసి నటించిన చిత్రం క్రిమినల్. తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా ఏకకాలంలో చిత్రీకరించారు దార్ధకులు మహేష్ భట్. ఈ చిత్రంలో నాగార్జున వైద్యుడి పాత్రలో నటించి మెప్పించారు. ఎం . ఎం . కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలన్ని జనాదరణ పొందడం విశేషం. ముఖ్యంగా “తెలుసా మనసా” పాట ఇప్పటికి ప్రేక్షకులు పాడుకుంటారు.
1995 – 2000 మధ్య చిత్రాలు
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కె. కృష్ణ మోహనరావు నిర్మాణంలో వచ్చిన ఘరానా బుల్లోడు చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని నటించిన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. జట్కా బండి నడిపే నాగార్జున పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం సిసింద్రీ. శరత్ బాబు, ఆమనీ నటించిన ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ బాల నటుడిగా పరిచయం అయ్యారు.
దుండగుల చేతిలో అపహరణకు గురయ్యే చిన్న బాబు పాత్రలో అఖిల్ నటించారు. గిరిబాబు, సుధాకర్, తణికెళ్లభరణి కలిసి అపహరించిన ఆ బాబు ఈ ముగ్గురిని ఎలా ముప్పతిప్పలు పెట్టి ఎలా తప్పించుకున్నాడు, చివరికి తల్లి తండ్రి చంతకి ఎలా చేరాడో అనేది కధ. ఈ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఇంగ్లీష్ చిత్రానికి సిసింద్రీ చిత్రం రీమేక్ గా రావడం విశేషం. రాజ్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సిసింద్రీ చిత్రంలో “చిన్నితండ్రి”, “ఆటాడుకుందాం రా” పాటలు జనాదరణ పొందడం విశేషం. రోజా, ఇంద్రజ కథానాయికలుగా నాగార్జున నటించిన వజ్రం పారవేలాడనిపించినా ఆ తరువాత సౌందర్య తో కలిసి నటించిన రాముడొచ్చాడు చిత్రం విజయాన్ని అందించింది. కె. భాగ్యరాజ్ దర్శకత్వంలో అనిల్ కపూర్, నాగార్జున, శ్రీదేవి కలిసి నటించిన హిందీ చిత్రం Mr. బేచారా. ఈ చిత్రం విజయాన్ని అందించింది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున, టబు కలిసి నటించిన చిత్రం నిన్నేపెళ్లాడుతా. కుటుంబ కధ మరియు ప్రేమకథ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం భారీ విజయంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం మరియు ఈ చిత్రం కన్నడ భాషలో రీమేక్ చేయడం విశేషం.
భక్తిరస చిత్రం
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వి. దొరస్వామిరాజు నిర్మాణంలో వచ్చిన భక్తిరస చిత్రం అన్నమయ్య. వేంకటేశ్వర స్వామి భక్తుడు అన్నమయ్య జీవిత ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్నో పురస్కారాలు అందుకుంది. నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి, సుమన్, భానుప్రియ, శ్రీకన్య, మోహన్ బాబు, రోజా కలిసి నటించిన అన్నమయ్య చిత్రంలో నాగార్జున అన్నమయ్య పాత్రలో నటించడం విశేషం.
అప్పటివరకు ప్రేమికుడిగా, యాక్టన్ చిత్రాల్లో నటించిన నాగార్జున భక్తుడి పాత్రలో నటిస్తున్నారని తెలియగానే ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం జరిగింది ఆ తరువాత అన్నమయ్య చిత్రం విడుదలై అందులో నాగార్జున పాత్ర నటన చూసి ఎంతోమంది విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడం విశేషం. తిమ్మక్క, అక్కలమ్మ పాత్రలలో రమ్యకృష్ణ, కస్తూరి నటించడం విశేషం.
వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటించారు అని చెప్పడంకంటే జీవించారు అని చెప్పవచ్చు. పద్మావతి అమ్మవారిగా భానుప్రియ, భూదేవి పాత్రలో శ్రీకన్య నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఎం. ఎం. కీరవాణి అందించిన సంగీతంతో పాటు ఈ చిత్రంలోని అన్ని పాటలు విజయాన్ని సాధించడమే కాకుండా ప్రేక్షకులని ఇప్పటికి అలరిస్తున్నాయి. అన్నమయ్య చిత్రాన్ని తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేయడం విశేషం.
తమిళంలో సినిమా
రాట్చగన్ చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు నాగార్జున, సుష్మితాసేన్. నూతన దర్శకులు ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో “సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా” పాట జనాదరణ పొందింది. ఏ. ఆర్. రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు మరియు ఈ చిత్రం తెలుగులో రక్షకుడు పేరుతొ విడుదలైంది.
ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆవిడా మా ఆవిడే, సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆటో డ్రైవర్, మహేష్ భట్ హిందీ భాషలో దర్శకతం వహించిన అంగారే చిత్రాలు నిరాశపరిచాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన చంద్రలేఖ చిత్రం విజయాన్ని అందుకుంది. రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ కథానాయికలుగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.
మహేష్ భట్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, నాగార్జున, పూజాభట్, సోనాలి బెంద్రే కలిసి నటించిన హిందీ చిత్రం జక్మ్ విజయాన్ని సాధించింది. వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో నందమూరి హరికృష్ణ, నాగార్జున, రవితేజ, కల్పన, సాక్షి శివానంద్, సంఘవి కలిసి నటించిన సీతారామరాజు చిత్రం ఘన విజయం సాధించింది. అన్నదమ్ములుగా హరికృష్ణ, నాగార్జున నటించడం విశేషం మరియు ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.
జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో నాగార్జున, అంజలి ఝవేరి కలిసి నటించిన రావోయి చందమామ నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన నువ్వు వస్తావని చిత్రం ఘానా విజయం సాధించింది. నాగార్జున, సిమ్రాన్ కలిసి నటించిన ఈ చిత్రానికి వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఆర్. ఆర్. షిండే దర్శకత్వంలో నాగార్జున, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, సౌందర్య నటించిన నిన్నేప్రేమిస్తా ఘన విజయం సాధించింది.
నిన్నేప్రేమిస్తా చిత్రానికి ఎస్. ఏ. రాజ్ కుమార్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో ప్రతి పాత ఇప్పటికి ప్రేక్షకులు పాడుకుంటూ ఉండటం విశేషం. తిరుపతిస్వామి దర్శకత్వంలో అశ్వినిదత్ నిర్మాణంలో నాగార్జున, శిల్పాశెట్టి, సౌందర్య కలిసి నటించిన ఆజాద్ చిత్రం ఘన విజయం సాధించింది.
2001 – 2010 మధ్య చిత్రాలు
నాగార్జున ద్విపాత్రాభినయం చేసి నటించిన చిత్రం ఎదురులేనిమనిషి. సౌందర్య, షెహనాజ్ కలిసి నటించిన ఈ చిత్రం నిరాశపరిచింది. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సిమ్రాన్, రీమాసేన్ లతో కలిసి నటించిన బావనచ్చడు, మోహన్ బాబు, సౌందర్య, ప్రీతి జింగానీ తో కలిసి నటించిన అధిపతి, రవీం టండన్ తో కలిసి నటించిన ఆకాశవీధిలో, సుమంత్, సుధాకర్, భూమిక చావ్లా, ప్రత్యూషలతో కలిసి నటించిన స్నేహమంటే ఇదేరా చిత్రాలు నిరాశపరిచాయి.
దశరథ్ దర్శకత్వంలో 2002 సంవత్సరంలో కె. ఎల్. నారాయణ నిర్మాణంలో వచ్చిన చిత్రం సంతోషం. నాగార్జున, శ్రియ శరన్, గ్రేసీ సింగ్ కలిసి నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. సంతోషం చిత్రంలో కె. విశ్వనాధ్ ప్రత్యేక పాత్రలో నటించి అలరించారు మరియు ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరించాయి.
సంతోషం చిత్రంలో మిగితా పాత్రలలో నటించిన పృథ్విరాజ్, అనిత చౌదరి, ప్రభుదేవా, సునీల్ తమ నటనతో అలరించారు. ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించాయి. అర్జున్ సజనని దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, జాకీ శ్రోఫ్, నాగార్జున, రవీనా టండన్, ప్రభుదేవా కలిసి నటించిన హిందీ చిత్రం అగ్నివర్ష, ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.
కె. విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సోనాలి బెంద్రే, అన్షు కలిసి నటించిన చిత్రం మన్మధుడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మించిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు పురస్కారాలు అందుకుంది. ఇప్పటికి ఈ చిత్రం టివి లో ప్రసారం చేస్తే ప్రేక్షకులు బ్రహ్మ్రధం పడతారు.
జె. పి. దత్త దర్శకత్వంలో సంజయ్ దత్, అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ ఖన్నా, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, నాగార్జున కలిసి నటించిన హిందీ చిత్రం ఎల్ఓసి కార్గిల్. కార్గిల్ వార్ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ చిత్రం నిడివి నాలుగు గంటలు 15 నిముషాలు ఉండటం విశేషం మరియు రికార్డు.
మరికొన్ని చిత్రాలు
పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన శివమణి, వి . ఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన నేనున్నాను చిత్రాలు విజయాన్ని అందించాయి. నృత్య దర్శకులు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన తొలిచిత్రం మాస్. నాగార్జున, జ్యోతిక, ఛార్మి కలిసి నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిత్రం సూపర్. అనుష్క, అయేషా టాకియా కథానాయికలుగా తొలిసారి నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొండా కృష్ణంరాజు నిర్మించిన చిత్రం శ్రీ రామదాసు. శ్రీరాముడి భక్తుడు కంచర్ల గోపన్న కధ ఆధారంగా వచ్చిన శ్రీరామదాసు చిత్రం భారీ విజయం సాధించింది. నాగార్జున, స్నేహ, నాగేశ్వరరావు, సుమన్, వేద, సమీర్ కలిసి నటించిన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.
వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నయనతార కలిసి నటించిన బాస్ నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన డాన్ చిత్రం ఘన విజయం సాధించింది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున, అనుష్క, లారెన్స్, నికిత కలిసి నటించిన ఈ చిత్రానికి సంగీతం కూడా లారెన్స్ అందించడం విశేషం.
శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన కింగ్ చిత్రం విజయం సాధించగా, మంచు విష్ణుతో కలిసి చేసిన కృష్ణ అర్జున నిరాశపరిచింది. కిరణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన కేడి నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన చిత్రం రగడ విజయాన్ని అందించింది. అనుష్క, ప్రియమణి కలిసి నటించిన ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించారు.
2011 – 2024 మధ్య చిత్రాలు
రాధా మోహన్ దర్శకత్వంలో నాగార్జున, ప్రకాష్ రాజ్ కలిసి నటించిన చిత్రం గగనం. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఏకకాలంలో చిత్రీకరించడం జరిగింది. పయనం పేరుతొ తమిళ భాషలో విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లో విజయం సాధించింది. వి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున, స్నేహ కలిసి నటించిన రాజన్న చిత్రం విజయం సాధించింది.
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన మరో భక్తిరస చిత్రం షిర్డీసాయి. శ్రీకాంత్, సాయికుమార్, శ్రీహరి, కమిలిని ముఖర్జీ కలిసి నటించిన ఈ చిత్రంలో షిర్డీ సాయిబాబా పాత్రలో నటించారు నాగార్జున. తన పాత్రకి నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నారు నాగార్జున మరియు ఈ చిత్రం విజయాన్ని అందుకుంది.
నాగార్జున, అనుష్క కలిసి నటించిన ఢమరుకం ఘన విజయం సాధించగా ఆ తరువాత వచ్చిన గ్రీకువీరుడు చిత్రం నిరాశపరిచింది. జె. కె. భారవి దర్శకత్వంలో కౌశిక్ బాబు, నాగార్జున, సాయికుమార్, శ్రీహరి కలిసి నటించిన జగద్గురు ఆది శంకరాచార్య చిత్రంలో ఒక పాత్రలో నటించి మెప్పించారు నాగార్జున. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్ కలిసి నటించిన భాయ్ చిత్రం నిరాశపరిచింది.
మరికొన్ని చిత్రాలు
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, శ్రియ శరన్, సమంత మరియు అతిధి పాత్రలో అక్కినేని అఖిల్ కలిసి నటించిన చిత్రం మనం. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత జన్మ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. మనం చిత్రం అక్కినేని నాగేశ్వర్రావు గారికి ఆఖరికి చిత్రం కావడం బాధాకరం. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఘన విజయం సాధించింది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ కలిసి నటించిన చిత్రం ఊపిరి. తెలుగు భాషలోనే కాకుండా తమిళ భాషలో కూడా ఏకకాలంగా చిత్రకరించిన ఈ చిత్రంలో జయసుధ, తమన్నా కథానాయికగా నటించారు మరియు శ్రియ శరన్, అనుష్కా అతిధి పాత్రలో మెరిశారు. ఊపిరి చిత్రాన్ని తమిళ భాషలో తోజా పేరుతొ చిత్రీకరించి విడుదల చేయడం జరిగింది. రెండు భాషల్లో ఈ చిత్రం విజయం సాధించింది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ కధానాయకుడిగా వచ్చిన నిర్మల కాన్వెంట్ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించడం జరిగింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున, అనుష్క, జగపతిబాబు, సౌరభ్ జైన్, ప్రగ్య జైస్వాల్ కలిసి నటించిన భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ. హాథిరామ్ బాబాజీ పాత్రలో నాగార్జున నటించారు. ఈ చిత్రం నిరాశపరిచింది.
ఇంకొన్ని చిత్రాలు
ఓంకార్ దర్శకత్వంలో సమంత కథానాయికగా నటించిన రాజు గారి గాడి 2 చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించి అలరించారు. చాల సంవత్సరాల తరువాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున ఆఫీసర్ చిత్రంలో నటించిన అది ప్రేక్షకులను నిరాశపరిచింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ కలిసి నటించిన దేవదాసు చిత్రం విజయం సాధించింది.
డాన్ గా దేవా పాత్రలో నాగార్జున, వైద్యుడి గా దాస్ పాత్రలో నాని నటించి మెప్పించారు. అశ్వినిదత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు – 2 నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన వైల్డ్ డాగ్ చిత్రం విజయం సాధించింది.
సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రం బంగార్రాజు. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కలిసి నటించిన ఈ చిత్రం విజయం సాధించింది. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, నాగార్జున, అలియా భట్ కలిసి నటించిన హిందీ చిత్రం బ్రహ్మాస్త్రం: పార్ట్ వన్ – శివ. ఈ చిత్రం విజయం సాధించింది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ది ఘోస్ట్ చిత్రం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన నా సామిరంగా చిత్రం చిత్రం పరవాలేదనిపించింది. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్ కలిసి నటించిన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. 2025 సంవత్సరంలో రజనీకాంత్, ఉపేంద్రలతో కలిసి కూలి చిత్రం మరియు ధనుష్ తో కలిసి కుబేర చిత్రంతో మనముందుకు రాబోతున్నారు.
మరికొన్ని విశేషాలు
స్టార్ మా తెలుగు టీవీ ఛానెల్ లో ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ తెలుగు కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు నాగార్జున. క్రికెట్ అంటే ఇష్టపడే నాగార్జున టాలీవుడ్ ట్రోఫీ లో కింగ్ నాగార్జున జట్టు ఏర్పాటు చేసి క్రికెట్ ఆడటం జరిగింది. ఎన్నో చిత్రాల్లో అతిధి పాత్ర పోషించారు మరియు ఘటోహ్కాచుడు చిత్రంలో ప్రత్యేక పాటలో కనిపించడం జరిగింది.
నాగార్జున చిత్రాలు చాల వరకు హిందీ భాషలో డబ్బింగ్ చేయడం జరిగింది. తమ చిత్రాలకే కాకుండా బైట చిత్రాలని కూడా నిర్మించారు నాగార్జున. “కింగ్”, “యువసామ్రాట్” అని అభ్భిమానులు ఇష్టాంగా పిలుచుకుంటారు.
వ్యక్తిగతం
చెన్నై నగరంలో 1959 సంవత్సరంలో ఆగష్టు 29న జన్మించారు అక్కినేని నాగార్జున. తండ్రి అక్కినేని నాగేశ్వర్రావు తల్లి అన్నపూర్ణ. అన్నయ్య, వెంకట్, సోదరీమణులు నాగ సుశీల, సత్యవతి. సరోజ. హైదరాబాద్, చెన్నై మరియు అమెరికాలో తన చదువు కొనసాగించింది. 1984 సంవత్సరంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మి తో నాగార్జున వివాహం జరిగింది మరియు వీరికి ఒక కుమారుడు నాగ చైతన్య.
1990 సంవత్సరంలో నాగార్జున, లక్ష్మి విడిపోయాక 1992 సంవత్సరంలో కధానాయిక అమల ని వివాహం చేసుకున్నారు నాగార్జున మరియు వీరికి ఒక కుమారుడు అఖిల్. సుమంత్, సుశాంత్ నాగార్జునకి మేనల్లుళ్లు వరుస అవుతారు మరియు సుప్రియ మేనకోడలు వరుస అవుతారు.
నాగార్జున నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
- వెలుగునీడలు (బాలనటుడు)
- సుడిగుండాలు (బాలనటుడు)
- విక్రమ్
- కెప్టెన్ నాగార్జున
- అరణ్యకాండ
- మజ్ను
- సంకీర్తన
- కలెక్టర్ గారి అబ్బాయి
- అగ్ని పుత్రుడు
- కిరాయి దాదా
- ఆఖరిపోరాటం
- చినబాబు
- రావు గారి ఇల్లు (అతిధి పాత్ర)
- మురళీకృష్ణుడు
- జానకి రాముడు
- విజయ్
- విక్కీ దాదా
- గీతాంజలి
- అగ్ని
- శివ
- ప్రేమ యుద్ధం
- నేటి సిద్దార్థ
- ఇద్దరు ఇద్దరే
- శివ (హిందీ)
- నిర్ణయం
- చైతన్య
- శాంతి క్రాంతి
- జైత్రయాత్ర
- కిల్లర్
- అంతం
- ప్రెసిడెంట్ గారి పెళ్ళాం
- ఖుదాగవః (హిందీ)
- రక్షణ
- వారసుడు
- అల్లరి అల్లుడు
- గోవిందా గోవిందా
- హలో బ్రదర్
- క్రిమినల్
- ఘరానా బుల్లోడు
- వజ్రం
- ఘటోత్కచుడు (అతిధి పాత్ర పాటలో)
- సిసింద్రీ
- క్రిమినల్ (హిందీ)
- రాముడొచ్చాడు
- నిన్నే పెళ్లాడతా
- Mr.బేచారా (హిందీ)
- అన్నమయ్య
- రట్చగన్ (తమిళ్)
- ఆవిడ మా ఆవిడే
- ఆటోడ్రైవర్
- చంద్రలేఖ
- అంగారే (హిందీ)
- జక్మ్ (హిందీ)
- సీతారామరాజు
- రావోయి చందమామ
- నువ్వు వస్తావని
- ఆజాద్
- నిన్నే ప్రేమిస్తా
- అధిపతి
- ఎదురులేని మనిషి
- బావనచ్చడు
- ఆకాశవీధిలో
- స్నేహమంటేఇదేరా
- సంతోషం
- అగ్నివర్ష (హిందీ)
- మన్మధుడు
- శివమణి
- ఎల్ ఓ సి కార్గిల్ (హిందీ)
- నేనున్నాను
- మాస్
- సూపర్
- శ్రీ రామదాసు
- బాస్ – ఐ లవ్ యు
- స్టైల్ (అతిధి పాత్ర)
- డాన్
- కింగ్
- కృష్ణార్జున
- కేడి
- రగడ
- తకిట తకిట (అతిధి పాత్ర)
- రాజన్న
- గగనం
- షిర్డీ సాయి
- ఢమరుకం
- గ్రీకువీరుడు
- భాయ్
- శ్రీ జగద్గురు ఆదిశంకర
- మనం
- దొంగాట (అతిధి పాత్ర)
- అఖిల్ (పాటలో అతిధి పాత్ర)
- సైజ్ జీరో (అతిధి పాత్ర)
- సోగ్గాడే చిన్ని నాయన
- ఊపిరి
- నిర్మలా కాన్వెంట్
- ప్రేమమ్ (అతిధి పాత్ర)
- ఓం నమో వెంకటేశాయ
- రాజు గారి గాది 2
- ఆఫీసర్
- దేవదాస్
- మన్మధుడు 2
- వైల్డ్ డాగ్
- బంగార్రాజు
- ది ఘోస్ట్
- బ్రహ్మాస్త్ర పార్ట్ – 1 (హిందీ)
- నా సామి రంగా
- కుబేర
- కూలి (తమిళ్)