Choodalani Vundi Telugu Movie Songs Lyrics in Telugu

choodalani vundi songs lyrics in telugu
                                        చూడాలని వుంది తెలుగు పాటలు

ప్రముఖ దర్శకులు గుణశేఖర్ దర్శకత్వంలో “మెగాస్టార్” చిరంజీవి, సౌందర్య, అంజలా ఝవేరి మరియు ప్రత్యేక పాత్రలో ప్రకాష్ రాజ్ కలిసి నటించిన చూడాలని వుంది చిత్రం భారీ విజయం సాధించింది. 1998 సంవత్సరం, ఆగష్టు 27న విడుదలైన ఈ చిత్రానికి వైజయంతి మూవీస్ బ్యానర్ మీద సి. అశ్విని దత్ నిర్మించడం జరిగింది.

చూడాలని వుంది చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించాయి మరియు ఈ చిత్రంలో ఉన్న 6 పాటల్లో 5 పాటలు వేటూరి సుందరరామ మూర్తి రచించగా ఒక పాటని మాత్రం చంద్రబోస్ రచించారు.

ఈ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా మణిశర్మ ఫిలిం ఫేర్ మరియు నంది పురస్కారాలు అందుకోవడం విశేషం. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా తోట తరణి ఫిలిం ఫేర్ పురస్కారం అందుకోవడం విశేషం. నృత్య దర్శకురాలిగా సరోజ్ ఖాన్ మరియు ఆడియోగ్రాఫర్ కి మధు సుధన్ నంది పురస్కారాలు అందుకున్నారు.

ఈ చిత్రంలో అన్ని పాటలు జనాదరణ పొందడం విశేషం. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పట్నం సుబ్రమణియా అయ్యర్ స్వరపరిచిన రఘువంశ సుధా పాటను ఈ చిత్రంలో యమహానగరి పదాలతో కోల్కత్త నగరాన్ని వర్ణిస్తూ రచించారు రచయిత వేటూరి సుందరంగా మూర్తి.

కధ

ఈ చిత్ర కధ గురించి తెలుసుకోవాలంటే మెకానిక్ వృత్తి చేసుకుంటూ ఉండే పాత్రలో చిరరంజీవి నటించారు. ఒక రోజు తన బామ్మాను తీసుకు రావడానికి రైల్వే స్టేషన్కు వెళ్లగా అక్కడ రైలులో అంజలా ఝవేరిని ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతారు చిరంజీవి, అలా కాసేపు చూడగా ఆ రైలు అక్కడి నుండి కదులుతుంది, ఆ తరువాత మళ్ళీ ఇంకో స్టేషన్ వెళ్లి అక్కడ కూడా చూస్తూ ఉంటారు చిరంజీవి. ఈ సన్నివేశం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

ఆ తరువాత కొంతమంది దుండగులు కథానాయికను వెంబడించగా అక్కడి నుండి పారిపోయి పెళ్లి చేసుకుంటారు చిరంజీవి మరియు అంజలా ఝవేరి. పెళ్లి తరువాత అడవిలో ఉంటున్న వీరికి ఒక కొడుకు పుట్టడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఎలాగైనా కూతురిని తీసుకెళ్లి మరో పెళ్లి చేయాలనీ నిర్ణయించిన ప్రకాష్ రాజ్ ఆ అడవిలోకి వెళ్లి తన కూతురు అంజలా ఝవేరిని తీసుకెళ్ళిపోతారు.

ఆ తరువాత బలవంతం పెళ్లి చేయిస్తుంటే చిరంజీవి అడ్డుకోవడం, ఆ గొడవలో అంజలా ఝవేరి అనుకోకుండా చనిపోవడం జరుగుతుంది. తన కూతురు చనిపోయిందని తన మనవడిని తీసుకెళ్లి తనని పెద్ద చేసి తన చెడు వ్యాపారంలో శిక్షణ ఇవ్వాలని చూస్తారు ప్రకాష్ రాజ్. ఆ తరువాత కొడుకు కోసం వెతుకుతూ కోల్కత్త నగరం చేరుకుంటారు చిరంజీవి.

అక్కడ తనకి కొడుకు గురించి ఎలాంటి ఆధారాలు దొరికాయి, మరి అక్కడ తన కొడుకు దొరికాడా లేదా, లేక ఇంకా వేరే చోట ఉన్నాడా, ఒక వేళ దొరికితే ఎలాంటి ఇబ్బందుల్లో దొరికాడు అనేది ఈ చిత్ర కధ సారాంశం.

కోల్కత్త నగరంలో చిరంజీవికి తోడు కథానాయకి సౌందర్య మరియు హాస్య నటులు బ్రహ్మానందం, ఎం. ఎస్. నారాయణ సహాయం చేయడం విశేషం. ఈ చిత్రంలో నటి నటుల నటన ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది ముఖ్యంగా “వాడు సామాన్యుడు కాదు” అంటూ పదే పదే ప్రకాష్ రాజ్ చెప్పే సంభాషణ భయపెట్టేలా చేస్తుంది.

ఈ చిత్రంలో చిరంజీవి కొడుకు పాత్రలో తేజ సజ్జ నటించారు. ఈ చిత్రంలో హాస్యంతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. చిరంజీవి మరియు సౌందర్య మధ్య కవితలు చెప్పే సన్నివేశాలు అలాగే అద్దె ఇల్లు కోసం చిరంజీవి వెతుకుతున్నప్పుడు బ్రహ్మానందం మరియు ఎం. ఎస్. నారాయణ మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఇప్పటికి అలరించడం విశేషం.

చూడాలని వుంది చిత్రం నుండి అన్ని పాటల లిరిక్స్ మీకోసం ఇక్కడ చుడండి.

మొదటి పాట

పాట : ఓమరియా ఓమరియా

రచన : చంద్రబోస్ 

గానం : శంకర్ మహదేవన్, కవిత కృష్ణమూర్తి

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా

రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా

ప్రతిరోజూ విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా

చేద్దామంటే చుద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలతె తీరదు

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా

రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా

ప్రతిరోజూ విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా

చేద్దామంటే చుద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలతె తీరదు

సిరిమువ్వా రేపంటూ వెనుదిస్తుందా

గల్ గల్ గల్ మోగించగా

సిరిమల్లె మాకంటూ ముసుగేస్తుందా

గుం గుం గుం పంచివ్వగా

ప్రతిదినం ప్రబాతమై పదాలు తెచ్చే సూర్యుడు

ప్రకాశమే తగ్గించున నావల్ల కాదంటూ

ప్రతిక్షణం ఉషారుగా శ్రమించి సాగె వాగులు

ప్రయాణమే చాలించున మాకింకా సెలవంటూ

ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతుకే సాగని అంతేలేని సంతోషాలు ఒళ్ళో వాలని

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా

రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా

చిరుగాలి చిత్రంగా రానంటుందా

జూమ్ జూమ్ జూమ్ పయనించగా

కొమ్మల్లో కోకిలల కాదంటుందా కు కు కు వినిపించగా

నిరంతరం దినం దినం అలాగే సహనం చూపుతూ

విరామమే లేకుండా ఈ నెల తిరుగునుగా

ఆకాశమే అందాలని చిన్నారి రెక్కల గువ్వలు

అనుక్షణం అదే పనే ఆరాటపడిపోవా

ఆ మనసే ఉంటే మార్గం తానే ఎదురొస్తుందిలే

సత్తా ఉంటే స్వర్గం కూడా దిగి వస్తుందిలే

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా

రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా

ప్రతిరోజూ విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా

చేద్దామంటే చుద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలతె తీరదు

రెండవ పాట

పాట : అబ్బబ్బా ఇద్దు

రచన : వేటురి సుందరంగా మూర్తి

గానం : ఎస్. పి. బాలసుబ్రమణ్యం, సుజాత

అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

సలి పులి పంజా విసిరితే సలకాగే వయసులో

గిలగిలా లాడే సొగసుకే జోలాలీ

అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

వాటేసుకో వదలకు వలపుల వలా విసిరి

వాయించు నీ మురళిని వయసు గాలి పోసి

దోచెయ్యన దొరికితే దొరకని కొక సిరి

రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి

ఎవరికీ తెలియవు యద రస రసలు

పరువులాటకు పానుపు పిలిచాకా

తనువూ తాకినా తనివి తీరని వేళా

అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

జాబిల్లితో జాతకలూ జగడపు రగడలతో

పొంకాలతో నిన్ను నిన్ను పొగడ మాలలేసి

ఆకాశమే కులు కులు తొడిగేడు నడిమిదిగో

సూరీడుని పిలు పిలు చుక్క మంచు సోకి

అలకలు చిలకలు చెలి రుస రసాలు

ఇకజాగేందుకు ఇరుకున పడిపోకా

మనసు తీరిన వయసు మారని వేళా

అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

సలి పులి పంజా విసిరితే సలకాగే వయసులో

గిలగిలా లాడే సొగసుకే జోలాలీ

అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

మూడవ పాట

పాట : రామ్మా చిలకమ్మ

రచన : వేటూరి సుందరరామ మూర్తి

గానం: ఉదిత్ నారాయణ్

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ

పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ

ముక్కు మీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల

గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందుల్లో మిర్చి మసాలా

అరేయ్ వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ

పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ

గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మో

కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో

దొంగిలించుకున్న సొత్తు గోవిందా ఆవలించకుంటే నిద్దరవుతుందా

ఉట్టి కొట్టే వేళా రైకమ్మో చట్టి దాచి పెట్టు కొకమ్మో

కృష్ణ మురారి వాయిస్తావో చలి కోలాటమేదో ఆడిస్తావో

అరేయ్ ఆవొరే భయ్యా బన్సీ బాజావు అరేయ్ ఆంధ్రక నయ్యా హాత్ మీలో

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ

పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ

ఓలమ్మో చోళీ లోన సోకు గోలమ్మో

ఓయమ్మో కాళీ లేక వేసే ఈలమ్మో వేణువంటే వెర్రి గాలి పాటేలే

అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలా

జట్టే కడితే జంట రావమ్మో పట్టు విడుపు ఉంటె మేళమ్మో

ప్రేమాడే కృష్ణుడు కన్ను కొట్టాల

పెళ్లాడే కృష్ణుడు కాళ్ళు పట్టాల

అరేయ్ ఆయారే నాచ్ ది ఆంధ్రావాలా

అరేయ్ గాఒరే విందు చిందు డబ్లి గోల

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ

పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ

ముక్కు మీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల

గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందుల్లో మిర్చి మసాలా

అరేయ్ వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల

నాల్గవ పాట

పాట : సింబలే సింబలే

రచన : వేటూరి సుందరరామ మూర్తి

గానం : ఎస్. పి. బాలసుబ్రమణ్య, కె. ఎస్. చిత్ర

సింబలే సింబలే అంబరాలు అందేలే హాయిలే

బాల్బల్బల్బాలే చేతికందే మాకు వెండిమబ్బులే

వెన్నెలమ్మ వేటకొచ్చే ఏనుగమ్మ అంబరీలు

తేనెలమ్మ తేనెకోచే మల్లెజాజి మందరిలు

సింబలే సింబలే అంబరాలు అందేలే హాయిలే

బాల్బల్బల్బాలే చేతికందే మాకు వెండిమబ్బులే

చందమామ చేతికొచ్చే సబ్బుబిళ్ళ నేనులెమ్మని

చంద్రవంక వాగుపొంగె స్నానమాడ నిన్నూరమ్మని

పిల్లనెమలి సంబరం పింఛమెంతో సుందరం

పట్నమన్న పంజరం పట్టువిడ పావురం

ఈ గుటికొచ్చే కాపురం హొయలలో హొయలలో

సింబలే సింబలే అంబరాలు అందేలే హాయిలే

బాల్బల్బల్బాలే చేతికందే మాకు వెండిమబ్బులే

ఆకాశాలే నెలకొచ్చే మేడకన్నా నిడమెలని

ఆనందాల వెల్లువవుచ్చి లాలపోసే కంటిపాపకి

చూడ చూడ వింతలూ చుక్కలేడి గంతులు

ఆకుపచ్చ పొద్దులు మాకులేవు హద్దులు

ఈ కొండా కోనసీమలో హొయలలో హొయలలో

సింబలే సింబలే అంబరాలు అందేలే హాయిలే

బాల్బల్బల్బాలే చేతికందే మాకు వెండిమబ్బులే

వెన్నెలమ్మ వేటకొచ్చే ఏనుగమ్మ అంబరీలు

తేనెలమ్మ తేనెకోచే మల్లెజాజి మందరలు

ఐదవ పాట

పాట : యమానహగరి

రచన : వేటూరి సుందరరామ మూర్తి

గానం: హరిహరన్

స రి మా మా గ రి స స స ని ద ప స, స రి మా మా గ రి స స స ని ద ప

స రే మా గ ని గ ప స, స ని ద ప మా గ ప మా రి

యమహా నగరి కలకత్తా పూరి, యమహా నగరి కలకత్తా పూరి

నమహో హుగిలి హౌరాహ్ వారది

యమహా నగరి కలకత్తా పూరి

చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి, చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి

చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి

యమహా నగరి కలకత్తా పూరి

నమహో హుగిలి హౌరాహ్ వారాది

నేతాజీ పుటిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో

ఆ హంస పాడిన పాటే ఆ నందుడు చూపిన బాట సాగనా

పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం

కడకు చేరాలి గమ్యం కధీలి పోరా

ఒకరితో ఒకరికి ముఖ పరిచేయములు దొరకని క్షణముల

బిజీ బిజీ బ్రతుకుల గజి బిజీ ఉరుకుల పరుగులతో

యమహా నగరి కలకత్తా పూరి నమహో హుగిలి హౌరాహ్ వారాది

చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి

చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి

యమహా నగరి కలకత్తా పూరి

బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మాలిని సరోజినీ

రోజంతా సూర్యుడు కింద రాత్రంతా రజిని కందా సాగని

పదుగురు ప్రేమ లేలేని లోకం దేవతమార్కు మైకం

శరన్నవలాభిషేకం తెలుసుకోరా కధలకు నేలవాట

కాలాలకు కొలువుట తిదులకు సెలవట

అతిధుల గొడవట కలకత్తా నగరపు కిట కిటలో

యమహా నగరి కలకత్తా పూరి నమహో హుగిలి హౌరాహ్ వారాది

చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి

చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి

యమహా నగరి కలకత్తా పూరి

వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతికే గీతిరా

మాతంగి కాళీ నిలయ చౌరంగీ రంగుల దునియా నీదిరా

వినుగురు సత్యజిత్రే సితార ఎస్ టి బర్మన్ కి దార తెరెసా కి కుమార కదలి రారా

జనగనమనముల స్వరపడ వనముల హృదయపు లయలను

శృతి పరచిన ప్రియా సుఖ పీక ముఖ సుఖ రవళులతో

యమహా నగరి కలకత్తా పూరి

నమహో హుగిలి హౌరాహ్ వారాది

యమహా నగరి కలకత్తా పూరి

చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి, చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి

చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి

యమహా నగరి కలకత్తా పూరి

నమహో హుగిలి హౌరాహ్ వారాది

ఆరవ పాట

పాట : మనస్స ఎక్కడున్నావ్

రచన : వేటూరి సుందరరామ మూర్తి

గానం: ఎస్. పి. బాలసుబ్రమణ్య, కె. ఎస్. చిత్ర

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం
నువ్వను కోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
ఇది అందమైన వింత ఆత్మ కథ

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం
నువ్వను కోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
ఇది అందమైన వింత ఆత్మ కథ

హంస గీతమే వినరాద హింస మానరా మధన
తెల్లవారిన తరువాత తెల్లబోకుమా లలనా
ఇపుడే విన్నాను చెలి వేణువేదో
నిదరే ఇక రాదు లేవమ్మా
చెవులే కొరికింది చెలిమింటి మాట
ఎదలో ఇక దాచలేవమ్మా
పూల గాలికే పులకరం
గాలి ఊసుకే కలవరం
కంటి చూపులో కనికరం
కన్నె వయసుకే తొలివరం
మొదలాయె ప్రేమ క్లాసు రాగసుధా

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం

రాయలేనిది ప్రియలేఖ రాయభారమే వినవా
వేదమంటివి శుభలేఖ వెన్నెలంటని కలువ
పురులే విరిసింది నీలో వయ్యారం
కనులే తెరిచిందిలే పించం
వెలిగే నీలోన గుడిలేని దీపం
ఒడిలో తీరింది ఆ లోపం
ఎంకి పాటలో తెలుగులా
తెలుగు పాటలో తేనెలా
కలవనీ హాల మమతల
తరగనీ ప్రియ కవితలా
బహుశా ఇదేమొ భామా ప్లస్ కదా

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం
నువ్వను కోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
ఇది అందమైన వింత ఆత్మ కథ

 

చూడాలని వుంది చిత్రంలోని అన్ని పాటలు చూడాలంటే ఇక్కడ చుడండి.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *