First Movies of Telugu Actors in Telugu

Telugu Actors First Movies
Telugu Actors First Movies

కిరణ్ అబ్బవరం: రవి కిరణ్ కొల్ల దర్శకత్వంలో 2019 సంవత్సరంలో విడుదలైన రాజా వారు రాణి వారు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం. రహస్య గోరఖ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మనోవికాస్ డి. మరియు మీడియా 9 మనోజ్ నిర్మించారు. జయ్ క్రిష్ సంగీతం అందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది.

కార్తికేయ గుమ్మకొండ: రిషి దర్శకత్వంలో రవీందర్ ఆర్. గుమ్మకొండ నిర్మాణంలో వచ్చిన ప్రేమతో మీ కార్తీక్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు కార్తికేయ గుమ్మకొండ. సిమ్రత్ కౌర్ నటించిన ఈ చిత్రం 2017 సంవత్సరంలో విడుదలై అపజయాన్ని చూసింది మరియు ఈ చిత్రానికి షాన్ రెహమాన్ సంగీతం అందించారు.

విజయ్ దేవరకొండ: రవి బాబు దర్శకత్వంలో రామోజీ రావు నిర్మాణంలో వచ్చిన నువ్విలా చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు విజయ్ దేవరకొండ. హవీష్, యామి గౌతమ్, అజయ్  కలిసి నటించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ప్రత్యేక పాత్రలో నటించారు. 2011 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు మరియు ఈ చిత్రం విజయం అందుకోలేదు.

విశ్వక్ సేన్: యాకుబ్ అలీ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన వెళ్ళిపోమాకే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు విశ్వక్ సేన్. నిత్యశ్రీ రెడ్డి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. 2017 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదనిపించింది. అంతకుముందు జగపతిబాబు నటించిన బంగారు బాబు చిత్రంలో బాలనటుడిగా నటించారు విశ్వక్ సేన్.

సిద్దు జొన్నలగడ్డ: వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నాగ చైతన్య, కార్తీక కలిసి నటించిన జోష్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సిద్దు జొన్నలగడ్డ. కళాశాలలో చదివే కుర్రాడిగా మరియు గొడవలు చేసే కుర్రాడిగా ఈ చిత్రంలో నటించారు సిద్దు జొన్నలగడ్డ. 2009 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందించారు మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది.

మొదటి చిత్రాలు

నవీన్ పోలిశెట్టి: శేఖర్ కమ్ముల దర్శక, నిర్మాతగా అభిజీత్, సుధాకర్ కొమకుల, షాగున్ కౌర్, శ్రియ శరన్, అంజలి ఝవేరి కలిసి నటించిన లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు నవీన్ పోలిశెట్టి. 2012 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి అమల ముఖ్య పాత్ర పోషించారు.

ఆనంద్ దేవరకొండ: కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో మధుర శ్రీద రెడ్డి నిర్మాణంలో వచ్చిన దొరసాని చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ఆనంద్ దేవరకొండ. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటించగా ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు.

నాగ శౌర్య: ఎస్. ఉమేష్ కుమార్ దర్శకత్వంలో ఆదర్శ్ బాలకృష్ణ, సూర్య తేజ్, సింధు అఫ్ఫాన్ కలిసి నటించిన క్రికెట్, గర్ల్స్ & బీర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు నాగ శౌర్య. ఎస్. సునీత నిర్మించిన ఈ చిత్రం 2011 సంవత్సరంలో విడుదలై ప్రేక్షకులని నిరాశపరిచింది. ఈ చిత్రానికి శ్యామ్, దాస్ సంగీతం అందించారు.

శ్రీ విష్ణు: చైతన్య దంతులూరి దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మాణంలో నారా రోహిత్, వేదిక కలిసి నటించిన బాణం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు శ్రీ విష్ణు. 2009 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి మని శర్మ సంగీతం అందించారు. 2019 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదనిపించింది.

సందీప్ కిషన్: 2010 సంవత్సరంలో దేవ కట్ట దర్శకత్వంలో శర్వానంద్, సాయి కుమార్ రూబీ పరిహార్ కలిసి నటించిన ప్రస్థానం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సందీప్ కిషన్. 2010 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి రవి వల్లభనేని నిర్మించగా, మహేష్ శంకర్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

మొదటి చిత్రాలు

వరుణ్ సందేశ్: శేఖర్ కమ్ముల దర్శక నిర్మాణంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు వరుణ్ సందేశ్. తమన్నా భాటియా, నిఖిల్, గాయత్రీ రావు కలిసి నటించిన ఈ చిత్రం 2007 సంవత్సరంలో విడుదలై భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించగా పాటలన్ని ప్రేక్షకులని అలరించాయి.

సుధీర్ బాబు: గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సుధీర్ బాబు. మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ కలిసి నిర్మించిన ఈ చిత్రం 2010 సంవత్సరంలో విడుదలై ఘన విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు.

వరుణ్ తేజ్: నాగబాబు, బ్రహ్మానందం, జయసుధ కలిసి నటించిన హ్యాండ్సప్ చిత్రంతో బాలనటుడిగా అతిధి పాత్రలో మెరిసిన వరుణ్ తేజ్ ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్ బి. మధు, నల్లమలపు బుజ్జి కలిసి నిర్మించిన ముకుంద చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో కధానాయకుడిగా అడుగుపెట్టారు వరుణ్ తేజ్. పూజ హెగ్డే కథానాయకిగా నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. 2014 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందించారు.

సాయి ధరమ్ తేజ్: ఏ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో బన్నీ వాస్, హర్షిత్ రెడ్డి కలిసి నిర్మించిన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సాయి ధరమ్ తేజ్. రెజీనా కస్సన్ద్ర కథానాయికగా నటించిన ఈ చిత్రం 2014 సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు మరియు ఉత్తమ నూతన నటుడిగా సైమా, సంతోషం మరియు సినీ మా పురస్కారాలు అందుకోవడం విశేషం.

వైష్ణవ్ తేజ్: పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన జానీ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో బాల నటుడిగా అడుగుపెట్టారు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి నటించగా రమణ గోగుల సంగీతం అందించారు. 2003 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది.

మొదటి చిత్రాలు

రాజ్ తరుణ్: విరించి వర్మ దర్శకత్వంలో రామ్ మోహన్ పి. అక్కినేని నాగార్జున కలిసి నిర్మించిన ఉయ్యాలా జంపాల చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు రాజ్ తరుణ్. అవికా గోర్, పునర్నవి నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 2013 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి సన్నీ ఎం. ఆర్. సంగీతం అందించారు. ఈ చిత్రానికి రాజ్ తరుణ్ నటనకి ఉత్తమ నూతన నటుడిగా సైమా పురస్కారం లభించింది.

సుశాంత్: జి. రవిచంద్ర రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, అనుమోలు నాగ సుశీల కలిసి నిర్మించిన కాళిదాసు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సుశాంత్. తమన్నా కధానాయికగా నటించిన ఈ చిత్రం విజయాన్ని అందించింది. 2008 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు.

అఖిల్: శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మణంలో వచ్చిన సిసింద్రీ చిత్రంతో బాల నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు అఖిల్. కింగ్ అక్కినేని నాగార్జున, టబు, శరత్ బాబు, ఆమని, శివాజీ రాజా కలిసి నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. 1995 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి రాజ్ సంగీతాన్ని అందించారు. బాల నటుడిగా ఈ చిత్రానికి ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు అఖిల్.

అల్లు శీరీష్: రాధా మోహన్ దర్శకత్వంలో నటులు ప్రకాష్ రాజ్ నిర్మించిన గౌరవం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు అల్లు శిరీష్. తెలుగు మరియు తమిళ్ భాషలో కలిపి రూపొందించిన ఈ చిత్రంలో యామి గౌతమ్ కధానాయికగా నటించారు. 2013 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతాన్ని అందించారు మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది.

బెల్లంకొండ శ్రీనివాస్: వి. వి. వినాయక్ దర్శకత్వంలో 2014 సంవత్సరంలో విడుదలైన అల్లుడు శీను చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ సురేష్ మరియు బెల్లంకొండ గణేష్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో కధానాయికగా సమంత నటించగా ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో నటించారు మరియు ద్విపాత్రభినయం కూడా చేయడం విశేషం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది.

మొదటి చిత్రాలు

సుహాస్: హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి కలిసి నటించిన పడి పడి లేచే మనసు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు సుహాస్. 2018 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి మరియు సుధాకర్ చెరుకూరి కలిసి నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.

నారా రోహిత్: చైతన్య దంతులూరి దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మాణంలో వచ్చిన బాణం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు నారా రోహిత్. వేదిక కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు మరో పాత్రలో నటించారు. 2009 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది మరియు ఈ చిత్ర్రానికి మని శర్మ సంగీతం అందించారు.

ఆది సాయి కుమార్: కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో 2011 సంవత్సరంలో కె. అచ్చిరెడ్డి నిర్మాణంలో వచ్చిన ప్రేమకావాలి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ఆది సాయికుమార్. ఇషా చావ్ల కథానాయికగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది మరియు ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఉత్తమ నూతన నటుడిగా సైమా మరియు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నారు ఆది సాయి కుమార్.

నిఖిల్: దశరథ్ దర్శకత్వంలో నితిన్, నికిత కలిసి నటించిన సంబరం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక అతిధి పాత్రతో అడుగుపెట్టారు నిఖిల్. తేజ నిర్మించిన ఈ చిత్రం 2003 సంవత్సరంలో విడుదలై నిరాశపరిచింది. ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు.

నవీన్ చంద్ర: రవి వర్మ దర్శకత్వంలో 2006 సంవత్సరంలో విడుదలైన సంభవామి యుగే యుగే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు నవీన్ చంద్ర. కౌతిల్య, రాజ్, శ్రీజన, నీరజ, జాక్ కలిసి నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. ఇళ్లుషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మరియు కె. ఎన్. రెడ్డి మూవీస్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి అనిల్ సంగీతం అందించారు.

మొదటి చిత్రాలు

నవదీప్: తేజ దర్శక నిర్మాణంలో వచ్చిన జై చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు నవదీప్. సంతోషి, అయేషా ఝల్కా నటించిన ఈ చిత్రం 2004 సంవత్సరంలో విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు మరియు పాటలన్ని ప్రేక్షకులని అలరించాయి.

ప్రిన్స్ సిసిల్: తేజ దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ప్రిన్స్ సిసిల్. నందిత రాజ్ కథానాయికగా నటించిన ఈ చిత్రం 2012 సంవత్సరంలో విడుదలై పరవాలేదనిపించింది. ఈ చిత్రానికి యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు.

సుమంత్ అశ్విన్: ఎం. ఎస్. రాజు దర్శకత్వంలో 2012 సంవత్సరంలో విడుదలైన తూనీగ తూనీగ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సుమంత్ అశ్విన్. రియా చక్రవర్తి కధానాయికగా నటించిన ఈ చిత్రానికి మాగంటి రామచంద్ర నిర్మించగా కార్తీక్ రాజా సంగీతం అందించారు. ఈ చిత్ర్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

సత్యదేవ్: దశరథ్ దర్శకత్వంలో 2011 సంవత్సరంలో విడుదలైన Mr. పర్ఫెక్ట్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సత్యదేవ్. ప్రభాస్, కాజల్ అగర్హ్వాల్, తాప్సి కలిసి నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

ప్రియదర్శి: సతీష్ కాశెట్టి దర్శకత్వంలో షైక్ మస్తాన్ నిర్మాణంలో వచ్చిన టెర్రర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ప్రియదర్శి. శ్రీకాంత్, నికిత, రవి వర్మ కలిసి నటించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం నిరాశపరిచింది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *