
ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కధానాయికలు పరిచయం అవుతారు, తమ ప్రతిభతో ఎన్నో అవకాశాలు సంపాదించి విజయవంతంగా రాణిస్తున్నారు, మరి అలంటి కథానాయికల్లో కొంతమంది నటించిన మొదటి చిత్రాల గురించి తెలుసుకుందాం.
భూమిక చావ్లా: ఏ. కరుణాకరన్ దర్శకుడిగా 2000 సంవత్సరంలో సుమంత్ కధానాయకుడిగా నటించిన యువకుడు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు భూమిక చావ్లా. “సహజ” నటి జయసుధ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. “కింగ్” అక్కినేని నాగార్జున, ఎన్. సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
ఆర్తి అగర్వాల్: కె. విజయభాస్కర్ దర్శకత్వంలో 2001 సంవత్సరంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద స్రవంతి రవి కిషోర్ నిర్మించిన నువ్వునాకు నచ్చావ్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు ఆర్తి అగర్వాల్. “విక్టరీ” వెంకటేష్ కధానాయకుడిగా నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు.
కళ్యాణి: వల్లూరపల్లి రమేష్ బాబు నిర్మాణంలో, వంశీ దర్శకత్వంలో “మాస్ మహారాజ” రవితేజ కధానాయకుడిగా వచ్చిన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు కళ్యాణి. చక్రి అందించిన సంగీతంతో పాటు ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకున్నారు కళ్యాణి.
ఛార్మి: దీపక్ కధానాయకుడిగా భీమనేని శ్రీనివాసరావు దర్శక నిర్మాతగా వచ్చిన నీ తోడుకావాలి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ఛార్మి. 2002 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి వలీషా బాబాజి మరియు సందీప్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
త్రిష కృష్ణన్: జ్యోతి కృష్ణ దర్శకత్వంలో 2003 సంవత్సరంలో వచ్చిన నీ మనసు నాకు తెలుసు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు త్రిష కృష్ణన్. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ్ భాషలో కలిపి రూపొందించారు. తరుణ్, శ్రియ శరన్, సునీల్ కలిసి నటించిన ఈ చిత్రానికి ఏ. ఎం. రత్నం నిర్మించగా ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులని అలరించింది.
మొదటి చిత్రాలు
జ్యోతిక: వి. వి. వినాయక్ దర్శకత్వంలో 2003 సంవత్సరంలో “మెగాస్టార్” చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు జ్యోతిక. బి. మధు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
జెనీలియా డి. సౌజ: సూర్య కిరణ్ దర్శకుడిగా 2003 సంవత్సరంలో “కింగ్” అక్కినేని నాగార్జున నిర్మాతగా సుమంత్ కధానాయకుడిగా వచ్చిన సత్యం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు జెనీలియా డి. సౌజ. ఈ చిత్రం భారీ విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించడం జరిగింది.
కమిలిని ముఖర్జీ: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2004 సంవత్సరంలో విడుదలైన ఆనంద్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు కమిలిని ముఖర్జీ. రాజా కధానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది మరియు ఉత్తమ కథానాయికగా నంది పురస్కారాన్ని అందుకున్నారు కమిలిని ముఖర్జీ. అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ మీద విడుదలైన ఈ చిత్రానికి కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించారు.
ఆసిన్: పూరి జగన్నాద్ దర్శకుడిగా కె. ఎల్. ఎన్. రాజు నిర్మాతగా 2003 సంవత్సరంలో “మాస్ మహారాజ” రవితేజ కధానాయకుడిగా వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ఆసిన్. ఈ చిత్రంలో జయసుధ ప్రత్యేక పాత్రలో నటించగా చక్రి అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించింది మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు ఫిలిం ఫేర్ పురస్కారం కూడా అందుకున్నారు ఆసిన్.
అనుష్క శెట్టి: పూరి జగన్నాధ్ దర్శకుడిగా 2005 సంవత్సరంలో విడుదలైన సూపర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు అనుష్క శెట్టి. “కింగ్” అక్కినేని నాగార్జున కధానాయకుడిగా మరియు నిర్మాతగా చేసిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. సందీప్ చౌతా అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయేషా టాకియా మరో కధానాయకిహ నటించిన ఈ చిత్రంలో సోను సూద్ ప్రత్యేక పాత్రలో నటించారు.
మొదటి చిత్రాలు
ఇలియానా డి. క్రుజ్: వై. వి. ఎస్. చౌదరి దర్శక నిర్మాతగా 2006 సంవత్సరంలో రామ్ పోతినేని కధానాయకుడిగా వచ్చిన దేవదాసు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ఇలియానా డి. క్రుజ్. చక్రి అందించిన సంగీతంతో పాటు ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించడం విశేషం. ఈ చిత్రానికి ఉత్తమ నూతన నటిగా ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు ఇలియానా డి. క్రుజ్.
నయనతార: వి. వి. వినాయక్ దర్శకత్వంలో నల్లమలపు బుజ్జి నిర్మాణంలో వచ్చిన చిత్రం లక్ష్మి. వెంకటేష్, ఛార్మి కలిసి నటించిన ఈ చిత్రంలో నయనతార తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించగా మణిశర్మ నేపధ్యం సంగీతం అందించారు. శర్వానంద్, రాజీవ్ కనకాల ప్ర్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం 2006 సంవత్సరంలో విడుదలై భారీ విజయం సాధించింది.
కాజల్ అగర్వాల్: తేజ దర్శకత్వంలో 2007 సంవత్సరంలో కె. మహేంద్ర నిర్మాణంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు కాజల్ అగర్వాల్. నందమూరి కళ్యాణ్ రామ్ కధానాయకుడిగా నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలన్ని అలరించాయి.
హన్సిక మోత్వానీ: పూరి జగన్నాధ్ దర్శకత్వంలో “స్టైలిష్ స్టార్” అల్లు అర్జున్ నటించిన దేశముదురు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు హన్సిక మోత్వానీ. డి. వి. వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. 2007 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి ఉత్తమ నూతన నటిగా ఫిలిం ఫేర్, సంతోషం, సినీ మా పురస్కారాలు అందుకున్నారు హన్సిక మోత్వానీ.
అంజలి: శివ నాగేశ్వర్రావు దర్శక నిర్మాతగా 2006 సంవత్సరంలో ఆనంద్ కధానాయకుడిగా ఫోటో అనే చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యారు అంజలి. రోహిత్ రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ఆ తరువాత ఎన్నో తమిళ చిత్రాలతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు అంజలి.
మొదటి చిత్రాలు
తమన్నా భాటియా: దశరథ్ దర్శకత్వంలో, మంచు లక్ష్మి ప్రసన్న నిర్మాతగా 2005 సంవత్సరంలో మంచు మనోజ్ కుమార్ నటించిన శ్రీ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు తమన్నా భాటియా. సందీప్ చౌతా సంగీతం అందించిన ఈ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది.
శృతి హస్సన్: ప్రకాష్ కోవెలమూడి దర్శకుడిగా 2011 సంవత్సరంలో సిద్దార్థ్ కధానాయకుడిగా వచ్చిన అనగనగ ఓ ధీరుడు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు శృతి హస్సన్. ప్రకాష్ కోవెలమూడి, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వచ్చిన ఈ చిత్రానికి సలీమ్ – సులైమాన్, మిక్కీ జె. మేయర్, కోటి, ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా సలీమ్ – సులైమాన్ నేపధ్య సంగీతం అందించారు.
అనగనగ ఓ ధీరుడు చిత్రంలో నటించిన శృతి హస్సన్ పాత్రకి ఉత్తమ నూతన నటిగా సినీ మా, ఫిలిం ఫేర్ మరియు సైమా పురస్కారాలు లభించాయి. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ప్రసన్న ప్రత్యేక పాత్రలో నటించి అలరించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది.
రెజీనా కస్సన్ద్ర: తాతినేని సత్య దర్శకత్వంలో 2012 సంవత్సరంలో విక్రమ్ రాజు నిర్మాతగా సుధీర్ బాబు కధానాయకుడిగా వచ్చిన శివ మనసులో శృతి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు రెజీనా కస్సన్ద్ర. వి. సెల్వగణేష్ మరియు యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది మరియు ఉత్తమ నూతన నటిగా సైమా పురస్కారం అందుకున్నారు రెజీనా కస్సన్ద్ర.
పూజ హెగ్డే: విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో 2014 సంవత్సరంలో వచ్చిన ఒక లైలా చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు పూజ హెగ్డే. అక్కినేని నాగ చైతన్య కధానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. “కింగ్’ అక్కినేని నాగార్జున నిర్మాతగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఉత్తమ నూతన నటిగా సంతోషం పురస్కారం అందుకున్నారు పూజ హెగ్డే.
రాశి ఖన్నా: శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి నిర్మాతలుగా వచ్చిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు రాశి ఖన్నా. నాగ శౌర్య కధానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. 2014 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ముందు 2014 సంవత్సరంలో అక్కినేని కుటుంబం నటించిన మనం చిత్రంలో అతిధి పాత్రలో మెరిశారు రాశి ఖన్నా.
మొదటి చిత్రాలు
కృతి శెట్టి: బుచ్చి బాబు సన దర్శకత్వంలో వైష్ణవ తేజ్ కధానాయకుడిగా 2021 సంవత్సరంలో వచ్చిన ఉప్పెన చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు కృతి శెట్టి. నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తమిళ నటులు విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
రకుల్ ప్రీత్ సింగ్: గౌతమ్ పట్నాయక్ దర్శకత్వంలో సిద్దార్థ్ రాజ్ కుమార్ కధానాయకుడిగా వచ్చిన కెరటం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు రకుల్ ప్రీత్ సింగ్. 2011 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. జోషువా శ్రీధర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
స్నేహ: బాలశేఖరన్ దర్శకత్వంలో 2001 సంవత్సరంలో తరుణ్, శివాజీ, ప్రీతి కలిసి నటించిన ప్రియమైననీకు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు స్నేహ. ఆర్. బి. చౌదరి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి శివ శంకర్ సంగీతం అందించారు.
శ్రీ లీల: అశోక్ జి. దర్శకత్వంలో 2017 సంవత్సరంలో వచ్చిన చిత్రాంగద చిత్రంతో బాలనటిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు శ్రీ లీల. అంజలి, సప్తగిరి కలిసి నటించిన ఈ చిత్రానికి సెల్వగణేష్ సంగీతం అందించారు. శ్రీధర్ గంగపట్నం నిర్మించిన ఈ చిత్రం నిరాశపరిచింది. ఆ తరువాత పెళ్లిసందD చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యారు శ్రీ లీల.
శ్రియ శరన్: విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 2001 సంవత్సరంలో వచ్చిన ఇష్టం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు శ్రియ శరన్. చరణ్ దొడ్ల కధానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రామోజీరావు నిర్మించగా డి. జి. గోపినాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేదు.
సమంత రుతు ప్రభు: గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య కధానాయకుడిగా నటించిన ఏమాయె చేసావే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సమంత రుతు ప్రభు. 2010 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఉత్తమ నూతన నటిగా సినీ మా, ఫిలిం ఫేర్, స్పెషల్ జ్యూరీ నంది పురస్కారాలు అందుకున్నారు సమంత రుతు ప్రభు.
మొదటి చిత్రాలు
సాయి పల్లవి: 2017 సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ కధానాయకుడిగా వచ్చిన ఫిదా చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సాయి పల్లవి. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందించగా పాటలన్ని ప్రేక్షకులని అలరించాయి. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్, సైమా పురస్కారాలు అందుకున్నారు సాయి పల్లవి.
నిత్యా మీనన్: 2011 సంవత్సరంలో నందిని రెడ్డి దర్శకత్వంలో నాని కధానాయకుడిగా నటించిన అలా మొదలైంది చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు నిత్యా మీనన్. కె. ఏల్. దామోదర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది మరియు ఈ చిత్రంలో స్నేహ ఉల్లాల్ మరో కధానాయికగా నటించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకున్నారు నిత్యా మీనన్.
రష్మిక మందన్న: పరశురామ్ దర్శకత్వంలో 2018 సంవత్సరంలో బన్నీ వాష్ నిర్మాణంలో వచ్చిన గీత గోవిందం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ కధానాయకుడిగా రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా పాటలన్ని ప్రేక్షకులని అలరించాయి మరియు ఈ చిత్రానికి ఉత్తమ నటిగా జీ సినీ, విమర్శకుల నుంచి ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నారు రష్మిక మందన్న.
అనుపమ పరమేశ్వరన్: చందూ మొండేటి దర్శకత్వంలో సూర్య దేవర నాగ వంశీ నిర్మాణంలో 2016 సంవత్సరంలో వచ్చిన ప్రేమమ్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు అనుపమ పరమేశ్వరన్. నాగ చైతన్య, శృతి హస్సన్, మడోన్నా సెబాస్టియన్ కలిసి నటించిన ఈ చిత్రం ఘాన విజయం సాధించింది. ఉత్తమ సహాయ నటిగా ఐఫా ఉత్సంలో పురస్కారం అందుకున్నారు అనుపమ పరమేశ్వరన్. రాజేష్ మురుగేషన్, గోపి సుందర్ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించింది.