ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజు పద్మ మరియు భారతరత్న పురస్కారాలు అందజేస్తారు, మరి ఈ పురస్కారాలు ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు, ఎవరికీ ఇస్తారు, వాటి అర్హతలేంటి అనే విషయాలు తెలుసుకుందాం.
1954 సంవత్సరంలో భారత ప్రభుత్వం రెండు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ప్రవేశపెట్టింది, ఆ పురస్కారాలు పద్మ మరియు భారతరత్న. ఈ పురస్కారాలు ప్రవేశ పెట్టిన తరువాత పద్మ పురస్కారాలని 3 భాగాలుగా విభజించడం జరిగింది. పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ పేర్లతో భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలని విభజించింది. వివిధ రంగాలలో సేవచేసి గుర్తింపు పొందిన వ్యక్తులకి ఈ పురస్కారాలు అందజేస్తారు.
భారతరత్న
ఈ పురస్కారం భారత దేశ అత్యున్నత పురస్కారంగా మరియు భారత దేశం గర్వించదగ్గ పురస్కారంగా భావిస్తారు. ఈ పురస్కారాన్ని పొందినవారు దేశానికి గర్వకారణంగా నిలుస్తారు. భారత రాష్రపతికి ప్రధానమంత్రి తప్ప ఇంకెవరు కూడా ఈ పురస్కారాన్ని ఫలానా వ్యక్తికీ ఇవ్వవలసిందిగా సూచించకూడదు. ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని(2024 సంవత్సరం వరకు) 54 మందికి ఈ పురస్కారం లభించింది. భారత పౌరులకె కాకుండా కొంతమంది విదేశీ పౌరులు కూడా అందుకోవడం విశేషం.
భారతరత్న పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు ఈ పురస్కారాన్ని అందుకున్నమొదటి విదేశీ వ్యక్తి మదర్ థెరిసా. కొంతమందికి ఈ పురస్కారం మరణాంతరం కూడా ఇవ్వడం జరిగింది, అలా మరణించిన తరువాత కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్ట్రీ. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ తన 40వ సంవత్సరంలో భారతరత్నపురస్కారాన్ని అందుకున్నారు, అంతేకాకుండా ఈ పురస్కారం అందుకున్న మొదటి క్రీడాకారుడు.
ప్రతి సంవత్సరం ముగ్గురికి భారతరత్న పురస్కారం అందించాలని తీర్మానం చేయడం జరిగింది. భారతరత్న పురస్కారాన్ని తమ పేరుకి ముందు గాని తరువాత గాని వాడుకోవడానికి వీలు లేదు. కొన్ని కారణాలవల్ల భారతరత్న పురస్కారాన్ని రెండుసార్లు రద్దు చేశారు. భారతరత్న పురస్కారాన్ని ఇచ్చేటప్పుడు భారత రాష్రపతి సంతకం చేసిన ఒక పట్టా మరియు పతకం ప్రధానం చేస్తారు.
పద్మ పురస్కారాలు
భారతరత్న పురస్కారం తరువాత దేశ పౌరులకు ఇచ్చే మరో అత్త్యున్నత పురస్కారం పద్మ పురస్కారాలు. ముందుగా పద్మవిభూషణ్ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించారు ఆ తరువాత పద్మ పురస్కారాలని 3 వర్గాలుగా విభజించారు, వాటినే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలుగా ఇవ్వడం మొదలుపెట్టారు.
పద్మ పురస్కారాలను ఫలానా వ్యక్తికీ ఇవ్వవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి సామాన్య పౌరులు వరకు ఎవరైనా సూచించవచ్చు, కమిటీ లో ఉన్న వ్యక్తులు అన్ని సూచనలు తీసుకుని ప్రధానమంత్రికి అందచేయడం జరుగుతుంది, ఆ తరువాత అర్హులైన వారి పేర్లను ప్రధానమంత్రి దేశ రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది.
పద్మవిభూషణ్: భారత దేశానికి విశేషమైన సేవలు చేసిన వ్యక్తికీ ఈ పురస్కారం అందిస్తారు. ఈ పురస్కారం రెండవ అత్యున్నత పురస్కారం. పద్మవిభూషణ్ పురస్కారం పొందిన మొదటి వ్యక్తి సత్యేన్ద్ర నాథ్ బోస్. 1954 సంవత్సరం లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విద్య మరియు సాహిత్య రంగాలలో ఈయన చేసిన కృషికి ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది.
పద్మభూషణ్: కళలు, సాహిత్యం మరియు వివిధ రంగాలలో ఈ పురస్కారం అందిస్తారు. ఈ పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తి అజూధియా నాథ్ ఖోస్లా, సైన్స్ మరియు ఇంజినీరింగ్ రంగాలకి గాను ఈన పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1954 సంవత్సరం లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రద్మశ్రీ: ప్రజాసేవ, క్రీడలు మరియు పరిశోధన వంటి రంగాలలో ఘనత చాటిన వారికి ఈ పురస్కారం అందిస్తారు. వైద్య రంగంలో తన సేవలను గుర్తించి బీర్ భాన్ భాటియాకు పద్మశ్రీ పురస్కారం అందజేశారు మరియు ఈయన తోలి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి. 1954 సంవత్సరం లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.