IPL 2025 Schedule and Latest News

indian premier league 2025 updates
                                                                                Indian Premier League 2025

ప్రతి సంవత్సరం భారత క్రీడా ప్రేక్షకులని ఇండియన్ ప్రీమియర్ లీగ్ అలరిస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా భారత ప్రేక్షకులని అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సిద్ధమైంది, మరి ఈ కొత్త సీజన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

2008 సంవత్సరంలో ఎంతో ఘనంగా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సీజన్ అలరించడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు 17 సీజన్లు ప్రేక్షకులను అలరించి దిగ్విజయంగా ముందుకు సాగుతుంది, ఇప్పుడు 18 సీజన్ తో అలరించడానికి మరింత ఘనంగా ముస్తాబయ్యి ప్రేక్షకుల  ముందుకు రాబోతుంది.

ఇక ఈ కొత్త ఐపీఎల్ సీజన్ లో కొంతమంది ఆటగాళ్లు తమ కొత్త జట్లతో ఆడటానికి సిద్ధమయ్యారు అలాగే మైదానాలు కూడా సిద్ధం చేస్తున్నారు ఐపిఎల్ నిర్వాహకులు. మరి ఈ సారి ఏ జట్టులో ఏ ఆటగాళ్లు ఉన్నారు, అలాగే ఎన్ని మైదానాల్లో ఎన్ని మ్యాచ్లు నిర్వహిస్తున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా 10 జట్లతో ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత అభిమానుల ముందుకు రావడానికి సిద్ధమైంది. మొత్తం పది జట్లతో ఈ సారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు, అంతేకాకుండా ఆ పది జట్లని రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది, అంటే గ్రూప్ ఏ అని మరియు గ్రూప్ బి అని విభజించారు. గ్రూప్ ఏ లో మొత్తం 5 జట్లు అలాగే గ్రూప్ బి లో 5 జట్లని చేర్చడం జరిగింది.

గ్రూపులు, ఫార్మటు

గ్రూప్ ఏ జట్లు: చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్త నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి.

గ్రూప్ బి జట్లు: ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జయింట్స్ జట్లు ఉన్నాయి.

ఇక ఫార్మటు విషయానికి వస్తే ప్రతి గ్రూప్ లో ఉన్న ప్రతి జట్టు మరో జట్టుతో రెండు మ్యాచ్లు ఆడాలి, అలాగే మిగితా గ్రూప్ లో ఉన్న 5 జట్లలో 4 జట్లతో ఒక్క మ్యాచ్ ఆది మిగిలిన ఒక్క జట్టుతో రెండు మ్యాచ్లు ఆడేలా ఫార్మాటుని రూపొందించారు. అంటే ప్రతి జట్టు 14 మ్యాచ్లు ఖచ్చితంగా ఆడేలా టోర్నమెంట్ని రూపొందించారు.

ఆడిన 14 మ్యాచ్లో ఏ జట్లకైతే ఎక్కువ పాయింట్స్ సంపాదించి మొదట నాలుగు స్థానాల్లో నిలుస్తాయో ఆ జట్లు ప్లే ఆప్స్ ఆడటానికి అర్హత సాధిస్తాయి. గ్రూప్ ఏ నుంచి రెండు జట్లు అలాగే గ్రూప్ బి నుంచి రెండు జట్లకు ఎక్కువ పాయింట్స్ వస్తాయో ఆ జట్లు ప్లే ఆఫ్ మ్యాచ్లు ఆడతాయి.

ప్లే ఆఫ్ అంటే ఏంటి: ఇలాంటి టోర్నమెంట్లలో సెమి ఫైనల్ ఫార్మటు పద్దతిలో ఆడతారు కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సెమీఫైనల్ పద్దతిలో కాకుండా ప్లే అఫ్ పద్దతితో ఆడతారు. ప్లే అఫ్ అంటే క్వాలిఫైయర్ 1 మ్యాచ్, ఎలిమినేటర్ 1 మ్యాచ్ మరియు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడించి చివరికి ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.

క్వాలిఫైయర్ 1 మ్యాచ్ అంటే మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ముందుగా ఒక మ్యాచ్ ఆడతాయి, ఈ మ్యాచ్లో ఏ జట్టైతే విజయం సాధిస్తుందో ఆ జట్టు నేరుగా ఫైనల్ మ్యాచ్ కోసం అర్హత సాధిస్తుంది మరియు ఓడిన జట్టుకి మరో అవకాశం లభించడం జరుగుతుంది. ఆ తరువాత ఎలిమినేటర్ 1 మ్యాచ్ జరుగుతుంది అంటే 3 మరియు 4 స్థానాల్లో ఉన్న రెండు జట్లు తలపడతాయి.

ఈ మ్యాచ్లో ఓడిన జట్టు ఇంటికి వెళ్లిపోగా గెలిచిన జట్టు మరో మ్యాచ్ ఆడే అవకాశం దొరుకుతుంది. క్వాలిఫైయర్ 1 లో ఓడిన జట్టు మరియు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్లు ఒక మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్ ఎవరు నెగ్గితే ఆ జట్టు ఫైనల్ కి చేరుకొని ముందుగా ఎవరైతే ఫైనల్ కి చేరుకున్న జట్టు ఉంటుందో ఆ జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఈ ప్రకారంగా ప్లే ఆఫ్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు.

మైదానాలు

ఇక ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే మ్యాచ్ల మైదానాల గురించి తెలుసుకోవాలంటే మొత్తం 13 మైదానాలు సిద్ధం చేశారు. ఇక ఆ మైదానాలు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ మైదానం, బెంగళూరు నగరంలోని ఎం. చిన్నస్వామి మైదానం, చెన్నై నగరంలోని ఎం. ఏ. చిదంబరం మైదానం, ఢిల్లీ నగరంలోని అరుణ్ జైట్లీ మైదానం, హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ మైదానం, జైపూర్ నగరంలోని సవాయ్ మాన్సింగ్ మైదానం, కోల్కత్త నగరంలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం, లక్నో నగరంలోని బి ఆర్ ఎస్ ఏ బి వి ఎకనా క్రికెట్ మైదానం, ముంబై నగరంలోని వాంఖేడే మైదానం, మొహాలీ నగరంలోని ముల్లన్పూర్ పట్టణంలోని మహారాజ యదవీంద్ర సింగ్ మైదానం లో మ్యాచ్లు నిర్వహించనున్నారు.

ఇవి కాకుండా మరో మూడు మైదానాల్లో కూడా మ్యాచ్లు నిర్వహిస్తున్నారు, ఆ మైదానాల గురించి తెలుసుకోవాలంటే పంజాబ్ జట్టు కోసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, ధర్మశాల పట్టణంలోని హెచ్. పి. సి. ఏ క్రికెట్ మైదానం, ఇక్కడ మూడు మ్యాచ్లు ఆడతారు, రాజస్థాన్ రాయల్స్ జట్టు కోసం గువాహటి నగరంలోని బరస్పరా క్రికెట్ మైదానం, ఇక్కడ రెండు మ్యాచ్లు ఆడతారు, ఢిల్లీ క్యాపిటల్స్ కోసం విశాఖపట్నం నగరంలోని ఏ. సి. ఏ. – వి. డి. సి. ఏ క్రికెట్ మైదానం, ఇక్కడ కూడా రెండు మ్యాచ్లు ఆడేలా నిర్వహించనున్నారు.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జరిగే మొదటి మ్యాచ్ గురించి తెలుసుకోవాలంటే 2025 సంవత్సరం, మార్చ్ 22న కోల్కత్త నైట్ రైడర్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా రాత్రి 7:30 జరగబోతుంది. 2024 సంవత్సరంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ – 17 లో కోల్కత్త నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించిన విషయం మనందరికీ తెలిసిందే.

ఆటగాళ్లు

ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే 2024 సంవత్సరం నవంబర్ నెలలో సౌదీ అరేబియా దేశం, జడ్డ నగరంలో జరిగిన భారీ వేలంపాటలో 10 జట్లకు సంబందించిన యజమానులు పాల్గొని ఆటగాళ్ళని భారీ ధరలతో కొనుగోలు చేయడం జరిగింది.

ఈసారి వేలంపాటలో అన్ని జట్లలో ఉన్న ఆటగాళ్లలో 5 లేదా 6 ఆటగాళ్ళని మినహాయించి మిగితా ఆటగాళ్లందరిని ఈ వేలంపాటలో చేర్చడం జరిగింది. ఇందులో అత్యధిక ధరతో వేలంలో కొనుగోలు చేయబడిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు సృష్టించారు. 27 కోట్ల రూపాయలకి రిషబ్ పంత్ లక్నో జట్టు కొనుగోలు చేయడం జరిగింది.

అంతేకాకుండా పంజాబ్ జట్టు శ్రేయాస్ అయ్యర్ ని 26.75 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వైభవ్ సూర్యవంశీ అనే 13 సంవత్సరాల కుర్రాడు 1. 1 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేయడం విశేషం. ఇక 2023 సంవత్సరంలో జరిగిన వేలంపాటలో ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ళైన పాట్ కమ్మిన్స్ మరియు మిట్చెల్ స్టార్క్ లను భారీ ధరలకు కొనుగోలు చేసిన విషయం తెలిసందే కానీ ఆ ధరనిని కూడా వెనక్కి నెట్టి మరింత ఎక్కువ ధరకి రిషబ్ పంత్ మరియు శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు భారీ ధరకి పలకడం ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు.

ఐపీఎల్ 2025 జట్లు పూర్తి వివరాలు

ఇక ఆటగాళ్ల వివరాల్లోకి వెళితే ప్రతి జట్టులో కనీసం 20 కి పైగా ఆటగాళ్లు ఉండటం జరిగింది. ఆ ఆటగాళ్ల వివరాలు జట్ల వారీగా ఇప్పుడు చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్:

  1. రుతురాజ్ గైక్వార్డ్
  2. నూర్ అహ్మద్ 
  3. ఖలీల్ అహ్మద్ 
  4. రవిచంద్రన్ అశ్విన్ 
  5. వన్ష్ బేడీ
  6. ముకేశ్ చౌదరి 
  7. డెవాన్ కాన్వే 
  8. సామ్ కర్రన్ 
  9. ఎం ఎస్ ధోని 
  10. శివమ్ దూబే 
  11. నాథన్ ఎల్లీస్ 
  12. రామకృష్ణ ఘోష్ 
  13. శ్రేయాస్ గోపాల్ 
  14. దీపక్ హూడా 
  15. రవీంద్ర జడేజా 
  16. అంశుల్ కంబోజ్ 
  17. కమలేష్ నాగర్కోటి 
  18. జామీ ఓవర్టన్ 
  19. మతీశ పతిరాణా 
  20. షైక్ రషీద్ 
  21. రచిన్ రవీంద్ర 
  22. విజయ్ శంకర్ 
  23. ఆండ్రే సిద్దార్థ్ 
  24. గుర్జప్ నీత్ సింగ్ 
  25. రాహుల్ త్రిపాఠి

ఢిల్లీ క్యాపిటల్స్:

  1. హ్యారి బ్రూక్ 
  2. దుష్మంత చమీర 
  3. ఫాఫ్ డు ప్లెసిస్ 
  4. డొనోవన్ ఫెర్రెర 
  5. జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ 
  6. ముకేశ్ కుమార్ 
  7. మన్వంత్ కుమార్ ఎల్. 
  8. అజయ్ మండల్ 
  9. కరుణ్ నైర్ 
  10. దర్శన్ నాల్కణ్డే 
  11. టి. నటరాజన్ 
  12. విప్రజ్ నిగమ్ 
  13. అక్షర్ పటేల్ 
  14. అభిషేక్ పోరెల్ 
  15. కె. ఎల్. రాహుల్ 
  16. సమీర్ రిజ్వి 
  17. అశుతోష్ శర్మ 
  18. మోహిత్ శర్మ 
  19. మైఖేల్ స్టార్క్ 
  20. మాధవ్ తివారి 
  21. త్రిస్తాం స్టబ్స్ 
  22. త్రిపురాణ విజయ్
  23. కుల్దీప్ యాదవ్

గుజరాత్ టైటాన్స్:

  1. శుబ్మన్ గిల్ 
  2. గుర్నూర్ బ్రర్ 
  3. జొస్ బట్లర్ 
  4. గెరాల్డ్ కొయెట్జీ 
  5. కరీం జనత్ 
  6. అర్షద్ ఖాన్ 
  7. రషీద్ ఖాన్ 
  8. షారుఖ్ ఖాన్ 
  9. కుల్వంత్ కెజ్రోలియా 
  10. సాయి కిషోర్ 
  11. ప్రసిద్ కృష్ణ 
  12. కుమార్ కుశాగ్ర 
  13. మహిపాల్ లొంరోర్ 
  14. గ్లేన్ ఫిలిప్స్ 
  15. కాగిసో రబడా 
  16. అనుజ్ రావత్ 
  17. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ 
  18. ఇషాంత్ శర్మ 
  19. నిశాంత్ సింధు 
  20. మహమ్మద్ సిరాజ్ 
  21. సాయి సుదర్శన్ 
  22. వాషింగ్టన్ సుందర్ 
  23. మానవ సుథర్
  24. రాహుల్ తేవాతియా 
  25. జయంత్ యాదవ్

కోల్కత్త నైట్ రైడర్స్:

  1. అజింక్య రహానే 
  2. మొయిన్ అలీ 
  3. వైభవ్ అరోరా 
  4. వరుణ్ చక్రవర్తి 
  5. క్విన్టన్ డి కాక్ 
  6. రహమతుల్లాహ్ గర్భాజ్ 
  7. వెంకటేష్ అయ్యర్ 
  8. స్పీకర్ జాన్సన్ 
  9. ఉమ్రాన్ మాలిక్ 
  10. మయాంక్ మార్కండే 
  11. సునీల్ నరైన్ 
  12.  శార్దూల్ ఠాకూర్ 
  13. మనీష్ పాండే 
  14. రోవమన్ పావెల్ 
  15. అంగ్క్రిష్ రఘువంశీ 
  16. హర్షిత్ రాణా 
  17. అనుకూల్ రాయ్ 
  18. ఆండ్రే రస్సెల్ 
  19. రామన్దీప్ సింగ్ 
  20. రింకు సింగ్ 
  21. లవ్నిట్ సిసోడియా

లక్నో సూపర్ జెయింట్స్:

  1. రిషబ్ పంత్ 
  2. షాబాజ్ అహ్మద్ 
  3. ఆయుష్ బదోని 
  4. ఱవి బిష్ణోయ్ 
  5. మాథ్యూ బ్రిట్జ్కే 
  6. యువరాజ్ చౌదరి 
  7. ఆకాష్ దీప్ 
  8. రాజవర్ధన్ హాంగార్గేకర్ 
  9. అవేశ్ ఖాన్ 
  10. మోషీన్ ఖాన్ 
  11. ఆర్షిన్ కులకర్ణి 
  12. షమర్ జోసెఫ్ 
  13. ఆర్యన్ జూయల్ 
  14. ఇడెన్ మార్క్రమ్ 
  15. మిట్చెల్ మార్ష్ 
  16. డేవిడ్ మిల్లర్ 
  17. నిఖోలస్ పూరన్ 
  18. అబ్దుల్ సమద్ 
  19. ఎం. సిద్దార్థ్ 
  20. ఆకాష్ సింగ్ 
  21. దిగ్వేశ్ సింగ్ 
  22. హిమ్మత్ సింగ్ 
  23. మయాంక్ యాదవ్ 
  24. ప్రిన్స్ యాదవ్

ముంబై ఇండియన్స్:

  1. హార్దిక్ పాండ్య 
  2. రాజ్ అంగద్ భావ 
  3. ట్రెంట్ బౌల్ట్ 
  4. జస్ప్రీత్ బుమ్రా 
  5. దీపక్ చాహర్ 
  6. నమన్ ధీర్ 
  7. విల్ జాక్స్ 
  8. బేవాన్ జాకబ్స్ 
  9. అశ్వని కుమార్ 
  10. రాబిన్ మింజ్ 
  11. విగ్నేష్ పుథుర్ 
  12. ముజీబ్ ఉర్ రెహమాన్ 
  13. సత్యనారాయణ రాజు 
  14. ర్యాన్ రికెల్తాన్ 
  15. మిట్చెల్ సాంట్నర్ 
  16. కర్ణ్ శర్మ 
  17. రోహిత్ శర్మ 
  18. కృష్ణన్ శ్రీజిత్ 
  19. అర్జున్ టెండూల్కర్ 
  20. రీస్ టాప్లె 
  21. తిలక్ వర్మ 
  22. లిజాడ్ విల్లియమ్స్ 
  23. సూర్యకుమారి యాదవ్

పంజాబ్ కింగ్స్:

  1. శ్రేయాస్ అయ్యర్ 
  2. ప్రియాంష్ ఆర్య 
  3. పైలా అవినాష్ 
  4. క్సేవిఆర్ బార్ట్లేట్ 
  5. హరిప్రీత్ బ్రర్
  6. యజువేంద్ర చాహల్ 
  7. ప్రవీణ్ దూబే 
  8. లోకి ఫెర్గుసన్ 
  9. ఆరోన్ హార్డీ 
  10. జోష్ ఇంగ్లిస్ 
  11. మార్కో జాన్సెన్ 
  12. ముషీర్ ఖాన్ 
  13. గ్లేన్ మాక్స్వెల్
  14. అజ్మతుల్లాహ్ ఓమార్జాయి 
  15. కుల్దీప్ సేన్ 
  16. సూర్యన్ష్ షెడ్జ్ 
  17. అర్షదీప్ సింగ్ 
  18. హర్నూర్ సింగ్ 
  19. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 
  20. శశాంక్ సింగ్ 
  21. మార్కస్ స్తోయినిస్ 
  22. యాష్ ఠాకూర్ 
  23. విష్ణు వినోద్ 
  24. నెహ్యాల్ వధేరా 
  25. విజయకుమార్ వైషాక్

రాజస్థాన్ రాయల్స్:

  1. సంజు శాంసన్
  2. జోఫ్రా ఆర్చర్
  3. యుద్విర్ చరక్
  4. తుషార్ దేష్పాండే
  5. శుభం దూబే
  6. ఫజల్ హాక్ ఫరూఖీ
  7. వనిందు హాసరంగా
  8. షిమ్రోన్ హెట్మేర్
  9. యశస్వి జైశ్వాల్
  10. ధృవ్ జురెల్
  11. కుమార్ కార్తికేయ
  12. ఆకాష్ మధ్వల్
  13. క్వేన మఫాక
  14. రియాన్ పరాగ్
  15. నితీష్ రాణా
  16. కునాల్ రాథోర్
  17. అశోక్ శర్మ
  18. సందీప్ శర్మ
  19. వైభవ్ సూర్యవన్శి
  20. మహీష్ తీక్షణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

  1. రజత్ పటిదార్
  2. విరాట్ కోహ్లీ
  3. జాకబ్ బెథెల్
  4. మనోజ్ భండగే
  5. స్వస్తిక్ చికార
  6. రసిఖ్ సలాం దర్
  7. టిమ్ డేవిడ్
  8. యష్ దయాల్
  9. జోష్ హాజెల్ వుడ్
  10. భువనేశ్వర్ కుమార్
  11. లియం లివింగ్ స్టోన్
  12. లుంగీ ఎంగిడి
  13. దేవదత్ పడిక్కాల్
  14. క్రునాల్ పాండ్య
  15. మోహిత్ రాఠీ
  16. ఫీల్ సాల్ట్
  17. జితేష్ శర్మ
  18. సుయాశ్ శర్మ
  19. రొమారియో షెఫర్డ్
  20. అభినందన్ సింగ్
  21. స్వప్నిల్ సింగ్
  22. నువాన్ తుషార

సన్ రైజర్స్ హైదరాబాద్:

  1. పాట్ కమ్మిన్స్
  2. జీషాన్ అన్సారీ
  3. సచిన్ బేబీ
  4. బ్రైడాన్ కర్స్
  5. రాహుల్ చాహర్
  6. ట్రావిస్ హెడ్
  7. ఇషాన్ కిషన్
  8. హేన్రిచ్ క్లాస్సేన్
  9. ఇషాన్ మలింగా
  10. అభినవ్ మనోహర్
  11. కమిందు మెండిస్
  12. హర్షల్ పటేల్
  13. నితీష్ కుమార్ రెడ్డి
  14. మహమ్మద్ షమీ
  15. అభిషేక్ శర్మ
  16. సిమర్జీత్ సింగ్
  17. అథర్వ తైడే
  18. జయదేవ్ ఉనద్కట్
  19. అనికేత్ వర్మ
  20. ఆడమ్ జంపా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు షెడ్యూల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://documents.iplt20.com/smart-images/1739621485265_IPL%20Season%20Schedule%202025-1.pdf

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *