Celebrity Cricket League

భారత దేశంలో సినిమా మరియు క్రికెట్ కి ఉన్న ప్రత్యేక స్థానం ఏంటో మనందరికీ తెలిసిందే. సినిమా మరియు క్రికెట్ కి అభిమానులు కూడా కోట్లలో ఉన్నారు. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసిన క్రికెట్ గురించి లేదా సినిమా గురించి మాట్లాడుకుంటారు. మరి ఆ సినిమా, క్రికెట్ కలిస్తే అభిమానుల ఆనందానికి హద్దులుండవ్.

తారల క్రికెట్

మన సినీ తారలు క్రికెట్ ఆడటం మనం చూస్తుంటాం. సరదాకోసమో, షూటింగ్ స్పాట్ లో కాస్త తీరిక దొరికిన అలాగే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు చారిటీ కోసమో క్రికెట్ ఆడటం జరుగుతుంది. కానీ నిజమైన ఆటగాళ్లలాగా మన సినీ తారలు క్రికెట్ ఆడటం అంటే కత్తిమీద సాము లాంటిది, దెబ్బలు తగలకుండా సాధన చేస్తూ ఎంతో నిబద్దతతో నిజమైన ఆటగాళ్ల లాగ ఆడి చూపిస్తున్నారు, అది కూడా అంతర్జాతీయస్థాయి ఆటగాళ్లు ఆడినట్టు ఆడి అభిమానులను అలరిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్

సినిమా తారల మధ్య జరిగే క్రికెట్ లీగ్ ని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అంటారు. ఈ లీగ్ ఎప్పుడు మొదలైంది, ఎవరు మొదలుపెట్టారు అనేది తెలుసుకుందాం.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2003 సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమ అంతా కలిసి క్రికెట్ ఆడటం జరిగింది. నాలుగు జట్లతో ఈ లీగ్ ప్రారంభించారు. ఈ లీగ్ పేరు “స్టార్ క్రికెట్” అని పేరు పెట్టడం జరిగింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ పేర్లతో నాలుగు జట్లుగా విడిపోయి ఈ క్రికెట్ లీగ్ ఆడటం జరిగింది. మొదటి సారి చిరంజీవి జట్టు విజయం సాధించింది. రెండవసారి 2005 సంవత్సరంలో మళ్ళి తెలుగు సినిమా పరిశ్రమ అంతా కలిసి క్రికెట్ ఆడటం జరిగింది. ఈ సీజన్ లో కూడా చిరంజీవి జట్టు విజయం సాధించింది. ఆ తరువాత 2010 లో కూడా ఆడటం జరిగింది ఈ సారి నాగార్జున జట్టు గెలవడం జరిగింది.

ఈ మ్యాచ్లన్నీ 20-20 ఫార్మటు ప్రకారంగా ఆడటం జరిగింది అప్పటికి ఇంకా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి అధికారిక 20-20 ఫార్మటు ఇంకా రాలేదు కానీ సినీ తారలు మాత్రం 20-20 మ్యాచ్ ఆడటం జరిగింది. సినిమా తారలు మరియు కొంతమంది భారత క్రికెట్ క్రిడాకారులు కలిసి కూడా క్రికెట్ ఆడటం జరిగింది అది కూడా వన్డే క్రికెట్ మ్యాచ్. అప్పటి భారత క్రికెట్ సారధి సౌరవ్ గంగూలీ XI పేరు తో ఒక జట్టు అలాగే vs చిరంజీవి XI పేరు ఒక జట్టు తో వన్డే క్రికెట్ ఆడటం జరిగింది. ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్,సౌరవ్ గంగూలీ,అజిత్ అగార్కర్,దినేష్ మోంగియా, పార్థివ్ పటేల్ మరి కొంతమంది క్రికెట్ ఆటగాళ్లు అలాగే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, తరుణ్, శ్రీకాంత్ తదితర నటులు ఈ మ్యాచ్ లో ఆడటం జరిగింది. హుద్ హుద్ తుఫాన్ సమయంలోను చారిటీ కోసం సరదాగా ఇండోర్ స్టేడియం లో క్రికెట్ ఆడటం జరిగింది, అలాగే కబడ్డీ కూడా ఆడటం విశేషం.

సి.సి.ఎల్ ప్రారంభం

ఐపీఎల్ స్పూర్తితో రకరకాల లీగ్లు క్రికెట్ మరియు క్రీడా ప్రపంచంలో అడుగుపెట్టాయి, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ మరొక్క లీగ్ అభిమానుల ముందుకు రావడం జరిగింది. అదే సీసీఎల్ అంటే సెలబ్రిటీ క్రికెట్ లీగ్. విష్ణువర్ధన్ ఇందూరి అనే వ్యాపారవేత్త సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కి శ్రీకారం చుట్టారు. భారత దేశంలో ఉన్న వివిధ భాషల సినీ పరిశ్రమల మధ్య అలాగే నటి నటుల మధ్య ఈ లీగ్ నిర్వహిస్తారు. మొదటి సీజన్ 2011 సంవత్సరంలో ప్రారంభమైంది. తెలుగు, తమిళ్, కన్నడ మరియు హిందీ పరిశ్రమలను జట్టు గా మార్చి లీగ్ ప్రారంభించారు. ఆ తరువాత సీజన్ లో మరో రెండు కొత్త జట్లు అంటే మరో రెండు చిత్ర పరిశ్రమలు ఈ లీగ్ లో పాల్గొన్నాయి, కేరళ సినీ జట్టు మరియు బెంగాల్ సినీ జట్టు. మూడవ సీజన్ వచ్చేసరికి మరో రేండో సినీ జట్లు పాల్గొన్నాయి. మరాఠీ సినీ జట్టు, పంజాబ్ సినీ జట్టు. ఆరవ సీజన్ కి మరాఠీ సినీ జట్టు తప్పుకోగా ఆ స్థానంలో పంజాబ్ సినీ జట్టు వచ్చి చేరింది. అలా మొత్తం 8 జట్లతో ఈ లీగ్ దిగ్విజయంగా కొనసాగుతుంది.

ఫార్మటు

ఈ లీగ్ ఫార్మటు అచ్చం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోలి ఉంటుంది ప్రతి జట్టు మరొక్క జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడి ఎవరైతే మొదట నాలుగు స్థానాల్లో నిలుస్తారో వారు సెమి ఫైనల్స్ మరియు ఫైనల్స్ ఆడతారు. 8 జట్లు ఉండటం వల్ల రెండు గ్రూపులుగా విడిపోయి ఆడటం జరుగుతుంది.

2023 సంవత్సరం లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ లో మాత్రం ఒక కొత్త మార్పుతో కూడిన ఫార్మటు తో ఆడటం జరిగింది. టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్లో రెండు జట్లు ఎలాగైతే రెండు ఇన్నింగ్స్ ఆడతాయో అలాగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా అలానే ఆడటం విశేషం. ముందు సీజన్స్ అన్ని 20-20 లో ఆడితే 2023-2024 సంవత్సరంలో మాత్రం 10 ఓవర్ల మ్యాచ్ ఆడటం జరిగింది. మొత్తం నాలుగు ఇన్నింగ్స్ ఆడేలా కొత్త పద్ధతి తీసుకొచ్చారు. డి.ఆర్.ఎస్ సిస్టం మాత్రం ఈ లీగ్ లో చేర్చలేదు.

విజేతలు

ఇప్పటివరకు 10 సీజన్లు జరిగాయి. ఈ పది సీజన్ లో విజేతలుగా తెలుగు సినీ జట్టు 4 సార్లు విజయం సాధిస్తే తమిళ్ మరియు కన్నడ సినీ జట్లు చెరో రెండు సార్లు గెలిచాయి. హిందీ సినిమా జట్టు అలాగే బెంగాల్ సినిమా జట్టు చేరొక్కసారి గెలవడం జరిగింది. 2018 సంవత్సరంలో కొన్ని కారణాల వల్ల ఈ లీగ్ జరగలేదు అలాగే 2020, 2021, 2022 సంవత్సరాలలో కోవిడ్ – 19 కారణంగా ఈ లీగ్ జరగలేదు.

ఆటగాళ్లు

హిందీ నటుడు సల్మాన్ ఖాన్ ఈ లీగ్ ప్రచారకర్తగా ఉన్నారు. తెలుగు సినీ జట్టుకి విక్టరీ వెంకటేష్ గారు మరియు సచిన్ జోషి ప్రచారకర్తగా ఉన్నారు. ఇక తెలుగు జట్టు ఆటగాళ్ల విషయానికొస్తే తరుణ్, సచిన్ జోషి, రఘు, సామ్రాట్ రెడ్డి, ఆక్కినేని అఖిల్, నిఖిల్, మేక రోషన్, ఎస్.ఎస్. థమన్  తదితరులు తెలుగు సినిమా జట్టులో ఆడుతున్నారు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *