జవగళ్ శ్రీనాథ్ తరువాత భారత క్రికెట్ జట్టులో వేగవంతమైన ఫాస్ట్ బౌలర్ గా ఎదిగిన వారిలో అజిత్ అగార్కర్ ఒకరు. అజిత్ అగార్కర్ పేరు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ముంబైలో జన్మించిన అజిత్ అగార్కర్, ఒక ప్రతిభావంతమైన ఆల్‌రౌండర్‌గా భారత జట్టుకు అనేక విజయాలను అందించారు.
బంతితో బలమైన ప్రభావాన్ని చూపుతూ, తన బ్యాటింగ్‌తో కూడా చరిత్ర సృష్టించారు అజిత్ అగార్కర్. ఒక సాధారణ ఆటగాడిగా తన క్రికెట్ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తరువాత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన అజిత్ అగార్కర్ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
క్రికెట్ ప్రయాణం
ముంబై నగరంలో జన్మించిన అజిత్ అగార్కర్ అందరి యువకుల్లాగే క్రికెట్ అంటే అభిమానం ఎక్కువ, ముఖ్యంగా బ్యాటింగ్ అంటే ఇష్టపడే అజిత్ అగార్కర్ ఎక్కువ పరుగులు సాధించాలని తెగ సాధన చేసేవారు. తన సాధన, పట్టుదల మరియు క్రికెట్ మీద అభిమానం చూసి అజిత్ అగార్కర్ తండ్రి తనని రమాకాంత్ అచ్చ్రేకర్ అనే ప్రముఖ క్రికెట్ కోచ్ దెగ్గర శిక్షణ ఇప్పించడం జరిగింది.
రమాకాంత్ అచ్చ్రేకర్ గారి సలహా మేరకు అజిత్ అగార్కర్ తన పాఠశాలని శివాజీ పార్క్ దెగ్గర ఉన్న పాఠశాలలో చేరడం జరిగింది. ఉదయం సమయంలో పాఠశాలకి వెళ్లి చదువుకుని ఆ తరువాత సాయంత్రం సమయంలో శివాజీ పార్క్ లో క్రికెట్ సాధన చేసేవారు అజిత్ అగార్కర్. శివాజీ పార్క్ లో జరిగే టౌర్నమెంట్లలో తన సత్తా చాటుతూ పరుగుల వరద సృష్టించేవారు అజిత్ అగార్కర్.
బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ మీదకి కూడా మనసు మళ్లడంతో మెల్లగా బౌలింగ్ వేయడం ప్రారంభించారు అజిత్ అగార్కర్. 1996 సంవత్సరంలో ముంబై జట్టు తరుపున తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్రారంభించారు అజిత్ అగార్కర్. అసలే ముంబై జట్టు అందులో ఎక్కువ మంది ఆటగాళ్లు బ్యాటింగ్ లో స్పెషలిస్ట్ ఉండటం వల్ల బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా పట్టు సాధించాలని అప్పుడే జట్టులో చోటు దొరకడానికి వీలుంటుందని కోచ్ రమాకాంత్ అచ్చ్రేకర్ సూచనలు ఇచ్చారు. కోచ్ సూచన ప్రకారం బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండిటి మీద కూడా దృష్టి సాధించి ఆల్‌రౌండర్ ఆటగాడిగా ఎదిగారు అజిత్ అగార్కర్.
అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం
ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో అజిత్ అగార్కర్ తన అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అరంగ్రేటం చేయడం జరిగింది. 111 వ ప్లేయర్ గా భారత వన్డే క్రికెట్లో అడుగుపెట్టారు అజిత్ అగార్కర్. ఆడిన మొదటి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ వికెట్ తీశారు అజిత్ అగార్కర్. 1998 సంవత్సరం ఏప్రిల్ 1న జరిగిన ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించడం విశేషం.
ఆ తరువాత న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు అజిత్ అగార్కర్. 1998 సంవత్సరం అక్టోబర్ 7న జింబాబ్వే జట్టుతో ఆడిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో 216వ ఆటగాడిగా భారత టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టారు మరియు ఈ మ్యాచ్ భారత్ ఓటమిపాలైంది.
1999 సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టుతో ఆస్ట్రేలియా దేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో అజిత్ అగార్కర్ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు మరియు ఆ సిరీస్ భారత్ ఓడిపోయింది. 2002 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టుతో వారి దేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ప్రఖ్యాతి “లార్డ్స్” మైదానంలో శతకం సాధించిన ఆటగాళ్లలో అజిత్ అగార్కర్ ఒకరు. బౌలర్ ఆశిష్ నెహ్రాతో కలిసి ఆడిన ఈ ఇన్నింగ్స్లో తను ఈ శతకం సాధించడం విశేషం.
తన వికెట్ కాపాడుకుంటూ 109 పరుగులు చేసి అజేయంగా నిలబడ్డారు అజిత్ అగార్కర్ కానీ ఈ మ్యాచ్ భారత్ విజయం సాధించలేదు. 2003 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో 20 సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియా జట్టు మీద భారత్ నెగ్గడం విశేషం మరియు ఈ మ్యాచ్లో అజిత్ అగార్కర్ 6 వికెట్లు పడగొట్టి భారత జట్టుని గెలిపించారు.
మరికొన్ని విశేషాలు
టెస్ట్ మ్యాచ్ కన్నా ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడిన అజిత్ అగార్కర్ తన బౌలింగ్ తో ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేసి ఎన్నో వికెట్లు పడగొట్టారు అజిత్ అగార్కర్. 2006 సంవత్సరంలో జరిగిన వన్డే సిరీస్ లో వెస్ట్ ఇండీస్ జట్టు మీద ఒక బౌలర్ గా తన అత్త్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. 2000 సంవత్సరంలో రాజకోట్ నగరంలో జింబాబ్వే జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో వేగంగా అర్ధ శతకం సాధించి ఒక కొత్త రికార్డు నమోదు చేశారు అజిత్ అగార్కర్. 25 బంతుల్లో 67 పరుగులు సాధించి ఒక కొత్త రికార్డు సృష్టించారు అజిత్ అగార్కర్.
ఆస్ట్రేలియా జట్టుతో ఆడిన టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 7 సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగారు అజిత్ అగార్కర్. వరుసగా సున్నా పరుగుల మీద వెనుదిరిగిన అజిత్ అగార్కర్ ను అందరు “బొంబాయి డక్” అని సరదాగా పేరు పిలవడం జరిగింది.
ఒక వైపు జవగళ్ శ్రీనాథ్ గాయాలతో సతమతవుతుంటే తన స్థానంలో అజిత్ అగార్కర్ కి అవకాశం వచ్చేది మరియు అప్పుడే జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా మరియు ఇర్ఫాన్ పఠాన్ లాంటి ఫాస్ట్ బౌలర్లు రావడంతో అజిత్ అగార్కర్ స్థానానికి గట్టి పోటీ ఎదురయ్యింది.
మరికొన్ని విశేషాలు
- జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే తరువాత భారత వన్డే క్రికెట్ లో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా అజిత్ అగార్కర్ మూడవ ఆటగాడిగా ముందు వరుసలో ఉన్నారు.
- 2009- 2010 సంవతసరంలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో కర్ణాటక జట్టు మీద ముంబై జట్టు గెలవడం విశేషం మరియు ఈ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టి ముంబై జట్టుని విజయాన్ని అందించారు అజిత్ అగార్కర్.
- 2000 సంవత్సరంలో జింబాబ్వే జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో 21 బంతుల్లో 50 పరుగులు సాధించి రికార్డు సృష్టించారు మరియు 3 వికెట్లు తీసి భారత జట్టుకి విజయాన్ని అందించారు.
- జంషెడ్పూర్ నగరంలో వెస్ట్ ఇండీస్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో 3వ స్థానంలో బ్యాటింగ్ దిగిన అజిత్ అగార్కర్ 95 పరుగులు చేయడం విశేషం.
- 23 వన్డే మ్యాచ్లు ఆడి 50 వికెట్లు పడగొట్టి డెన్నిస్ లిల్లీ లాంటి దిగజ్జ బౌలర్ రికార్డు బ్రేక్ చెయడం జరిగింది.
- వన్డే మ్యాచ్లలో 1000 పరుగులు సాధించి 200 వికెట్లు పడగొట్టిన ఆటగాళ్లలో అజిత్ అగార్కర్ ఒకరు.
- విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టుకి సారధిగా ఎంపికయ్యారు అజిత్ అగార్కర్. 2013 సంవత్సరంలో రంజీ ట్రోఫీ సాధించిన ముంబై జట్టుకి సారధిగా ఉన్నారు అజిత్ అగార్కర్.
- 1996 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు ముంబై జట్టుకు ఆడటం జరిగింది.
క్రికెట్ వీడ్కోలు
2006 సంవత్సరంలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సిరీస్ తరువాత అజిత్ అగార్కర్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికారు. ఆ తరువాత 2007 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టుతో ఆడిన వన్డే సిరీస్ తరువాత అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి కూడా వీడ్కోలు పలికారు అజిత్ అగార్కర్.
దక్షిణాఫ్రికా జట్టుతో ఆడిన అంతర్జాతీయ 20 – 20 మ్యాచ్ తో 20 – 20 క్రికెట్ లో అరంగ్రేటం చేశారు అజిత్ అగార్కర్ మరియు 2007 సంవత్సరంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ నుంచి వీడ్కోలు పలికారు అజిత్ అగార్కర్. మొత్తం నాలుగు అంతర్జాతీయ 20 – 20 క్రికెట్ ఆడిన అజిత్ అగార్కర్ 14 పరుగులు తీసి 3 వికెట్లు తీయడం జరిగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇండియాన్ ప్రీమియర్ లీగ్ లో 2008 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు కోల్కత్త నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడారు మరియు 2011 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున ఆడటం జరిగింది. రెండు జట్లు కలిపి మొత్తం 6 సీజన్లు ఆడిన అజిత్ అగార్కర్ మొత్తం 42 మ్యాచ్లు, 179 పరుగులు మరియు 29 వికెట్లు తీయడం జరిగింది. 2013 సంవత్సరం తరువాత ఇండియాన్ ప్రీమియర్ లీగ్ నుంచి వీడ్కోలు పలికారు.
క్రికెట్ తరువాతి జీవితం
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన అజిత్ అగార్కర్ క్రికెట్ విశ్లేషకుడిగా మరియు కామెంట్రీ అవతారంలో కనిపించి అభిమానులని అలరించారు. ఆ తరువాత 2023 సంవత్సరం జులై 4 నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ పాత్రలో నియమితులయ్యారు. బెంగళూరు నగరంలోని ప్రఖ్యాత గోల్ఫ్ షైర్లో జరిగిన బి. ఎం. ఆర్ ప్రపంచ కార్పొరేట్ గోల్ఫ్ ఛాలెంజ్లో గోల్ఫ్ క్రీడని ఆడటం జరిగింది. తన జట్టులో ఉన్న షబ్బీర్ రాజీతో కలిసి ఆడిన ఈ గోల్ఫ్ ఆటలో 62 పాయింట్లు సంపాదించారు మరియు ఈ గోల్ఫ్ ఛాలెంజ్ క్రీడలో ఫైనల్ మ్యాచ్ గెలవడం జరిగింది.
గణాంకాలు
టెస్ట్: అజిత్ అగార్కర్ ఆడిన టెస్ట్ క్రికెట్ గణాంకాల గురించి తెలుసుకోవాలంటే 26 టెస్ట్ మ్యాచ్లు ఆడి 16.79 సగటుతో 571 పరుగులు చేశారు, ఇందులో ఒక శతకం ఉండడం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 109. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 4,857 బంతులు వేయగా 47.32 సగటుతో 58 వికెట్లు పడగొట్టారు మరియు ఒక్క సారి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడం విశేషం, అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 6/41 అంతేకాకుండా 68 క్యాచ్లు అందుకున్నారు.
వన్డే: అజిత్ అగార్కర్ ఆడిన వన్డే క్రికెట్ గణాంకాల గురించి తెలుసుకోవాలంటే 191 వన్డే మ్యాచ్లు ఆడి 14.58 సగటుతో 1,269 పరుగులు చేశారు, ఇందులో 3 అర్ధ శతకాలు ఉండడం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 95. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 9,484 బంతులు వేయగా 27.85 సగటుతో 288 వికెట్లు పడగొట్టారు మరియు రెండు సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడం విశేషం, అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 6/42 అంతేకాకుండా 52 క్యాచ్లు అందుకున్నారు.
20 – 20 క్రికెట్: అజిత్ అగార్కర్ ఆడిన అంతర్జాతీయ 20 – 20 క్రికెట్ గణాంకాల గురించి తెలుసుకోవాలంటే 4 మ్యాచ్లు ఆడి 7.5 సగటుతో 15 పరుగులు చేశారు, అత్యధిక స్కోర్ వచ్చేసి 14. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 63 బంతులు వేయగా 28.33 సగటుతో 3 వికెట్లు పడగొట్టారు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 2/10.
మరికొన్ని గణాంకాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్: అజిత్ అగార్కర్ ఆడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ గణాంకాల గురించి తెలుసుకోవాలంటే 42 మ్యాచ్లు ఆడి 17.9 సగటుతో 179 పరుగులు చేశారు, అత్యధిక స్కోర్ వచ్చేసి 39. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 782 బంతులు వేయగా 39.69 సగటుతో 29 వికెట్లు పడగొట్టారు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 3/25 మరియు 5 క్యాచ్లు అందుకున్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: అజిత్ అగార్కర్ ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాల గురించి తెలుసుకోవాలంటే 110 మ్యాచ్లు ఆడి 28.75 సగటుతో 3,336 పరుగులు చేశారు, ఇందులో 4 శతకాలు మరియు 16 అర్ధ శతకాలు ఉండడం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 145. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 18,132 బంతులు వేయగా 30.69 సగటుతో 299 వికెట్లు పడగొట్టారు మరియు 12 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడం విశేషం, అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 6/41 అంతేకాకుండా 37 క్యాచ్లు అందుకున్నారు.
లిస్ట్ ఏ క్రికెట్: అజిత్ అగార్కర్ ఆడిన లిస్ట్ ఏ క్రికెట్ గణాంకాల గురించి తెలుసుకోవాలంటే 270 మ్యాచ్లు ఆడి 17.50 సగటుతో 2,275 పరుగులు చేశారు, ఇందులో ఒక్క శతకంతో పాటు 7 అర్ధ శతకాలు ఉండడం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 100. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 13,322 బంతులు వేయగా 26.16 సగటుతో 420 వికెట్లు పడగొట్టారు మరియు 3 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడం విశేషం, అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 6/18 అంతేకాకుండా 69 క్యాచ్లు అందుకున్నారు.
అజిత్ అగార్కర్ భారత క్రికెట్‌లో ఒక విలక్షణ ఆటగాడు. వేగవంతమైన బౌలింగ్‌తో, అవసరమైన సమయంలో బ్యాటింగ్‌తో జట్టుకు మద్దతుగా నిలిచిన అగార్కర్, భారత క్రికెట్‌ను ముందుకు నడిపించిన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. మిగితా బౌలర్లతో పోల్చుకుంటే అజిత్ అగార్కర్ ఎత్తు కొంచెం తక్కువ కావడంతో తన బౌలింగ్ మీద అందరికి అనుమానాలు ఉండేవి కానీ ఆటను గంటకు 142 – 150 కిలోమీటర్ వేగంతో వేయడం జరిగేది.
అజిత్ ఆగర్కర్ క్రికెట్ ప్రపంచంలో తన ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించారు. అతని వేగం, స్వింగ్ మీద అతని నియంత్రణ కూడా అభిమానులకు అనేక అద్భుత క్షణాలను అందించింది. భారత క్రికెట్‌లో అతని సేవలకు గౌరవంగా, అజిత్ ఆగర్కర్ ఒక అజేయ పేరుగా నిలిచిపోయారు.
వ్యక్తిగతం
అజిత్ అగార్కర్ పూర్తి పేరు అజిత్ బాలచంద్ర అగార్కర్, మహారాష్ట్ర రాష్ట్రం ముంబై నగరంలో బాలచంద్ర అగార్కర్, మీనా దంపతులకు 4 డిసెంబర్ 1976 సంవత్సరంలో జన్మించారు మరియు మాణిక్ అగార్కర్ అనే సోదరి ఉన్నారు. ముంబై నగరంలోనే అజిత్ అగార్కర్ చదువు కొనసాగింది. 2002 సంవత్సరంలో ఫాతిమా ఘడియల్లి అనే యువతిని వివాహం చేసుకున్నారు మరియు వీరికి ఒక కుమారుడు రాజ్ అగార్కర్.