
భారత క్రికెట్ జట్టుకి 1931 సంవత్సరంలో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ హోదా లభించిన తరువాత 1932 సంవత్సరంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు “ఆల్ ఇండియా” పేరుతొ జట్టుగా బయలుదేరి వెళ్ళింది. ఒక టెస్ట్ మ్యాచ్ మరియు కొన్ని ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఈ పర్యటనలో ఆడటం జరిగింది.
మరి ఈ పర్యటనలో భారత టెస్ట్ జట్టులో ఉన్న సభ్యులు ఎవరు, ఎవరికీ స్థానం దొరికింది, ఎవరికీ స్థానం దొరకలేదు, ఎవరు సారధ్యం వహించారు, ఈ మ్యాచ్ ఫలితం ఏమైంది మరియు ఈ మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లకు సంభందించిన పూర్తి విశేషాలు తెలుసుకుందాం.
టెస్ట్ మ్యాచ్ విశేషాలు
ఇంగ్లాండ్ లోని ప్రఖ్యాత “లార్డ్స్” మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకోవడం జరిగింది మరియు మొదటి ఇన్నింగ్స్లో 105.1 ఓవర్లలో 259 పరుగులు చేశారు ఇంగ్లాండ్ జట్టు. డి. ఆర్. జార్డిన్ 79 పరుగులు చేసి టాప్ స్కోర్ చేశారు మరియు మహమ్మద్ నిస్సార్ 5 వికెట్లు పడగొట్టారు.
ఇక భారత బ్యాటింగ్ గురించి చెప్పాలంటే మొదటి ఇన్నింగ్స్లో 93 ఓవర్లలో 189 పరుగులు చేశారు, 40 పరుగులు చేసిన సి. కె. నాయుడు టాప్ స్కోర్ చేయడం విశేషం మరియు డబ్ల్యూ. ఈ. బౌస్ 4 వికెట్లు తీశారు. ఇక రెండవ ఇన్నింగ్స్లో 110 ఓవర్లలో ఇంగ్లాండ్ 275/8 స్కోర్ చేసి డిక్లేర్ చేయడం జరిగింది. డి. ఆర్. జార్డిన్ 85 పరుగులతో టాప్ స్కోర్ చేయగా జహంగీర్ ఖాన్ 4 వికెట్లు తీయడం జరిగింది.
భారత జట్టు 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగితే 59.3 ఓవర్లలో 187 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడం జరిగింది. అమర్ సింగ్ 51 పరుగులు చేసి టాప్ స్కోర్ చేయగా డబ్ల్యూ. ఆర్. హంమొండ్ 3 వికెట్లు పడగొట్టారు. 158 పరుగులతో ఇంగ్లాండ్ జట్టు గెలిచినా ఈ టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లో ముగియడం విశేషం.
భారత జట్టు ఆటగాళ్లు
ఈ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు 18 మంది ఆటగాళ్లతో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లడం జరిగింది. ఆ ఆటగాళ్లు ఎవరంటే:
- పోర్బందర్ మహారాజ నిట్వర్సింహ్జి భావ్ సిన్జీ
- కె. ఎస్. జి. లింబ్ది
- సి. కె. నాయుడు
- అమర్ సింగ్
- సొరబ్జి కోల్హా
- గులాం మహమ్మద్
- శంకర్రావు గోడంబె
- జహంగీర్ ఖాన్
- జోగిందర్ సింగ్
- బహదూర్ కపాడియా
- లాల్ సింగ్
- నారిమన్ మార్షల్
- మహమ్మద్ నిస్సార్నౌ
- మాల్ జిఓమల్
- జనార్దన్ నవ్లే
- నజీర్ అలీ
- ఫిరోజే పలియా
- సయ్యద్ వజీర్ అలీ
18 మంది ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్తే తుది జట్టులో చోటు సంపాదించిన 11 మంది ఆటగాళ్లు: సి. కె. నాయుడు (సారధి), జనార్దన్ నవ్లే (వికెట్ కీపర్), నౌమాల్ జిఓమల్, సయ్యద్ వజీర్ అలీ, సొరాబ్జి కోల్హా, నజీర్ అలీ, ఫిరోజే పలియా, లాల్ సింగ్, జహంగీర్ ఖాన్, అమర్ సింగ్, మహమ్మద్ నిస్సార్.
ఆటగాళ్ల విశేషాలు
జనార్ధన్ నవ్లే:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లో జనార్ధన్ నవ్లే వికెట్ కీపర్ స్థానంలో ఎన్నుకోబడ్డారు అంతేకాకుండా రెండు ఇన్నింగ్స్లో ఓపెనింగ్ బ్యాటర్ గా దిగి 12 & 13 పరుగులు చేయడం జరిగింది.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: జనార్ధన్ నవ్లే తన క్రికెట్ జీవితంలో మొత్తం 2 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడగా 13.00 సగటుతో 42 పరుగులు సాధించారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 13.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: జనార్ధన్ నవ్లే ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ గురించి తెలుసుకోవాలంటే 65 మ్యాచ్లు ఆడి 19.18 సగటుతో 1,976 పరుగులు చేశారు, ఇందులో 9 అర్ధశతకాలు ఉండటం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 96 అలాగే 100 కాచ్లు పట్టుకున్నారు 36 స్టంపింగ్స్ చేయడం విశేషం.
వ్యక్తిగతం
జనార్ధన్ నవ్లే పూర్తి పేరు జనార్దన్ గ్యానోబా నవ్లే. 1902 సంవత్సరం, డిసెంబర్ 7న అప్పటి బ్రిటిష్ ఇండియా పూణే నగరంలోని ఫుల్గాన్ లో మరాఠీ కుటుంబంలో జన్మించారు. తన చదువంతా పూణే నగరంలో కొనసాగించారు జనార్దన్ నవ్లే. భారత అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్ట మొదట బంతిని ఎదురుకున్న ఆటగాడిగా గుర్తుండిపోయారు జనార్ధన్ నవ్లే.
స్వతహాగా కుడి చేతి బ్యాటరైనా జనార్ధన్ నవ్లే 16 సంవత్సరాలకే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి ఎన్నో టౌర్నమెంట్లలో వికెట్ కీపింగ్ చేయడం జరిగింది. భారత జట్టు తరుపున 6వ ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం జరిగింది. 1933 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికారు. 1979 సంవత్సరం సెప్టెంబర్ 7న మరణించారు జనార్ధన్ నవ్లే.
నౌమాల్ జిఓమల్:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లో నౌమాల్ జిఓమల్ రెండవ ఓపెనింగ్ బ్యాటర్ గా దిగి రెండు ఇన్నింగ్స్ కలిపి 33 & 25 పరుగులు చేశారు.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: నౌమాల్ జిఓమల్ తన క్రికెట్ జీవితంలో మొత్తం 3 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం జరిగింది. 27.00 సగటుతో 108 పరుగులు చేశారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 43. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 108 బంతులు వేయగా 34.00 సగటుతో 2 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 1/14.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: నౌమాల్ జిఓమల్ ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ గురించి తెలుసుకోవాలంటే మొత్తం 84 మ్యాచ్లు ఆడి 32.59 సగటుతో 4,140 పరుగులు సాధించారు, ఇందులో 7 శతకాలు, 16 అర్ధ శతకాలు ఉన్నాయి మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 203*. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మొత్తం 5,102 బంతులు వేయగా 27.54 సగటుతో 108 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 5/18. 6 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టగా 43 క్యాచ్లు అందుకున్నారు.
వ్యక్తిగతం
నౌమాల్ జిఓమల్ పూర్తి పేరు నౌమాల్ జిఓమల్ మఖిజ. 1904 సంవత్సరం 17 ఏప్రిల్ న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి ప్రెసిడెన్సీ, కరాచీ నగరంలో జన్మించారు. పదవతరగతి చదివిన నౌమాల్ జిఓమల్ 1926 – 1927 సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టారు. కుడి చేతి బ్యాటర్ మరియు లెగ్ బ్రేక్ బౌలింగ్ వేయడంలో సిద్ధహస్తుడు నౌమాల్ జిఓమల్.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నౌమాల్ జిఓమల్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్ పదవికి ఎన్నికయ్యారు ఆ తరువాత 1957 సంవత్సరంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో సెలక్షన్ కమిటీలో సెలెక్టర్గా నియమితులయ్యారు. కొన్ని ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లలో అంపైరింగ్ చేశారు నౌమాల్ జిఓమల్. 1980 సంవత్సరం, జులై 28 న మరణించారు నౌమాల్ జిఓమల్.
సయ్యద్ వజీర్ అలీ:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లో సయ్యద్ వజీర్ అలీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం జరిగింది. ఆల్రౌండర్ ఆటగాడిగా బరిలోకిదిగిన సయ్యద్ వజీర్ అలీ రెండు ఇన్నింగ్స్లో చేసిన పరుగులు 31 & 39.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: సయ్యద్ వజీర్ అలీ తన క్రికెట్ జీవితంలో మొత్తం 7 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడటం జరిగింది, అందులో 16.92సగటుతో 237 పరుగులు సాధించారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 42 అలాగే 30 బంతులు వేసిన ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు మరియు ఒక్క క్యాచ్ అందుకున్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: సయ్యద్ వజీర్ అలీ ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు గురించి తెలుస్కుకోవాలంటే 121 మ్యాచ్లు ఆడి 38.77 సగటుతో 7,212 పరుగులు చేసి 22 శతకాలు, 21 అర్ధ శతకాలు సాధించారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 268*. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 2,308 బంతులు వేసి 30.67 సగటుతో 34 వికెట్లు తీయడం జరిగింది మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 5/22, అలాగే ఒక్క సరి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయాం జరిగింది అంతేకాకుండా 59 క్యాచ్లు అందుకున్నారు.
వ్యక్తిగత జీవితం
సయ్యద్ వజీర్ అలీ 1903 సంవత్సరం 15 సెప్టెంబర్న అప్పటి బ్రిటిష్ ఇండియా, పంజాబ్ రాష్ట్రం జుల్లుందుర్ నగరంలో జన్మించారు. అలీగర్హ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదువుని పూర్తి చేశారు సయ్యద్ వజీర్ అలీ. 19 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టారు సయ్యద్ వజీర్ అలీ. కుడి చేతి బ్యాటర్ మరియు కుడి చేతి మీడియం పేస్ బౌలెరైనా సయ్యద్ వజీర్ అలీ 11వ ఆటగాడిగా ఆల్ రౌండర్ ఆటగాడిగా భారత టెస్ట్ క్రికెట్లో ఆడటం జరిగింది.
1932 – 1936 సంవత్సరం మధ్య అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఆడిన సయ్యద్ వజీర్ అలీ 1950 సంవత్సరం జూన్ 17న పాకిస్తాన్ దేశం, కరాచీ, సింధ్ నగరంలో మరణించారు.
సి. కె. నాయుడు:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కి సారధ్యం వహించిన ఆటగాడు సి. కె. నాయుడు. భారత టెస్ట్ క్రికెట్ జట్టు తరుపున 7వ ఆటగాడిగా ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడటం జరిగింది. స్వతహాగా కుడి చేతి బ్యాటర్ మరియు కుడి చేతి స్లో మీడియం బౌలెరైనా సి. కె. నాయుడు ఈ టెస్ట్ మ్యాచ్లో నాల్గవ స్థానంలో దిగి రెండు ఇన్నింగ్స్లో 40 & 10 పరుగులు చేయడం జరిగింది.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: సి. కె. నాయుడు తన క్రికెట్ జీవితంలో మొత్తం 7 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడి 25.00 సగటుతో 350 పరుగులు సాధించారు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉండటం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 81. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 858 బంతులు వేయగా 42.88 సగటుతో 9 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చి 3/40 అలాగే 4 క్యాచ్లు అందుకున్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: సి. కె. నాయుడు ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ గురించి తెలుసుకోవాలంటే మొత్తం 207 మ్యాచ్లు ఆడి 35.94 సగటుతో 11,825 పరుగులు సాధించారు. ఇందులో 26 శతకాలు, 58 అర్ధ శతకాలు ఉండటం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 200.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే 25,798 బంతులు వేయగా 29.28 సగటుతో 411 వికెట్లు పడగొట్టగా, 12 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు అలాగే రెండు సార్లు మ్యాచ్లో 10 వికెట్లు తీయడం జరిగింది. అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 7/44 మరియు 170 క్యాచ్లు ఒక స్టాంపింగ్ చేయడం విశేషం.
వ్యక్తిగతం
సి.కే.నాయుడు పూర్తి పేరు కొట్టారీ కనకయ్య నాయుడు. 1895 అక్టోబర్ 31 న మహారాష్ట్ర రాష్ట్రం, నాగపూర్ నగరంలో, సెంట్రల్ ప్రావిన్స్ లో కొట్టారీ సూర్య ప్రకాష్ రావు నాయుడు, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. నాగపూర్ నగరంలోని పాఠశాల మరియు కళాశాలలో సి. కె. నాయుడు చదువుకున్నారు.
సి.కే.నాయుడు 1916 సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం జరిగింది. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తరువాత జాతీయ సెలక్షన్ కమిటీకి చైర్మన్ గా మరియు బి.సి.సి.ఐ కి వైస్ ప్రెసిడెంట్ గా అలాగే రేడియో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటులో ముఖ్య భూమికను పోషించి మరియు వ్యవస్థాపిక అధ్యక్షుడిగా ఉన్నారు. 1967 సంవత్సరం 14 నవంబర్ నాడు మధ్య ప్రదేశ్ రాష్ట్రం, ఇండోర్ నగరంలో సి.కే. నాయుడు మరణించారు.
సొరభ్జి కొల్హ:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో సొరభ్జి కొల్హ ఐదవ స్థానాల్లో దిగి రెండు ఇన్నింగ్స్ కలిపి 22 & 4 పరుగులు చేయడం జరిగింది. భారత టెస్ట్ క్రికెట్ తరుపున రెండవ ఆటగాడిగా ఆడటం జరిగింది.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: సొరభ్జి కొల్హ తన క్రికెట్ జీవితంలో మొత్తం 2 టెస్ట్ మ్యాచ్లు ఆడి 17.25 సగటుతో 69 పరుగులు చేశారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 31, అలాగే 2 క్యాచ్లు అందుకున్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: సొరభ్జి కొల్హ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ గురించి తెలుసుకోవాలంటే మొత్తం 75 మ్యాచ్లు ఆడి 29.08 సగటుతో 3,578 పరుగులు చేశారు, ఇందులో 6 శతకాలు, 14 ఆర్ద్ర శతకాలు ఉండటం విశేషం అలాగే అత్యధిక స్కోర్ వచ్చేసి 185*. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 444 బంతులు వేయగా 46.50 సగటుతో 6 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 2/14 అలాగే 51 క్యాచ్లు అందుకున్నారు.
వ్యక్తిగత జీవితం
సొరభ్జి కొల్హ పూర్తి పేరు సొరాబ్జి హోర్మస్జి మున్చేర్ష కోల్హా. 1902 సంవత్సరం సెంప్టెంబర్ 22న అప్పటి బ్రిటిష్ ఇండియా బొంబాయి నగరంలో జన్మించారు మరియు తన చదువంతా బొంబాయి నగరంలో సాగింది. ఒక అద్భుతమైన ఆటగాడిగా బ్యాటింగ్ చేస్తూ అలాగే ఫీల్డింగ్ లో కూడా చురుకుగా పరిగెడుతూ అందరిచేత ప్రశంసలు అందుకున్నారు సొరభ్జి కొల్హ. 1950 సంవత్సరం 11 సెప్టెంబర్ న అహ్మదాబాద్ నగరంలో మరణించారు.
సయ్యద్ నజీర్ అలీ:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో సయ్యద్ నజీర్ అలీ ఆరవ స్థానంలో దిగి రెండు ఇన్నింగ్స్లో 13 & 6 పరుగులు చేశారు. భారత టెస్ట్ క్రికెట్లో 8వ ఆటగాడిగా ఆడిన సయ్యద్ నజీర్ అలీ కుడి చేతి బ్యాటర్ మరియు కుడి చేతి ఫాస్ట్ మీడియం బౌలర్ గా జట్టులో ఆడటం జరిగింది.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: సయ్యద్ నజీర్ అలీ తన క్రికెట్ జీవితంలో మొత్తం 2 మ్యాచ్లు ఆడి 7.50 సగటుతో 30 పరుగులు చేశారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 13. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 138 బంతులు వేసి 20.75 సగటుతో 4 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 4/83.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: సయ్యద్ నజీర్ అలీ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ గురించి తెలుసుకోవాలంటే మొత్తం 75 మ్యాచ్లు ఆడి 30.17 సగటుతో 3,440 పరుగులు చేశారు, అలాగే 7 శతకాలు, 15 అర్ధ శతకాలు సాధించారు మరియు అత్త్యుత్తమ స్కోర్ వచ్చేసి 197. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 8,360 బంతులు వేయగా 25.49 సగటుతో 158 వికెట్లు పడగొట్టారు అలాగే 6 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 7/93 అలాగే 48 క్యాచ్లు అందుకున్నారు.
వ్యక్తిగత జీవితం
సయ్యద్ నజీర్ అలీ 1906 సంవత్సరం 8 జూన్ బ్రిటిష్ ఇండియా, పంజాబ్, జులుందర్ నగరంలో జన్మించారు. చక్కటి షాట్స్ ఆడే అద్భుతమైన బ్యాటర్ మరియు మైదానంలో చురుకుగా ఉంటూ ఫీల్డింగ్ చేసే ఆటగాడు సయ్యద్ నజీర్ అలీ. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సయ్యద్ నజీర్ అలీ పాకిస్తాన్ దేశానికి వలస వెళ్లి కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడటం జరిగింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సయ్యద్ నజీర్ అలీ టెస్ట్ జట్టు సెలెక్టర్ పాత్రలో మరియు సెక్రెటరీ పాత్రలో పనిచేయడం జరిగింది. 1975 సంవత్సరం ఫిబ్రవరి 18 న లాహోర్ నగరంలో మరణించారు.
ఫిరోజే పలియా:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో ఫిరోజే పలియా ఏడవ స్థానంలో దిగి రెండు ఇన్నింగ్స్లో 1 & 1 పరుగులు చేశారు. గాయం కారణంగా రెండవ ఇన్నింగ్స్లో ఆఖరి స్థానంలో దిగడం జరిగింది. భారత క్రికెట్ జట్టు తరుపున 10వ ఆటగాడిగా ఆడారు ఫిరోజే పలియా. ఎడమ చేతి బ్యాటింగ్ మరియు ఎడమ చేతితో స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్గా జట్టులో ఆడారు ఫిరోజే పలియా.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: ఫిరోజే పలియా తన క్రికెట్ జీవితంలో మొత్తం రెండు అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడటం జరిగింది. 9.67 సగటుతో 29 పరుగులు సాధించారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 16. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 42 బంతులు వేయడం జరిగింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: ఫిరోజే పలియా ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ల గురించి తెలుసుకోవాలంటే మొత్తం 100 మ్యాచ్లు ఆడగా 32.40 సగటుతో 4,536 పరుగులు సాధించారు, అందులో 8 శతకాలు, 19 అర్ధ శతకాలు సాధించారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 216. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 13,565 బంతులు వేయగా 24.06 సగటుతో 208 వికెట్లు పడగొట్టారు అంతేకాకుండా ఏడుసార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసుకున్నారు. అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 7/109 మరియు 40 క్యాచ్లు అందుకున్నారు.
వ్యక్తిగతం
ఫిరోజే పలియా పూర్తి పేరు ఫిరోజే ఎడ్యుల్జి పలియా, ఈయన 1910 సంవత్సరం 5 సెప్టెంబర్ అప్పటి బ్రిటిష్ ఇండియా, బొంబాయి ప్రెసిడెన్సీ, బొంబాయ్ నగరంలో జన్మించారు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండిటిలో కూడా తన అద్భుతమైన ఆటతీరును కనబర్చారు. 1981 సంవత్సరంలో సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బెంగళూరులో మరణించారు.
లాల్ సింగ్:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో లాల్ సింగ్ ఎనిమిదవ స్థానంలో దిగి రెండు ఇన్నింగ్స్లో 15 & 29 పరుగులు చేశారు. భారత క్రికెట్ జట్టు తరుపున నాలగవ ఆటగాడిగా ఆడారు లాల్ సింగ్. కుడి చేతి బ్యాటర్ మరియు కుడి చేతి స్లో మీడియం బౌలర్గా జట్టులో ఆడారు లాల్ సింగ్.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: లాల్ సింగ్ తన క్రికెట్ జీవితంలో మొత్తం ఒక్క అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడి 22.00 సగటుతో 44 పరుగులు చేశారు మరియు అత్యధిక పరుగులు వచ్చేసి 29 అలాగే ఒక్క క్యాచ్ తీసుకున్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: లాల్ సింగ్ ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ల గురించి తెలుసుకోవాలంటే మొత్తం 32 మ్యాచ్లు ఆడి 24.95 సగటుతో 1123 పరుగులు చేశారు, ఇందులో ఒక శతకం, 5 అర్ధ శతకాలు సాధించారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 107*. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మొత్తం 80 బంతులు వేసి 59.00 సగటుతో ఒక్క వికెట్ పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 1/9, అలాగే 23 క్యాచ్లు అందుకున్నారు.
వ్యక్తిగతం
లాల్ సింగ్ పూర్తి పేరు లాల్ సింగ్ గిల్. 1909 సంవత్సరం 16 డిసెంబర్ అప్పటి బ్రిటిష్ మలయా కౌలా లంపూర్ నగరంలో జన్మించారు. లాల్ సింగ్ చదువంతా కౌలా లంపూర్ నగరంలో సాగింది. 1985 సంవత్సరం నవంబర్ 19న మరణించారు.
జహంగీర్ ఖాన్:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో జహంగీర్ ఖాన్ తొమ్మిదొవ స్థానంలో దిగి రెండు ఇన్నింగ్స్లో 1 & 0 పరుగులు చేశారు. భారత క్రికెట్ జట్టు తరుపున మూడవ ఆటగాడిగా ఆడారు జహంగీర్ ఖాన్. కుడి చేతి బ్యాటింగ్ మరియు కుడి చేతి ఫాస్ట్ మీడియం బౌలర్.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: జహంగీర్ ఖాన్ తన క్రికెట్ జీవితంలో మొత్తం 4 టెస్ట్ మ్యాచ్లు ఆడి 5.57 సగటుతో 39 పరుగులు చేశారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 13. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 606 బంతులు వేసి 63.75 సగటుతో 4 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 4/60, అంతేకాకుండా 4 క్యాచ్లు అందుకున్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: జహంగీర్ ఖాన్ ఆడిన ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ల గురించి తెలుసుకోవాలంటే మొత్తం 111 మ్యాచ్లు ఆడి 22.32 సగటుతో 3,327 పరుగులు చేయగా, 4 శతకాలు, 7 అర్ధ శతకాలు సాధించారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 133. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 8,314 బంతులు వేయగా 25.34 సగటుతో 328 వికెట్లు పడగొట్టారు మరియు 12 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడం జరిగింది అలాగే 2 సార్లు మ్యాచ్లో 10 వికెట్లు తీయడం జరిగింది. అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 8/33 అలాగే 82 క్యాచ్లు అందుకున్నారు.
వ్యక్తిగతం
జహంగీర్ ఖాన్ పూర్తిపేరు మహమ్మద్ జహంగీర్ ఖాన్. ఈయన 1910 సంవత్సరం ఫిబ్రవరి 1న అప్పటి బ్రిటిష్ ఇండియా, పంజాబ్ రాష్ట్రం, జలంధర్ నగరంలో జన్మించారు. తన చదువంతా లాహోర్ నగరం ఇస్లామీయ కళాశాలో సాగింది. భారత్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాకిస్తాన్ దేశానికి వలస వెళ్లిన జహంగీర్ ఖాన్ అక్కడ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారు.
ఇంగ్లాండ్ దేశంలో ఉన్న కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అదనుకున్నారు జహంగీర్ ఖాన్. 1988 సంవత్సరం జులై 23న మరణించారు జహంగీర్ ఖాన్.
అమర్ సింగ్:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో అమర్ సింగ్ పడవ స్థానములో దిగి రెండు ఇన్నింగ్స్లో 5 & 51 పరుగులు చేశారు. భారత క్రికెట్ జట్టు తరుపున మొదటి ఆటగాడిగా ఆడిన అమర్ సింగ్ కుడి చేతి బ్యాటర్ మరియు కుడి చేతి ఫాస్ట్ మీడియం బౌలర్.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: అమర్ సింగ్ తన క్రికెట్ జీవితంలో మొత్తం 7 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడి 22.46 సగటుతో 292 పరుగులు చేశారు, అందులో ఒక అర్ధ శతకం ఉండటం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 51. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 2,182 బంతులు వేయగా 30.64 సగటుతో 28 వికెట్లు పడగొట్టారు మరియు 2 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడం జరిగింది. అమర్ సింగ్ అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 7/86 అలాగే 3 క్యాచ్లు అందుకున్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: అమర్ సింగ్ ఆడిన ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ల గురించి తెలుసుకోవాలంటే మొత్తం 92 మ్యాచ్లు ఆడి 24.23 సగటుతో 3,344 పరుగులు సాధించారు మరియు 5 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉండటం విశేషం అలాగే అత్యధిక స్కోర్ వచ్చేసి 140*. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 23,689 బంతులు వేసి 18.35 సగటుతో 506 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 8/23 అలాగే 42 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు, 14 సార్లు మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టడం విశేషం మరియు 77 క్యాచ్లు అందుకున్నారు.
వ్యక్తిగతం
అమర్ సింగ్ పూర్తి పేరు లాదబాయి నాకుం అమర్ సింగ్. 1910 సంవత్సరం 4 డిసెంబర్ అప్పటి బ్రిటిష్ ఇండియా, గుజరాత్, రాజకోట నగరంలో జన్మించారు. భారత్ క్రికెట్ జట్టులో మొట్ట మొదటి సారి అర్ధ శతకం సాధించిన వ్యక్తిగా అమర్ సింగ్ గుర్తుండిపోతారు అలాగే ఆంగ్ల అక్షరాలా ప్రకారం మొదట భారత లేటెస్ట్ క్రికెట్ క్యాప్ అందుకున్న వ్యక్తిగా నిలిచిపోతారు.
అమర్ సింగ్ మొదటి భారత ఫాస్ట్ బౌలర్ మరియు అల్ రౌండర్ అవ్వడం విశేషం. 1940 సంవత్సరం 21 మే జాంనగర్ లో మరణించారు అమర్ సింగ్.
మహమ్మద్ నిస్సార్:
భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో మహమ్మద్ నిస్సార్ పదకొండవ స్థానములో దిగడం జరిగింది. ఆడిన రెండు ఇన్నింగ్స్లో 1 & 0 పరుగులు చేయగా 5 & 1 వికెట్లు పడగొట్టారు. భారత క్రికెట్ జట్టు తరుపున తొమ్మిదవ ఆటగాడిగా ఆడిన మహమ్మద్ నిస్సార్ కుడి చేతి బ్యాటర్ మరియు కుడి చేతి ఫాస్ట్ బౌలర్.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: మహమ్మద్ నిస్సార్ తన క్రికెట్ జీవితంలో మొత్తం 6 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడగా 6.87 సగటుతో 55 పరుగులు చేశారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 14. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 1,211 బంతులు వేయగా 28.28 సగటుతో 25 వికెట్లు పడగొట్టారు అలాగే 3 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 5/90 అలాగే 2 క్యాచ్లు అందుకున్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: మహమ్మద్ నిస్సార్ ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ల గురించి తెలుసుకోవాలంటే మొత్తం 93 మ్యాచ్లు ఆడి 10.98 సగటుతో 1120 పరుగులు సాధించారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 49. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 15,061 బంతులు వేయగా 17.70 సగటుతో 396 వికెట్లు పడగొట్టారు మరియు 32 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు, 3 సార్లు మ్యాచ్లో 10 వికెట్లు తీసుకున్నారు. మహమ్మద్ నిస్సార్ అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 6/17 అలాగే 65 క్యాచ్లు అందుకున్నారు.
వ్యక్తిగతం
మహమ్మద్ నిస్సార్ 1910 సంవత్సరం 10 ఆగష్టు అప్పటి బ్రిటిష్ ఇండియా, పంజాబ్, హోషియార్పూర్ నగరంలో జన్మించారు. భారత జట్టులో ఉత్తమ ఫాస్ట్ బౌలర్గ మహమ్మద్ నిస్సార్ పేరు సంపాదించుకున్నారు. అప్పట్లోనే ప్రపంచ క్రికెట్లో ఉత్తమ ఫాస్ట్ బౌలర్ జాబితాలో చోటు సంపాదించారు మహమ్మద్ నిస్సార్.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాకిస్తాన్ దేశానికి వలస వెళ్లారు మహమ్మద్ నిస్సార్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసిన సభ్యుల్లో మహమ్మద్ నిస్సార్ ఒకరు. 1963 సంవత్సరం 11 మార్చ్ లాహోర్ నగరంలో మరణించారు.