First Indian Female Test Cricket Captain

అంతర్జాతీయ క్రికెట్ భారత దేశంలో 1932 సంవత్సరంలో అడుగుపెట్టింది. సి.కే. నాయుడు సారధ్యంలోని పురుషుల జట్టు తమ మొదటి టూర్ ఇంగ్లాండ్ లో పర్యటించింది మరియు అంతర్జాతీయ మహిళా క్రికెట్ భారత్ లో ఎప్పుడు ప్రవేశించింది, మొదట ఏ జట్టు తో భారత మహిళా క్రికెట్ జట్టు ఆడింది, అప్పుడు సారధ్యం వహించిన మొదటి మహిళా క్రికెటర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళా క్రికెట్ ప్రారంభం

భారత మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ లోకి 1976 సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. తమ మొదటి టెస్ట్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ జట్టుపై ఆడటం జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టుకి సారధ్యం వహించారు శాంతా రంగస్వామి.

శాంతా రంగస్వామి ఎవరు

1954 జనవరి 1న మద్రాస్ నగరంలో సి.వి. రంగస్వామి, రాజలక్ష్మి దంపతులకి జన్మించారు శాంతా రంగస్వామి. ఆరుగురు అక్క చెల్లెళ్లలో శాంతా రంగస్వామి మూడో సంతానం గా జన్మించారు. 1976 సంవత్సరంలో శాంతా రంగస్వామి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టడం జరిగింది, వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు కి నాయకత్వం వహిస్తూ ఆరంగ్రేటం చేయడం జరిగింది. ఈ మ్యాచ్ పాట్నా నగరంలో లోని మొయిన్-ఉల్-హాక్ మైదానం లో జరిగింది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించడం విశేషం.

భారత జట్టు సారధిగా మొత్తం 8 టెస్ట్ మ్యాచ్ లో సారధ్యం వహించారు శాంతా రంగస్వామి. మొత్తం రెండు దఫాలుగా సారధ్య భాద్యతలు చేపట్టారు. 1976-1977 సంవత్సరం మరియు 1983-1984 సంవత్సరంలో భారత మహిళల జట్టుకి సారధ్యం వహించారు. శాంతా రంగస్వామి కెరీర్లో మొత్తం 16 టెస్ట్ మ్యాచ్లు మరియు 19 వన్డే అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం జరిగింది. 1982 సంవత్సరం నుంచి 1987 సంవత్సరం వరకు భారత అంతర్జాతీయ వన్డే క్రికెట్ జట్టుకి సారధ్యం వహించారు, అలా 16 అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్లకి సారధ్యం వహించారు శాంతా రంగస్వామి.

క్రికెట్ గణాంకాలు

కుడి చేతితో బ్యాటింగ్ చేసే శాంతా రంగస్వామి తన క్రికెట్ జీవితంలో మొత్తం 16 టెస్ట్ మ్యాచ్లు ఆడి 32.6 సగటుతో 750 పరుగులు చేశారు. తన మొదటి టెస్ట్ శతకం న్యూజిలాండ్ జట్టుతో చేయడం విశేషం. జనవరి 8, 1977 సంవత్సరంలో న్యూజిలాండ్ దేశంలోని డునెడిన్ నగరంలోని కరిస్బ్రూక్ మైదానం లో ఈ శతకం సాధించారు శాంతా రంగస్వామి. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా మంచి ప్రదర్శన కనబరిచారు శాంతా రంగస్వామి. 31.61 సగటుతో మొత్తం 21 టెస్ట్  వికెట్లు పడగొట్టారు శాంతా రంగస్వామి. తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇంగ్లాండ్ జట్టుతో రావడం జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్ లో 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు శాంతా రంగస్వామి.

19 అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఆడిన శాంతా రంగస్వామి 15.1 సగటుతో 287 పరుగులు చేశారు మరియు 29.41 సగటుతో 12 వికెట్లు తీశారు. 1982 సంవత్సరంలో న్యూజిలాండ్ లో జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ లో తన బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 50 పరుగులు మరియు ఇంటర్నేషనల్చే X I తో ఆడి 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఉత్తమమైన గణాంకాలు నెలకొల్పారు.

శాంతా రంగస్వామి గురించి మరికొన్ని విషయాలు

  • భారత మహిళల అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో శతకం సాధించిన మొదటి మహిళా క్రికెటర్ శాంతా రంగస్వామి.
  • 2019 సంవత్సరంలో భారత క్రికెట్ అసోసియేషన్ మరియు బి.సి.సి.ఐ అపెక్స్ కౌన్సిల్ కు ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా క్రికెటర్ గా గుర్తింపు పొందారు.
  • 1976 సంవత్సరంలో శాంతా రంగస్వామి గారికి అర్జున పురస్కారం లభించింది.
  • క్రికెట్ రచయితా గా పని చేస్తూ మరియు బెంగళూరు నగరంలోని కెనరా బ్యాంకు లో జనరల్ మేనేజర్ హోదాలో ఉన్నారు శాంతా రంగస్వామి.
  • బి.సి.సి.ఐ అనగా బోర్డు అఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా తరఫునుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మొదటి భారత మహిళా క్రికెటర్ గా గుర్తింపు పొందడం జరిగింది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *