History of Dronacharya Award in Telugu

ద్రోణాచార్య పురస్కారం అంటే ఏంటి, ఈ పురస్కారం ఎవరు ఎవరికిస్తారు, ఎప్పటినుంచి ఇవ్వడం మొదలుపెట్టారు, ఎవరి పేరు మీద ఇవ్వడం మొదలు పెట్టారు ఈ విషయాలు తెలుసుకుందాం.

భారత క్రీడారంగంలో క్రీడాకారులకు ఎన్నో రకాల జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభిస్తుంటాయి అంతేకాకుండా ఎంతో మంది అభిమానాన్ని సంపాదిస్తుంటారు మరి ఆ క్రీడాకారులను తయారు చేసి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేలాగా తీర్చిదిద్ది, శిక్షణ ఇచ్చిన గురువులకి ఎలాంటి గౌరవం ఇస్తారు అనే విషయాన్ని తెల్సుకుందాం. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన గురువులకు గౌరవంతో ఇచ్చే పురస్కారమే ద్రోణాచార్య పురస్కారం. మరీ ఈ పురస్కారం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

ద్రోణాచార్య పురస్కారం

భారత ప్రభుత్వం 1985 సంవత్సరంలో ద్రోణాచార్య పురస్కారం ఇవ్వడం ప్రారంభించారు. ప్రతీ సంవత్సరం భారత యువజనుల వ్యవహారాలు మరియు క్రీడా శాఖా మంత్రి ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఒలంపిక్స్ గేమ్స్, పారా ఒలంపిక్స్ గేమ్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్షిప్, పారా స్పోర్ట్స్, క్రికెట్ మరియు ఇతర క్రీడలలో అత్త్యుత్తమ క్రీడాకారులను తయారు చేసిన గురువులకు ఈ పురస్కారం అందిస్తారు.

భారత దేశంలో గుర్తింపు పొందిన నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ , ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ , స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా, భారత క్రికెట్ బోర్డు ఇలా క్రీడలకు సంభందించిన బోర్డులనుంచి నామినేషన్స్ పంపించడం జరుగుతుంది. ప్రతి క్రీడ నుంచి ఇద్దరినీ ఎంపిక చేసి పది మంది ఉన్న కమిటీ సభ్యులకి సిఫార్సు చేయడం జరుగుతుంది.

ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పది మంది సభ్యుల కమిటీకి కొంతమంది క్రీడాకారుల పేర్లను సిఫార్సు చేస్తారు, తరువాత ఆ పది మంది కమిటీ సభ్యులు ఆ క్రీడాకారుల పేర్లని పరిశీలించి క్రీడల శాఖా మంత్రికి సమర్పిస్తారు. క్రీడాకారులకు 20 సంవత్సరాలకు పైగా శిక్షణ ఇచ్చిన గురువులకి ఈ పురస్కారం అందిస్తారు.

మొదటి సంవత్సరం ద్రోణాచార్య పురస్కారం అందుకున్న వ్యక్తులు

ద్రోణాచార్య పురస్కారం స్థాపించిన 1985 సంవత్సరంలో మొత్తం ముగ్గురికి ఈ పురస్కారం అందచేశారు. ఆ ముగ్గురు ఎవరంటే బాలచంద్ర భాస్కర్ భగవత్, ఓం ప్రకాష్ భరద్వాజ్ మరియు ఓ. ఏమ్. నంబియార్.

బాలచంద్ర భాస్కర్ భగవత్ రెజ్లింగ్ క్రీడకు గాను ద్రోణాచార్య పురస్కారం అందుకున్నారు. ఓం ప్రకాష్ భరద్వాజ్ బాక్సింగ్ క్రీడకు గాను ద్రోణాచార్య పురస్కారం అందుకున్నారు. ఓ. ఏమ్. నంబియార్ అథ్లెటిక్స్ కి గాను ద్రోణాచార్య పురస్కారం అందుకున్నారు. ఇప్పటివరకు 144 వ్యక్తులకు ద్రోణాచార్య పురస్కారం ప్రధానం చెశారు. ఈ పురస్కారం అందుకున్న పురస్కార గ్రహీతలకు ద్రోణాచార్యుని కాంస్య విగ్రహం, సర్టిఫికెట్, ఉత్సవ దుస్తులు మరియు 15 లక్షల నగదు ఇవ్వడం జరుగుతుంది.

ద్రోణాచార్య ఎవరు

మహాభారతం లోని ఒక పాత్ర పేరు ద్రోణాచారుడు. భరద్వాజుడి కుమారుడైన ద్రోణాచార్యుడు కౌరవులకు మరియు పాండవులకు విల్లు విద్యను నేర్పించడం జరిగింది. ద్రోణాచార్య కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయం చేయమని అడగటానికి పరుశురాముడు వద్దకు వెళ్ళినప్పుడు సహాయం చేయడానికి తన దెగ్గర ఎలాటి సంపద లేదు కానీ విల్లు విద్య నేర్పిస్తానని తనకి తెలిసిన విల్లు విద్య నేర్పించడం జరుగుతుంది. ఆ విల్లు విద్యని ద్రోణాచార్యుడు హస్తినాపుర్ లో కౌరవులకు మరియు పాండవులకు నేర్పించడం జరిగింది.

కౌరవులకు మరియు పాండవులకు విల్లు విద్యని నేర్పిన ద్రోణాచార్యుడికి ఇష్టమైన శిష్యుడు పాండవుల సోదరులలోని అర్జునుడు. అర్జునుడు ఎంతో ప్రతిభగల వ్యక్తి మరియు తను గురి చూసి బాణం కొట్టే విధానం ద్రోణాచార్యుడికి ఎంతో నచ్చుతుంది. కానీ మహాభారత యుద్ధంలో మాత్రం పాండవులు వైపు కాకుండా కౌరవుల వైపు నుంచి యుద్ధం చేయడం జరిగింది.

గురు దక్షిణ

ఏకలవ్యుడు అనే బోయ వంశానికి చెందిన వ్యక్తికీ విల్లు విద్య నేర్చుకోవాలని ఆశ ఉండేది కానీ ద్రోణాచార్యుడు అందుకు నిరాకరించడం జరిగింది. ఆ తరువాత బంకమట్టితో ద్రోణాచార్యుడి ప్రతిమను తయారు చేసి దానినే గురువుగా భావించి విల్లు విద్య సాధన చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ద్రోణాచార్యుడు నా ప్రతిమతో సాధన చేసిన నువ్వు నాకు గురు భక్తిగా ఏమివ్వగలవు అని అడగ్గా దానికి ఏకలవ్యుడు మీరు ఏది దక్షిణ గా అడిగిన ఇవ్వగలను అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ద్రోణాచార్యుడు నీ బొటన వేలు కావాలి అని కోరగా అప్పటికప్పుడే తన బొటన వేలు కోసి ఇవ్వడం జరిగింది.

ద్రోణాచార్య అవార్డు మన క్రీడా ప్రపంచంలో గురువుల కీర్తిని చాటుతుంది. ప్రతిభావంతులైన క్రీడా శిక్షకులు మరింత మంది విజయవంతమైన క్రీడాకారులను తీర్చిదిద్దగలరన్న ఆశతో ఈ అవార్డుకు ప్రాధాన్యతను కొనసాగించాలి.

ద్రోణాచార్య పురస్కారం గురించి మరి కొన్ని విశేషాలు:

  • 2012 సంవత్సరంలో ద్రోణాచార్య పురస్కారం లో జీవిత సాఫల్య పురస్కారాన్ని స్థాపించారు.
  • క్రికెట్ దేవుడిగా భావించే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురువు రమాకాంత్ అచ్చ్రేకర్ గారికి 1990 సంవత్సరంలో ద్రోణాచార్య పురస్కారం లభించింది.
  • 1990 సంవత్సరంలో ఏ. రమణ రావు అనే తెలుగు గురువు వాలీ బాల్ ఆటకి గాను ద్రోణాచార్య పురస్కారం అందుకున్నారు.
  • ద్రోణాచార్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా హన్సా శర్మ. వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు గాను 2000 సంవత్సరంలో ఈ పురస్కారం అందుకున్నారు.
  • ద్రోణాచార్య పురస్కారం అందుకున్న మొదటి విదేశీ గురువు బి.ఐ. ఫెర్నాండేజ్. ఈయన క్యూబా దేశస్థుడు. బాక్సింగ్ క్రీడకి గాను 2012 సంవత్సరంలో ద్రోణాచార్య పురస్కారం లభించింది.
  • 2009 సంవత్సరంలో ప్రముఖ బ్యాట్మింటన్ గురువు పుల్లెల గోపీచంద్ గారికి ద్రోణాచార్య పురస్కారం లభించడం విశేషం.
  • ప్రతీ సంవత్సరం ఆగష్టు 29న ద్రోణాచార్య పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ప్రముఖ హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చాంద్ పుట్టిన రోజు కావడం విశేషం మరియు అదే రోజు అర్జున పురస్కారం కూడా ఇవ్వడం జరుగుతుంది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *