First India Female Test Cricket Captain

first indian women test cricket in india
first indian women test cricket in india

క్రికెట్ ఈ క్రీడా భారత దేశంలో 1700 సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది ఆ తరువాత 1932 సంవత్సరంలో భారత పురుషుల క్రికెట్ జట్టు ఏర్పాటయ్యాక తమ మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టుకి సారధ్యం వహించిన ఆటగాడు సి. కే. నాయుడు, మరియు తనే మొదటి భారత అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అవ్వడం విశేషం.

మరి మహిళల క్రికెట్ భారత్ లో ఎప్పుడు మొదలైంది, మొదటి టెస్ట్ మ్యాచ్ ఏ జట్టుతో ఆడటం జరిగింది మరియు భారత టెస్ట్ క్రికెట్ జట్టుకి సారధ్యం ఎవరు వహించారు ఈ విషయాలు కూడా తెలుసుకుందాం.

మహిళా క్రికెట్ ప్రారంభం

1934 సంవత్సరంలో మహిళల క్రికెట్ ప్రారంభమైంది మరియు మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. ఆ తరువాత 1973 సంవత్సరంలో భారత మహిళా క్రికెట్ అసోసియేషన్ ఏర్పడింది. ఆ తరువాత 1976 సంవత్సరంలో భారత మహిళా క్రికెట్ జట్టు తమ మొట్టమొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ జట్టుతో ఆడటం జరిగింది.

భారత్ దేశంలో జరిగిన మొదటి సిరీస్ లో ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడింది భారత మహిళల టెస్ట్ క్రికెట్ జట్టు. భారత మహిళా క్రికెట్ జట్టు ఆడిన 6 మ్యాచ్లలో 4 మ్యాచ్లు డ్రా చేసుకుని ఒక మ్యాచ్ భారత జట్టు మరొక మ్యాచ్ వెస్ట్ ఇండీస్ జట్టు గెలవడం జరిగింది. మరి ఈ భారత మహిళా జట్టుకి సారధ్యం వహించింది శాంతా రంగస్వామి మరియు తనే మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా టెస్ట్ క్రికెట్ సారధి అవ్వడం విశేషం.

shanta rangaswamy indian cricket captain
shanta rangaswamy indian female cricket captain

శాంతా రంగస్వామి ఎవరు

శాంతా రంగస్వామి 1954 సంవత్సరం, జనవరి 1న అప్పటి మద్రాస్ రాష్ట్రం, మద్రాస్ నగరంలో సి. వి. రంగస్వామి, రాజలక్ష్మి దంపతులకి జన్మించారు. వీరి మాతృభాషా కన్నడ మరియు వీరు ఏడుగురు అక్క చెల్లెల్లు, అందులో శాంతా రంగస్వామి 3 వ సంతానంగా జన్మించారు. చిన్నతనం నుంచే క్రికెట్ మీద ఆసక్తి మొదలవడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు.

ఆ తరువాత తన చిన్నతనంలోనే తండ్రి కాలం చేయడంతో వీరి కుటుంబం బెంగళూరు నగరానికి వలస రావడంతో తన చదువంతా బెంగళూరు నగరంలో కొనసాగింది. తల్లి ప్రోత్సాహంతో క్రికెట్ మీద ద్రుష్టి పెట్టారు శాంతా రంగస్వామి. క్రికెట్ మాత్రమే కాకుండా బాల్ బ్యాట్మింటన్, సాఫ్ట్ బాల్ మరియు ఇతర క్రీడలలో కూడా చురుగ్గా ఆడేవారు.

అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం

శాంతా రంగస్వామి 1976 సంవత్సరంలో వెస్ట్ ఇండీస్ జట్టుతో జరిగిన అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో అరంగ్రేటం చేయడం జరిగింది. భారత మహిళా టెస్ట్ క్రికెట్ నుండి ఆడిన 10వ క్యాప్ ప్లేయర్ గా మరియు మొదటి మహిళా సారధిగా నిలిచిపోయారు శాంతా రంగస్వామి. ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 74 పరుగులు చేయడం విశేషం. రెండవ టెస్ట్ మ్యాచ్లో 57 పరుగులు చేయడమే కాకుండా 2 వికెట్లు తీసుకోవడం విశేషం.

మూడవ టెస్ట్ మ్యాచ్లో 78, 46 పరుగులు చేయడమే కాకుండా మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్లు పడగొట్టారు. నాల్గవ టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్లు పడగొట్టి 32 పరుగులు అలాగే రెండవ ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ పడగొట్టి ఒక్క పరుగు మాత్రమే చేశారు శాంతా రంగస్వామి. పాట్నా నగరంలో జరిగిన ఈ మ్యాచ్ భారత మహిళా జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ మహిళల జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 127 పరుగులు చేశారు ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 161 పరుగులు చేయడం జరిగింది. ఆ తరువాత మళ్ళి వెస్ట్ ఇండీస్ మహిళల జట్టు తమ రెండవ ఇన్నింగ్స్లో 88 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అవ్వగా భారత మహిళల జట్టు 26 ఓవర్లలో 55 పరుగులు చేసి 5 వికెట్లు పోగొట్టుకుని విజయం సాధించింది.

భారత మహిళా జట్టుకి శాంతా రంగస్వామి సారధ్యంలో టెస్ట్ మ్యాచ్లో మొదటి విజయం లభించడం విశేషం. ఆ తరువాత 5వ టెస్ట్ మ్యాచ్లో 2, 20 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ తీసుకున్నారు శాంతా రంగస్వామి. ఇక 6వ టెస్ట్ మ్యాచ్లో 63*, 8 పరుగులు చేశారు శాంతా రంగస్వామి. ఈ మ్యాచ్ వెసి ఇండీస్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో మరియు 24 పరుగులతో విజయం సాధించింది. తన మొదటి సిరీస్ లోనే 4 అర్ధ శతకాలు సాధించడం విశేషం.

1977 సంవత్సరంలో న్యూజీలాండ్ జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ భారత మహిళా క్రికెట్ జట్టు డ్రా చేసుకుంది మరియు ఈ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో శాంతా రంగస్వామి తన మొదటి శతకాన్ని సాదించారు. మొదటి ఇన్నింగ్స్లో 108 పరుగులు చేసి రెండవ ఇన్నింగ్స్లో 25* పరుగులు చేయడం జరిగింది.

వన్డే క్రికెట్ అరంగ్రేటం

శాంతా రంగస్వామి 1982 సంవత్సరంలో జరిగిన మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆరంగ్రేటం చేశారు. తన మొదటి అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టుతో ఆడటం జరిగింది. 19వ భారత వన్డే క్యాప్ ప్లేయర్ గా మరియు సారధిగా ఈ ప్రపంచకప్ టౌర్నమెంట్లో అడుగుపెట్టారు శాంతా రంగస్వామి.

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మొదటి వన్డేలో శాంతా రంగస్వామి ఒక్క పరుగు చేసి వెనుదిరగడం జరిగింది. ఈ మ్యాచ్ భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయం చూసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ జట్టుతో 50 పరుగులు చేసినా కూడా భారత మహిళల క్రికెట్ జట్టు ఓడిపోవడం జరిగింది మరియు వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇదే తనకి మొదటి అర్ధ శతకం కావడం విశేషం.

ఆ తరువాతి మ్యాచ్ న్యూజిలాండ్ జట్టుతో 7 పరుగులు చేసి ఒక్క వికెట్ తీసుకున్నారు, అలాగే ఇంటర్నేషనల్ ఎలెవన్ జట్టుతో 12 పరుగులు చేసి ఒక్క వికెట్ తీసుకున్నారు. అలా ఈ ప్రపంచకప్లో వరుసగా ఆస్ట్రేలియా జట్టుతో 3 మ్యాచ్లు, ఇంగ్లాండ్ జట్టుతో 3 మ్యాచ్లు, న్యూజిలాండ్ జట్టుతో 3 మ్యాచ్లు మరియు ఇంటర్నేషనల్ ఎలెవన్ జట్టుతో 3 మ్యాచ్లు ఆడటం జరిగింది.

ఈ ప్రపంచకప్లో శాంతరంగస్వామి స్కోర్లు వచ్చేసి 1, 50, 7, 12, 10, 5, 4, 11, 1, 1. 2, 22 మరియు 47 పరుగులు చేయడం జరిగింది. ఇక వికెట్ల విషయానికి వస్తే మొత్తం ఈ ప్రపంచకప్లో 10 వికెట్లు పడగొట్టడం జరిగింది. చివరిదైన ఇంటర్నేషనల్ ఎలెవన్ జట్టుతో 3 వికెట్లు పడగొట్టి భారత జట్టుని గెలిపించడం విశేషం. మొత్తం 12 మ్యాచ్లలో 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది శాంతా రంగస్వామి సారధ్యంలోని భారత మహిళల జట్టు.

1991 సంవత్సరంలో తన ఆఖరి అంతర్జాతీయ టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా జట్టుతో ఆడటం జరిగింది. జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడి 3 & 4 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది. 1987 సంవత్సరంలో తన ఆఖరి అంతర్జాతీయ వన్డే సిరీస్ ఆడటం జరిగింది. జరిగిన మూడు అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు కలిపి 33 పరుగులు చేయడం జరిగింది మరియు ఒక్క వికెట్ పడగొట్టారు శాంతా రంగస్వామి.

సారధిగా శాంతా రంగస్వామి

శాంతా రంగస్వామి రెండు పర్యాయాలుగా భారత మహిళా టెస్ట్ క్రికెట్ జట్టుకు సారధ్యం వహించారు. మొదటిసారి 1976 – 1977 మరియు రెండవసారి 1983 – 1984 సంవత్సరం మధ్య సారధి భాద్యతలు చేపట్టారు. మొదటిసారి సారధ్యం వహించినప్పుడు 8 మ్యాచ్లకు అలాగే రెండవసారి సారధ్యం వహించినప్పుడు 4 మ్యాచ్లకు సారధ్యం వహించారు.

శాంతా రంగస్వామి తన సారధ్యంలో మొత్తం 12 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లకు సారధ్యం వహించగా, ఇందులో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచి మరో రెండు టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయారు మరియు 9 టెస్ట్ మ్యాచ్లు డ్రా గా ముగిసాయి. ఇక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ల విషయానికి వస్తే, 1982 సంవత్సరం నుండి 1984 సంవత్సరం మధ్య భారత మహిళా వన్డే క్రికెట్ జట్టుకు సారధ్యం వహించారు. మొత్తం 16 అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్లకు సారధ్యం వహించగా, ఇందులో 4 వన్డే క్రికెట్ మ్యాచ్లు గెలిచి మరో 12 మ్యాచ్లు ఓడిపోయారు.

మరికొన్ని విశేషాలు

శాంతా రంగస్వామి కుడి చేతి బ్యాట్టింగ్ మరియు కుడి చేతి మీడియం పేస్ బౌలింగ్ వేస్తూ ఆల్ రౌండర్ పాత్రలో భారత మహిళా క్రికెట్ జట్టులో ఆడటం జరిగింది. భారత మహిళా క్రికెటర్లలో మొట్ట మొదటి శతకం సాధించిన మహిళగా శాంతా రంగస్వామి నిలిచిపోయారు మరియు మొదటి సిక్స్ కొట్టిన భారత మహిళా క్రికెటర్ శాంతా రంగస్వామి.

2019 సంవత్సరంలో భారత క్రికెట్ బోర్డు అపెక్స్ కౌన్సిల్ మరియు భారత క్రికెటర్స్ అసోసియేషన్ సభ్యురాలిగా చేరిన మొదటి మహిళ క్రికెట్ క్రీడాకారిణి శాంతా రంగస్వామి. 1976 సంవత్సరంలో అర్జున పురస్కారం అందుకున్నారు శాంతా రంగస్వామి. అంతర్జాతీయ క్రికెట్ నుండి వీడ్కోలు పలికిన తరువాత క్రికెట్ రచయితగా కొంత కాలం రచనలు చేశారు.

ఆల్ ఇండియా రేడియోలో కొంత కాలం క్రికెట్ కామెంట్రీ చేసిన శాంతా రంగస్వామి ఆ తరువాత బెంగళూరు నగరంలో కెనరా బ్యాంకు లో ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ గా నియమితులయ్యారు. భారత క్రికెట్ బోర్డు నుండి సి. కె. నాయుడు, జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా క్రికెటర్ శాంతా రంగస్వామి. 1992 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్ర ప్ర్రభుత్వం నుండి ఏకలవ్య పురస్కారం అందుకున్నారు.

1997 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం తరపున రజోత్సవ పురస్కారం మరియు 2020 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం తరపున జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు శాంతా రంగస్వామి. భారత మహిళా క్రికెట్ మార్గదర్శకురాలిగా శాంతా రంగస్వామిని పేర్కొంటారు. 1973 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్ర జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటమే కాకుండా మొట్ట మొదటి రాష్ట్ర జట్టు సారధిగా ఉన్నారు మరియు సౌత్ జోన్ జట్టు తరఫునుంచి కూడా ఆడటం జరిగింది.

1994 సంవత్సరంలో భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ పాత్ర వహించారు శాంతా రంగస్వామి. 2001 సంవత్సరం నుండి 2006 సంవత్సరం వరకు భారత మహిళా క్రికెట్ అసోసియేషన్ లో మహిళా సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవిలో ఉన్నారు. శాంతా రంగస్వామి బలంగా కొట్టే ఫోర్లు, సిక్సులు కొట్టడం, అలాగే తన గంభీరమైన స్వరం మరియు తన శరీరాకృతి చూసి భీం అని పిలిచేవారు. అలాగే మైదానంలో ప్రేక్షకులని చప్పట్లు కొట్టి ప్రోత్సహించమని కోరుకునేవారు.

గణాంకాలు

టెస్ట్ క్రికెట్: శాంతా రంగస్వామి తన క్రికెట్ జీవితంలో మొత్తం 16 టెస్ట్ మ్యాచ్లు ఆడి 32.60 సగటుతో 750 పరుగులు చేశారు, ఇందులో ఒక శతకం, 6 అర్ధ శతకాలు ఉన్నాయి మరియు తన అత్యధిక స్కోర్ వచ్చేసి 108. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 1,555 బంతులు వేయగా 31.61 సగటుతో 21 వికెట్లు పడగొట్టారు, అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 4/42 మరియు 10 క్యాచ్లు అందుకున్నారు.

వన్డే క్రికెట్: శాంతా రంగస్వామి తన క్రికెట్ జీవితంలో మొత్తం 19 వన్డే మ్యాచ్లు ఆడి 15.10 సగటుతో 287 పరుగులు చేశారు, ఇందులో ఒక్క అర్ధ శతకం మాత్రమే ఉంది మరియు తన అత్యధిక స్కోర్ వచ్చేసి 50. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 902 బంతులు వేయగా 29.41 సగటుతో 12 వికెట్లు పడగొట్టారు, అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 3/25 మరియు 6 క్యాచ్లు అందుకున్నారు.

ముగింపు

శాంతా రంగస్వామి కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, దృఢత్వం మరియు అభిరుచికి చిహ్నం. భారతదేశంలో మహిళా క్రికెట్ రూపురేఖలను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు, తరతరాలుగా మహిళా క్రికెటర్లు పెద్ద కలలు కనేలా ప్రేరేపించారు. మైదానంలో మరియు వెలుపల ఆమె చేసిన కృషి క్రీడ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *