క్రికెట్ అంటే భారత అభిమానులకి ఒక ఆట కాదు ఒక మతం, అలాగే ఆటగాళ్ళని దేవుళ్లుగా ఆరాధిస్తారు. మన దేశ క్రికెట్ ఆటగాళ్లనే కాకుండా విదేశీ క్రికెట్ ఆటగాళ్లని కూడా అదేవిధంగా అభిమానిస్తారు మన భారత ప్రేక్షకులు.
క్రికెట్ అంటే ఇష్టం ఉన్న ప్రతి వ్యక్తికీ భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటు సంపాదించి ఆడాలనే కోరిక ఉంటుంది, అలాగే తమ ప్రతిభ చూపించి అందరి చూపు తమ వైపు తిప్పుకునేలా చేయాలి అని ఉంటుంది, మరి జాతీయ జట్టులో చోటు సంపాదించాలంటే ఎం చెయ్యాలో ముందే చెప్పుకున్నాం. రంజీ ట్రోఫీ ఆడి తమ ప్రతిభ కనబర్చాలి అంతే కాకుండా మిగిలిన డొమెస్టిక్ మరియు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ ఉండాలి అప్పుడే సెలెక్టర్లు దృష్టిలో పడటం జరుగుతుంది.
జాతీయ జట్టులో చోటు సంపాదించడానికి రంజీ ట్రోఫీ ఆడాలి అని చెప్పుకున్నాం మరి ఆ రంజీ ట్రోఫీ అంటే ఏంటి, ఆ ట్రోఫీ ఎప్పుడు మొదలు పెట్టారు, ఎవరు పేరుతొ మొదలు పెట్టారు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. రంజీ ట్రోఫీ కాకుండా మరో రెండు క్రికెట్ ట్రోఫీలు ఉన్నాయి అవే ఇరానీ కప్ మరియు దియోధర్ ట్రోఫీ.
భారత డొమెస్టిక్ క్రికెట్ లో రంజీ ట్రోఫీ తర్వాత ముఖ్యమైనది ఇరానీ కప్. ఈ ఇరానీ కప్ ఎప్పుడు మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు మరియు ఆ పేరు ఎలా వచ్చింది ఈ విషయాలన్నీ తెలుసుకుందాం.
ఇరానీ కప్
1934 సంవత్సరంలో “ది క్రికెట్ ఛాంపియన్షిప్ అఫ్ ఇండియా” పేరుతొ డొమెస్టిక్ క్రికెట్ ప్రారంభమైంది, ఆ తరువాత 1935 సంవత్సరంలో రంజీ ట్రోఫీ అని పేరు మార్చిన విషయం మనకు తెలిసిందే. ఇన్ని సంవత్సరాలైనా రంజీ ట్రోఫీ దిగ్విజయంగా నడుస్తుంది. రంజీ ట్రోఫీ ప్రారంభించి 25 సంవత్సరాలైనా సంధర్బంగా భారత క్రికెట్ బోర్డు పెద్దలు ఒక ఎక్సిబిషన్ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆ ఎక్సిబిషన్ మ్యాచ్ ఏంటి అంటే రంజీ ట్రోఫీ సీజన్ ఫైనల్లో గెలిచిన జట్టు మరియు మిగిలిన జట్లని కలిపి “రెస్ట్ అఫ్ ఇండియా” జట్టు పేరుతొ ఒక మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ 1959 – 1960 సంవత్సరంలో జరిగింది. ఈ మ్యాచ్ విజేత ముంబై జట్టు గెలవడం జరిగింది. ఆ తరువాత ఈ మ్యాచ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.
1960-1961 మరియు 1961-1962 సంవత్సరాలలో ఈ మ్యాచ్ నిర్వహించలేదు కానీ ఇలాంటి మ్యాచ్ ఆడితే బాగుంటుందనుకుని మళ్ళీ 1962-1963 సంవత్సరంలో ఈ పద్ధతిని పునఃప్రారంభించారు. ఈ మ్యాచ్ కి “ఇరానీ కప్” అని పేరు పెట్టడం జరిగింది. ఇక ప్రతి సంవత్సరం ఈ ఇరానీ కప్ ఆడటం జరుగుతుంది.
ఇరానీ కప్ సీజన్ గురించి చెప్పుకోవాలంటే రంజీ ట్రోఫీ సీజన్ తరువాత ఇరానీ కప్ సీజన్ మొదలయ్యేది ఆ తరువాత రంజీ ట్రోఫీ సీజన్ ముందు ఇరానీ కప్ నిర్వహించడం మొదలుపెట్టారు మళ్ళీ రంజీ ట్రోఫీ సీజన్ తర్వాతే ఇరానీ కప్ నిర్వహిస్తున్నారు. 1962-1963 సంవత్సరం నుంచి మొదలైన ఇరానీ కప్ ఇప్పటివరకు దిగ్విజయంగా కొనసాగుతుంది. మధ్యలో కోవిడ్ కారణంగా ఒక సీజన్ ఆడటం జరగలేదు.
ఫార్మటు
ఇరానీ కప్ ఫార్మటు గురించి తెలుసుకోవాలంటే ఈ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ పద్దతిలో ఆడతారు అంటే 5 రోజులు జరుగుతుంది, అది కూడా ఒకటే మ్యాచ్. ఒక వేళా మ్యాచ్ డ్రా అవ్వడం జరిగితే ఇరు జట్లలో ఏ జట్టైతే తమ మొదటి ఇన్నింగ్స్ లో ఎక్కువ పరుగులు చేసిందో ఆ జట్టుని విజేతగా ప్రకటిస్తారు.
విజేతలు
ఇరానీ కప్ విజేతల విషయానికి వస్తే రెస్ట్ అఫ్ ఇండియా జట్టు 30 సార్లు విజేతగా నిలిచింది. ఆ తరువాత స్థానం ముంబై జట్టుది. 29 సార్లు ఫైనల్ కి వస్తే 14 సార్లు విజేతగా నిలిచింది. కర్ణాటక జట్టు 8 సార్లు ఫైనల్ కి వస్తే 6 సార్లు విజేతగా నిలిచింది. ఢిల్లీ జట్టు 7 సార్లు ఫైనల్ కి వస్తే రెండు సార్లు విజేతగా నిలిచింది. రైల్వేస్ జట్టు, విదర్భ జట్టు రెండు సార్లు ఫైనల్ వస్తే రెండు సార్లు విజేతగా నిలిచాయి. హైదరాబాద్, హర్యానా, తమిళనాడు జట్లు ఒక్కో సారి ఫైనల్ కి వచ్చి విజేతగా నిలవడం జరిగింది.
ఇరానీ ఎవరు
బి.సి.సి.ఐ కోశాధికారిగా, వైస్ ప్రెసిడెంట్ గా అలాగే రెండు సార్లు ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తి ఇరానీ. ఈనా పూర్తి పేరు ZR ఇరాని. 1907 డిసెంబర్ 12న జన్మించారు. లండన్ లో చదువుకున్నారు, భారత్ తిరిగి వచ్చాక ఢిల్లీ లోని రోషనార క్లబ్ లో మరియు ముంబై పార్శి జింఖానా జట్లకు ఆడటం జరిగింది. భారత క్రికెట్ బోర్డుకు ఇరానీ గారు చేసిన సేవలు గుర్తించి ఇరానీ కప్ అని పేరు పెట్టడం జరిగింది. 1970 సంవత్సరంలో ఇరానీ గారు మరణించడం జరిగింది.
దియోధర్ ట్రోఫీ
భారత డొమెస్టిక్ క్రికెట్ లో మరో ముఖ్యమైన ట్రోఫీ దియోధర్ ట్రోఫీ. ఈ ట్రోఫీని దేవదారు ట్రోఫీ అని కూడా పిలుస్తారు కొంతమంది. ఇక ఈ దియోధర్ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది ఈ విషయాలన్నీ తెల్సుకుందాం.
భారత క్రికెట్ లో రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ తర్వాత మరో ముఖ్యమైనది దియోధర్ ట్రోఫీ. ఈ ట్రోఫీ భారత క్రికెట్ బోర్డు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. 1973 – 1974 సంవత్సరం నుంచి ఈ ట్రోఫీ ఆడటం ప్రారంభించారు. ఈ దియోధర్ ట్రోఫీని వన్డే పద్దతిలో ఆడటం జరుగుతుంది అంటే ఇరు జట్లు 50-50 ఓవర్లు ఆడేలా నియమించారు.
జట్లు, ఫార్మటు
దియోధర్ ట్రోఫీ జట్ల విషయానికి వస్తే ఈ ట్రోఫీ 5 జట్లతో ప్రారంభించారు. నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ పేర్లతో జట్లని నియమించారు. కొన్ని సంవత్సరాల వరకు ఈ 5 జట్లతో ఈ దియోధర్ ట్రోఫీ జరిగింది. ప్రతి జట్టు మిగితా జట్టుతో ఆడేది. ఎవరైతే మొదటి రెండు స్థానాల్లో నిలుస్తారో వారి మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగేది. కొన్ని సంవత్సరాలు వరకు దియోధర్ ట్రోఫీలో ఎలాంటి మార్పులు లేకుండా జరిగింది ఆ తరువాత జోన్లు పేరుతొ ఉన్న జట్లని తీసేసి ఇండియా ఏ, ఇండియా బి మరియు విజయ్ హజారే ట్రోఫీ లో విజేతగా నిలిచిన జట్టుతో ఆడటం జరిగింది.
మూడేళ్ళ తరువాత మళ్ళీ కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇండియా ఏ, ఇండియా బి మరియు ఇండియా సి జట్ల పేర్లతో దియోధర్ ట్రోఫీ ఆడటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోనే జట్లని తీసుకొచ్చి ఈ ట్రోఫీ ఆడటం మొదలుపెట్టారు. నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ ఈ జట్లు ఉన్న విషయాలు మనం ముందుగానే తెలుసుకున్నాం ఇప్పుడు వీటితో పాటు మరో కొత్త జట్టు వచ్చి చేరింది అదే నార్త్ – ఈస్ట్ జోన్ జట్టు అంటే ప్రస్తుతం 6 జట్లతో ఈ దియోధర్ ట్రోఫీ ఆడుతున్నారు.
దియోధర్ ట్రోఫీ పేరు ఎలా వచ్చింది
దియోధర్ ట్రోఫీ ఈ పేరు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం డి.బి. దియోధర్ అనే క్రికెట్ ఆటగాడు. “గ్రాండ్ ఓల్డ్ మెన్ అఫ్ ఇండియన్ క్రికెట్” గా ఆయనని పిలుచుకునేవారు. 1894 జనవరి 14 న అప్పటి బ్రిటిష్ ఇండియా లో పుణేలో జన్మించారు. ఈన పూర్తి పేరు దినకర్ బల్వంత్ దియోధర్. పూణే కళాశాలలో సంస్కృతం భాషని పాఠం గా చెప్పేవారు.
1939 సంవత్సరం నుంచి 1941 సంవత్సరం వరకు మహారాష్ట్ర తరపు నుంచి రంజీ ట్రోఫీ ఆడారు దియోధర్ గారు. మొత్తం 81 మ్యాచ్లు ఆడీ 4,522 పరుగులు సాధించారు. 246 తన అత్యధిక స్కోర్. ఇక సగటు వచ్చేసి 39.32. భారత క్రికెట్ బోర్డుకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మహారాష్ట్ర క్రికెట్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. జాతీయ సెలక్షన్ కమిటీలో కూడా పనిచేయడం జరిగింది.
1973 సంవత్సరంలో డి. బి. దియోధర్ గారి పేరు మీద “ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్” ఆడటం జరిగింది. “భారత పోస్ట్” దియోధర్ గారి పేరు మీద స్మారక స్టాంప్ విడుదల చేసింది. 2012 లో పూణే లోని “సహారా క్రికెట్ స్టేడియం”లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.
చాల తక్కువ మంది వరల్డ్ వార్ 1 కి ముందు, రెండవ వరల్డ్ వార్ తరువాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు, అందులో ఒకరు దియోధర్ గారు కూడా ఉండటం విశేషం అది కూడా బొంబాయి ట్రైఎంగిలార్ మ్యాచ్ లో 1911 మరియు 1946 రంజీ ట్రోఫీలో ఆడటం జరిగింది.
1944 లో నవనగర్ తో జరిగిన ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో రెండు శతకాలు సాధించి తన జట్టుని గెలిపించారు దియోధర్. అప్పుడు దియోధర్ గారి వయసు 53. 1965 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. 1991 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. వంద సంవత్సరాల పుట్టిన రోజు జరుపుకున్న మొదటి ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా నిలిచిపోయారు దియోధర్. ఆ తరువాత స్థానం వసంత్ రాజి గారు వందేళ్ల పుట్టినరోజు జరుపుకోవడం విశేషం. 1993 ఆగష్టు 24 న మృతి చెందారు దినకర్ బల్వంత్ దియోధర్.