Javagal Srinath Blog in Telugu

కపిల్ దేవ్ లాంటి దిగజ్జ క్రికెట్ క్రీడాకారుడు భారత జట్టుకి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది కానీ భారత జట్టుకి తన లాగ సరైన ఫాస్ట్ బౌలర్లు దొరక్క సెలక్షన్ కమిటీ సతమతమవుతుంది. ఎంతమంది స్పీన్ర్లు ఉన్న కానీ వేగంగా బంతిని విసిరే ఫాస్ట్ బౌలర్ కోసం మన భారత జట్టు చేయని ప్రయత్నం లేదు. ఎంతోమంది ఫాస్ట్ బౌలర్లని ప్రయత్నించినా ఆ వేగం మాత్రం సరిపోవట్లేదు.

ఒక వైపు స్పిన్ బౌలర్ల రాణిస్తున్న వారి సహాయంతో కొంతమంది మీడియం పేస్ బౌలర్లు ఎదో కొద్దిగా వేగం ప్రయత్నించడం తప్పితే పెద్ద ప్రభావం చూపలేకపోయారు. అప్పుడే ఓక వ్యక్తి వేగవంతమైన బౌలింగ్ వేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునేలా చేసి ఆశ్చర్యపరిచారు. “మైసూరు ఎక్ష్ప్రెస్స్” పేరుతొ పిలవబడే ఆ వ్యక్తి జవగల్ శ్రీనాథ్.

తన బౌలింగ్‌లో గాలి వేగంతో పాటు నియంత్రణను కలిగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నారు. మరి ఈ రోజు జవగళ్ శ్రీనాథ్ గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం.

Mysore Express Javagal Srinath Indian Fast bolwer
Mysore Express Javagal Srinath Indian Fast bowler

క్రికెట్ ఆరంగ్రేటం

మైసూరులోని ఒక క్రికెట్ క్లబ్లో జవగళ్ శ్రీనాథ్ బౌలింగ్ చేస్తుండగా అక్కడే ఉన్న ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సెలెక్టర్ గుండప్ప విశ్వనాధ్ తన బౌలింగ్ చూసి ప్రతిభను గుర్తించి అతనికి కర్ణాటక రాష్ట్ర జట్టు తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లో క్రికెట్ ఆడటానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలా తన మొదటి మ్యాచ్ 1989 సంవత్సరంలో కర్ణాటక జట్టు తరఫునుంచి ఆడారు జవగళ్ శ్రీనాథ్.

ప్రత్యర్థి హైదరాబాద్ జట్టు మీద వరుసగా 3 వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించారు జవగళ్ శ్రీనాథ్. ఆడిన మొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ సీజన్లోనే 25 వికెట్లు తీసి సంచలనం సృష్టించగా ఆ తరువాత సీజన్లో 20 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచారు.

అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం

పాకిస్తాన్ జట్టుతో 1991 సంవత్సరం 18 అక్టోబర్ న తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు జవగళ్ శ్రీనాథ్. భారత తరఫునుంచి 81వ వన్డే క్రికెట్ ఆటగాడిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్లో అరంగ్రేటం చేయడం జరిగింది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ షార్జా వేదికగా జరిగింది మరియు ఆడిన మొదటి వన్డే మ్యాచ్లో ఒక్క వికెట్ పడగొట్టారు జవగళ్ శ్రీనాథ్.

ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మీద భారత జట్టు విజయం సాధించడం విశేషం. అలా ఆ సంవత్సరంలో మొత్తం 11 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడిన జవగళ్ శ్రీనాథ్ 30.00 సగటుతో 14 వికెట్లు పడగొట్టడం జరిగింది. ఆస్ట్రేలియా జట్టుతో 1991 సంవత్సరం 29 నవంబర్ న తన మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడారు జవగళ్ శ్రీనాథ్.

భారత తరఫునుంచి 193వ టెస్ట్ క్రికెట్ ఆటగాడిగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో అరంగ్రేటం చేయడం జరిగింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టారు మరియు సిరీస్ మొత్తం కలిపి 55.30 సగటుతో 10 వికెట్లు పడగొట్టారు జవగళ్ శ్రీనాథ్. దక్షిణాఫ్రికా జట్టుతో 1992 సంవత్సరంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో జవగళ్ శ్రీనాథ్ 12 వికెట్లు తీయడం జరిగింది మరియు ఈ సిరీస్ భారత జట్టు ఓడిపోవడం బాధాకరం.

స్వదేశంలో మొదటి సిరీస్

1994 సంవత్సరంలో భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో మొదటి సారి భారత్ లో అంతర్జాతీయ క్రికెట్ ఆడారు జవగళ్ శ్రీనాథ్. ఈ సిరీస్ కపిల్ దేవ్ ఆటకి వీడ్కోలు పలికిన తరువాత జరగడమే కాకుండా జవగళ్ శ్రీనాథ్ ని ప్రధాన బౌలర్ గా ఎదిగే అవకాశం రావడం విశేషం.

ఈ సిరీస్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా సత్తా చాటారు జవగళ్ శ్రీనాథ్. ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టి ఒక అర్ధ సెంచరీ సాధించడం విశేషం. రెండవ ఇన్నింగ్స్ లో 72 బంతులు ఆడి 60 పరుగులు తీశారు జవగళ్ శ్రీనాథ్. ఆరు ఫోర్లు మరియు ఒక సిక్స్ కొట్టి ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు జవగళ్ శ్రీనాథ్ మరియు ఈ మ్యాచ్ భారత్ 96 పరుగులతో విజయం సాధించింది.

ఆస్ట్రేలియా జట్టుతో భారత్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో జవగళ్ శ్రీనాథ్ వేసే బంతులు గంటకు 149.6 కిలోమీటర్ వేగంతో రావడం విశేషం. ఆ టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో భారత జట్టు రెండు టెస్ట్ మ్యాచ్లు నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది. 1997 సంవత్సరంలో జరిగిన జింబాబ్వే పర్యటనలో జవగల్ శ్రీనాథ్ బౌలింగ్ లో ఉన్న వేగాన్ని చూసి జింబాబ్వే జట్టు సారధి అలీస్టైర్ క్యాంప్బెల్ ఎంతో ప్రశంసించడం జరిగింది. దక్షిణాఫ్రికా దిగజ్జ బౌలర్లయిన లాన్స్ క్లూసెనర్ మరియు అల్లన్ డోనాల్డ్ లతో జవగళ్ శ్రీనాథ్ ని పోల్చడం విశేషం.

గాయాలు

శ్రీనాథ్ కూడా ఆటకు సంబంధించి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎక్కువగా గాయాల బారిన పడినా వాటిని అధిగమించి తన ప్రదర్శనలో మెరుగుదల చూపించారు. జట్టు అవసరాలకు అనుగుణంగా ఎప్పుడూ సమర్ధతతో నిలబడిన ఈ బౌలర్, ఆటగాడిగా తన సహనం మరియు కట్టుబాటుతో గుర్తింపుపొందారు.

కపిల్ దేవ్ క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికిన తరువాత జవగళ్ శ్రీనాథ్ మీదే కొన్ని సంవత్సరాలు ఫాస్ట్ బౌలింగ్ భారం ఒత్తిడి పడడంతో అతనికి గాయాలు అవ్వడం మొదలైంది. వేగంగా బంతులు వేయడంతో భుజానికి గాయం అవ్వగా సర్జరీ చేయించుకోవల్సి వచ్చింది. గాయం నుంచి కోలుకుంటాన లేదా అనే సందేహంతో ఉన్న జవగళ్ శ్రీనాథ్ కు కొన్ని నెలలలోపు గాయం తగ్గిపోయింది. గాయం తగ్గిన వెంటనే భారత జట్టులోకి తిరిగొచ్చి మంచి ప్రదర్శన కనబర్చారు. 1998 సంవత్సరంలో టెస్ట్ మ్యాచ్లలో 17 వికెట్లు మరియు వన్డే మ్యాచ్లలో 37 వికెట్లు తీసి తన పునరాగమనాన్ని గొప్పగా పునః ప్రారంభించారు.

కెరీర్ చివరి దశ

ఇక క్రికెట్ జీవితం చివరి దశకి వచ్చేసరికి జవగళ్ శ్రీనాథ్ బౌలింగ్ని భారత్ లో కంటే విదేశాలలో ఎక్కువ ఉపయోగించుకున్నారు భారత కొత్త సారధి సౌరవ్ గంగూలీ. 2000 సంవత్సరంలో విదేశాలలో ఆడిన మ్యాచ్లలో 21 టెస్ట్ వికెట్లు మరియు 15 వన్డే వికెట్లు తీయడం జరిగింది. జింబాబ్వే తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్లు పడగొట్టి టెస్ట్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నారు జవగళ్ శ్రీనాథ్.

కొత్త తోరం ఫాస్ట్ బౌలర్లు అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ దూసుకురావడంతో మెల్లగా తన స్థానం ప్రమాదంలో పడింది అని చెప్పుకోవచ్చు. 2002 సంవత్సరంలో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికినా కూడా వన్డే క్రికెట్ నంచి వీడ్కోలు పలకొద్దు అని నచ్చజెప్పారు సారధి సౌరవ్ గంగూలీ. 2003 సంవత్సరంలో న్యూజిలాండ్ పర్యటనలో 7 మ్యాచ్లు ఆడి 18 వికెట్లు పడగొట్టారు జవగళ్ శ్రీనాథ్. 2003 సంవత్సరంలో జరిగిన ప్రపంచకప్ తరువాతా అంతర్జాతీయ వన్డే క్రికెట్ కి కూడా వీడ్కోలు పలకడం జరిగింది.

క్రికెట్ తరువాత జీవితం

అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తరువాత కూడా ఎదో ఒక రకంగా క్రికెట్ ఆటకి చేరువలో ఉన్నారు జవగళ్ శ్రీనాథ్. కొన్ని సంవత్సరాలు కమెంటర్ గా వ్యాఖ్యానం చేశారు, ఆ తరువాత 2006 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జవగళ్ శ్రీనాథ్ ని మ్యాచ్ రిఫరీ గా నియమించడం విశేషం. మొత్తం 35 టెస్ట్ మ్యాచ్లు, 260 వన్డే మ్యాచ్లు మరియు 60 టీ 20 మ్యాచ్లలో రిఫరీ గా ఉండటం జరిగింది.

గణాంకాలు

టెస్ట్: జవగళ్ శ్రీనాథ్ గణాంకాల గురించి చర్చించుకోవాలంటే 67 టెస్ట్ మ్యాచ్లు ఆడిన జవగళ్ శ్రీనాథ్ 1,009 పరుగులు సాధించారు, 14.21 బ్యాటింగ్ సగటుతో 4 అర్ధ సెంచరీ సాధించారు మరియు అత్యధిక స్కోర్ 76 పరుగులు సాధించారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 15,104 బంతులు వేసిన జవగళ్ శ్రీనాథ్ 30.49 సగటుతో 236 వికెట్లు తీయడం జరిగింది. 10 సార్లు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయగా ఒక్క సరి మ్యాచ్లో 10 వికెట్లు తీయడం జరిగింది. తన అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చి 8/86 మరియు 22 క్యాచ్లు అందుకున్నారు.

వన్డే: ఇక అంతర్జాతీయ వన్డే గణాంకాల గురించి చర్చించుకోవాలంటే 229 వన్డే మ్యాచ్లు ఆడిన జవగళ్ శ్రీనాథ్ 10.63 సగటుతో 883 పరుగులు సాధించారు అలాగే ఒక్క అర్ధ సెంచరీ సాధించారు మరియు తన అత్యధిక స్కోర్ వచ్చేసి 53. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 11,935 బంతులు వేసిన జవగళ్ శ్రీనాథ్ 28.08 సగటుతో 315 వికెట్లు పడగొట్టారు. మూడు సార్లు ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు జరిగింది. తన అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చి 5/23 మరియు 32 క్యాచ్లు అందుకున్నారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్: ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణంకాలు గురించి చర్చించుకోవాలంటే 147 మ్యాచ్లు ఆడిన జవగళ్ శ్రీనాథ్ 14.49 బ్యాటింగ్ సగటుతో 2,276 పరుగులు సాధించగా, 7 అర్ధ సెంచరీలు సాధించారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 76. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 28,618 బంతులు వేయగా 26.61 సగటుతో 533 వికెట్లు పడగొట్టారు. 23 సార్లు ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టగా 3 సార్లు ఒక మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టారు మరియు తన అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 9/76 అలాగే 62 క్యాచ్లు అందుకున్నారు.

లిస్ట్ ఏ క్రికెట్: లిస్ట్ ఏ క్రికెట్ క్రికెట్ గణంకాలు గురించి చర్చించుకోవాలంటే 290 మ్యాచ్లు ఆడగా 10.48 బ్యాటింగ్ సగటుతో 1,153 పరుగులు సాధించగా, ఒక్క అర్ధ సెంచరీ ఉండడం విశేషం మరియు తన అత్యధిక స్కోర్ 53. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 14,981 బంతులు వేయగా 26.25 సగటుతో 407 వికెట్లు పడగొట్టారు. నాలుగు సార్లు ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 5/23 అలాగే 49 క్యాచ్లు అందుకున్నారు.

