భారత క్రీడారంగంలో క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాలలో అర్జున పురస్కారం ఒకటి. మేజర్ ధ్యాన్ చంద్ పురస్కారం తరువాత రెండవ అతి ముఖ్యమైన పురస్కారం ఈ అర్జున పురస్కారం. మరి ఈ పురస్కారం ఎప్పటినుంచి ఇవ్వడం మొదలు పెట్టారు, ఎవరు ఇస్తారు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం.
అర్జున పురస్కారం
మహాభారతం కధలోని పాత్రలో ఒకటైన అర్జునుడి పేరు మీద ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అర్జునుడు కష్టపడేతత్వం, పట్టుదల, కృషి, అంకితభావం, ఏకాగ్రత మరియు పోరాటతత్వం ఉండడం వల్ల క్రీడాకారులకి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది.
అర్జున పురస్కారం 1961 సంవత్సరం నుంచి ఇవ్వడం ప్రారంభించారు. భారత ప్రభుత్వం తరఫు నుంచి భారత క్రీడా శాఖా మంత్రి ఈ అర్జున పురస్కారం ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. భారత జాతీయ క్రీడలలో అత్త్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు ఈ పురస్కారం అందజేస్తారు. ఈ పురస్కారం ఇవ్వడం ప్రారంభించాక ఎన్నో రకాల మార్పులు చేర్పులు చేయడం జరిగింది.
1977 సంవత్సరం నుంచి అన్ని రకాల క్రీడలకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. 1995 సంవత్సరంలో వికలాంగులు ఎవరైతే వివిధ రకాల క్రీడలలో పాల్గొంటారో వాళ్లకి కూడా ఈ పురస్కారం ఇవ్వడం ప్రారంభించారు, అదే సంవత్సరం అర్జున పురస్కారాలలో జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం మొదలు పెట్టారు.
పునఃపరిశీలన
2018 సంవత్సరం తర్వాత అర్జున పురస్కారాల్ని పునఃపరిశీలించి ఆ తరువాత ఒలంపిక్ క్రీడలు, పారా ఒలంపిక్ క్రీడలు, ఆసియ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్, ప్రపంచకప్ మరియు క్రికెట్ క్రీడలకు అర్జున పురస్కారం ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరంలో 15 అర్జున పురస్కారాలు ఇవ్వాలని క్రీడా శాఖ నిర్ణయించింది.
మేజర్ ధ్యాన్ చంద్ పురస్కారం ప్రవేశ పెట్టడానికి ముందు అర్జున పురస్కారం ఇవ్వడం గౌరవంగా భావించేవారు అలాగే ఈ పురస్కారం ప్రధానమైనది. జాతీయ క్రీడల ఫెడరేషన్స్, భారతీయ ఒలంపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా, స్పోర్ట్స్ ప్రమోషన్ అండ్ కంట్రోల్ బోర్డు, రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల నుంచి నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది.
అర్జున పురస్కారం ఇచ్చేటప్పుడు కాంస్య విగ్రహం తో కూడిన విధంగా ఉంటుంది. కాంస్య విగ్రహంతో పాటు ఒక సర్టిఫికెట్ మరియు 15 లక్షల నగదు అందిస్తారు. క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణతో పాటు క్రీడలలో అత్యుత్తమ స్థాయిని కనబరుస్తారో వారికి అర్జున పురస్కారం ఇవ్వబడుతుంది.
తోలి అర్జున పురస్కారం
అర్జున పురస్కారం అందుకున్న తోలి క్రీడాకారుడు మనుల్ ఆరోన్. 1961 సంవత్సరంలో ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. చెస్ ఆటకి గాను ఈ పురస్కారం లభించింది. మనుల్ ఆరోన్ గారిని చెస్ ఆటలో మాస్టర్ గా పిలవబడ్డారు. 2023 సంవత్సరానికి గాను అర్జున పురస్కారం అందుకున్న వ్యక్తి ప్రాచి యాదవ్. కేనోయిన్గ్స్ అనే ఆటకి ప్రాచి యాదవ్ అర్జున పురస్కారం అందుకున్నారు.