First Telugu Cinema – Bhakta Prahlada

భారత దేశంలో ఎన్నో భాషలు అలాగే ఎన్నో చిత్ర పరిశ్రమలు ఉన్నాయి. హిందీ, మరాఠీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ, భోజ్పురి, పంజాబీ, బెంగాలీ, ఒడియా ఇంకా మరెన్నో భాషల్లో చిత్రాలు ప్రతి సంవత్సరం రూపుదిద్దుకుంటాయి. భారత సినీ పరిశ్రమలో హిందీ సినీ పరిశ్రమని అతి పెద్ద సినీ పరిశ్రమ అంటారు ఆ తరువాత స్థానం తెలుగు సినీ పరిశ్రమ.

హిందీ సినిమా తరువాత దక్షిణాది సినీ పరిశ్రమలో అతి ముఖ్యమైన చిత్ర పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. ప్రతి సంవత్సరం వందకుపైగా చిత్రాలు నిర్మాణం జరుపుకుంటూ విడుదలవుతూ ఉంటాయి, అలాగే ఎంతో మంది దర్శకులు, నటీనటులు, సాంకేతికనిపుణులు పరిచయం అవుతుంటారు, అలంటి తెలుగు సినీ పరిశ్రమలో నిర్మించిన మొదటి సినిమా ఏది, దర్శకుడు ఎవరు, ఆ చిత్రంలో నటించిన నటీనటులు ఎవరు మరియు ఆ చిత్రం ఎప్పుడు విడుదలైంది ఇలాంటి విశేషాలు తెలుసుకుందాం.

మొదటి తెలుగు సినిమా

అలం అరా అనే హిందీ చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన అర్దేషిర్ ఇరానీకి దక్షిణాది సినీ పరిశ్రమలో కూడా అడుగుపెట్టి చిత్రాలు నిర్మించాలనే కోరిక ఉండింది అది కూడా తెలుగు మరియు తమిళ భాషలో ఏకకాలంలో చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా హెచ్.ఎం.రెడ్డి గారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ “ఇంపీరియల్ ఫిలిం కంపెనీ” బ్యానర్ మీద భక్త ప్రహ్లాద అనే చిత్రాన్ని నిర్మించారు. 1931 సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైందని అందరు అనుకుంటారు కానీ ఈ చిత్రం 1932 సంవత్సరం ఫిబ్రవరి 6న విడుదలైందని కొంతమంది ప్రేక్షకులకు ఇప్పటికి తెలీదు. అలా భక్త ప్రహ్లాద చిత్రం తెలుగులో విడుదలైన మొదట టాకీ చిత్రం (అంటే శబ్దంతో కూడిన చిత్రం) అని చెప్పుకోవచ్చు. ఇక మొదట తమిళ టాకీ చిత్రం విషయానికి వస్తే హెచ్. ఎం. రెడ్డి దర్శకత్వంలోనే అర్దేషిర్ ఇరానీ నిర్మించారు మరియు ఆ చిత్రం పేరు కాళిదాసు.

సినిమా కధ, పాత్రలు

భక్త ప్రహ్లాద చిత్రం కధ విషయానికి వస్తే శ్రీ మహా విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడు మీద తీసిన చిత్రం అని చెప్పుకోవచ్చు. నాస్తికుడు మరియు దేవుడి మీద నమ్మకం లేకపోవడం అలాగే నేను తప్ప ఎవరు గొప్ప కాదు అనుకునే స్వభావం కలిగిన ఉన్న తండ్రి హిరణ్యకశ్యపుడు మాటని లెక్క చేయకుండా ఎప్పుడు శ్రీ మహా విశువుని కొలిచే తన తనయుడు ప్రహ్లదుడి మీద కోపం పెంచుకుని ఆ తరువాత నర్సింహా అవతారంలో వచ్చిన శ్రీ మహా విష్ణు చేతిలో హిరణ్యకశ్యపుడు మరణించడమే ఈ చిత్ర కధ.

భక్త ప్రహ్లాద చిత్రం లోని పాత్రలు గురించి చెప్పుకోవాలంటే ప్రహ్లదుడిగా సింధూరి కృష్ణారావు, హిరణ్యకశ్యపుడిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతి పాత్రలో సురభి కమలాబాయి, ఇంద్రుడి పాత్రలో దొరస్వామి నాయుడు, బ్రహ్మ మరియు చండామార్కులు పాత్రలో చిత్రపు నరసింహారావు, మొద్దబ్బాయి పాత్రలో ఎల్.వి. ప్రసాద్ నటించడం జరిగింది.

అప్పట్లో సినిమాలు కంటే వేదిక మీద నాటకాలు ఎక్కువ ప్రదర్శిస్తుండేవారు, ఆ నాటకాలకే ఎక్కువ విలువ ఉండేది అలా భక్త ప్రహ్లాద చిత్ర కధని కూడా ఒక వేదికపై వేసిన నాటకాన్ని చూసి అదే కథతో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ చిత్రం చుసిన ప్రేక్షకుల నుంచి  మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది ఈ చిత్రం నచ్చింది అని చెప్పడం మరికొంతమంది నచ్చలేదు అని చెప్పడం అలాగే ఈ చిత్రం మీద విమర్శలు చేయడం జరిగింది.

చిత్రీకరణ

బొంబాయి (ఇప్పుడు ముంబై) లోని “ఇంపీరియల్ స్టూడియోస్” లో భక్త ప్రహ్లద చిత్రం చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. సి.ఎస్.ఆర్ ఆంజనేయులు పర్యవేక్షణలో భక్త ప్రహ్లద చిత్రం చిత్రీకరణ చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం హెచ్.ఆర్. పద్మనాభశాస్ట్రీ మరియు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా ఇరానీ గారు ఉండడం జరిగింది. భక్త ప్రహ్లద చిత్రానికి పాటలు రచించింది రామకృష్ణమాచార్యులు మరియు చందాల కేశవులు గారు అలాగే పోతన లాంటి కవులు రాసిన కొన్ని పద్యాలూ కూడా తీసుకోవడం జరిగింది.

హెచ్. ఎం. రెడ్డి

భక్త ప్రహ్లాద చిత్రాన్ని దర్శకత్వం వహించిన దర్శకుడు హెచ్. ఎం. రెడ్డి గురించి ప్రస్తావిస్తే తను 1892 జూన్ 12న జన్మించారు. తన పూర్తి పేరు హనుమప్ప మునియప్ప రెడ్డి. తన చదువంతా బెంగళూరులో సాగింది ఆ తరువాత హైదరాబాద్ లోని ఒక కళాశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేయడం జరిగింది. కొన్ని రోజుల తరువాత తన ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ నుంచి ముంబై నగరానికి వెళ్లడం జరిగింది. సినిమాల మీద ఇష్టంతో ముంబైలోని ఒక సినిమాకి సంబంధించిన కంపెనీలో పనికి కుదిరారు హెచ్. ఎం. రెడ్డి.

సినిమా మీద హెచ్. ఎం. రెడ్డికి ఉన్న ఇష్టాన్ని చూసి అర్దేషిర్ ఇరానీ గారు తన ప్రొడక్షన్ కంపెనీ “ఇంపీరియల్ ఫిలిం కంపెనీ”లో అవకాశం ఇచ్చి ప్రోత్సహించి దర్శకత్వ భాద్యతలు ఇవ్వడం జరిగింది.

నిర్మాణ భాగస్వామ్యం, దర్శకత్వం

భక్త ప్రహ్లద చిత్రం తీసిన తరువాత చెన్నై వెళ్లారు హెచ్. ఎం. రెడ్డి. బి. ఎన్. రెడ్డి, కన్నాంబ గార్లతో కలిసి ఒక నిర్మాణ సంస్థని ప్రారంభించారు. రోహిణి పిక్చర్స్ పేరు మీద సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు హెచ్. ఎం. రెడ్డి గారు. ఆ నిర్మాణంలో వచ్చిన మొదటి చిత్రం గృహలక్ష్మి. మొత్తం 4 చిత్రాలని నిర్మించి 17 చిత్రాలని దర్శకత్వం వహించారు. 1960 జనవరి 14న కాలం చేశారు హెచ్. ఎం. రెడ్డి.

భక్త ప్రహ్లాద చిత్రం తెలుగులో అదే పేరుతొ మరో రెండు సార్లు నిర్మించబడింది. 1942 సంవత్సరంలో శోభనాచల్ ప్రొడక్షన్స్ మీద చిత్రపు నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. 1967 సంవత్సరంలో మరోసారి ఈ చిత్రాన్ని నిర్మించడమైనది. ఆ సంవత్సరంలో కూడా చిత్రపు నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. ఏ వి ఎం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎమ్. మురుగన్, ఏ.వి. మేయప్పన్, ఎమ్. కుమారన్, ఏమ్. శరవణన్ నిర్మించారు. ప్రహ్లదుడిగా తెలుగు నటుడు తరుణ్ తల్లి నటి రోజా రమణి గారు ఆ పాత్ర చేయడం జరిగింది. ఇక హిరణ్యకశ్యపుడు పాత్రలో ప్రముఖ నటులు ఎస్. వి. రంగారావు గారు చేయడం విశేషం.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *