క్రికెట్ కనిపెట్టింది ఇంగ్లాండ్ దేశమైన మరియు ఎక్కువ ప్రపంచకప్ లు సాధించిన ఆస్ట్రేలియా దేశమైన, క్రికెట్ ఆటని మాత్రం తమ సొంతం అనుకుని ఎక్కువ ఇష్టపడేది భారత అభిమానులు మాత్రమే. క్రికెట్ ఆటని ఒక మతంలాగా మరియు ఆటగాళ్ళని దేవుళ్లులాగా చూసి అభిమానించే ప్రజలు ఒక భారత దేశంలో మాత్రమే ఉన్నారు.
భారత దేశంలో ఇప్పటివరకు ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ మైదానాలు రూపుదిద్దుకున్నాయి. ప్రపంచ క్రికెట్ దేశాలలో ఎక్కడ కూడా అన్ని మైదానాలు లేని అంతర్జాతీయ క్రికెట్ మైదానాలు కేవలం భారత్ లో మాత్రమే ఉండటం విశేషం మరియు భారత క్రికెట్ అభిమానులకి గర్వకారణం.
మొదటి మైదానం
1932 సంవత్సరంలో భారత జట్టు క్రికెట్ లో అడుగుపెట్టి తమ మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్ మైదానం లో ఆడటం జరిగింది. 15 డిసెంబర్ 1933 సంవత్సరంలో భారత జట్టు స్వదేశంలో తమ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడటం జరిగింది. బొంబాయి నగరంలో (ఇప్పుడు ముంబై అని పిలుస్తున్నారు) ని జిమ్ఖానా గ్రౌండ్ లో ఆడటం జరిగింది. ఇదే భారత క్రికెట్ దేశంలో మొదటి అంతర్జాతీయ క్రికెట్ మైదానం అని చెప్పుకోవచ్చు, ఆ తరువాత ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ మైదానాలు భారత్ లో రూపుదిద్దుకున్నాయి.
ఇప్పటివరకు భారత దేశంలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ మైదానాల గురించి తెలుసుకుందాం.
S.No | మైదానం | నగరం | |
---|---|---|---|
1 | బ్రబౌర్న్ మైదానం | ముంబై | |
2 | వాంఖేడే మైదానం | ముంబై | |
3 | డి.వై. పాటిల్ మైదానం | ముంబై | |
4 | అరుణ్ జైట్లీ మైదానం | ఢిల్లీ | |
5 | గ్రీన్ పార్క్ మైదానం | కాన్పూర్ | |
6 | ఎం.ఏ. చిదంబరం మైదానం | చెన్నై | |
7 | ఈడెన్ గార్డెన్స్ | కోల్కత్త | |
8 | ఎం. చిన్నస్వామి మైదానం | బెంగళూరు | |
9 | బారాబతి మైదానం | కట్టక్ | |
10 | సవాయ్ మాన్సింగ్ మైదానం | జైపూర్ | |
11 | నరేంద్ర మోదీ మైదానం | అహ్మదాబాద్ | |
12 | ఇందర్జీత్ సింగ్ బేడీ మైదానం | మొహాలీ | |
13 | ఐ పి సి ఎల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ | వడోదర | |
14 | వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి మైదానం | విశాఖపట్నం | |
15 | రాజీవ్ గాంధీ మైదానం | హైదరాబాద్ | |
16 | హోల్కర్ మైదానం | ఇండోర్ | |
17 | వి సి ఏ మైదానం | నాగపూర్ | |
18 | ఎం సి ఏ మైదానం | పూణే | |
19 | ఎస్ సీ ఏ మైదానం | రాజకోట్ | |
20 | జె ఎస్ సి ఏ మైదానం | రాంచి | |
21 | హెచ్ పి సి ఏ మైదానం | హిమాచల్ ప్రదేశ్ | |
22 | గ్రేటర్ నోయిడా ఎస్ సి గ్రౌండ్ | నోయిడా | |
23 | ఏ సి ఏ మైదానం | గౌహతి | |
24 | గ్రీన్ఫిల్డ్ మైదానం | త్రివేంద్రం | |
25 | రాజీవ్ గాంధీ మైదానం | డెహ్రాడూన్ | |
26 | బి ఆర్ ఎస్ ఏ బి వాజ్పాయ్ ఎకాన మైదానం | లక్నో | |
27 | లాలభై కాంట్రాక్టర్ మైదానం | సూరత్ | |
28 | ఎస్ వి నారాయణ్ సింగ్ మైదానం | రాయిపూర్ |
కనుమరుగైన క్రికెట్ మైదానాలు
S.No | మైదానం | నగరం |
---|---|---|
1 | జింఖానా గ్రౌండ్ | ముంబై |
2 | యూనివర్సిటీ గ్రౌండ్ | లక్నో |
3 | లాల్ బహదూర్ శాస్త్రి మైదానం | హైదరాబాద్ |
4 | జవహర్లాల్ నెహ్రు మైదానం | చెన్నై |
5 | వి సి ఏ గ్రౌండ్ | నాగపూర్ |
6 | సర్దార్ వల్లభాయ్ పటేల్ మైదానం | అహ్మదాబాద్ |
7 | గాంధీ మైదానం | జలంధర్ |
8 | గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం | అమ్రిత్సర్ |
9 | షేర్ ఐ కాశ్మీర్ మైదానం | శ్రీనగర్ |
10 | మోతీ బాగ్ మైదానం | వడోదర |
11 | నెహ్రు మైదానం | ఇండోర్ |
12 | కీనన్ మైదానం | జంషెద్పూర్ |
13 | నెహ్రు మైదానం | గౌహతి |
14 | కంట్రీ గోల్ఫ్ క్లబ్ గ్రౌండ్ | ఫరీదాబాద్ |
15 | జవహర్లాల్ నెహ్రు మైదానం | ఢిల్లీ |
16 | యూనివర్సిటీ మైదానం | త్రివేంద్రం |
17 | నెహ్రు మైదానం | పూణే |
18 | సెక్టార్ 16 మైదానం | చంఢీగర్ |
19 | మౌలానా ఆజాద్ మైదానం | జమ్మూ |
20 | మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్ | రాజకోట్ |
21 | నహర్ సింగ్ మైదానం | ఫరీదాబాద్ |
22 | కెప్టెన్ రూప్ సింగ్ మైదానం | గ్వాలియర్ |
23 | ఇందిరా ప్రియదర్శిని మైదానం | విశాఖపట్నం |
24 | నెహ్రు మైదానం | ఫటోర్దా |
25 | కె డి సింగ్ బాబు మైదానం | లక్నో |
26 | మొయిన్ ఉల్ హాక్ మైదానం | పాట్నా |
27 | కల్కత్త క్రికెట్ & ఫుట్బాల్ క్లబ్ | కోల్కత్త |
28 | గంగోత్రి గ్లెడ్స్ క్రికెట్ గ్రౌండ్ | మైసూర్ |
29 | కార్నైల్ సింగ్ మైదానం | ఢిల్లీ |
30 | మోహన్ మీకిన్స్ మైదానం | ఘజియాబాద్ |
31 | జింఖానా గ్రౌండ్ | సికింద్రాబాద్ |
32 | మిడిల్ ఇన్కమ్ గ్రూప్ గ్రౌండ్ | ముంబై |
33 | జె ఎం యూ గ్రౌండ్ | ఢిల్లీ |
34 | నెహ్రు మైదానం | గుర్గావ్ |
35 | హర్బక్స్ సింగ్ మైదానం | ఢిల్లీ |
36 | జవహర్లాల్ నెహ్రు మైదానం | కోచి |
37 | బర్కతుల్లాహ్ ఖాన్ మైదానం | జోధ్పూర్ |
38 | గురునానక్ కాలేజీ గ్రౌండ్ | చెన్నై |
39 | ఇందిరా గాంధీ మైదానం | విజయవాడ |
40 | ఎన్ 2 మైదానం | ఔరంగాబాద్ |
41 | చెంప్లాస్ట్ క్రికెట్ గ్రౌండ్ | చెన్నై |
42 | టాటా దిగ్వాదిహ్ మైదానం | ధన్బాద్ |
43 | తౌ దేవి లాల్ మైదానం | గుర్గావ్ |
44 | ఇన్ఫోసిస్ గ్రౌండ్ | మైసూర్ |
45 | బిలాఖియా మైదానం | వాపి |
46 | పిత్వాల మైదానం | సూరత్ |
47 | సాటిన్ద్ర మోహన్ దేవ్ మైదానం | సిల్చార్ |
48 | బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్ | ముంబై |
49 | డి ఆర్ ఈ ఎం ఐ ఎస్ గ్రౌండ్ | కట్టక్ |
50 | మాయాజాలం గ్రౌండ్ | చెన్నై |
51 | డా. పి వి జి రాజు ఏ సి ఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ | విజయనగరం |
52 | ఏ సీ ఏ - కె డి సీ ఏ క్రికెట్ గ్రౌండ్ | మూలపాడు |