
వి. బి. రాజేంద్రప్రసాద్ తనయుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కధానాయకుడిగా, సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా అన్ని రకాల పాత్రలలో నటిస్తూ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్న జగపతిబాబు గురించి తెలుసుకుందాం.
సినీ ప్రస్థానం
వి. బి. రాజేంద్రప్రసాద్ దర్శక నిర్మాతగా నటభూషణ శోభన్ బాబు, మంజుల కలిసి నటించిన చిత్రం మంచి మనుషులు, ఈ చిత్రంతో బాలనటుడిగా నటించారు జగపతిబాబు. 1974 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 15 సంవత్సరాల తరువాత అంటే 1989 సంవత్సరంలో కధానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు జగపతిబాబు.
వి. మధుసూధనరావు దర్శకత్వంలో వి. బి. రాజేంద్రప్రసాద్ నిర్మాణంలో 1989 సంవత్సరంలో వచ్చిన చిత్రం సింహ స్వప్నం. రెబెల్ స్టార్ కృష్ణంరాజు, సహజ నటి జయసుధ, జగపతిబాబు, వాణి విశ్వనాధ్, శాంతిప్రియ కలిసి నటించిన ఈ చిత్రం విజయాన్ని అందించింది మరియు ఈ చిత్రంలో జగపతిబాబు ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
అనిల్ దర్శకత్వంలో ఎస్. వెంకటరత్నం నిర్మాణంలో వచ్చిన చిత్రం అడవిలో అభిమన్యుడు. జగపతిబాబు, వినోద్ కుమార్, ఐశ్వర్య కలిసి నటించిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. 1990 సంవత్సరంలో వాసి రెడ్డి దర్శకత్వంలో వడ్డే రమేష్ నిర్మించిన చిత్రం చిన్నారి ముద్దుల పాపా. జగపతిబాబు, కావేరి, శివాజీరాజా, సుధాకర్ కలిసి నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది.
పందిరిమంచం, పరిష్కారం, జగన్నాటకం, సాహసం, అసాధ్యులు చిత్రాలలో నటించి మెప్పించారు జగపతిబాబు. ఏ. ఎం. రత్నం దర్శకత్వంలో 1992 సంవత్సరంలో వచ్చిన పెద్దరికం చిత్రంలో జగపతిబాబు, సుకన్య, ఎన్.ఎన్. పిళ్లై, భానుమతి రామకృష్ణ, చంద్రమోహన్, విజయకుమార్, ఎం. బాలయ్య, కవిత, కలిసి నటించారు మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
రగులుతున్న భరతం, మదర్ ఇండియా చిత్రాల్లో నటించారు జగపతిబాబు. నటభూషణ శోభన్ బాబు, డా. రాజేశేఖర్, జగపతిబాబు, రమ్యకృష్ణ, కలిసి నటించిన చిత్రం బలరామకృష్ణులు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆశయం, పిల్లలు దిద్దిన కాపురం, ఆదర్శం చిత్రాలలో అలరించారు జగపతిబాబు.
భారీ విజయాలు
రామ్ గోపాల్ వర్మ దస్ర్శకత్వంలో జగపతిబాబు కధానాయకుడిగా వచ్చిన చిత్రం గాయం. 1993 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్నో అందుకుంది. శివకృష్ణ, రేవతి, ఊర్మిళ కలిసి నటించిన గాయం చిత్రం గ్యాంగ్ వార్ నేపథ్యం మీద తీశారు దర్శకులు రామ్ గోపాల్ వర్మ. అప్పటివరకు జగపతిబాబు పాత్రకి వేరే వాళ్ళు గాత్ర దానం చేసేవారు కానీ గాయం చిత్రంలో తన పాత్రకి తననే గాత్ర దానం చేయవలసిందిగా జగపతిబాబుతో దర్శకులు రామ్ గోపాల్ వర్మ పట్టుబట్టడం విశేషం.
గాయం చిత్రానికి శ్రీ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది ముఖ్యంగా “అలుపన్నది ఉందా”, “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని”, “నైజం పోరి” పాటలు జనాదరణ పొందడం విశేషం. అన్నయ చరణ్ రాజ్ పాత్రని దుండగులు హతమార్చడంతో అప్పటివరకు సరదాగా ఉండే దుర్గ పాత్ర అన్నయ్య పాత్ర చనిపోయాక తను కూడా గుండాయిజం చేయడం మొదలుపెడతారు మరియు సీరియస్ పాత్రలో జగపతిబాబు అద్భుతంగా నటించారు.
కథానాయకి మీనాతో చేసిన భలేపెళ్ళాం, సౌందర్య, రంభ, కంచన్ కలిసి నటించిన అల్లరి ప్రేమికుడు, కృష్ణంరాజు, జయసుధ, రమ్యకృష్ణ కలిసి నటించిన జైలర్ గారి అబ్బాయి చిత్రాలలో నటించి మెప్పించారు జగపతిబాబు. 1994 సంవత్సరంలో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, ఆమని, రోజా కలిసి నటించిన చిత్రం శుభలగ్నం. మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.
ఆస్తులు, అంతస్తులు మరియు గొప్పగా బతకాలనే ఆశతో భర్తని వేరే అమ్మాయికి అమ్మేసి ఆ తరువాత జీవితమంటే డబ్బు, ఆస్తులు, అంతస్తులు కాదు ప్రేమ, ఆప్యాయత, అనురాగం అని తెలుసుకుని మామలు వ్యక్తిగా మారిపోయే పాత్రలో కథానాయకి ఆమని అద్భుతంగా నటించారు అనే చెప్పడం కంటే జీవించారు అని చెప్పుకోవచ్చు. మధ్యతరగతి భర్తగా జగపతిబాబు నటన కూడా అద్భుతం అని చెప్పొచ్చు.
ఈ చిత్రంలోని హాస్యంతో పాటు ఎస్. వి. కృష్ణారెడ్డి అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను అలరించింది. చిలుక ఏ తోడు లేక, పక్కింటి మంగళ గౌరీ పాటలతో పాటు సౌందర్య మరియు హాస్య నటులు ఆలీ మధ్య వచ్చే ప్రత్యేక గీతం చినుకు చినుకు అందెలతో పాటలు కూడా ప్రజాదరణపొందాయి. శుభలగ్నం చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం.
తీర్పు, చిలకపచ్చకపురం, భలే బుల్లోడు, సంకల్పం, ఆయనకి ఇద్దరు, శుభమస్తు, శ్రీకారం, మా ఆవిడా కలెక్టర్ చిత్రాలతో అలరించారు జగపతిబాబు. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, ఆమని, నందిత కలిసి నటించిన చిత్రం మావిచిగురు. 1996 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో సంగీతం మరియు నటీనటుల నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు.
గుర్తుండిపోయే చిత్రాలు
భీమేయునేని శ్రీనివాసరావు దర్శకత్వంలో జగపతిబాబు, రాశి, రవళి కలిసి నటించిన చిత్రం శుభాకాంక్షలు. 1997 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహం ప్రేమికుల వల్ల విడిపోతే మళ్ళీ ఆ స్నేహాన్ని కలపడానికి గోపి అనే వ్యక్తి ఎలా ప్రయత్నించాడు అనేది నేపధ్యం. ఈ చిత్రంలో జగపతిబాబు తో పాటు హాస్యనటులు సుధాకర్ కూడా ప్రేక్షకులను అలరించారు.
క్రియేటివ్ దర్శకులు కృష్ణవంశీ దర్శకత్వంలో 1998 సంవత్సరంలో సాయి కుమార్, సౌందర్య, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ కలిసి నటించిన చిత్రం అంతఃపురం. రాయలసీమ ప్రాంత నేపథ్యంలో తెరక్కేక్కిన ఈ చిత్రం లో జగపతిబాబు సహాయనటుడి పాత్రలో నటించడం విశేషం. ఇళయరాజా అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు జగపతిబాబుకి నంది పురస్కారం అందించింది.
సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆహా చిత్రంలో జగపతిబాబు, సంఘవి,రఘువరన్, జయసుధ, భానుప్రియ కలిసి నటించిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. సోమరిపోతుగా అల్లరి చిల్లరిగా తిరిగే కొడుకు పాత్రలో జగపతిబాబు నటిస్తే తండ్రి పాత్రలో విజయకుమార్, అన్నయ్య పాత్రలో రఘువరన్ వదిన పాత్రలో జయసుధ నటించారు.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సముద్రం చిత్రంలో జగపతిబాబు, సాక్షి శివానంద్ కలిసి నటించారు మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది. చేయని హత్య నేరంలో ఇరుకున్న జగపతిబాబుని ఎలా బైటికివస్తారు అనే నేపథ్యంతో తీసిన చిత్రం సముద్రం మరియు ఈ చిత్రానికి పురస్కారాలు లభించడం విశేషం.
మనోహరం, సర్దుకుపోదామరండి, హనుమాన్ జంక్షన్, శివరామరాజు చిత్రాలతో అలరించారు జగపతిబాబు. సందడే సందడి, కబడ్డీ కబడ్డీ, ధమ్, అతడే ఒక సైన్యం, ఖుషి ఖుషీగా, పెదబాబు, అనుకోకుండా ఒక రోజు, పందెం జగపతి, థట్ ఈజ్ పాండు, సామాన్యుడు, బ్రహ్మాస్త్రం చిత్రాల్లో నటించారు జగపతిబాబు.
సహాయనటుడిగా
అల్లరి నరేష్, గౌరీ ముంజల్, ఆర్తి చాబ్రియా కలిసి నటించిన చిత్రం గోపి: గోడమీద పిల్లి. ఈ చిత్రంలో ప్రముఖ నటులు జగపతిబాబు పోలీస్ పాత్రలో నటించడం విశేషం. జగపతిబాబు, ప్రియమణి కలిసి నటించిన చిత్రం పెళ్ళైనకొత్తలో. మదన్ దర్శక నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. గోపీచంద్ నటించిన లక్ష్యం చిత్రంలో అన్నయ్య పాత్రలో నటించారు జగపతిబాబు.
తరుణ్, ఇలియానా కలిసి నటించిన భలేదొంగలు చిత్రంలో జగపతిబాబు పోలీస్ పాత్రలో నటించారు మరియు ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. కథానాయకుడు, హోమం, రక్షా, సిద్ధం, ఆకాశమంత, అధినేత, బంగారుబాబు, ప్రవరాఖ్యుడు, మా నాన్న చిరంజీవి చిత్రాల్లో నటించారు.
గుర్తింపుపొందిన చిత్రాలు
నందమూరి బాలకృష్ణ, రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ కలిసి నటించిన చిత్రం లెజెండ్. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతిబాబు ప్రతినాయకుడి పాత్రలో నటించడం విశేషం మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది.సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్ల నువ్వులేని జీవితం, మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు, జూ.ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో నాగ చైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాల్లో నటించి అలరించారు జగపతిబాబు.
బెల్లంకొండా శ్రీనివాస్ నటించిన జయజనకి నాయక, అక్కినేని అఖిల్ నటించిన హలో, రాంచరణ్ నటించిన రంగస్థలం, జూ. ఎన్టీఆర్ నటించిన అరవింద సామెత వీర రాఘవ, మహేష్ బాబు నటించిన మహర్షి, నాని నటించిన టాక్ జగదీశ్, బాలకృష్ణ నటించిన అఖండ, ప్రభాస్ నటించిన సలార్, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ చిత్రాల్లో నటించి మెప్పించారు జగపతిబాబు.
మిగితా భాషల్లో
మద్రాసి చిరంతో తమిళ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు జగపతిబాబు. తాండవం, పుథగం, లింగ చిత్రాల్లో నటించి మెప్పించారు. బచ్చన్ చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి జాగ్వార్, రాబర్ట్ కాటేరా లాంటి చిత్రాల్లో కన్నడ ప్రేక్షకులను అలరించారు జగపతిబాబు.
మోహన్ లాల్ నటించిన పులిమురుగన్ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఆది, మధురరాజా లాంటి చిత్రాల్లో నటించారు జగపతిబాబు. కిసీకా భాయ్ కిసీకా జాన్ చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు జగపతిబాబు. సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే, విక్టరీ వెంకటేష్, భూమిక చావ్లా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. అన్ని భాషల్లోనూ నటిస్తూ ఇచ్చిన ప్రతి పాత్రకి న్యాయం చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్కుంటూ ముందుకెళ్తున్నారు జగపతిబాబు.
వ్యక్తిగతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్టణం లో జన్మించారు జగపతిబాబు. తండ్రి వి. బి. రాజేంద్రప్రసాద్ సినీ నిర్మాత మరియు సినిమా నిమిత్తం చెన్నై నగరంలో స్థిరపడ్డారు. జగపతిబాబు చదువంతా చెన్నై నగరంలో కొనసాగింది. లక్ష్మి అనే మహిళా ని వివాహం చేసుకున్నారు మరియు వీరికి ఇద్దరు కుమార్తెలు మరియు ఇద్దరికీ వివాహం జరిగింది.
జగపతిబాబు నటించిన సినిమాల గురించి తెలుసుకుందాం
- మంచి మనుషులు (బాలనటుడిగా)
- సింహ స్వప్నం
- అడవిలో అభిమన్యుడు
- చిన్నారి ముద్దుగా పాపా
- పందిరిమంచం
- పరిష్కారం
- జగన్నాటకం
- సాహసం
- అసాధ్యులు
- పెద్దరికం
- రగులుతున్న భారతం
- మదర్ ఇండియా
- బలరామకృష్ణులు
- ఆశయం
- పిల్లలు దిద్దిన కాపురం
- ఆదర్శం
- గాయం
- భలే పెళ్ళాం
- అల్లరి ప్రేమికుడు
- జైలర్ గారి అబ్బాయి
- శుభలగ్నం
- మనీ మనీ (అతిధి పాత్ర)
- తీర్పు
- చిలకపచ్చకాపురం
- భలే బుల్లోడు
- సంకల్పం
- ఆయనకీ ఇద్దరు
- శుభమస్తు
- శ్రీకారం
- మా ఆవిడ కలెక్టర్
- మావిచిగురు
- జాబిలమ్మపెళ్లి
- శుభాకాంక్షలు
- చిలక్కొట్టుడు
- పెళ్లిపందిరి
- ప్రియరాగాలు
- ఒక చిన్న మాటా
- దొంగాట
- మావిడాకులు
- పెళ్లి కనుక
- పెళ్లి పీటలు
- అంతఃపురం
- శ్రీమతి వెళ్ళొస్తా
- ఆహా
- స్వప్నలోకం
- మనుసులో మాట
- అల్లుడుగారు వచ్చారు
- రావోయి చందమామ
- సముద్రం
- మనోహరం
- సర్దుకుపోదాం రండి
- చూసొద్దాం రండి
- మూడు ముక్కలాట
- బాచి
- బడ్జెట్ పద్మనాభం
- ఫామిలీ సర్కస్
- నాలో ఉన్న ప్రేమ
- హనుమాన్ జంక్షన్
- శివ రామ రాజు
- సందడే సందడి
- కబడ్డీ కబడ్డీ
- దమ్
- అతడే ఒక సైన్యం
- ఖుషి ఖుషీగా
- పెదబాబు
- అనుకోకుండా ఒక రోజు
- పందెం
- జగపతి
- దటీస్ పాండు
- సామాన్యుడు
- బ్రహ్మాస్త్రం
- గోపి – గోడ మీద పెళ్లి
- పెళ్లైన కొత్తలో
- మద్రాసి (తమిళ్)
- లక్ష్యం
- స్వగతం
- నగరం
- భలే దొంగలు
- కథానాయకుడు
- హోమం
- రక్ష
- సిద్ధం
- ఆకాశమంత
- అధినేత
- బంగారు బాబు
- నిన్ను కలిశాక (అతిధి పాత్ర)
- ప్రవరాఖ్యుడు
- మా నాన్న చిరంజీవి
- సాధ్యం
- గాయం – 2
- జై బోలో తెలంగాణ
- చట్టం
- నగరం నిద్రపోతున్న వేళా
- కీ
- క్షేత్రం
- నందీశ్వరుడు
- సిక్స్
- తాండవం (తమిళ్)
- ఆపరేషన్ దుర్యోధన 2
- లెజెండ్
- ఏప్రిల్ ఫూల్ (అతిధి పాత్ర)
- పుథగం (తమిళ్)
- బచ్చన్ (కన్నడ)
- రా రా క్రిష్నయ్య
- కరెంట్ తీగ
- పిల్ల నువ్వు లేని జీవితం
- ఓ మనిషి కథ
- లింగా (తమిళ్)
- జాగ్వర్ (కన్నడ)
- శ్రీమంతుడు
- హితుడు
- నాన్నకు ప్రేమతో
- ఎటాక్
- ఇజం
- పులి మురుగన్ (మలయాళం)
- కత్తి సందల్ (తమిళ్)
- ఓం నమో వెంకటేశాయ
- విన్నర్
- రారండోయ్ వేడుక చూద్దాం
- పటేల్ సర్
- జయ జానకి నాయక
- ఆక్సిజన్
- హలో
- రంగస్థలం
- భైరవా
- నెల టికెట్
- సాక్ష్యం
- గూఢచారి
- ఆటగాళ్లు
- ఆది (తమిళ్)
- అరవింద సమేత వీర రాఘవ
- యాత్ర
- మహర్షి
- ఓహ్ బేబీ
- విశ్వాసం (తమిళ్)
- సై రా నరసింహారెడ్డి
- మధుర రాజా (మలయాళం)
- మిస్ ఇండియా
- ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్
- పిట్ట కథలు
- రిపబ్లిక్
- మహా సముద్రం
- రాబర్ట్ (కన్నడ)
- అన్నబెల్లె సేతుపతి (తమిళ్)
- లాభం (తమిళ్)
- అన్నతే (తమిళ్)
- మథగజ (కన్నడ)
- లక్ష్య
- హీరో
- గుడ్ లక్ సఖి
- రాధే శ్యామ్
- మాన్స్టర్ (మలయాళం)
- ఘనీ
- రామబాణం
- రుద్రాంగి
- కిసీకా భాయ్ కిసీకా జాన్ (హిందీ)
- వాయిస్ అఫ్ సత్యనాథన్ (మలయాళం)
- సాలార్ – 1
- కాటేరా (కన్నడ)
- గుంటూరు కారం
- కంగువ (తమిళ్)
- గ్యాంగ్స్టర్స్ (వెబ్ సిరీస్)
- పరంపర (వెబ్ సిరీస్)
- ది ఫామిలీ స్టార్
- సింబా
- Mr. బచ్చన్
- పుష్ప 2: ది రూల్
- రుస్లాన్ (హిందీ)