వ్యక్తిగతం

కర్ణాటక రాష్ట్రం మైసూర్ నగరం 1969 సంవత్సరం ఆగష్టు 31న జె. కె. చంద్రశేఖర్, భాగ్యలక్ష్మి దంపతుల్లకు జన్మించారు జవగళ్ శ్రీనాథ్. ఆయన తండ్రి ఒక ఉపాద్యాయుడు, తల్లి గృహిణి. జవగళ్ శ్రీనాథ్ తల్లిదండ్రులు సంప్రదాయ అభిప్రాయాలు ఉన్నప్పటికీ, క్రికెట్‌పై ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. ఈ మద్దతు వల్లే జవగళ్ శ్రీనాథ్ భారతదేశ అత్యుత్తమ వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా ఎదిగారు.

జవగళ్ శ్రీనాథ్ చదువంతా మైసూర్ నగరంలోనే కొనసాగింది మరియు ఇంజనీరింగ్ కూడా మైసూర్ నగరంలోని శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ అఫ్ ఇన్స్టిట్యూట్ కళాశాల నుండి పట్టా పొందడం జరిగింది. 1999 సంవత్సరంలో జ్యోత్స్నా అనే వ్యక్తిని జవగళ్ శ్రీనాథ్ వివాహం చేసుకున్నారు, ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం పెరగడంతో 2008 సంవత్సరంలో మాధవి పాత్రవాళి అనే పాత్రికేయురాలిని వివాహం చేసుకున్నారు.

ముగింపు

జవగళ్ శ్రీనాథ్ ఆటకు ఇచ్చిన విలువ, కట్టుబాటు, మరియు ప్రదర్శన భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఒక స్పీడ్‌స్టర్‌గా, ఒక రిఫరీగా మరియు అత్యుత్తమ వ్యక్తిత్వంతో భారత క్రికెట్‌లో ఒక అపూర్వమైన శిఖరంగా నిలిచిన జవగళ్ శ్రీనాథ్ అన్ని కాలాలకు ఆదర్శంగా నిలిచారు.

జవగళ్ శ్రీనాథ్ భారత క్రికెట్‌కు అందించిన సేవలు మాటల్లో చెప్పలేనివి. భారత యువ బౌలర్లకు ఒక ప్రేరణగా నిలిచిన ఆయన స్పీడ్‌స్టర్‌లుగా తమ గుర్తింపును సృష్టించుకోవడంలో సహాయపడ్డారు. భారత క్రికెట్‌లో వేగగత బౌలింగ్‌కు జవగళ్ శ్రీనాథ్ చిహ్నంగా నిలిచారు. కేవలం బౌలర్‌గా మాత్రమే కాకుండా జవగళ్ శ్రీనాథ్ ఒక వినయశీల వ్యక్తిగా అభిమానుల మదిలో స్థానం సంపాదించారు. ఆటపట్ల ఆయన కట్టుబాటు, క్రికెట్ మైదానం గుండా సాగే ప్రామాణికత భారత క్రికెటర్లకు ఒక ప్రేరణగా నిలిచింది.

మరికొన్ని విశేషాలు
  • కపిల్ దేవ్ తరువాత టెస్ట్ మ్యాచ్ లో 200 వికెట్లు తీసిన రెండవ వ్యక్తి జవగళ్ శ్రీనాథ్.
  • 2010 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసి సెక్రెటరీ గా నెగ్గారు జవగళ్ శ్రీనాథ్.
  • 1999 సంవత్సరంలో అర్జున పురస్కారం లభించింది.
  • 2003 సంవత్సరంలో మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పురస్కారం అందుకోవడం విశేషం.
  • పూణే నగరంలో మహారాష్ట్ర జట్టుతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో బంతిని రివర్స్ స్వింగ్ వేసి 93 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టారు.
  • 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం ద్వారా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కష్టాల్లో పెట్టేవారు జవగళ్ శ్రీనాథ్.
  • మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో దూకుడు బంతులను సంధించేవారు జవగళ్ శ్రీనాథ్.
  • ఇన్‌స్వింగర్‌లు, ఔట్‌స్వింగర్‌లు, యార్కర్లు, అలాగే మధ్య మధ్యలో షార్ట్ పిచ్ బంతులను విసరడంలో జవగళ్ శ్రీనాథ్ దిట్ట.
  • మొత్తం నాలుగు క్రికెట్ ప్రపంచకప్లు ఆడిన జవగల్ శ్రీనాథ్ 44 వికెట్లు పడగొట్టారు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *