How and why IPL Tournament was Started

క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ దేశంలో అయినా భారతీయ అభిమానులే ఎక్కువ ఇష్టపడతారు అంతేకాకుండా క్రికెట్ ని ఒక క్రీడలా కాకుండా మతం లా చూసే అభిమానులు మరియు క్రికెట్ ఆటగాళ్ళని దేవుళ్లుగా అభిమానించే అభిమానులు మన దేశంలో ప్రతి నగరంలోనూ వీధిలోనూ కనిపిస్తారు. అలంటి క్రికెట్ ఇష్టపడే దేశంలో ఒక లీగ్ ప్రారంభమైతే అభిమానుల ఆనందానికి హద్దులుండవు. మరి ఆ లీగ్ ఏంటి ఎలా ప్రారంభమైంది అనేది తెలుసుకుందాం.

ఐపిఎల్ అనగా “ఇండియన్ ప్రీమియర్ లీగ్” ఈ లీగ్ భారత్ లో మొదలయ్యి ఈ ఏడాదికి 17 సంవత్సరాలు అయ్యింది. ఈ 17 సంవత్సరాలలో ఎన్నో మార్పులు, చేర్పులు, వివాదాలు ఇంకా చాలా విషయాలు జరిగాయి కానీ అన్నింటిని దాటుకుంటూ ఈ భారత లీగ్ మరో కొత్త సీజన్ కి ముస్తాబయింది, అలాగే ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెడుతూనే ఉంది, మరి అలంటి ఐపీఎల్ మొదలవడానికి కారణం ఏంటి? అసలు ఈ లీగ్ మొదలుపెట్టాలి అని ఎందుకనుకున్నారు? ఈ లీగ్ వెనుక ఉన్నది ఎవరు? ఈ విషయాలన్నీఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెట్ అనగానే అందరికి గుర్తొచ్చేది మొదట సంప్రాదయకమైన టెస్ట్ మ్యాచ్ ఇది ఐదు రోజులు ఉంటుంది, ఆ ఐదు రోజులు ఇరు జట్లు రెండేసి ఇన్నింగ్స్ ఆడతారు ఇది అందరికి తెలిసిన విషయమే అలాగే టెస్ట్ మ్యాచ్ మొదలయిన చాలా ఏళ్ళ తరువాత వన్డే క్రికెట్ ఫార్మటు తీసుకొచ్చారు అది ఒక్కరోజులో ఫలితం తేలిపోయే ఆట మరియు ఇరు జట్లు 50-50 ఓవర్లు ఆడతారు. ఇవి రెండు ఫార్మాట్లు కాకుండా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మరో కొత్త ఫార్మటు తో ముందుకొచ్చింది అదే 20-20 క్రికెట్ దీన్నే పొట్టి క్రికెట్ అని కూడా పిలుస్తారు మన భాషలో.

పొట్టి క్రికెట్ ఫార్మటు

20-20 క్రికెట్ అంటే రెండు జట్లు 20-20 ఓవర్లు ఆడేలా కొత్త పధ్ధతి తీసుకొచ్చారు. అలా కొన్ని జట్లతో ఈ మ్యాచ్లు ఆడించడం మొదలుపెట్టారు. అప్పుడే 20-20 క్రికెట్ ప్రపంచకప్ మొదలుపెట్టాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం దీనికి అన్ని క్రికెట్ బోర్డులు ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. దక్షిణాఫ్రికా లో జరిగిన మొదటి 20-20 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ కి రావడం పాకిస్తాన్ తో ఆఖరి మ్యాచ్ గెలవడం అందరికి తెలిసిందే. ఈ 20-20 ప్రపంచకప్ జరిగిన కొద్దిరోజులకే ఒక కొత్త క్రికెట్ లీగ్ తెరపైకి వచ్చింది అదే “ఇండియన్ క్రికెట్ లీగ్”.

భారత దేశంలో క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడి కల ఎలాగైనా క్రికెట్ నేర్చుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించి భారత్ తరపున ఆడాలి అని కానీ రోజు రోజుకి ఈ క్రికెట్ ప్రపంచంలో పోటీ ఎక్కువ అవ్వడంవల్ల కొంతమందికి అవకాశాలు వస్తున్నాయ్ కొంతమందికి అవకాశాలు రావట్లేదు. అలా కొంతమందిలో ఎంత ప్రతిభ ఉన్న నిరాశతో రంజీ ట్రోఫీ వరకే పరిమితం అవుతున్నారు, అలాంటి ప్రతిభ ఉన్న ఆటగాళ్ల కోసమే ఈ “ఐసిఎల్” ని తెరమీదకి తీసుకొచ్చింది జీ మీడియా సంస్థ.

ఇండియన్ క్రికెట్ లీగ్ అంటే ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అందరికి తెలుసు మరి ఈ ఇండియన్ క్రికెట్ లీగ్ ఏంటి, ఇది ఎప్పుడు మొదలుపెట్టారు అనేది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు, తెలియని వాళ్ళకోసమే ఈ క్రికెట్ లీగ్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను.

జీ మీడియా సంస్థ వారు ఒక కొత్త ఆలోచనతో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు అదే ఇండియన్ క్రికెట్ లీగ్. బి.సి.సి.ఐ మరియు ఐ.సి.సి కి వ్యతిరేకంగా ఈ లీగ్ ని ప్రారంభించారు. ఈ లీగ్ లో మొత్తం ఆరు ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, చంఢీగర్, హైదరాబాద్, కోల్కత్త జట్లు ఈ లీగ్ లో పాల్గొన్నాయి. భారత జాతీయ జట్టులో చోటు సంపాదించని ఆటగాళ్లు ఈ లీగ్ లో ఆడటం జరిగింది అలాగే విదేశీ ఆటగాళ్లు కూడా ఈ లీగ్ లో ఆడటం జరిగింది. అనూహ్యంగా ఈ లీగ్ కి భారత మాజీ క్రికెట్ ఆటగాడు కపిల్ దేవ్ తో పాటు మరి కొంతమంది భారత మాజీ ఆటగాళ్లు మద్దతు పలకడం జరిగింది. అలా కొంతమంది స్వదేశీ విదేశీ ఆటగాళ్లతో లీగ్ మొదలయ్యి ఒక సీజన్ ముగిసింది. మొదటి సీజన్ లో చెన్నై జట్టు విజయం సాధించింది.

ఒక విజయవంతమైన సీజన్ ముగిసిన వెంటనే మరో కొత్త సీజన్ మొదలుపెట్టారు ఐ.సి.ఎల్ నిర్వాహకులు. ఈ సీజన్ లో మరో రెండు కొత్త జట్లు ఈ లీగ్ లో భాగం అవ్వడం జరిగింది, అదే అహ్మదాబాద్ జట్టు మరియు పాకిస్తాన్ దేశం నుంచి లాహోర్ జట్టు. రెండవ సీజన్ లో విన్నర్ గా లాహోర్ జట్టు నిలిచింది. రెండో సీజన్ కూడా విజయవంతం అవ్వడంతో ఈ సారి మరో జట్టు ఈ లీగ్ లో భాగం అయ్యింది అదే బాంగ్లాదేశ్ దేశం నుంచి ఢాకా జట్టు. ఈ మూడో సీజన్ లో విన్నర్ గా హైదరాబాద్ జట్టు నిలిచింది.

ఒక వైపు ఈ లీగ్ ప్రేక్షకుల ఆదరణ పొందడం చూసి కొంతమంది దేశి, విదేశీ ఆటగాళ్లు తమ జాతీయ క్రికెట్ బోర్డు కు రాజీనామా చేసి ఈ లీగ్ లో పాల్గొనడం జరిగింది, ఇది చూసి ఐ.సి.సి, బి.సి.సి.ఐ మరియు మిగితా విదేశీ క్రికెట్ బోర్డులు వారించినా కూడా వారి మాట లెక్క చేయకుండా ఆటగాళ్లు ఈ లీగ్ లో ఆడేందుకు ముందుకొచ్చారు. దిగజ్జ ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొనడం జరిగింది. బ్రియాన్ లారా, మార్వాన్ ఆటపట్టు, ఇంజమామ్-ఉల్-హాక్ ఇంకా కొంతమంది ఆటగాళ్లు ఈ లీగ్ లో ఆడటం జరిగింది. కేవలం ఈ లీగ్ కోసం “జీ మీడియా” సంస్థ వారు ఒక కొత్త స్పోర్ట్స్ ఛానల్ ని మొదలుపెట్టారు దానిపేరు “జీ స్పోర్ట్స్”.

కొత్త సీజన్ కొత్త మార్పులు

దిగ్విజయంగా మూడు సీజన్ లు ముగించాక నాలుగో సీజన్ కి ఇండియన్ క్రికెట్ లీగ్ ముస్తాబయింది. ఈ సారి వన్డే ఫార్మటు లో ఈ లీగ్ ని మొదలు పెట్టారు. తొమ్మిది నగరాలుగా ఉన్న జట్లని 4 జట్లుగా విభజించారు అది కూడా దేశి జట్లు గా మార్చారు.

ఐ.సి.ఎల్. భారత్, ఐ.సి.ఎల్.పాకిస్తాన్, ఐ.సి.ఎల్.బాంగ్లాదేశ్ మరియు ఐ.సి.ఎల్.వరల్డ్ XI పేర్లతో కొత్త సీజన్ మొదలుపెట్టారు. భారత్,పాకిస్తాన్,బాంగ్లాదేశ్ జట్టు లో ఆ దేశ ఆటగాళ్లు ఉంటె వరల్డ్ XI జట్టులో మాత్రం మిగితా విదేశీ క్రీడాకారులు ఉండటం విశేషం. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్,శ్రీలంక దేశస్థులు ఈ జట్టు లో ఉన్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ లీగ్ ని ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశం తో భారత క్రికెట్ బోర్డు ఒక ప్రకటన తీసుకొచ్చింది. ఆ ప్రకటనలో ఉన్న సమాచారం ఎవరైతే ఈ లీగ్ లో పాల్గొంటారో ఆ క్రీడాకారులని అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. ఇదే బాటలో మిగితా క్రికెట్ బోర్డు లు కూడా తమ ఆటగాళ్ళని నిషేధం ప్రకటించడం వల్ల నాల్గవ సీజన్ మధ్యలో ఆపేయడం జరిగింది. ఈ ప్రకటనతో ఉలిక్కిపడ్డ ఆటగాళ్లు ఐసిఎల్ వీడడం జరిగింది. అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్నీ, రోహన్ గవాస్కర్ (సునీల్ గవాస్కర్ తనయుడు) లాంటి ఆటగాళ్లు కూడా ఈ లీగ్ లో ఆడటం జరిగింది. తెలుగు సినీ నటుడు మంచు విష్ణు హైదరాబాద్ జట్టు కి సహా యజమానిగా ఉండటం విశేషం.

ఐ పి ఎల్ ప్రారంభం

ఐసిఎల్ విజయాన్ని చూసిన బి.సి.సి.ఐ ఎలాగైనా ఇలాంటి లీగ్ ఒకటి అధికారికంగా ప్రారంభించాలని దేశ నలుమూలల్లో ఉంటున్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని అనుకుంది. అప్పుడే లలిత్ మోడీ అనే వ్యాపారవేత్త మరియు క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఒక ప్రతిపాదనతో బి.సి.సి.ఐ పెద్దలని కలిసి తన ఆలోచనలని చెప్పడం జరిగింది, అలా ఈ ఐపిఎల్ మొదలవడానికి బీజం ఏర్పడింది. 2008 సంవతసరం లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ దేశ విదేశాలలో ఉన్న క్రికెట్ అభిమానులను ఎంతగానో ఉత్సాహపరుస్తూ దిగ్విజయంగా నడుస్తుంది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *